మహారాష్ట్రలోని థానే జిల్లాలో హృదయ విదారక ఘటన వెలుగు చూసింది. భార్యపై కోపంతో తొమ్మిదేళ్ల కుమారుడిని పొట్టన పెట్టుకున్నాడు ఓ కసాయి తండ్రి. నోట్లో కాగితాలు కుక్కి మరి దారుణంగా హత్య చేశాడు. ఈ విషయం వెలుగులోకి రావడంతో పోలీసులు నిందితుడు తండ్రిని అరెస్ట్ చేశారు. ఈ సంఘటన థానే జిల్లా సహపూర్ తాలూకా పరిధిలోని కసర ప్రాంతంలోని వశాల వద్ద సోమవారం అర్థరాత్రి రాత్రి జరిగింది. ఘటన జరిగిన సమయంలో 59 ఏళ్ల నిందితుడు మద్యం మత్తులో ఉన్నాడని పోలీసులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ఘటన వెనుక అసలు కారణం ఇంకా తెలియరాలేదు.
Deputy C M: దేశంలో మొదటి డిప్యూటీ సీఎం పదవి ఎవరికి దక్కిందో తెలుసా?
ఈ ఘటనపై పోలీసులు మాట్లాడుతూ.. భార్య భర్తల మధ్య గొడవలు జరిగి వారు దూరంగా నివసిస్తున్నారని చెప్పారు. అయితే తన.. 9 ఏళ్ల కుమారుడు తల్లితోనే ఉంటున్నాడు. ఉన్నట్టుండి సోమవారం రోజున తల్లి ఇంటి నుంచి బాలుడు కనిపించకుండా పోయాడు. ఆ తర్వాత.. అతను కనిపించకుండా పోవడంతో కుటుంబ సభ్యులు వెతకడం ప్రారంభించారు. మంగళవారం ఉదయం 8 గంటల ప్రాంతంలో తండ్రి ఇంటి సమీపంలో బాలుడు శవమై కనిపించాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు.
UP Crime: “నన్ను ప్రేమించి వేరేవాడితో అక్రమ సంబంధం”.. ప్రియురాలి తలనరికి దారుణ హత్య..
బాలుడి నోటిలో పేపర్ నింపి మరీ హత్య చేసినట్లు గుర్తించారు. అయితే.. భార్యతో విడిపోయిన తర్వాత నిందితుడు అతిగా మద్యం సేవించడం ప్రారంభించాడని పోలీసుల విచారణలో తేలింది. ఈ కేసులో పోలీసు అధికారి మాట్లాడుతూ.. నిందితుడు సోమవారం అర్థరాత్రి రాత్రి మద్యం సేవించి, చిరిగిన నోట్‌బుక్ కాగితాలతో చేసిన బంతిని తన కొడుకు నోటిలో నింపాడని, దాంతో బాలుడు మరణించాడని పోలీసులు తెలిపారు. మృతుడి బంధువు ఫిర్యాదు మేరకు నిందితుడిని మంగళవారం రాత్రి అరెస్టు చేసి అతడిపై ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ) సెక్షన్ 302 (హత్య) కింద కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. చిన్నారి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. తన కొడుకు మరణంతో తల్లి తీవ్రంగా రోధిస్తుంది.