తెలంగాణ సర్కార్‌కు ఈసీ షాక్.. రైతు బంధు అనుమతి ఉపసంహరణ
తెలంగాణలో బీఆర్ఎస్ సర్కార్‌కు షాక్ ఇచ్చింది కేంద్ర ఎన్నికల కమిషన్.. రెండు రోజుల క్రితం రైతు బంధు నిధుల పంపిణీకి అనుమతి ఇచ్చిన ఎన్నికల సంఘం.. ఇప్పుడు ఉన్నట్టుండి రైతు బంధుకు ఇచ్చిన అనుమతిని ఉపసంహరించుకుంటున్నట్టు ప్రకటించింది.. కాగా, ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున రైతుబంధు నిధులకు బ్రేక్ పడింది. అయితే దీనిపై ప్రభుత్వ ప్రతిపదనకు ఎన్నికల కమిషన్ నిధుల విడుదలకు అనుమతి ఇచ్చింది. అయితే, నవంబర్ 28వ తేదీలోపు రైతులకు నిధులు జమ చేయాలని సూచించింది. ఎన్నికల కమిషన్ నిధుల విడుదల చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో రైతులకు ఊరట లభించినట్టు అయ్యింది.. కానీ, రైతు బంధు నిలిపివేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి తాజాగా ఆదేశాలు జారీ చేసింది కేంద్ర ఎన్నికల కమిషన్.. ఇప్పుడు నిధులు విడుదల చేస్తే ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందకు వస్తుందని స్పష్టం చేసింది ఎన్నికల కమిషన్.. రెండు రోజుల క్రితం రైతు బంధు నిధుల విడుదలకు అనుమతి ఇచ్చిన ఈసీ.. అయితే, 28వ తేదీ 70 లక్షల రైతుల ఖాతాల్లో సుమారు 7 వేల కోట్ల రూపాయలు రైతుబంధు నిధులు వేసేందుకు సిద్ధమైంది తెలంగాణ ప్రభుత్వం.. ఇప్పుడు వెలువడిన ఈసీ తాజా ఆదేశాలతో రైతుల ఖాతాల్లో నగదు జమ నిలిచిపోయింది.
కార్తిక పౌర్ణమి.. శైవక్షేత్రాలు భక్తులతో కిటకిట
కార్తిక పౌర్ణమిని అత్యంత ముఖ్యమైన, పవిత్రమైన రోజుల్లో ఒకటిగా భావిస్తారు భక్తులు.. ఈ రోజున నదుల్లో పుణ్యస్నానాలు ఆచరించి, దీపాలు వెలిగిస్తుంటారు.. సూర్యోదయానికి ముందే దీపాధారదన చేస్తారు.. ముఖ్యమంత్రి శైవ క్షేత్రాలకు భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది.. ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలం కార్తీక రెండవ సోమవారం, పౌర్ణమి కావడంతో మల్లన్న ఆలయానికి భక్తులు పోటెత్తారు. మధ్యాహ్నం వరకు పౌర్ణమి ఉండటంతో పాతాళగంగలో పుణ్యస్నానాలను ఆచరిస్తున్నారు భక్తజనం … గంగాధర మండపం, ఉత్తర శివమాడ వీధిలో కార్తీక దీపాలను వెలిగిస్తున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా భక్తులందరికీ స్వామివారి అలంకార దర్శనానికి అనుమతి ఇస్తున్నారు. క్యూలైన్లో వేలాదిమంది భక్తులు వేచిఉండగా.. మల్లన్న దర్శనానికి సుమారు 4 గంటల సమయం పడుతున్నట్టు అధికారులు