Impure : పెళ్లి కూతురు ‘కన్య’ కాదని పెళ్లి క్యాన్సిల్.. టాలీవుడ్‌ను షేక్ చేసే బోల్డ్ కాన్సెప్ట్‌తో వస్తున్న ‘ఇంప్యూర్’!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్లో ఇప్పుడు మూసకథలకు కాలం చెల్లింది. సమాజంలోని సున్నితమైన అంశాలను ధైర్యంగా తెరపైకి తీసుకొస్తున్నారు యువ మేకర్స్. సరిగ్గా ఇలాంటి ఒక బర్నింగ్ అండ్ సెన్సేషనల్ పాయింట్‌తో ప్రేక్షకులకు షాక్ ఇవ్వడానికి వస్తున్న సినిమానే ‘ఇంప్యూర్’ (Impure). పెళ్లి పీటల మీద కూర్చోబోయే అమ్మాయి ‘కన్య’ కాదని అత్తమామలకు తెలియడంతో.. వెంటనే ఆ పెళ్లిని రద్దు చేసే సంచలనాత్మక కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కింది. కాకినాడలో పుట్టి, అమెరికాలో పెరిగిన తెలుగమ్మాయి వారాహి మల్లిపాముల ఈ చిత్రంతో నటిగా, రచయిత్రిగా, నిర్మాతగా ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్నారు. అమెరికాలోని న్యూయార్క్, లాస్ ఏంజిల్స్ లో టెక్ రంగంలో పనిచేస్తూనే.. రాత్రుళ్లు, వీకెండ్స్ లో స్క్రిప్ట్ రాసుకుంటూ తన సినిమా కలను ఆమె నిజం చేసుకున్నారు.
ఒక మహిళా ప్రాధాన్య చిత్రాన్ని తీయాలని వారాహి ఎందరో నిర్మాతలకు కథ వినిపించినా ఎవరూ ముందుకు రాలేదు. అప్పుడే హీరోయిన్ సమంత, దర్శకురాలు నందిని రెడ్డి కాంబోలో వచ్చిన ‘మా ఇంటి బంగారం’ సినిమా ఆమెలో ఆశలు రేకెత్తించింది. లేడీ ఓరియెంటెడ్ సినిమాలను కూడా థియేటర్లలో ప్రపంచవ్యాప్తంగా ఆదరిస్తారని వారు నిరూపించడంతో.. వారాహికి ధైర్యం వచ్చింది. “నేను ఏళ్ల తరబడి సినిమా కోసం పడుతున్న కష్టాన్ని మా అమ్మ చూసింది. మా చెల్లి పెళ్లికి ఎంతో ఖర్చు పెట్టినట్లే.. నాకు కూడా డబ్బులు ఇస్తానని, దాన్ని నీ సినిమాలో పెట్టుబడిగా పెట్టుకోమని అమ్మ చెప్పింది. అలా వచ్చిన డబ్బు కూడా సరిపోకపోవడంతో ఎన్నో అప్పులు చేశాం. అక్కడి నుంచి ఇక్కడికొచ్చి టెక్నీషియన్స్ ను, నటీనటులను పెట్టుకుని ఈ సినిమా పూర్తి చేశాను. సమంత, నందినీ రెడ్డిలు ఇచ్చిన స్ఫూర్తితోనే ఇప్పుడు ఈ చిత్రాన్ని స్వయంగా నేనే పంపిణీ చేస్తున్నాను” అని వారాహి ఎమోషనల్ అయ్యారు.
Also Read
- Mayuri Distributors: సుదీర్ఘ విరామం తర్వాత రంగంలోకి 'రామోజీ గ్రూప్'.. 'తెల్ల కాగితం'తో డిస్ట్రిబ్యూషన్లో ప్రకంపనలు!
- Anakapalli Producer Naidu: టికెట్ ఇవ్వలేదని థియేటర్‌నే కొనేసిన నిర్మాత.. వాట్ ఎ జర్నీ!
- Dhurandhar: ఇదెక్కడి ట్విస్ట్ .. సినిమా రిలీజ్ అయిన మళ్లీ సెన్సార్‌కి వెళ్లిన ‘ధురంధర్’ !
