Selfie Video: నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. నవీపేట మండలం ఫకీరాబాద్ గ్రామం వద్ద నవ దంపతులు రైలు కిందపడి బలన్మరణానికి పాల్పడ్డారు. మృతులు పోతంగల్ మండలం హెడ్డోలి గ్రామానికి చెందిన బండారి అనిల్ కుమార్ శైలజ పోలీసులు గుర్తించారు. వీరికి గత సంవత్సరం క్రితమే వివాహం జరిగినట్లు సమాచారం. సంఘటన స్థలానికి చేరుకున్న రైల్వే పోలీసులు విచారణ చేపట్టారు.
Read also: Mallu Bhatti Vikramarka: ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా కలెక్టర్లు ఉండాలి..
నిజామాబాద్ జిల్లా పొతంగల్ మండలం హెగ్డోలికి చెందిన అనిల్ (28), అదే మండలానికి చెందిన శైలజ (24)కి ఏడాది కిందటే వివాహమైంది. ఎంతో సాఫీగా సాగుతున్న వీరి కాపురంలో బంధువులు సందడి చేశారు. దంపతులిద్దరూ ఇంటర్వ్యూకు వెళ్తున్నామని కుటుంబసభ్యులకు చెప్పి సోమవారం ఇంటి నుంచి వెళ్లిపోయారు. అనంతరం భార్యాభర్తలిద్దరూ గతంలో తప్పు చేశారంటూ సెల్ఫీ వీడియో చిత్రీకరించారు, భర్త క్షమించినా.. బంధువులు సూటిపోటి మాటలతో చిత్రహింసలకు గురిచేస్తున్నారు. తమపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని తట్టుకోలేక వారిద్దరూ రైలు కిందపడి ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నట్లు వీడియో చిత్రీకరించారు. అనంతరం ఈ వీడియోలను కోటగిరి ఎస్సై సందీప్‌కు పంపించారు.
Read also: CM Revanth Reddy: కలెక్టర్లు ఎసీ గదులకే కాదు.. క్షేత్రస్ధాయిలో పర్యటించాల్సిందే..
ఈ వీడియో చూసిన అతను వెంటనే నవీపేట్ ఎస్సై యాదగిరిగౌడ్‌ను వీడియోతో పాటు వారి సెల్‌ఫోన్ నంబర్‌తో అప్రమత్తం చేశాడు. ఆత్మహత్య చేసుకునేందుకు దంపతులు గోదావరికి వస్తున్నట్లు వీడియోలో ఉంది. ఆ సమాచారం మేరకు స్థానిక పోలీసులు బాసర వంతెన వద్దకు వెళ్లి మాటువేశారు. ఎంత వెతికినా జాడ దొరకలేదు. దీంతో బాధితురాలి ఫోన్ నంబర్‌ను ట్రాక్ చేయగా ఫకీరాబాద్-మిట్టాపూర్ మధ్య ఉన్నట్లు గుర్తించారు. వెంటనే ఎస్సై నవీపేటకు వెళ్లడానికి చాలా ఆలస్యమైంది. రైలు పట్టాలపై అనిల్, శైలజ మృతదేహాలు లభ్యమయ్యాయి. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై తెలిపారు. వాళ్లిద్దరూ చేసిన తప్పేంటి అనే విషయం పై కుటుంబ సభ్యులను అడిగితెలుసుకోనున్నారు. తప్పును భర్త క్షమించినా.. బంధువులు చిత్రహింసలకు గురిచేయడంపై ఆరా తీస్తున్నారు. వీరిద్దరిని కాపాడలేకపోయామని ఎస్సై ఆవేదన వ్యక్తం చేశారు.
AP Government: పెట్టుబడులను ఆకర్షించడం లక్ష్యం.. కొత్త పరిశ్రమల కోసం సర్కార్ కసరత్తు..