చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్‌పై నేడు సుప్రీంకోర్టులో విచారణ
టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు బెయిల్ రద్దు పిటిషన్‌పై ఈ రోజు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది.. ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబుకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు.. మొదట మధ్యంతర బెయిల్, ఆ తర్వాత రెగ్యులర్ బెయిల్‌ను మంజూరు చేసిన విషయం విదితమే కాగా.. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది ఏపీ సీఐడీ.. సాక్ష్యాధారాలు సమర్పించినా సరే తమ వాదన పరిగణలోకి తీసుకోలేదని సుప్రీంకోర్టుకు వెళ్లింది.. ఇక, ఈ కేసును జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ సతీష్ చంద్ర శర్మతో కూడిన ధర్మాసనం ఈ రోజు విచారణ జరపనుంది.. అయితే, చంద్రబాబుకు బెయిల్ మంజూరులోతమ వాదనలు హైకోర్టు ఏమాత్రం పరిగణనలోకి తీసుకోలేదని పిటిషన్‌లో పేర్కొంది సీఐడీ.. హైకోర్టు తన పరిధి దాటి తీర్పులో ఏపీ ప్రభుత్వంపై వ్యాఖ్యలు చేసిందంటున్నారు పిటిషనర్.. ఈ కేసులో సుప్రీంకోర్టు వెంటనే చంద్రబాబు బెయిల్‌ను రద్దు చేయాలని కోరింది.
మంత్రి వేణుగోపాల్ ఆరోగ్యపరిస్థితిపై కీలక ప్రకటన
ఆంధ్రప్రదేశ్ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అస్వస్థతకు గురైనట్టు వార్తలు వచ్చాయి.. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం నుంచి తిరుపతి వెళ్తుండగా మంగళగిరి సమీపంలో ఆయన అస్వస్థతకు గురైనట్లు తెలిసింది. దీంతో, వెంటనే ఆయనను విజయవాడలోని ప్రభుత్వాసుపత్రిలో చేర్పించడం.. ఆ తర్వాత ఆయనను మెరుగైన వైద్యం కోసం మణిపాల్ ఆస్పత్రికి తరలించారు. ఇదే సమయంలో.. మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణకు గుండెనొప్పి అనే వార్తలు హల్‌చల్ చేశాయి.. అవి అవాస్తవమని ఆయన కుమారుడు చెల్లుబోయిన నరేన్ ఇప్పటికే స్పష్టం చేశారు. ఆయన ఆరోగ్యం బాగానే ఉందని.. కొన్ని మీడియాలు చూపిస్తున్నట్లు గుండె జబ్బు కాదని.. కేవలం అస్వస్థతకు గురయ్యారని క్లారిటీ ఇచ్చారు. అయితే, మంత్రి వేణుగోపాల్ ఆరోగ్య పరిస్థితిపై ఆయన సోషల్ మీడియా టీమ్ ఓ ప్రకటన చేసింది.. మంత్రి వేణు ఆరోగ్యం బాగానే ఉంది.. గత కొన్ని రోజులుగా వరుసగా పార్టీ కార్యక్రమంలో పాల్గొని సరైన నిద్ర లేని కారణంగా గాస్టిక్ ఇబ్బంది వచ్చిందని తెలిపారు.. సాధారణ బాడీ చెక్అప్ నిమిత్తం విజయవాడ మణిపాల్ హాస్పిటల్ కి వెళ్లడం జరిగింది. చాలా రోజుల నుండి విశ్రాంతి లేకపోవడంతో మాత్రమే ఈ సమస్య వచ్చిందన్నారు. ఒక రెండు రోజులు రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది డాక్టర్లు తెలియజేసినట్టు వెల్లడించారు.. మరేమీ కాదు.. ఎటువంటి వదంతులు నమ్మకండి అంటూ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ఆరోగ్య పరిస్థితిపై ఆయన సోషల్ మీడియా టీమ్ ప్రకటన చేసింది.
తెలంగాణలో నేటి నుంచి వైన్స్ బంద్!