- NTR-Trivikram: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు పూనకాలే.. గాడ్ ఆఫ్ వార్‌పై బిగ్గెస్ట్ అప్డేట్ ఇచ్చిన త్రివిక్రమ్!
టాలీవుడ్లో తెలుగమ్మాయి పాత్రలకు కూడా నార్త్ హీరోయిన్లనే తీసుకుంటుంటారు. ఆ మూసను బ్రేక్ చేస్తూ ఈ సినిమాలో యషా ముత్తులూరి అనే అచ్చమైన తెలుగమ్మాయిని ప్రధాన పాత్రలో తీసుకున్నారు. ‘మా ఇంటి బంగారం’కు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేసిన నిశాంతి ఇవని ఈ సినిమాతో దర్శకురాలిగా పరిచయం అవుతున్నారు. ఇక సినిమా స్థాయిని పెంచడానికి ప్రముఖ సినిమాటోగ్రాఫర్ జ్ఞానశేఖర్ వి.ఎస్ విజువల్స్ అందించగా.. గ్రామీ అవార్డ్ నామినీలు రాజా కుమారి, కరణ్ పాండవ్ అద్భుతమైన సంగీతం సమకూర్చారు. ముఖ్యంగా రాజాకుమారి పాడిన ‘ఓఎమ్జి’ (OMG) సాంగ్ కు, అందులోని హుక్ స్టెప్ కు అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. ఇందులో సాయి కృష్ణ కూడా అద్భుతంగా నటించారు. ఇప్పటికే లాస్ ఏంజిల్స్‌లోని ప్రతిష్టాత్మక ‘టిసిఎల్ చైనీస్ థియేటర్’, న్యూయార్క్‌లోని చారిత్రాత్మక ‘సినిమా విలేజ్’లో వరల్డ్ ప్రీమియర్స్ జరుపుకున్న ఈ చిత్రం.. అక్కడ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. రక్తపాతంతో కూడిన కమర్షియల్ సినిమాలకు భిన్నంగా.. స్త్రీ, పురుషుల సమస్యలపై సరికొత్త కోణంలో ఈ సినిమా ఉంటుందని వారాహి చెబుతున్నారు. బోల్డ్ అండ్ రియలిస్టిక్ కంటెంట్‌తో వస్తున్న ఈ ‘ఇంప్యూర్’ అక్టోబర్ 2న పాన్-ఇండియా స్థాయిలో పరిమిత థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
తాజావార్తలు
-
Impure : పెళ్లి కూతురు ‘కన్య’ కాదని పెళ్లి క్యాన్సిల్.. టాలీవుడ్‌ను షేక్ చేసే బోల్డ్ కాన్సెప్ట్‌తో వస్తున్న ‘ఇంప్యూర్’!
-
IND vs SL Semi-Final: భారత్ vs శ్రీలంక సెమీఫైనల్.. బుడ్డోడికి షాక్.. ప్లేయింగ్ 11, పిచ్, వెదర్, లైవ్ డీటెయిల్స్ ఇవే!
-
8,000mAh బ్యాటరీ, Full HD+ AMOLED డిస్ప్లేతో Oppo K15s, K15x లాంచ్.. ధర ఎంతంటే.?
-
CM Vijay: ‘రాజరికం, కుటుంబ పాలనకు TVKలో చోటు లేదు’.. ధారాపురం సభలో విజయ్ కీలక వ్యాఖ్యలు
-
LPG e-KYC: ముగిసిన ఆఖరి గడువు.. ఎల్పీజీ ఇ-కేవైసీ చేయని వాళ్లకు గ్యాస్ వస్తుందా? క్లారిటీ ఇదిగో..
ట్రెండింగ్
-
భారీ బ్యాటరీ, ఇమర్సివ్ డిస్ప్లేతో అక్టోబర్ 6న Vivo S2 FE లాంచ్‌కు రెడీ..!
-
POCO Big Billion Days Sale 2026: రూ.11,999 నుంచే స్మార్ట్ఫోన్లు.. X8 సిరీస్‌పై భారీ డిస్కౌంట్లు.!
-
1,600 నిట్స్ డిస్ప్లే, 3nm చిప్సెట్, Galaxy AI ఫీచర్లతో Samsung Galaxy Tab S12 సిరీస్ లాంచ్..!
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!