Anakapalli: సినిమా డైరెక్ట్ చేయడం కన్నా.. దాన్ని నిర్మించి రిలీజ్ చేయడమే మహా కష్టం! డైరెక్టర్ త్రినాథరావు నక్కిన షాకింగ్ కామెంట్స్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్లో వరుస హిట్లు కొడుతూ స్టార్ డైరెక్టర్‌గా గుర్తింపు తెచ్చుకున్న త్రినాథరావు నక్కిన.. ఇప్పుడు నిర్మాతగా మారి కొత్త కష్టాలు ఎదుర్కొంటున్నారు. కేవలం సినిమా తీస్తే సరిపోదని, దాన్ని థియేటర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడమే అత్యంత కష్టమైన పని అని ఆయన బాంబు పేల్చారు. దర్శకత్వం కంటే నిర్మాణమే పెద్ద సవాల్ అని, ఒక నిర్మాత పడే కష్టాలు ఇప్పుడు తనకు స్వయంగా అర్థమవుతున్నాయని ఆయన చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి. భవ్య శ్రీ మూవీ మేకర్స్, నక్కిన నెరేటివ్స్ బ్యానర్లపై కాండ్రేగుల నాయుడు, త్రినాథరావు నక్కిన సంయుక్తంగా నిర్మించిన పక్కా రా అండ్ రస్టిక్ విలేజ్ డ్రామా ‘అనకాపల్లి’. విక్రమ్ సహిదేవ్, సంధ్యా వశిష్ట, తారక్ పొన్నప్ప ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి ఖగేష్ తమ్మినేని దర్శకత్వం వహించారు. అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కాబోతున్న ఈ చిత్రంపై మేకర్స్ ఎంతో కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. ముఖ్యంగా ‘మేం వయసుకు వచ్చాం’ లాంటి కల్ట్ ఫీల్ గుడ్ లవ్ స్టోరీ తర్వాత, ఇన్నేళ్లకు త్రినాథరావు కలం నుంచి జాలువారిన మరో అద్భుతమైన ప్రేమకథ ఇది కావడం విశేషం. ఇందులో ఎవరూ ఊహించని రేంజ్లో ఒక మైండ్ బ్లాంక్ అయ్యే ఇంటర్వెల్ ట్విస్ట్ ఉంటుందని, క్లైమాక్స్ మాత్రం కంటతడి పెట్టిస్తుందని చిత్ర బృందం గ్యారెంటీ ఇస్తోంది.
ఈ సినిమా కోసం ఆగస్టు నుంచే తీవ్రంగా శ్రమించామని, పలువురికి ప్రదర్శించి వారి సలహాలతో సినిమాను మరింత అద్భుతంగా మలిచామని ప్రముఖ నిర్మాత లగడపాటి శ్రీధర్ వెల్లడించారు. తన కుమారుడు విక్రమ్‌కు ఇంతటి అద్భుతమైన అవకాశం ఇచ్చిన త్రినాథరావుకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సినిమాలో విలన్‌గా నటించిన తారక్ పొన్నప్ప స్క్రీన్ మీద కచ్చితంగా భయపెడతాడని, హీరోయిన్ సంధ్య పాత్ర ఎంతో కొత్తగా ఉంటుందని లగడపాటి శ్రీధర్ నమ్మకంగా చెప్పారు. నిర్మాతగా కాండ్రేగుల నాయుడు పడ్డ కష్టం, ఆయన ప్యాషన్ ఈ సినిమా విజయంతో తీరుతుందని యూనిట్ భావిస్తోంది. ఇప్పటికే అనకాపల్లిలో వేసిన స్పెషల్ షోలకు ఆడియన్స్ నుంచి అద్భుతమైన బ్రహ్మరథం పట్టింది. ఇప్పుడు పబ్లిక్ థియేటర్లలో ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి. అదిరిపోయే మ్యూజిక్, గూస్ బంప్స్ తెప్పించే యాక్షన్, ఊహించని మలుపులతో వస్తున్న ఈ కల్ట్ లవ్ అండ్ ఫ్యామిలీ డ్రామా ‘అనకాపల్లి’ అక్టోబర్ 2న థియేటర్లలో జాతర సృష్టించడానికి సిద్ధమైంది.
Also Read
తాజావార్తలు
-
New Zealand Test Squad: టీమిండియాతో టెస్ట్ సమరానికి కివీస్ రెడీ.. 14 మందితో జట్టు ప్రకటన!
-
EPS Pension Hike: EPS పెన్షనర్లకు గుడ్ న్యూస్.. రూ.3,000 కనీస పెన్షన్‌పై నవంబర్ 19న కీలక నిర్ణయం..!
-
AP High Court: పండుగలు, సెలవుల్లో బస్సు టికెట్ ధరల పెంపుపై హైకోర్టు సీరియస్.. కీలక ఆదేశాలు
-
Pete Hegseth: ప్రతిపక్షానికి ఎదురుదెబ్బ.. పీట్ హెగ్సెత్‌పై అభిశంసన ప్రయత్నం విఫలం.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
-
Astrology: నవంబర్ 11 బుధవారం దినఫలాలు.. ఈ రాశివారు కాస్త జాగ్రత్త..
ట్రెండింగ్
-
National Education Day 2026: బట్టీ పద్ధతులకు చెక్.. ఏఐ యుగంలో ‘క్రిటికల్ థింకింగ్’
-
Kitchen Storage Tips : ఆవాలు ఎక్కువ కాలం తాజాాగా ఉండాలా.? ఈ సింపుల్ చిట్కాలు పాటిస్తే పాడవవు
-
Jio Recharge: Buy 1 Get 1 ఆఫర్ తో ఈ రెండు ప్లాన్లపై డబుల్ బెనిఫిట్స్..!
-
BSNL నుంచి కొత్త రీఛార్జ్ ప్లాన్లు.. రూ.172, రూ.184, రూ.190లకే అన్లిమిటెడ్ కాలింగ్..!
-
గేర్లు మార్చాల్సిన అవసరం లేకుండానే సులువుగా రైడ్.. KTM 390 Super Duke GT Evo బైక్ లాంచ్‌కు సిద్ధం..!