Rajasthan: ఆత్మలతో మాట్లాడుతుందని భార్యను హత్య చేసిన భర్త..
- రాజస్థాన్‌లో దారుణం..
- మూఢనమ్మకాలకు భార్య బలి..
- ఆత్మలతో ఫోన్‌లో మాట్లాడుతుందని అనుమానం..
- భార్యను చంపిన భర్త..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rajasthan: రాజస్థాన్‌లో దారుణం జరిగింది. భార్యను కిరాతకంగా హతమార్చడు ఓ వ్యక్తి. దీనికి కారణం వింటే అంతా ఆశ్చర్యపోవడం ఖాయం. భార్య తరుచుగా ఫోన్ ద్వారా ‘ఆత్మ’లతో మాట్లాడుతోందని ఆరోపించాడు. ఈ ఘటన బార్మర్ జిల్లాలో జరిగింది. తన భార్య ఆత్మలతో ఫోన్ ద్వారా మాట్లాడుతోందని అనుమానించిన భర్త ఆమెను హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. బుధవారం తెల్లవారుజామున చున్నీలాల్ తన భార్య జియోదేవీ(40)ని గొడ్డలితో నరికి చంపాడు.
Read Also: Prudhviraj: పృథ్విరాజ్ పై అరెస్ట్ వారెంట్ జారీ.. మనోవర్తి చెల్లించాలంటూ..
Also Read
జియోదేవీ తన ఫోన్ ద్వార ఆత్మలతో కమ్యూనికేట్ అవుతోందని భర్త అనుమానిస్తున్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది. దంపతులకు 17 ఏళ్ల కుమార్తె సుమిత్ర దాడి సమయంలో తండ్రి చున్నీలాల్‌ని ఆపేందుకు ప్రయత్నించింది. ఈ దాడిలో గాయపడింది. అరుపులు విన్న ఇరుగుపొరుగు వారు ఇంటికి వెళ్లి చూడగా.. తల్లికూతుళ్లు ఇద్దరు తీవ్రంగా గాయపడి ఉన్నారు. బాధితులను వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే జియోదేవీ మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు.
మంగళవారం రాత్రి చున్నీలాల్ తన భార్య, నలుగురు పిల్లలతో కలిసి రాత్రి భోజనం చేసినట్లు పోలీసులు తెలిపారు. తెల్లవారుజామున 2.30 గంటల ప్రాంతంలో చున్నీలాల్ నిద్రలేచి భార్యపై దాడి చేశారు. తెల్లవారుజామున 3 గంటలకు ఇరుగుపొరుగు వారు ఫోన్‌లో పోలీసులకు వివరాలు అందించారు. సుమిత్ర ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు చున్నీలాల్‌ను హత్య కేసులో అరెస్టు చేశారు. జియో దేవి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం పంపారు మరియు దర్యాప్తు కొనసాగుతోంది.
తాజావార్తలు
-
Project Cheetah Success: భారత్‌లో పెరిగిన చీతాల సంఖ్య.. 56కి చేరిక.. పర్యావరణానికి ఎందుకు కీలకం?
-
El Nino: ధరల మోత మరోసారి మోగనుంది.. సామాన్యులను నిండా ముంచిన ఎల్‌నినో!
-
Abhishek-Vaibhav: స్వదేశంలో సింహం, విదేశాల్లో పిల్లి.. అభిషేక్, సూర్యవంశీలపై మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
Asian Games 2026: షూటింగ్లో మరో రజత పతకం.. టేబుల్ టెన్నిస్‌లో పాకిస్థాన్‌ను 3-0తో చిత్తు చేసిన భారత్
-
Thick Milk Cream: పాలపై మీగడ రావడం లేదా? 1-5-6 ఫార్ములా ట్రై చేయండి.. మందమైన మీగడ పొందండి.!
ట్రెండింగ్
-
Jio vs Airtel: రూ.3,599 ప్లాన్.. ఏడాది వ్యాలిడిటీతో పాటు OTT + అనేక ప్రయోజనాలు.. ఏది బెస్ట్.?
-
Suryakumar Yadav: ధోనీ, కోహ్లీ, రోహిత్ టాలెంట్ వద్దు.. ఆ ఒక్కడిలో ఆ ఒక్క టాలెంట్ దొంగిలిస్తా!
-
iPhone 18 Pro Max: ఐఫోన్ 18 ప్రో మాక్స్ ఛార్జింగ్ టెస్ట్‌లో సంచలనం..
-
Jio యూజర్లకు అదిరిపోయే ఆఫర్.. ఏడాది పాటు Amazon Prime Lite ఫ్రీ.. ఎలా పొందాలంటే.?
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!