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో మూడు రోజుల పాటు మద్యం దుకాణాలు మూతపడనున్నాయి. మంగళవారం (నవంబర్ 28) సాయంత్రం 5 గంటల నుంచి గురువారం (నవంబర్ 30) సాయంత్రం 5 గంటల వరకు మద్యం అమ్మకాలు నిలిపివేయనున్నారు. ఈ విషయంపై వైన్స్, బార్ల యజమానులకు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) ముందస్తు సమాచారం ఇచ్చింది. రాష్ట్రంలోని మద్యం దుకాణాల యజమానులను రాష్ట్ర ఎక్సైజ్‌శాఖ అప్రమత్తం చేసింది. ఎన్నికలను సజావుగా నిర్వహించే క్రమంలో కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసిన ఆదేశాలను పాటించకపోతే.. లైసెన్స్‌లు రద్దు చేయడంతో పాటు కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. మరోవైపు అసెంబ్లీ ఎన్నికల ఎన్నికల ఫలితాలు వెలువడనున్న డిసెంబర్ 3వ తేదీ కూడా మద్యం షాపులు మూసి ఉంటాయని అధికారులు తెలిపారు. ఇక డిసెంబర్ 1నుంచి నూతన మద్యం దుకాణాలు ప్రారంభం కానున్నాయి. తెలంగాణ ఎన్నికల పోలింగ్‌కు కౌంట్‌డౌన్ మొదలైంది. ప్రచారానికి ఇంకా కొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉండటంతో.. ప్రధాన పార్టీలు బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ ప్రచారంతో హోరెత్తిస్తున్నాయి. ఎన్నికల ప్రచార పర్వం నేటి సాయంత్రం ఐదు గంటల నుంచి ముగుస్తుంది. దీంతో అగ్రనేతలంతా తెలంగాణలో విస్తృతంగా పర్యటించనున్నారు. రాహుల్ గాంధీ చివరి రోజు హైదరాబాద్‌పై ఫోకస్ చేయగా.. సీఎం కేసీఆర్ నేడు వరంగల్, గజ్వేల్‌లో పర్యటిస్తారు.
రాహుల్, ప్రియాంక, రేవంత్ రెడ్డి సభలు.. రోడ్ షోలు.. వివరాలు ఇవే..
తెలంగాణలో ఎన్నికల ప్రచారం నేటితో ముగియనుంది. ఈ నేపథ్యంలో రాజకీయ నేతలు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. వివిధ రాజకీయ పార్టీల నేతలు నేడు పలు ప్రాంతాల్లో పర్యటించి ప్రచారం చేయనున్నారు. సాధ్యమయ్యే సమావేశాలు, సమావేశాలు, రోడ్ షోలు మరియు వీధి సమావేశాలు అన్నీ ప్లాన్ చేయబడ్డాయి. ఇందులోభాగంగా చివరి రోజైన ఇవాళ కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రచారం చేయనున్నారు. ఏఐసీసీ అధినేత రాహుల్ గాంధీ ఇవాళ హైదరాబాద్‌లో రోడ్ షోలు, వీధి సభలు నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటలకు జూబ్లీహిల్స్, మధ్యాహ్నం 12 గంటలకు నాంపల్లి, మధ్యాహ్నం 2 గంటలకు మల్కాజ్ గిరి, ఆనంద్ బాగ్ చౌరస్తాలో వీధి సభలు, వీధి సమావేశాల ద్వారా ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఇక ప్రియాంక గాంధీ నేడు జహీరాబాద్, మల్కాజిగిరిలలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ప్రియాంక గాంధీ జహీరాబాద్‌లో ఉదయం 11:30 నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు ప్రచారం చేయనున్నారు. అలాగే మధ్యాహ్నం 2:30 గంటలకు మల్కాజ్ గిరిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొని ప్రసంగిస్తారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఇవాళ కామారెడ్డి, మల్కాజిగిరి నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహించనున్నారు. దోమకొండలోని కామారెడ్డి పట్టణంలో రేవంత్ రెడ్డి రోడ్ షోలో పాల్గొననున్నారు. ఉదయం 10 గంటలకు కామారెడ్డి పట్టణంలో రోడ్ షో, 11 గంటలకు దోమకొండలో రోడ్ షో నిర్వహిస్తారు. మధ్యాహ్నం 2.30 గంటలకు మల్కాజిగిరిలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో కలిసి రేవంత్ రెడ్డి రోడ్ షోలో పాల్గొంటారు.
