కర్ణాటకలోని కొప్పల్లో దారుణ ఘటన చేసుకుంది. భర్త కళ్లేదుటే ఆరుగురు వ్యక్తులు 21 ఏళ్ల మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమె భర్తను విచక్షణారహితం కొట్టారని బాధితురాలు తెలిపింది.
Agra: ఉత్తర ప్రదేశ్లో దారుణం జరిగింది. ఓ వ్యాపారవేత్త తన తల్లిని, కొడుకును హత్య చేసి, తాను ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన ఆగ్రాలో చోటుచేసుకుంది. భార్య గుడికి వెళ్లిన సమయంలో అతను ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు ప్రాథమిక విచారణలో తేలింది. ఆత్మహత్య, హత్యలకు ఆర్థిక ఇబ్బందులే కారణమని తెలుస్తోంది.
అనకాపల్లి జిల్లా మాడుగుల మండలంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. తాటిపర్తి పంచాయితీ కాశీపురం గ్రామంలో తన భర్త వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని అనుమానంతో భార్య ఓ మహిళపై పెట్రోల్ పోసి నిప్పంటించి హత్యాయత్నానికి పాల్పడిన వైనం తాజాగా వెలుగులోకి వచ్చింది.
పెళ్లి తిరస్కరించిందన్న ఆరోపణతో ఓ యువతిపై ఓ యువకుడు కత్తితో పొడిచి చంపగా, ఆమె కోడలు, మేనల్లుడు దాడిలో గాయపడిన సంఘటన ఖానాపూర్ పట్టణంలోని శివాజీనగర్లో గురువారం జరిగింది. ఖానాపూర్ పోలీస్ ఇన్స్పెక్టర్ మోహన్ మాట్లాడుతూ, శెట్పల్లి అలేఖ్య (20) తనతో పెళ్లి నిరాకరించినందుకు ఆమె స్నేహితుడు శ్రీకాంత్ కత్తితో దాడి చేయడంతో ఆమె తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందింది. అయితే.. అలేఖ్యకు ఆమె తల్లిదండ్రులు మరో పెళ్లి సంబంధాన్ని చూస్తున్నారు.. ఇది తెలిసిన శ్రీకాంత్…
మధ్యప్రదేశ్లో డాక్టర్ నర్సుపై కాల్పులు జరిపాడు. నర్సుగా పనిచేస్తున్న మహిళ వేరే వ్యక్తితో ఎఫైర్ పెట్టుకుందనే అనుమానంతో డాక్టర్ ఆమెపై కాల్పులు జరిపిన ఘటన బుధవారం జబల్పూర్లో చోటు చేసుకుంది. ఇద్దరి మధ్య దీనిపై వాగ్వాదం జరిగింది. కోపోద్రిక్తుడైన డాకర్ట సందీప్ సోని(34), 27 ఏళ్ల మహిళా నర్సుపై గన్లో రెండు రౌండ్లు కాల్పులు జరిపారు.
ప్రేమ పేరుతో నమ్మించి.. శారీరకంగా అనుభవించి పెళ్లికి నిరాకరించడమే కాకుండా స్లో పాయిజన్ ద్వారా చంపాలని చూశాడు ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం కి చెందిన మాధురి, శేఖర్లు సాఫ్ట్వేర్ ఉద్యోగులుగా పనిచేస్తున్నారు.
Woman Robs Own Home: ఢిల్లీకి చెందిన ఓ మహిళ సొంతింటికే కన్నం పెట్టింది. బురఖా ధరించి సొంత ఇంటిలో పెళ్లి కోసం ఉంచిన నగలను దోచింది. 31 ఏళ్ల యువతి ఇంట్లోకి చొరబడి నగలు, నగదును దోచుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన జనవరి 30న ఢిల్లీలోని ఉత్తమ్ నగర్ లోని సేవర్ పార్క్లోని ఇంట్లో జరిగింది. దీనిపై ఇంటి యజమాని కమలేష్ పోలీసులను ఆశ్రయించడంతో అసలు కథ వెలుగులోకి వచ్చింది.
Uttar Pradesh: ఉత్తరప్రదేశ్ లక్నోలో దారుణం జరిగింది. ప్రియురాలిని హత్య చేసినందుకు ఓ వ్యక్తిని అరెస్ట్ చేశారు. కాకోరికి చెందిన బ్రిజేష్ మౌర్యను నిందితుడిగా పోలీసులు గుర్తించారు. అతని ప్రియురాలు సరిత, పెళ్లి చేసుకోవాలని బలవంతం చేసినందుకే నిందితుడు గొంతు నులిమి హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని చెరువు వద్ద వేలాడదీశాడు.
తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం పెదకొండేపూడిలో వివాహితకు భర్త శిరోమండనం చేసిన అమానుష ఘటన చోటుచేసుకుంది. అనుమానంతో భార్యను చిత్ర హింసలు ఆమెకు గుండు గీసి పరారయ్యాడు. నాలుగేళ్ల క్రితం హైదరాబాదులో సినిమా జూనియర్ ఆర్టిస్టులుగా పనిచేసిన కర్రి అభిరామ్, ఆశలు అప్పట్లో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.