చెబుతున్నారు.. మొత్తంగా శివనమస్మరణతో ముక్కంటీ క్షేత్రం మార్మోగుతోంది.. ఇక, శ్రీశైలంతో పాటు ఈ రోజు తెల్లవారుజామున నుంచే భక్తులు తెలుగు రాష్ట్రాల్లోని ఇతర ఆలయాల్లో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాన్నారు. భక్తిశ్రద్దలతో దీపాలు వెలిగిస్తున్నారు. వరంగల్ భద్రకాళి, అన్నవరం, ద్వారకతిరుమల, భద్రాచలం సహా చిన్నా పెద్ద ఆలయాలు అనే తేడా లేకుండా అన్ని ఆలయాల దగ్గర రద్దీ కనిపిస్తోంది.. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని శివాలయాలన్నీ శివనామస్మరణతో మారుమొగుతున్నాయి. హన్మకొండలోని వెయ్యి స్తంభాల గుడి, సిద్దేశ్వరా స్వామి దేవాలయం, భద్రకాళి భద్రశ్వరా స్వామి దేవాలయాల్లో తెల్లవారు జామునుంచి భక్తులు బారులు తీరారు. కాళేశ్వరం, రామప్ప, పాలకుర్తి సోమేశ్వర స్వామి దేవాలయం, కురవి వీరబాదరస్వామి, ఐనవోలు మల్లికార్జున స్వామి, కొమురవెళ్లి మల్లన్న ఆలయాల్లో కార్తికపౌర్ణమి శోభ సంతరించుకుంది. శివాలయాల్లో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహిస్తున్నారు. శివనామస్మరణతో శైవ క్షేత్రాలు మారుమోగుతున్నాయి.
సామాజిక విప్లవానికి నిదర్శనమే అంబేద్కర్ విగ్రహం..!
సామాజిక విప్లవానికి నిదర్శనమే విజయవాడలో అంబేద్కర్ విగ్రహ నిర్మాణం అన్నారు మంత్రి మేరుగ నాగార్జున.. ఏపీ చరిత్రలో సామాజిక సమతుల్యత కోసం సీఎం వైఎస్ జగన్ ఈ నిర్మాణం చేస్తున్నారని తెలిపారు.. అంబేద్కర్ చరిత్ర ఈ నిర్మాణంలో తెలుస్తుందన్నారు. త్వరలో బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం ప్రారంభిస్తాం అని వెల్లడించారు. అంబేద్కర్ జీవిత చరిత్ర చెప్పే స్టూడియో, మినీ థియేటర్ కూడా ఇందులో ఉంటాయి.. బౌద్ధ మతాన్ని అంబేద్కరం స్వీకరించిన నాటి వివరాలు ఈ స్మృతివనంలో ఉంటాయని వివరించారు. అంబేద్కర్ భావజాలాన్ని సీఎం వైఎస్ జగన్ పరిపాలనా తీరులో చూడవచ్చు అన్నారు. ఏ వర్గాన్ని విస్మరించకుండా అన్నిరకాల సహకారం అందిస్తున్నారు సీఎం జగన్ అని కొనియాడారు.. వేల కోట్లు ఇచ్చినా ఇలాంటి స్ధలం నిర్మాణానికి దొరకదు అన్నారు. మరోవైపు, నారా లోకేష్ ఎవరు? ఎమ్మెల్యేనా..? అని ప్రశ్నించారు మంత్రి మేరుగ నాగార్జున.. అంబేద్కర్ పేరు ఉచ్ఛరించడానికి లోకేష్, అతని కుటుంబం పనికిరావన్నారు. ముళ్లపొదల్లో అంబేద్కర్ విగ్రహం పెట్టాలని చూసి దళితులను అపహాస్యం చేసిన వ్యక్తిగా చంద్రబాబు మిగులుతారని మండిపడ్డారు మంత్రి మేరుగ నాగార్జున.
