Birthday Cake: బర్త్ డే కేక్ తీసుకురావడం ఆలస్యమైందన్న కోపంతో ఓ వ్యక్తి భార్య, కుమారుడిపై దారుణంగా దాడికి తెగబడ్డాడు. ఈ ఘటన ముంబైలోని అంధేరీ ప్రాంతంలో చోటు చేసుకుంది. ఘటన అనంతరం నిందితుడు లాతూర్‌కు పారిపోయాడు. గాయపడిన మహిళను రాజావాడా ఆస్పత్రికి తరలించి చికిత్స అందించి డిశ్చార్జ్ చేశారు. కుమారుడు ఇంకా చికిత్స పొందుతూనే ఉన్నారు.
Read Also: Rajasthan: రాజస్థాన్‌లో కాషాయ పార్టీ ఓటమికి కారణాలివేనా?
నిందితుడైన రాజేంద్ర షిండే పుట్టిన రోజున ఈ ఘటన జరిగింది. బర్త్ డే కేక్ తీసుకురావాలని షిండే తన భర్యాను కోరినట్లు పోలీసులు వెల్లడించారు. అయితే, మహిళ కేక్ ఆర్డర్ చేసినప్పటికీ, కేక్ ఆలస్యంగా వచ్చింది. దీంతో భార్యభర్తల మద్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ గొడవను సర్దిచెప్పడానికి కొడుకు ప్రయత్నించాడు. గొడవ సమయంలో షిండే వంటగదిలోకి వెళ్లి కత్తిని తీసుకువచ్చి భార్య మణికట్టుపై దాడి చేశారు. కొడుకు పొట్టలో పొడిచాడు. ఈ ఘటన తర్వాత అతను అక్కడ నుంచి పారిపోయాడు. మహిళ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. లాతూర్ పారిపోతున్న నిందితుడిని పట్టుకున్న పోలీసులు ముంబై తీసుకువచ్చారు. పోలీస్ కస్టడీ విధించారు.