రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలంలోని బడంగ్‌పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. అల్మాస్‌గూడలోని వినాయక హిల్స్ లో కూతురు నిహారిక అత్తను తండ్రి చంపేశాడు. వినాయక హిల్స్‌కు చెందిన జయరామ్‌కు తన కూతురు స్వాతితో ప్రభు అనే వ్యక్తి వివాహం చేశాడు. పెళైన నాటి నుంచి తన కూతురు స్వాతికి ఆమె అత్త లలితలకు తగాదాలు జరుగుతున్నాయి. రెండు రోజుల క్రితం కూతురు ఇంటికి భార్యతో పాటు ప్రభు వచ్చాడు.
Read Also: India Alliance: లోక్ సభా ఎన్నికలలో సీట్లు మరియు ఫలితాలు
ఇక, అదే సమయంలో గొడవ పడుతున్న కూతురు నిహారిక ఆమె అత్త లలితను చూసిన ప్రభు.. గొడవను సద్దుమణిగించే క్రమంలో కూతురు అత్త లలితతో వాగ్వివాదానికి దిగాడు. ఇక, కోపంతో కూతురు నిహారిక అత్త లలిత తలపై ప్రభు సుత్తెతో దాడి చేశాడు. దీంతో ఆమె చికిత్స పొందుతూ చనిపోయింది. ఇక, లలిత కుమారుడి ఫిర్యాదు మేరకు ప్రభును పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు ప్రభును రిమాండ్ కు తరలించారు.