విరిగిన రైలు పట్టా.. ఏపీలో తప్పిన భారీ ప్రమాదం
ఈ మధ్య వరుసగా రైలు ప్రమాదాలు భారీ ప్రాణనష్టాన్ని మిగిల్చాయి.. అయితే, ఆంధ్రప్రదేశ్‌లో మరో ఘోర రైలు ప్రమాదం తప్పింది.. తిరుపతి జిల్లా పూతలపట్టు మండలంలో రైలు పట్టా విరిగింది.. అయితే, ముందుగా రైలు పట్టా విరిగినట్టు గ్యాంగ్ మేన్ గుర్తించడంతో ప్రమాదం తప్పింది.. విరిగిన పట్టాను గమనించి.. దీనిపై అధికారులకు సమాచారం ఇచ్చాడు గ్యాంగ్‌మెన్.. దీంతో.. రామేశ్వరం నుంచి వస్తున్న రైలును నిలిపివేశారు అధికారులు.. మరమ్మతులు చేసి యథావిథిగా రైళ్లను నడుపుతున్నారు.. రైలు పట్టా మరమ్మతుల కారణంగా 10 నిమిషాలు ఆలస్యంగా పాకాలకు చేరుకుంది రైలు.. ప్రస్తుతానికి ఆ రైట్‌లో రైళ్ల రాకపోకలు యథావిథిగా కొనసాగుతున్నట్టు రైల్వే అధికారులు చెబుతున్నారు.
కాంగ్రెస్ ఏమైనా కొత్త పార్టీనా చెత్తపార్టీ.. 55 ఏండ్లు మనల్ని చావగొట్టిన పార్టీ…
కాంగ్రెస్ అది ఏమైనా కొత్త పార్టీనా చెత్తపార్టీ.. 55 ఏండ్లు మనల్ని చావగొట్టిన పార్టీ అని మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యాలు చేశారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లో కేటీఆర్ రోడ్ షో చేపట్టారు. కాంగ్రెస్, బీజేపీఓడు ఇయ్యాల పొద్దున్న ఆర్డర్ ఇచ్చి రైతుబంధు ఆపించారని మండిపడ్డారు. దేమో ఇచ్చుకోవచ్చన్నరు ఇప్పుడు ఈసీ మీద ఒత్తిడి తెచ్చి రైతు బందు ఆపిచ్చిండ్రని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారం రాకముందే రైతుబంధు కాటగలిపిండ్రని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆ దిక్కుమాలిన పార్టీలకు ఓటేస్తే ఆగమైతం అన్నారు. తెలంగాణలో ఉన్న రైతులు బీద బిక్కీలే వారికి 3 గంటల కరెంటు చాలంటున్నడు రేవంత్ రెడ్డి అని అన్నారు. రైతుబంధు రైతుకిస్తే, కౌలుదారుకు ఇయ్యనంటున్నాడని అన్నారు. కాంగ్రెస్ కు ఇప్పటికే 11 ఛాన్స్ లిచ్చినం ప్రజల జీవితాలను ఆగం చేసిండ్రని అన్నారు. కాంగ్రెస్ అదేమైనా కొత్త పార్టీనా, చెత్తపార్టీ.. 55 ఏండ్లు మనల్ని చావగొట్టిన పార్టీ అన్నారు. సీఎంగా కేసీఆర్ రైతుబంధు స్టార్ట్ చేసిండు, రైతుభీమా, కళ్యాణలక్ష్మి, షాదీముబారక్, 24 గంటల కరెంటు ఇచ్చారని గుర్తు చేశారు. ఒకసారి తప్పుచేసి 50 ఏండ్లు బాధపడ్డం, అదే తప్పు మరోసారి చేయద్దని ప్రజలకు పిలుపు నిచ్చారు. డబ్బాలో ఓటేసే ముందుమిమ్మల్ని మీరు ప్రశ్నించుకోని ఓటేయ్యండి అని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ కావాలో కరెంటు కావాలో ఆలోచించాలని తెలిపారు. ఆగం కావద్దు అని తెలిపారు. రైతుబంధు కావాల్నా, రాబంధు కాంగ్రెస్ కావాల్నా బీజేపీ, కాంగ్రెస్ డిల్లీ నేతలంతా వచ్చి ఒక్క కేసీఆర్ బొండిగ పిసకాలని చూస్తున్నారని తెలిపారు. 55 ఏండ్లు భస్మాసుర హస్తం మనలను నాశనం చేసిందన్నారు. కత్తి ఒకనికిచ్చి యుద్దం మమ్మల్ని చేయమంటే మాతోని కాదని కేటీఆర్ స్పష్టం చేశారు.
