Hackers: సైబర్ కేటుగాళ్లు బరితెగించారు. రోజు రోజుకు కొత్త టెక్నిక్ తో డేటాలను హ్యాక్ చేస్తూ పోలీసులకు సవాల్ విసురుతున్నారు. అమాయకులును ఆసరాగా చేసుకుని వారిని బెంబేలెత్తిస్తున్నారు. కానీ.. ఇప్పుడు ఈ కేటుగాళ్లు ప్రజలపై కాకుండా.. ఏకంగా పోలీసులపై కన్ను పడింది. పోలీస్ ఆప్ నే హాక్ చేసేంతగా తెగించారు. సైబర్ నెరగాళ్లు టీఎస్ పోలీస్ యాప్ ను హ్యాక్ చేసినట్లు పోలీసులు గుర్తించారు.
కొద్దిరోజుల క్రితం Hack Eye App హాక్ గురైంది. తాజాగా TSCOP యాప్ ను సైతం నిందితులు హ్యాక్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. TSCOP యాప్ లో డిపార్ట్మెంట్ కు సంబంధించిన వివరాలు, యాప్ ను హ్యాక్ చేసి డేటాను ఆన్లైన్ లో కేటుగాళ్లు అమ్ముతున్నట్లు వెలుగులోకి వచ్చింది. తెలంగాణ పోలీసుల డేటా 120 డాలర్లకు అంటూ ప్రకటనలు సోషల్ మీడియాలో విడుదల చేశారు. రెండు ఆప్ల్ లల్లో దాదాపు 12 లక్షల మంది డాటా ఉన్నట్లు గుర్తించారు. 12 లక్షల మంది డాటా బహిరంగ మార్కెట్లో సైబర్ కేటగాళ్లు విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించి షాక్ కు గురయ్యారు.
Read also: Secunderabad: పోలీసులను చూసి భవనం పైనుంచి దూకిన వ్యక్తి.. తరువాత..
అయితే ప్రజలకు సత్వర సేవలు అందించేందుకు అనుగుణంగా ‘హాక్-ఐ’ యాప్ ను తెలంగాణ పోలీసులు రూపొందించిన విషయం తెలిసిందే.. ఈ యాప్ హ్యాకింగ్‌కు గురి కావడంతో కీలక సమాచారం హ్యాకర్ల చేతికి వెళ్లింది. ఎవరైనా సమాచారం ఇచ్చేందుకు, ఫిర్యాదు చేసేందుకు ఈ యాప్‌ను రాష్ట్ర పోలీసులు అందుబాటులోకి తెచ్చారు. ఈ యాప్‌లో దాదాపు 2 లక్షల మంది ఆధార్, ఫోన్ నెంబర్లతో పాటు ఇతర వివరాలు ఉన్నాయి. ఈ సమాచారం అపహరణకు గురైనట్లుగా భావిస్తున్నారు. కాగా.. సైబర్ సెక్యూరిటీ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు. అయితే.. హ్యాకర్ల కోసం గాలిస్తున్నారు. కాగా.. అపహరణకు గురైన సమాచారంతో హ్యాకర్లు బెదిరింపులకు పాల్పడే అవకాశముందని భావిస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Secunderabad: పోలీసులను చూసి భవనం పైనుంచి దూకిన వ్యక్తి.. తరువాత..