భార్యభర్తల మధ్య గొడవ.. కొడుకు ప్రాణం తీసింది. గొడవ పడొద్దని అడ్డుగా వచ్చిన తనయుడిపై తండ్రి కోపంతో దాడి చేశాడు. దీంతో.. కొడుకు తీవ్ర గాయాలై మృతి చెందాడు. ఈ క్రమంలో.. ఆ కుటుంబంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటన బుధవారం బెంగళూరులో జరిగింది.
Read Also: Actress Hema: బెంగళూరు డ్రగ్స్ కేసు.. హేమకు ‘మా’ ఊహించని షాక్!
వివరాల్లోకి వెళ్తే.. బెంగళూరులో ఓ తండ్రి తన 24 ఏళ్ల కొడుకును కత్తితో పొడిచి చంపాడు. అదే రోజున తన సోదరి పుట్టినరోజు వేడుకలు ఉన్నాయి. ఆ వేడుకలు జరుపుకునేందుకు కుటుంబసభ్యులు వెళుతుండగా.. ఉన్నట్టుండి భార్యభర్తల మధ్య గొడవ మొదలైంది. ఈ క్రమంలో గొడవను శాంతింపజేసే ప్రయత్నంలో తండ్రి ప్రమాదవశాత్తు కత్తితో పొడిచాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. అనంతరం నిందితుడు బసవరాజ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. మృతుడు సర్జాపూర్‌లోని ఓ ప్రైవేట్ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న యశ్వంత్ గా గుర్తించారు.
ఈ ఘటన బుధవారం ఉదయం 10 గంటల ప్రాంతంలో జరిగింది. మాటల వాగ్వాదం పెనుగులాటగా మారిందని, భార్యను కత్తితో చంపేస్తానని నిందితుడు బసవరాజ్ బెదిరించడంతో.. కుమారుడు యశ్వంత్ జోక్యం చేసుకున్నాడు. అయితే ఆ గొడవలో బసవరాజ్ తన కుమారుడిని కత్తితో పొడిచాడని పోలీసులు పేర్కొన్నారు. వెంటనే.. గాయపడిన యశ్వంత్‌ను ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు అతను చనిపోయినట్లు ప్రకటించారు.