బీజేపీ, బీఆర్‌ఎస్ ఒక్కటే అంటే వాళ్ళను చెప్పుతో కొట్టండి.. కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
బీజేపీ, బీఆర్‌ఎస్ ఒక్కటే అంటే వాళ్ళను చెప్పుతో కొట్టాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి తెలంగాణ ప్రజల్ని కోరారు. 50 శాతం కాంగ్రెస్ అభ్యర్థులకు కర్ణాటక సర్కారు నుంచి వచ్చిన డబ్బులిస్తే.. మిగిలిన 50 శాతానికి కేసీఆర్ డబ్బులు సమకూరుస్తున్నాడని కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ కుటుంబ పార్టీ లను ఒడించడమే మా ప్రాధాన్యం అని తెలిపారు. రైతు బందుపై కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. రెండు పార్టీలూ తెరవెనుక చర్చలు జరుపుతూ.. బీజేపీని ఓడిద్దామని కుట్రలుచేస్తున్నాయని మండపడ్డారు. ఆవు ఎక్కడమేసినా.. పాలు ప్రగతి భవన్ లో ఇస్తే చాలు అన్నట్లు ఇద్దరూ సహకరించుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నీవు ఇచ్చే హామీలకు గ్యారంటీ ఎవరు రాహుల్ గాంధీ ? అని ప్రశ్నించారు. అధికార పగ్గాలు వదిలిపెట్టి, కాంగ్రెస్ అధ్యక్ష పదవిని వదిలి పారిపోయిన రాహుల్ ఇవాళ నీతులు వల్లెవేయడం హాస్యాస్పదం అన్నారు. మజ్లిస్ పార్టీ నీడపడిన ఏ పార్టీతోనూ బీజేపీ కలిసే ప్రసక్తే లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. నీ చరిత్ర ఏంటి? నీ పార్టీ చరిత్ర ఏంటి? మీ ఇంటికి రమ్మంటావా? ఢిల్లీకి రమ్మంటావా? అమరవీరు స్థూపానికి వస్తావా? చర్చకు వస్తావా? అని సవాల్ విసిరారు.
తెలంగాణలో అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్సే..
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది అని రాజస్థాన్ ఎమ్మెల్యే సచిన్ పైలెట్ తెలిపారు. ప్రజల్లో మంచి స్పందన ఉంది.. రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీల పర్యటనలకు మంచి స్పందన వస్తుందని ఆయన పేర్కొన్నారు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో ఆకాంక్షలు నెరవేరలేదు.. నిరుద్యోగం పెరిగి పోతుంది.. ప్రజలు ప్రభుత్వ మార్పు కోరుకుంటున్నారు.. భారత్ జోడో యాత్ర ద్వారా రాహుల్ గాంధీ 4 వేల కిలో మీటర్ల పాదయాత్ర చేశారు అని ఆయన చెప్పుకొచ్చారు. ఛత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ లతో పాటు తెలంగాణలోనూ కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది అని సచిన్ పైలెట్ వెల్లడించారు. ఎల్లుండి (నవంబర్ 30) జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ కి ఓటేయాలి అని కాంగ్రెస్ నేత సచిన్ పైలెట్ కోరారు. కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇవ్వాలని ప్రజలు నిర్ణయించుకున్నారు.. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు.. వారికి క్రెడిబిలిటి లేదు.. ఉద్యోగాలు ఇవ్వలేదు.. నిరుద్యోగ భృతి ఇవ్వలేదు.. కర్ణాటక విజయం తరువాత జరుగుతున్న తెలంగాణ ఎన్నికల్లో కూడా అలాంటి ఫలితమే వస్తుంది అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఓట్ ఫర్ చేంజ్.. మార్పు కోసమే ప్రజలు ఓటేయబోతున్నారు.. రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి బహుమతిగా ఇవ్వండి అని సచిన్ పైలెట్ పేర్కొన్నారు.