నేడు యోగి కేబినెట్ భేటీ.. కీలక నిర్ణయాలకు ఆమోదం
సీఎం యోగి అధ్యక్షతన మంగళవారం మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఉత్తరప్రదేశ్ సబార్డినేట్ రెవెన్యూ ఎగ్జిక్యూటివ్ నాయబ్ తహసీల్దార్ సర్వీస్ థర్డ్ అమెండ్‌మెంట్ రూల్స్-2023 మంగళవారం ఆమోదం కోసం క్యాబినెట్ ముందు ఉంచబడుతుంది. నాయబ్ తహసీల్దార్ల వేతనాలు, పదోన్నతుల విషయంలో సమస్య నెలకొంది. ఉన్నత స్థాయి ఏకాభిప్రాయం ఆధారంగా, ప్రస్తుత నిబంధనలను సవరించడానికి అంగీకరించబడింది. ఈ ప్రతిపాదనను మంత్రివర్గం ఆమోదించిన తర్వాత వారి సమస్యలు పరిష్కరిస్తామన్నారు. అదేవిధంగా జ్యుడీషియల్ అధికారుల వేతనాలకు సంబంధించిన వ్యత్యాసాన్ని తొలగించేందుకు ఉత్తరప్రదేశ్ హయ్యర్ జ్యుడీషియల్ సర్వీస్ రూల్స్ 1975ని కేబినెట్ ఆమోదించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. సీతాపూర్ సివిల్ లైన్స్‌లో కొత్త జిల్లా ఆసుపత్రి భవన నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం భూమిని ఏర్పాటు చేయనుంది. ఇందుకోసం సీతాపూర్‌లోని సివిల్ లైన్స్‌లో ఉన్న 13 బిఘాల స్థలాన్ని జిల్లా ఆస్పత్రికి మంజూరు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. ఇది కాకుండా, డాక్టర్ అంబేద్కర్ కల్చరల్ సెంటర్ స్థాపనకు ఐష్‌బాగ్ ఈద్గా ముందు మౌజా భదేవన్ లక్నోలో ఉన్న 5493.52 చదరపు మీటర్ల నాజుల్ ల్యాండ్ ఏరియాలో 3299 చదరపు మీటర్లు ఇవ్వాలనే ప్రతిపాదనను ఆమోదించవచ్చు. జై ప్రకాష్ నారాయణ్ ఇంటర్నేషనల్ సెంటర్ ప్రాజెక్ట్ వ్యయ ఫైనాన్స్ కమిటీ ఆమోదించిన ఖర్చు ఖర్చు ప్రతిపాదన, GPNIC సొసైటీని రద్దు చేసి దాని కార్యకలాపాలను లక్నో డెవలప్‌మెంట్ అథారిటీకి అప్పగించడానికి నిర్ణయం తీసుకోవచ్చు.
గుజరాత్‌లో పిడుగుపాటుకు 27 మంది మృతి..పశువులు మృతి..
ఒకవైపు చలికాలం మొదలైన కూడా.. మరోవైపు భారీ వర్షాలు జనాలను ఇబ్బందులకు గురి చేస్తున్నాయి.. గత కొన్ని రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.. తాజాగా గుజరాత్ లో కురిసిన భారీ వర్షాలకు పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి.. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురవడంతో జనాలు అనేక ఇబ్బందులకు గురైయ్యారు. భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. రాష్ట్రంలోని 251 తాలూకాల్లోని 230 తాలూకాలకు పైగా ఉరుములు, మెరుపులతో కూడిన అకాల వర్షాలు కురిశాయి.. నిన్న రాష్ట్రంలో పలు చోట్ల కురిసిన వర్షాలకు అనేక ప్రాంతాల్లో వరదలు సంభవించాయి.. డౌడ్, భరూచ్, తాపి, అహ్మదాబాద్, అమ్రెల్లి, బనస్కాంత, బొతాద్, ఖేడా, మెహ్ సానా, పంచ్ మహల్, సబర్ కాంత, సూరత్, సురేంద్రనగర్, దేవభూమి ద్వారకాలో అధిక మరణాలు సంభవించాయని అధికారులు పేర్కొన్నారు. ఇంకా మరణించిన వారి సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు..
పాకిస్తాన్ లో పెరుగుతున్న కష్టాలు.. బతుకు జీవుడా అంటున్న జనాలు
పాకిస్థాన్ పరిస్థితి రోజురోజుకు దిగజారుతోంది. రెండు పూటలా భోజనం అందక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పాకిస్థాన్‌లో ఆహారం, నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటాయి. పొరుగు దేశంలో ద్రవ్యోల్బణం అదుపు తప్పింది. వాటి ధరలు విపరీతంగా పెరిగి ప్రజల జీవనాన్ని కష్టతరం చేశాయి. పొరుగు దేశంలో వరుసగా రెండో వారం కూడా ద్రవ్యోల్బణం 40 శాతానికి పైగానే కొనసాగుతోంది. దీంతో సామాన్య ప్రజల వెన్ను విరిగింది. పాకిస్థాన్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ విడుదల చేసిన గణాంకాల ప్రకారం నవంబర్ 23తో ముగిసిన వారంలో దేశ ద్రవ్యోల్బణం 41.13 శాతంగా నమోదైంది. పెరుగుతున్న గ్యాస్ ధరల కారణంగా ద్రవ్యోల్బణం భారీగా పెరిగిందని పాకిస్థాన్ వార్తాపత్రిక డాన్ పేర్కొంది. గత ఏడాది కాలంలో పాకిస్థాన్‌లో గ్యాస్ ధరలు రూ.1,100కు పైగా పెరిగాయి. పాకిస్థాన్‌లో పిండి ధర 88.2 శాతం భారీగా పెరిగింది. బాస్మతి బియ్యం 76.6 శాతం, సాదా బియ్యం 62.3 శాతం. టీ ఆకులు 53 శాతం, ఎర్ర కారం 81.70 శాతం, బెల్లం 50.8 శాతం, బంగాళదుంపలు 47.9 శాతం పెరిగాయి. సిగరెట్లు 94 శాతం, గోధుమ పిండి 88.2 శాతం, కారం పొడి 81.7 శాతం ఖరీదైంది.
