Rapido: బెంగళూర్లో దారుణం జరిగింది ఓ ర్యాపిడో డ్రైవర్ మహిళా ప్రయాణికురాలిపై అఘాయిత్యానికి యత్నించాడు. రాపిడో ఆటో డ్రైవర్ సదరు మహిళను లైంగికంగా వేధించాడు. ఈ విషయాన్ని బాధిత మహిళ స్నేహితుడు అంకుర్ బాగ్చి బుధవారం ఎక్స్(ట్విట్టర్)లో వెల్లడించారు. తన స్నేహితురాలిని రాపిడో ఆటో డ్రైవర్ అనుచితంగా తాకడమే కాకుండా ఆమె ప్రతిఘటించడంతో కదులుతున్న వాహనం నునంచి బలవంతంగా బయటకు తోసేశాడని వెల్లడించారు.
Badradri: తెలంగాణ ఎన్నికల వేళ షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. ఛత్తీస్గఢ్ - తెలంగాణ రాష్ట్రాల సరిహద్దులో 25 మంది వ్యాపార వేత్తలను మావోయిస్టులు కిడ్నాప్ చేశారు. పోలీసులకు సహకరిస్తే చంపేస్తామని వారిని హెచ్చరించారు.
తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం పుల్లలపాడు గ్రామంలో కాల్పులు కలకలం రేపాయి. అనంతపల్లి గ్రామంలో సబ్ రిజిస్టర్ కార్యాలయం వద్ద దస్తావేజు లేకరిగా పనిచేస్తున్న కాట్రగడ్డ ప్రభాకర్ను తుపాకీతో కాల్చి గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు.
Karnataka Family Suicide: కర్ణాణకలో దారుణం చోటు చేసుకుంది. రూ. 1.5 లక్షల అప్పు ఓ కుటుంబాన్ని బలిగొంది. తీసుకున్న అప్పుకు వడ్డీ కట్టలేక.. అప్పులవారి వేధింపుల భరించలేక ఓ వ్యక్తి తన భార్య, ముగ్గురు పిల్లలతో సహా ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తుమకూరు జిల్లా సదాశివ నగర్లో చోటు చేసుకుంది. ఆత్మహత్యకు ముందు మఈతుడు రెండు పేజీల సూసైడ్ నోట్, బంధువులకు ఓ సెల్పీ వీడియో పంపినట్టు తెలుస్తోంది. దాని ఆధారంగా ధారంగా పోలీసులు కేసు…
Karnataka: కర్ణాటకలో దారుణం జరిగింది. కొడలిపై కోపంతో ఓ అత్త సొంత మనవడినే హత్య చేసింది. కేవలం తొమ్మిది నెలల వయసున్న పసివాడిని గొంతు కోసి హత్య చేసింది. ఈ ఘటన కర్ణాటకలోని గదగ్ జిల్లాలోని గజేంద్ర నగర్ తాలూకాలోని ఓ గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ సంఘటన నవంబర్ 22న జరిగింది. విచారణలో సరోజా గూలీ అనే మహిళ తన కోడలు నాగరత్నను ఇష్టకపడకపోవడమే తొమ్మిది నెలల మనవడు అద్విక్ని…
Uttar Pradesh: ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. ప్రపోజ్ చేస్తే ఒప్పుకోలేదని మహిళను ఓ వ్యక్తి గొడ్డలితో నరికి హత్య చేశాడు. కాన్పూర్లోని రాణా గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు పోలీసులు ఆదివారం తెలిపారు. 26 ఏళ్ల వ్యక్తి తన పొరుగును ఉండే మహిళను నరికి చంపి, ఆ తర్వాత విషం తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు వెల్లడించారు.
Uttar Pradesh: ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో దారుణం చోటు చేసుకుంది. మహ్మద్ ప్రవక్తను అవమానించడనే ఆరోపణలో ఓ వ్యక్తి బస్సు కండక్టర్పై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు. పదునైన ఆయుధంతో పొడిచాడు. ప్రస్తుతం కండక్టర్ని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటన ప్రయాగ్రాజ్లో జరిగింది. 20 ఏళ్ల యువకుడికి, కండక్టర్కి బస్సు టికెట్ ఛార్జీపై వివాదం మొదలైంది. ఆ తర్వాత అతనిని పొడిచాడు. ప్రవక్త గురించి అవమానకరంగా మాట్లాడినందుకే కండక్టర్పై దాడి చేసినట్లు నిందితుడు ఓ వీడియోలో…