చివరి 5 ఓవర్లలోనే నా పని.. ఫినిషింగ్ స్కిల్స్‌పై దృష్టి పెట్టా!
యువ ‘ఫినిషర్’ రింకు సింగ్ ఫామ్ కేవలం ఐపీఎల్‌కు మాత్రమే పరిమితం కాలేదు. అంతర్జాతీయ క్రికెట్‌లో కూడా రింకు మెరుపులు మెరిపిస్తున్నాడు. ఆస్ట్రేలియా టీ20 సిరీస్‌లో రింకు అదరగొట్టేస్తున్నాడు. తొలి మ్యాచ్‌లో లక్ష్య ఛేదన సమయంలో భారత జట్టును గెలిపించిన రింకు.. రెండో టీ20లో తొలుత బ్యాటింగ్ సందర్భంగా 9 బంతుల్లోనే 31 రన్స్ బాదాడు. రెండో టీ20లో ఇన్నింగ్స్ చివరలో క్రీజులోకి వచ్చిన యువ ఫినిషర్ 4 ఫోర్లు, 2 సిక్సులు బాది అభిమానులను అలరించాడు. రెండో టీ20 మ్యాచ్ అనంతరం రింకు సింగ్ మాట్లాడుతూ.. జట్టులో తన పాత్రపై కచ్చితమైన అవగాహన ఉందని, ఫినిషింగ్ స్కిల్స్‌పై దృష్టి పెట్టా అని తెలిపాడు. ‘నేను కొంతకాలంగా 5-6 స్థానంలో ఆడుతున్నాను. కాబట్టి దూకుడుగా ఆడాల్సిన అవసరం ఉంది. అయినా కూడా ప్రశాంతంగా మరియు ఏకాగ్రతతో ఉండటానికి ప్రయత్నిస్తాను. బంతిని బట్టి నా షాట్ ఎంపిక ఉంటుంది. బంతిని నిశితంగా గమనించగలిగితేనే.. భారీ షాట్లు కొట్టేందుకు ఛాన్స్ లభిస్తుంది’ అని రింకు తెలిపాడు.
యూజర్లకు అదిరిపోయే గుడ్‌న్యూస్ చెప్పిన ఫోన్‌పే..
తన యూజర్లకు అదిరిపోయే గుడ్‌న్యూస్ చెప్పింది డిజిటల్ ఆన్‌లైన్ పేమెంట్స్ ప్లాట్‌ఫామ్స్ సంస్థ ఫోన్‌పే.. జనవరి 2024 నాటికి వినియోగదారుల రుణాలను ప్రారంభించాలని భావిస్తుస్తోంది. వాల్‌మార్ట్ మద్దతు ఉన్న స్టార్టప్, క్రెడిట్ అండర్‌రైటింగ్‌ను నిర్మించేటప్పుడు వ్యక్తిగత రుణాలను పంపిణీ చేస్తుంది.. ఫోన్‌పే తన ప్లాట్‌ఫామ్స్‌లో కన్సూమర్ లెండింగ్ లోన్స్‌ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సిద్ధమవుతున్నట్టాగా తెలుస్తోంది.. ఇదే జరిగితే ఫోన్‌పే కూడా తన కస్టమర్లకు పర్సనల్ లోన్స్, ఇతర కన్సూమర్ లోన్స్ ఆఫర్ చేస్తుందన్నమాట.. దీని కోసం ఫోన్ పే ఐదు బ్యాంకులు మరియు నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలతో అనుసంధానం యొక్క చర్చలు చివరి దశలో ఉన్నట్టుగా జాతీయ మీడియా పేర్కొంది.. తర్వాత దశలో, ఫోన్‌పే క్రెడిట్ లైన్ ఆఫర్‌ను కూడా చూడవచ్చు. మరోవైపు, ఈ నెల ప్రారంభంలో, ఫోన్‌పే వినియోగదారుల సంఖ్య 500 మిలియన్లను దాటినట్లు ప్రకటించింది. కంపెనీ ప్రకటన ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా ఈ స్థాయి 500 మిలియన్ల వినియోగదారులను చేరుకున్న మొదటి భారతీయ ఇంటర్నెట్ కంపెనీగా నిలిచింది. “మేం ఫోన్‌పేని ప్రారంభించినప్పుడు, ఇంత తక్కువ వ్యవధిలో 500 మిలియన్ల మంది నమోదిత వినియోగదారులను పొందుతామని ఊహించలేదు. మేం డిజిటల్ చెల్లింపులను తీసుకురావాలనే మా విజన్ స్టేట్‌మెంట్‌లో 50 శాతం మాత్రమే సాధించాం.. 1 బిలియన్ భారతీయులు” అని ఫోన్‌పే వ్యవస్థాపకుడు మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సమీర్ నిగమ్ ఒక ప్రకటనలో తెలిపారు.
