Rohit Sharma Celebration: అది నా కోసం మాత్రమే, నేను చెప్పను.. జాగింగ్ సెలబ్రేషన్స్‌పై రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rohit Sharma Jogging Celebration Shakes Internet: టీమిండియా సీనియర్ ఓపెనర్, హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ 35వ వన్డే సెంచరీతో అదరగొట్టాడు. బుధవారం గువాహటిలో వెస్టిండీస్‌తో జరిగిన రెండో వన్డేలో 75 బంతుల్లో 10 ఫోర్లు, 6 సిక్సర్లతో 101 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్ ముందుగా 405/7 పరుగులు చేయగా.. భారత్ 43.3 ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోయి 406 పరుగులు చేసి 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ 223 పరుగులతో అజేయంగా నిలవగా.. రోహిత్ సెంచరీతో రాణించాడు. దీంతో మూడు వన్డేల సిరీస్‌లో భారత్ 2-0 ఆధిక్యంలోకి వెళ్లింది. మ్యాచ్ అనంతరం హిట్‌మ్యాన్ తన సెంచరీ సెలబ్రేషన్ వెనుక ఉన్న కారణాన్ని వెల్లడిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
అది నా కోసమే:
సెంచరీ అనంతరం రోహిత్ శర్మ చేసిన సంబరాలు అభిమానులను బాగా ఆకట్టుకున్నాయి. జాగింగ్ చేస్తున్నట్లు చేసిన సెలబ్రేషన్స్, హిట్‌మ్యాన్ ప్రదర్శించిన హావాభావాలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఈ ప్రత్యేక సెలబ్రేషన్ గురించి రోహిత్‌ను ప్రశ్నించగా.. నేను చెప్పను అని పరోక్షంగా చెప్పాడు. ‘ఆ సెలబ్రేషన్ నా కోసమే. అది నా కోసం మాత్రమే. కొన్ని విషయాలు మనతోనే ఉండాలి. వాటిని ఇతరులతో పంచుకోకూడదు’ అని రోహిత్ చెప్పాడు. జాగింగ్ సెలబ్రేషన్ వెనుక అసలు కారణం ఏమిటో మాత్రం రోహిత్ వెల్లడించలేదు. ఏదేమైనా జాగింగ్ సెలబ్రేషన్స్‌కు సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. రోహిత్ అసలు విషయాన్ని చెబితే బాగుండు అని ఫాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
Also Read
- IND vs SL Semi-Final: భారత్ vs శ్రీలంక సెమీఫైనల్.. బుడ్డోడికి షాక్.. ప్లేయింగ్ 11, పిచ్, వెదర్, లైవ్ డీటెయిల్స్ ఇవే!
- Shubman Gill: 405 స్కోర్ చూసి కంగారుపడిపోయా.. ఓటమి తప్పదనుకున్నా.. కానీ.: గిల్
- India vs West Indies: 55 ఏళ్ల వన్డే క్రికెట్ చరిత్రలోనే తొలిసారి.. హిస్టరీని తిరగరాసిన భారత్, వెస్టిండీస్..!
- Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
నాకు నేనే చెప్పుకున్నా:
వెస్టిండీస్ నిర్దేశించిన 406 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ కలిసి 250కి పైగా అద్భుతమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ‘ఇలాంటి భారీ లక్ష్యాన్ని ఛేదించేటప్పుడు పెద్ద భాగస్వామ్యాలు నెలకొల్పడం చాలా ముఖ్యం. అదే మేం చేశాం. గిల్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. అతడి బ్యాటింగ్‌పై పూర్తి నియంత్రణ కనిపించింది. తొలి ఇన్నింగ్స్‌లో దాదాపు 50 ఓవర్లు ఫీల్డింగ్ చేసిన తర్వాత తీవ్రమైన వేడిలో బ్యాటింగ్ చేయడం సవాలుగా మారింది. అలాంటి పరిస్థితుల్లో ఏకాగ్రతను కోల్పోకుండా ఉండటమే కీలకం. నాకు ఉన్న సుదీర్ఘ అనుభవాన్ని ఉపయోగించుకున్నా. పరిస్థితులు సవాలుగా ఉన్నా.. సులభంగా వికెట్ ఇవ్వకూడదని నాకు నేనే చెప్పుకున్నా. పిచ్ బాగుందని మాకు తెలుసు. టాప్ ఆర్డర్ నుంచి భారీ పరుగులు అవసరమని భావించాం. ఆ దిశగా పరుగులు చేశాం’ అని హిట్‌మ్యాన్ వివరించాడు.
