Kitchen Hacks : వంటగది స్విచ్బోర్డులపై జిడ్డు, నూనె మరకలా? ఈ చిట్కాలతో 5 నిమిషాల్లో క్లీన్..!
- స్విచ్‌బోర్డ్ శుభ్రం చేసే ముందు ఈ జాగ్రత్తలు తప్పనిసరి
- రబ్బింగ్ ఆల్కహాల్‌తో జిడ్డు మరకలకు చెక్
- బేకింగ్ సోడాతో మొండి మురికి మాయం
- పూర్తిగా ఆరిన తర్వాతే కరెంట్ ఆన్ చేయండి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kitchen Hacks : వంటగదిలో వంట చేసేటప్పుడు వెలువడే నూనె, గ్రీజు , పొగ కారణంగా గోడలతో పాటు స్విచ్‌బోర్డులు నల్లగా మారి జిడ్డు పడుతుంటాయి. ఇంట్లోని ఇతర గదులతో పోలిస్తే కిచెన్‌లోని స్విచ్‌బోర్డులు చూడటానికి చాలా మురికిగా కనిపిస్తాయి. అయితే ఎలక్ట్రికల్ పరికరాలు కావడం వల్ల వీటిని నీటితో కడగడం అత్యంత ప్రమాదకరం. ప్రమాదం లేకుండా, చాలా సురక్షితంగా , సులభంగా స్విచ్‌బోర్డులను కొత్తవాటిలా ఎలా మెరిపించవచ్చో ఇప్పుడు చూద్దాం.
ప్రాథమిక భద్రతా జాగ్రత్తలు
విద్యుత్ పరికరాలను శుభ్రం చేసేటప్పుడు భద్రతకే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. శుభ్రపరచడం ప్రారంభించే ముందే మెయిన్ స్విచ్ లేదా MCBని పూర్తిగా ఆపివేయాలి. అలాగే కాళ్లకు రబ్బరు బూట్లు, చేతులకు పొడి గ్లౌజులు ధరించడం మంచిది. స్విచ్‌బోర్డ్‌పై నేరుగా నీటిని గానీ, ఇతర ద్రవ స్ప్రేలను గానీ ఎప్పుడూ చల్లకూడదు. బోర్డును శుభ్రం చేయడానికి బాగా పిండిన తేలికపాటి తడి గుడ్డను మాత్రమే ఉపయోగించాలి.
Also Read
- Stain Removal Tips : నవరాత్రి వేళ తెల్లటి బట్టలపై కుంకుమ, మొండి మరకలా? ఈ చిట్కాలతో మాయం.!
- How to Store Fashion Jewellery: మీ ఫ్యాషన్ జ్యువెలరీ నల్లగా మారుతున్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో మెరిపించండి!
- How To Clean Tiles Lining: టైల్స్ మధ్య నల్లటి మురికి పేరుకుపోయిందా? ఈ క్లీనింగ్ చిట్కాలు పాటించండి
- Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
బేకింగ్ సోడా పేస్ట్
బేకింగ్ సోడా ఉపరితలాలకు ఎలాంటి గీతలు పడకుండా జిడ్డును తొలగించే అద్భుతమైన నాన్-టాక్సిక్ క్లీనర్. మూడు నుండి నాలుగు టీస్పూన్ల బేకింగ్ సోడాకు కొన్ని చుక్కల నీరు కలిపి చిక్కటి పేస్ట్‌లా తయారు చేయాలి. ఈ పేస్ట్‌ను స్విచ్‌బోర్డ్‌పై పూసి 5 నిమిషాల పాటు ఉంచాలి. అనంతరం ఒక పొడి స్క్రబ్బర్ లేదా బ్రష్‌తో మెల్లగా రుద్ది, పొడి గుడ్డతో తుడిచేస్తే బోర్డు మెరిసిపోతుంది.
ఉప్పు, నిమ్మకాయ , టూత్‌పేస్ట్ చిట్కాలు
రెండు టీస్పూన్ల ఉప్పులో నిమ్మరసం కలిపి, పాత టూత్‌బ్రష్ సహాయంతో స్విచ్బోర్డ్కు పూసి 5 నిమిషాలు ఉంచాలి. ఆ తర్వాత స్క్రబ్బర్‌తో రుద్ది శుభ్రం చేస్తే ముదురు మరకలు సులభంగా వదులుతాయి. అంతేకాకుండా, ఇంట్లో ఉండే తెల్లటి టూత్‌పేస్ట్‌ను స్విచ్బోర్డ్కు పూసి 5 నిమిషాలు ఉంచిన తర్వాత బ్రష్‌తో సున్నితంగా రుద్ది, పొడి గుడ్డతో తుడిచివేసినా మంచి ఫలితం ఉంటుంది.