స్కిన్ టైట్ డ్రెస్ లో నాగినీ భామ సొగసుల ప్రదర్శన.. సైడ్ యాంగిల్ లో హాట్ పోజులు..
బాలీవుడ్ ముద్దుగుమ్మ మౌని రాయ్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. హాట్ అందాలకు కేరాఫ్ గా నిలిచిన ఈ అమ్మడు సోషల్ మీడియాలో హైపర్ యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోలను అభిమానులతో పంచుకుంటుంది.. ఎప్పుడు హాట్ గా ఫోటోలను షేర్ చేస్తున్న ఈ అమ్మడు తాజాగా వెరైటీ డ్రెస్సులో సైడ్ యాంగిల్ లో నడుము అందాలతో ఉన్న ఫొటోలను షేర్ చేసింది.. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. నాగినితో బాగా ఫేమస్ అయిన ఈ బ్యూటీ. అందానికి.. నటనకు ముగ్దులైన ఆడియన్స్.. ఈ సీరియల్ తో పాటు మరిన్ని సీరియల్స్ లోనూ ఆమెను ఆదరించారు. ఇక మౌనీ కూడా తన మార్క్ నటనతో వారిని మెప్పించింది. బాలీవుడ్ లో పలు సినిమాల్లో కూడా నటించి మెప్పించింది బ్యూటీ. ఆడియెన్స్ కు ఎంతో దగ్గరైంది.. హాట్ హాట్ గా ఉండే మౌనీకి వరుసగా ఆఫర్లు రావడం స్టార్ట్ అయ్యింది. నెమ్మదిగా సినిమా ఆఫర్లనూ అందుకోవడం ప్రారంభించింది. కొన్ని హిందీ సినిమాల్లో మెరిసింది బ్యూటీ.. అటు సౌత్ సినిమాల్లో కూడా కనిపించింది. పాన్ ఇండియా మూవీగా వచ్చిన కేజీఎఫ్ లోనూ ఈ ముద్దుగుమ్మ ఓ పాటలో కనిపించింది..
తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీలో రచ్చ లేపుతున్న సుధా కొంగర కామెంట్స్…
గురు, ఆకాశం నీ హద్దురా లాంటి మంచి సినిమాలు చేసిన డైరెక్టర్ సుధా కొంగర ఇప్పుడు కోలీవుడ్ లో హాట్ టాపిక్ అయ్యింది. తమిళ సినీ అభిమానులు సుధా కొంగరని ట్యాగ్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూనే ఉన్నారు. ఇంత రచ్చ జరగడానికి కారణం ఏంటంటే… డైరెక్టర్ అమీర్ తెరకెక్కించిన ‘రామ్’ అనే సినిమా 2005లో రిలీజ్ అయ్యింది. జీవా హీరోగా నటించిన ఈ సినిమా కోలీవుడ్ లో చాలా మంచి హిట్ అయ్యింది. స్లో పాయిజన్ లా హిట్ అయిన ‘రామ్’ సినిమా చూడడానికి అప్పటిలో అసిస్టెంట్ డైరెక్టర్ గా మణిరత్నం దగ్గర వర్క్ చేస్తున్న హీరో కార్తీ, సుధా కొంగర అండ్ స్టూడియో గ్రీన్ ప్రొడక్షన్ హౌజ్ హెడ్ కే.ఈ.జ్ఞానవేల్ రాజాలు థియేటర్ కి వెళ్లారట. రామ్ సినిమాని చూసిన సుధా కొంగర అసలు మూవీలో మేకింగ్ యే లేదు, సినిమా బాగోలేదు అనుకుంటూ థియేటర్స్ నుంచి బయటకి వచ్చిందట. అసలు 2005లో జరిగిన విషయం ఇప్పుడు ఎలా బయటకి వచ్చింది అంటే జ్ఞానవేల్ రాజా ఇటీవలే ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో సుధా కొంగర అన్న మాటలని రివీల్ చేసాడు.