జడేజా అడిగినా చెప్పలేదు:
తన సెంచరీ సెలబ్రేషన్ గురించి రవీంద్ర జడేజా కూడా అడిగాడని రోహిత్ శర్మ వెల్లడించాడు. ‘జడేజా నన్ను ఆ సెలబ్రేషన్ గురించి అడిగాడు. డ్రెస్సింగ్ రూమ్‌లో చెబుతానని చెప్పా. అది నా కోసమే అని అన్నా’ అని నవ్వుతూ చెప్పాడు. అయితే జడేజా మాత్రం రోహిత్ కోసం మరో రకమైన సెలబ్రేషన్‌ను సూచించాడట. ‘జడేజా చాలా క్రియేటివ్‌గా ఆలోచించాడు. నేను వచ్చి స్లైడ్ చేసి, జంప్ చేయాలని చెప్పాడు. కానీ 50 ఓవర్లు ఫీల్డింగ్ చేసి, దాదాపు 25-30 ఓవర్లు బ్యాటింగ్ చేసిన తర్వాత అలాంటి సెలబ్రేషన్ చేసే పరిస్థితిలో నేను లేను. అది న వల్ల కాదు’ అని రోహిత్ సరదాగా వ్యాఖ్యానించాడు.
Look what it means to the Hitman 🤩👌
🎥 A memorable celebration during a memorable knock 🥳
Updates ▶️ https://t.co/6XCYRtZLAi#TeamIndia | #INDvWI | @mflone_ | @ImRo45 pic.twitter.com/V5h46wVK11
— BCCI (@BCCI) September 30, 2026
తాజావార్తలు
-
Rohit Sharma Celebration: అది నా కోసం మాత్రమే, నేను చెప్పను.. జాగింగ్ సెలబ్రేషన్స్‌పై రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Anakapalli: సినిమా డైరెక్ట్ చేయడం కన్నా.. దాన్ని నిర్మించి రిలీజ్ చేయడమే మహా కష్టం! డైరెక్టర్ త్రినాథరావు నక్కిన షాకింగ్ కామెంట్స్!
-
Theater Plus: ఓటీటీ సబ్స్క్రిప్షన్ అవసరం లేదు.. రూపాయి కట్టకుండానే 3 మలయాళ బ్లాక్ బస్టర్స్ ఫ్రీ!
-
Hindu Kush Earthquake: అఫ్గానిస్థాన్‌లో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై 5.3 తీవ్రత
-
Impure : పెళ్లి కూతురు ‘కన్య’ కాదని పెళ్లి క్యాన్సిల్.. టాలీవుడ్‌ను షేక్ చేసే బోల్డ్ కాన్సెప్ట్‌తో వస్తున్న ‘ఇంప్యూర్’!
ట్రెండింగ్
-
8,000mAh బ్యాటరీ, Full HD+ AMOLED డిస్ప్లేతో Oppo K15s, K15x లాంచ్.. ధర ఎంతంటే.?
-
భారీ బ్యాటరీ, ఇమర్సివ్ డిస్ప్లేతో అక్టోబర్ 6న Vivo S2 FE లాంచ్‌కు రెడీ..!
-
POCO Big Billion Days Sale 2026: రూ.11,999 నుంచే స్మార్ట్ఫోన్లు.. X8 సిరీస్‌పై భారీ డిస్కౌంట్లు.!
-
1,600 నిట్స్ డిస్ప్లే, 3nm చిప్సెట్, Galaxy AI ఫీచర్లతో Samsung Galaxy Tab S12 సిరీస్ లాంచ్..!
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!