రబ్బింగ్ ఆల్కహాల్‌తో సురక్షితమైన శుభ్రత
ఎలక్ట్రానిక్ , విద్యుత్ ఉపకరణాలను శుభ్రం చేయడానికి ‘రబ్బింగ్ ఆల్కహాల్’ (ఐసోప్రొపైల్ ఆల్కహాల్) అత్యంత సురక్షితమైన మార్గం. ఇది త్వరగా ఆవిరైపోతుంది కాబట్టి షార్ట్ సర్క్యూట్ అయ్యే ప్రమాదం ఉండదు. కొద్దిగా రబ్బింగ్ ఆల్కహాల్‌ను పొడి మైక్రోఫైబర్ గుడ్డ లేదా దూదికి అద్ది స్విచ్‌బోర్డ్‌పై మెల్లగా తుడవాలి. ఇది బోర్డుపై ఉన్న మొండి నూనె, గ్రీజు మరకలను క్షణాల్లో కరిగించివేస్తుంది.
తెల్ల వెనిగర్ , డిష్ సోప్ ద్రవం
ఇంట్లో రబ్బింగ్ ఆల్కహాల్ అందుబాటులో లేకపోతే తెల్ల వెనిగర్, డిష్‌వాషింగ్ లిక్విడ్ ఉపయోగించవచ్చు. వెనిగర్‌లోని ‘ఎసిటిక్ యాసిడ్’ జిడ్డును కరిగించే సహజ క్రిమిసంహారక ఏజెంట్‌గా పనిచేస్తుంది. ఒక గిన్నెలో గోరువెచ్చని నీరు తీసుకుని అందులో కొన్ని చుక్కల డిష్ సోప్, ఒక టీస్పూన్ తెల్ల వెనిగర్ వేసి కలపాలి. ఈ మిశ్రమంలో గుడ్డను ముంచి, ఒక్క చుక్క నీరు కూడా కారకుండా బాగా పిండివేసి బోర్డును తుడవాలి. మూలల్లో ఉన్న జిడ్డును తొలగించడానికి పాత టూత్‌బ్రష్‌ను తేలికగా తడిపి వాడవచ్చు. ఆ తర్వాత పొడి గుడ్డతో క్షుణ్ణంగా తుడవాలి.
బోర్డును ఆరబెట్టడం , విద్యుత్ పునరుద్ధరణ
శుభ్రపరచడం పూర్తయిన తర్వాత స్విచ్‌బోర్డ్, దాని చుట్టుపక్కల ప్రాంతం పూర్తిగా పొడిగా మారే వరకు వేచి చూడాలి. పొడి గుడ్డతో చివరిసారిగా క్షుణ్ణంగా తుడిచి, తడి ఏమాత్రం లేదని నిర్ధారించుకున్న తర్వాత మాత్రమే మెయిన్ విద్యుత్ సరఫరాను (MCB) తిరిగి ఆన్ చేయాలి.
తాజావార్తలు
-
Test Twenty Cricket: క్రికెట్లో సరికొత్త ప్రయోగం.. అమ్మాయిలు, అబ్బాయిలతో 80 ఓవర్ల సరికొత్త ‘టెస్ట్ ట్వంటీ’ టోర్నీకి శ్రీకారం..!
-
IND vs ZIM: “ఆ ఇద్దరి వల్లే గెలిచాం.. అయినా నాకు సంతృప్తిగా లేదు”.. కెప్టెన్‌గా తొలి విజయంపై స్మృతి కీలక వ్యాఖ్యలు..
-
AP High Court: స్థానిక ఎన్నికలపై హైకోర్టు కీలక ఆదేశాలు..
-
Trump: వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీగా కేటీ జకారియా నియామకం.. అంతలోనే షాకిచ్చిన ట్రంప్
-
IND vs WI 5th T20: నేడే భారత్ vs వెస్టిండీస్ డిసైడర్ మ్యాచ్.. అభిషేక్‌కి షాక్.. బుడ్డోడికి గుడ్‌న్యూస్! ప్లేయింగ్ 11 ఇదే?
ట్రెండింగ్
-
Saturday Horoscope: ఆ రాశుల వారికి ఆర్థిక లాభాలు.. కానీ ఆ రాశి వారు మాత్రం జాగ్రత్త సుమీ..!
-
International Day for the Eradication of Poverty: పేదరికం అంటే ఆకలి మాత్రమే కాదు.. కొత్త సవాళ్లివే.!
-
Stain Removal Tips : నవరాత్రి వేళ తెల్లటి బట్టలపై కుంకుమ, మొండి మరకలా? ఈ చిట్కాలతో మాయం.!
-
Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
-
TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?