తొమ్మిది వారాలకు రతికా తీసుకున్న రెమ్యూనరేషన్ ఎన్ని లక్షలో తెలుసా?
బిగ్ బాస్ సీజన్ 7 తెలుగులో 12 వ వారం డబుల్ ఎలిమినేషన్ అయిన విషయం తెలిసిందే.. అశ్విని, రతిక ఇద్దరు ఈ వారం ఇంటికి వెళ్లారు.. అయితే వీరిద్దరూ రెమ్యూనరేషన్ గట్టిగానే తీసుకున్న విషయం తెలిసిందే.. అయితే రతిక అశ్విని కన్నా ఎక్కువగా తీసుకుందని వార్తలు వినిపిస్తున్నాయి.. రతిక రోజ్ 14 మంది కంటెస్టెంట్స్ లో ఒకరిగా బిగ్ బాస్ తెలుగు 7లో అడుగు పెట్టింది. మొదటి రోజు నుండే కంటెంట్ ఇవ్వడం స్టార్ట్ చేసింది. బయట ఆమె కోసం పని చేసే పీఆర్ టీమ్స్ ఉన్నాయి. పక్కా ప్లానింగ్ తో వెళ్ళింది. పల్లవి ప్రశాంత్ విషయంలో ఆమె ప్రవర్తించిన తీరు విమర్శలపాలైంది.. ఇక రతికా పాప ఆడే గేమ్ లలో నిజం లేదని తెలిసిపోయింది.. దాంతో హౌస్ లో ఎప్పుడూ గొడవలు కూడా పడుతూ వస్తుంది.. జనాలకు చిరాకు తెప్పించింది.. బయట పరిస్థితులు, హౌస్లో ఎవరు టాప్ లో ఉన్నారో తెలుసుకున్న రతిక గేమ్ మార్చింది. అదే సమయంలో కన్ఫ్యూషన్ లో పడింది. అగ్రెసివ్ గా ఆడితే ప్రమాదం అనుకుని తగ్గింది.. అంతగా జనాలను ఆకట్టుకోలేక పోయింది.. దాంతో జనాలు కూడా పాపకు ఓట్లు వెయ్యలేక పోయారు.. 12వ వారం తప్పలేదు. డబుల్ ఎలిమినేషన్ లో రతిక ఇంటి బాట పట్టింది. అశ్విని శనివారం ఎలిమినేట్ కాగా… ఆదివారం రతిక ఎలిమినేట్ అయ్యింది. అర్జున్-రతిక డేంజర్ జోన్లోకి వచ్చారు. పల్లవి ప్రశాంత్ ఈ ఇద్దరిలో ఎవరికీ పాస్ వాడేందుకు ఆసక్తి చూపలేదు.. నాగార్జున రతిక ఎలిమినేట్ అయినట్లు ప్రకటించారు. మొత్తంగా రతిక రోజ్ 9 వరాలు హౌస్లో ఉంది. రతిక వారానికి రూ. 2 లక్షల ఒప్పందం మీద హౌస్లో అడుగుపెట్టిందట.. దాంతో తొమ్మిది వారాలకు గాను రూ.18 లక్షలు తీసుకుందని తెలుస్తుంది.. ఇక ఈ వారం యావర్, శోభా ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉందని సోషల్ మీడియా లో వార్తలు వినిపిస్తున్నాయి..