John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
John Campbell Hits Fastest ODI 100 for West Indies vs India: భారత్‌తో గువాహటి వేదికగా జరుగుతున్న రెండో వన్డేలో వెస్టిండీస్ ఓపెనర్ జాన్ క్యాంప్‌బెల్ శివాలెత్తాడు. 68 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్సర్లతో 101 పరుగులు చేశాడు. 65 బంతుల్లోనే శతకం పూర్తి చేసిన క్యాంప్‌బెల్.. భారత్‌పై వెస్టిండీస్ తరఫున అత్యంత వేగవంతమైన సెంచరీ చేసిన విండీస్ బ్యాటర్‌గా రికార్డు సృష్టించాడు. ఈ క్రమంలో రికార్డో పావెల్, మార్లన్ శామ్యూల్స్, షిమ్రాన్ హెట్మెయర్ వంటి స్టార్ బ్యాటర్లను అధిగమించాడు.
భారత్‌పై వెస్టిండీస్ తరఫున వేగవంతమైన వన్డే సెంచరీల జాబితాలో ఇప్పటివరకు రికార్డో పావెల్ ఉన్నాడు. అతడు 72 బంతుల్లో సెంచరీ చేశాడు. 2002లో మార్లన్ శామ్యూల్స్ 73 బంతుల్లో, 2018లో షిమ్రాన్ హెట్మెయర్ 74 బంతుల్లో శతకాలు నమోదు చేశారు. 2019లో హెట్మెయర్ మరోసారి 85 బంతుల్లో శతకం బాదాడు. ఇప్పుడు జాన్ క్యాంప్‌బెల్ 65 బంతుల్లో సెంచరీతో ఈ జాబితాలో అగ్రస్థానానికి చేరుకున్నాడు.
Also Read
- IND vs SL Semi Final: భారత్, శ్రీలంక సెమీఫైనల్‌కు వర్షం ముప్పు?.. మ్యాచ్ రద్దైతే ఫైనల్ బెర్త్ ఎవరిది?
- IND vs WI 2nd ODI: భారత్, వెస్టిండీస్ రెండో వన్డే.. తెలుగోడు అవుట్.. అరంగేట్రం చేసిన దేశవాళీ కింగ్!
- Gold Medals: ఆసియా క్రీడల్లో భారత్‌కు గోల్డ్ రష్.. ఆర్చరీ, షూటింగ్లో అదరగొట్టిన భారత అథ్లెట్లు.! ఒకేరోజు నాలుగు స్వర్ణాలు కైవసం..
- Kapil Dev: రిటైర్మెంట్ వెనక్కి తీసుకో.. ఇంకో రెండుమూడేళ్లు ఆడొచ్చు.. కోహ్లీకి కపిల్ దేవ్ కీలక సూచనలు
అంతేకాదు వెస్టిండీస్ తరఫున వన్డేల్లో అత్యంత వేగంగా సెంచరీ చేసిన బ్యాటర్ల జాబితాలోనూ క్యాంప్‌బెల్ నిలిచాడు. ఈ జాబితాలో దిగ్గజం బ్రియాన్ లారా 45 బంతుల్లో శతకం చేసి అగ్ర స్థానంలో ఉన్నాడు. క్రిస్ గేల్ 55 బంతుల్లో, ఎవిన్ లూయిస్ 61 బంతుల్లో, నికోలస్ పూరన్ 63 బంతుల్లో సెంచరీలు సాధించారు. తాజాగా క్యాంప్‌బెల్ 65 బంతుల్లో శతకం బాదాడు. అయితే సెంచరీ పూర్తిచేసుకున్న వెంటనే క్యాంప్‌బెల్ పెవిలియన్‌కు చేరాడు. ఇన్నింగ్స్ 19వ ఓవర్ తొలి బంతికి గర్నూర్ బ్రార్ వేసిన బంతిని భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించిన క్యాంప్‌బెల్.. నమన్ ధీర్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో తొలి వన్డేలో సెంచరీ చేసిన జస్టిన్ గ్రీవ్స్ మాదిరిగానే.. రెండో వన్డేలోనూ సెంచరీ చేసిన వెంటనే వెస్టిండీస్ ఓపెనర్ ఔటయ్యాడు.
భారత్‌పై వెస్టిండీస్ తరపున అత్యంత వేగవంతమైన వన్డే సెంచరీ:
65 జాన్ క్యాంప్‌బెల్, గౌహతి 2026
72 రికార్డో పావెల్, సింగపూర్ 1999
73 మార్లోన్ శామ్యూల్స్, విజయవాడ 2002
74 షిమ్రాన్ హెట్మేయర్, గౌహతి 2018
85 షిమ్రాన్ హెట్మేయర్, చెన్నై 2019
వెస్టిండీస్ తరఫున అత్యంత వేగవంతమైన వన్డే సెంచరీ:
45 లారా, ఢాకా 1999
55 గేల్,సెయింట్ జార్జ్ 2019
61 లూయిస్, పల్లెకెలె 2024
63 పూరన్, హరారే 2023
65 జాన్ క్యాంప్‌బెల్, గౌహతి 2026
66 హోప్, నేపియర్ 2025
తాజావార్తలు
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
LPG Subsidy: మీకు ఎల్పీజీ సబ్సిడీ రావడం లేదా..? అయితే రేపటి లోగా ఇలా చేయండి..
-
YouTuber Nandu : నేను బిగ్ బాస్ కోసం రాలేదు.. కుట్ర జరిగింది, అసలు దోషులు వేరే ఉన్నారు!
-
INDIA Bloc: ‘‘ఓట్ చోరీ’’పై ఇండీ కూటమి యాక్షన్ ప్లాన్..
-
Central Cabinet Decision: అన్నదాతలకు గుడ్‌న్యూస్.. కేంద్ర కేబినెట్ నిర్ణయాలు ఇవే!
ట్రెండింగ్
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!