KTR : బ్రిటన్ హౌస్ ఆఫ్ లార్డ్స్‌లో తెలంగాణ బిడ్డ.. ఉదయ్ నాగరాజుకు కేటీఆర్ ఘన సన్మానం
- హౌస్ ఆఫ్ లార్డ్స్‌కు ఎంపికైన ఉదయ్ నాగరాజు
- ఢిల్లీలో శాలువా, సిల్వర్ ఫిలిగ్రీతో కేటీఆర్ సత్కారం
- భారత్-యూకే సంబంధాల్లో కీలక పాత్ర పోషించాలని ఆకాంక్ష
- కేటీఆర్ రాజకీయ ప్రస్థానం తనకు స్ఫూర్తి అన్న ఉదయ్ నాగరాజు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KTR : తెలంగాణకు చెందిన ప్రముఖ ప్రవాస భారతీయుడు, తొలిసారిగా బ్రిటన్ ‘హౌస్ ఆఫ్ లార్డ్స్’ కు ఎంపికైన తెలుగు బిడ్డ ఉదయ్ నాగరాజును బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘనంగా సత్కరించారు. న్యూఢిల్లీలో నిర్వహించిన ఒక ప్రత్యేక అభినందన సభలో దేశంలోని పలు రాష్ట్రాల నుంచి, అన్ని ప్రధాన రాజకీయ పార్టీలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు. ఈ వేదికపై కేటీఆర్, ఉదయ్ నాగరాజును శాలువాతో సత్కరించి, కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రీ మాస్టర్ పీస్ అందజేసి తమ శుభాకాంక్షలు తెలిపారు.
భారత్-యూకే సంబంధాల్లో ఉదయ్ పాత్ర కీలకం: కేటీఆర్
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, హౌస్ ఆఫ్ లార్డ్స్‌కు ఎంపికైన ఉదయ్ నాగరాజుకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. గత రెండు దశాబ్దాలకు పైగా భారత్, బ్రిటన్ల మధ్య వివిధ రంగాల్లో సంబంధాల బలోపేతానికి ఉదయ్ నాగరాజు విశేష కృషి చేశారని కొనియాడారు. యూకే పౌరుడిగా అక్కడి స్థానిక రాజకీయాల్లో క్షేత్రస్థాయి నుంచి ఎదిగి, అత్యున్నత సభ సభ్యుడిగా ఎంపిక కావడం ఆయన పట్టుదల, సేవా నిరతికి నిదర్శనమని పేర్కొన్నారు. ఆయన ప్రస్థానం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రవాస భారతీయులకు, ముఖ్యంగా యువతకు ఎంతో స్ఫూర్తిదాయకమని అన్నారు. భవిష్యత్తులో భారత్-యూకే ద్వైపాక్షిక సంబంధాలతో పాటు తెలంగాణలో వాణిజ్యం, పెట్టుబడులు, సేవారంగాల పురోగతికి కూడా ఉదయ్ నాగరాజు తోడ్పడాలని ఆకాంక్షించారు.
Also Read
కేటీఆర్ రాజకీయ ప్రయాణమే నాకు స్ఫూర్తి
సన్మానం అందుకున్న అనంతరం ఉదయ్ నాగరాజు మాట్లాడుతూ, కేసీఆర్ నాయకత్వంలో సాగిన తెలంగాణ ఉద్యమం తనకు ఎంతో స్ఫూర్తినిచ్చిందని గుర్తుచేసుకున్నారు. అమెరికాలో ఉన్నత చదువులు పూర్తిచేసి, మంచి ఉద్యోగాన్ని వదులుకుని స్వరాష్ట్రం కోసం భారత్‌కు తిరిగివచ్చిన కేటీఆర్ రాజకీయ ప్రయాణం తనను ఎంతగానో ప్రభావితం చేసిందని చెప్పారు. సాధారణ కార్యకర్తగా ప్రయాణం ప్రారంభించి రాష్ట్ర మంత్రిగా, అంతర్జాతీయ గుర్తింపు పొందిన నాయకుడిగా ఎదిగిన కేటీఆర్ తీరు.. చదువుకున్న యువత రాజకీయాల్లోకి వస్తే సమాజంలో గొప్ప మార్పు తేవచ్చనే నమ్మకాన్ని కలిగించిందన్నారు. సమకాలీన రాజకీయాలు, పెట్టుబడుల సాధనపై కేటీఆర్‌కు ఉన్న దూరదృష్టి అభినందనీయమని చెబుతూ, ఈ కార్యక్రమానికి వచ్చి తనను అభినందించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
ప్రముఖుల సమక్షంలో ఘనంగా వేడుక
న్యూఢిల్లీలో జరిగిన ఈ అభినందన సభలో బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్రతో పాటు రాజ్యసభ సభ్యుడు దామోదర్ రావు, మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి, పార్టీ సీనియర్ నాయకుడు జాన్సన్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. పలువురు రాజకీయ ప్రముఖుల మధ్య ఈ వేడుక ఎంతో ఉత్సాహంగా జరిగింది.
తాజావార్తలు
-
Sudivya Kumar Sonu: ఉన్నత విద్యాశాఖ మంత్రి సుదివ్య కుమార్ సోను కన్నుమూత.. జేఎంఎం తీవ్ర దిగ్భ్రాంతి
-
Maremmma Pre Release Event: అబ్బాయి సినిమా చూసి ఫిదా అయిన రవితేజ.. ‘మారెమ్మ’పై మాస్ మహారాజా ప్రశంసలు
-
Miss World 2026 Winner: జోహెయిర్రీ మోలా సొంతం చేసుకున్న మిస్ వరల్డ్ కిరీటం.. టాప్ 40లో నికితా పొర్వాల్
-
Bigg Boss Telugu 10: ఇక బిగ్ బాస్ సందడే.. ఈరోజు నుంచి షో స్టార్ట్.. కంటెస్టెంట్స్ లిస్ట్ ఇదే!
-
OTR : కాంగ్రెస్‌లో ఇక గీత దాటితే ఎంతటి వారికైనా వేటు తప్పదా?
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!