క్లివేజ్ షోతో మైండ్ బ్లాక్ చేస్తున్న శృతిహాసన్..స్టన్నింగ్ లుక్ లో ఘాటు పోజులు..
శృతిహాసన్ కు యూత్ ఫాలోయింగ్ ఎక్కువ.. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన సినీ, పర్సనల్ విషయాలను అందరితో షేర్ చేసుకుంటుంది.. ఇక వరుస హిట్ సినిమాలతో దూసుకుపోతుంది.. ఈ ఏడాది అమ్మడుకు బాగా కలిసివచ్చింది.. సీనియర్ హీరోల సరసన జతకట్టి బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ను తన ఖాతాలో వేసుకుంది..ఈ ఏడాదిలో ఈమె నటించిన అన్నీ సినిమాలు బ్లాక్ బస్టర్స్ అయిన సంగతి తెలిసిందే.. అదే జోష్ తో వరుస సినిమాలను లైన్లో పెడుతుంది.. అయితే వెండితెరపైనే కాకుండా.. నిజజీవితంలో కూడా ఈ అమ్మడు కాస్త విభిన్నం.. తనకు నచ్చినట్లే ఉంటుంది.. ఎవరేమనుకున్న లెక్క చెయ్యదు.. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటుంది.. హిట్ సినిమాలు ఉన్నా కూడా గ్లామర్ డోస్ పెంచుతుంది.. ఈ మధ్యకాలంలో హాట్ లుక్స్ ఉన్న ఫోటోలను షేర్ చేస్తూ యువతను ఆకట్టుకుంటుంది.. నిత్యం రకరకాల ఫోటోలను, వీడియోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది.. కాగా, తాజాగా శృతి హాసన్ బోల్డ్నెస్ కి తెరలేపింది. ఎద అందాలు హైలెట్ అయ్యేలా హాట్ ఫోటో షూట్ చేసింది. స్లీవ్ లెస్ డ్రెస్ లో క్లీవేజ్ అందాలతో మతులు పోగొట్టింది.. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..
శివాజీని వెన్నుపోటు పొడిచిన అర్జున్.. ఈ వారం ఎలిమినేషన్ లో వీరే..
బిగ్ బాస్ సీజన్ 7 ఈవారం నామినేషన్స్ హీటెక్కించాయి. ముఖ్యంగా అమర్, అర్జున్ నామినేషన్స్ చూసి అడియన్సే అవాక్కయ్యేలా చేశారు. గతవారం తమకోసం నిలబడ్డవారినే తిరిగి నామినేట్ చేశారు.. ప్రశాంత్ ను అమర్ నామినేట్ చెయ్యడంతో ప్రశాంత్ ఎమోషనల్ అవ్వడంతో పాటు కన్నీళ్లు పెట్టుకున్నాడు.. అర్జున్ నామినేట్ చేయడంతో ఎమోషనల్ అయ్యాడు శివాజీ. ఇక ఎప్పటిలాగే ఆనవాయితీ ప్రకారం శివాజీని నామినేట్ చేశాడు గౌతమ్. శోభా, ప్రియాంకలు శివాజీ, యావర్, ప్రశాంత్ ను నామినేట్ చేశారు. హౌస్ లో 8 మంది ఉన్నారు.. ఒక్క అమర్ తప్ప మిగిలిన అందరు నామినేట్ అయ్యారు.. ముందుగా ప్రశాంత్ శోభాను నామినేట్ చెయ్యగా,ఆ తర్వాత ప్రియాంకను నామినేట్ చేశాడు. శోభాను డెడ్ కాకుండా నువ్వు కాపాడావ్ అది నచ్చలేదంటూ రీజన్ చెప్పాడు. ఇక తర్వాత మాత్రం ఆనవాయితీగా గౌతమ్ శివాజీని నామినేట్ చేశాడు. ముందుగా ప్రశాంత్ ను నామినేట్ చేస్తూ ఎవిక్షన్ పాస్ వచ్చిన తర్వాత గేమ్ ఆడలేదంటూ రీజన్ చెప్పాడు.. శోభా, ప్రియాంకలు తగ్గకుండా శివాజీని నామినేట్ చేశారు.. ఇక శివాజీని.. అర్జున్ ను నామినేట్ చేశాడు. ఫ్రెండ్షిప్ బ్యాండ్ నాకు వేస్తే నిజం అనుకున్నాను. కానీ నువ్వు గేమ్ ఆడుతున్నావని తెలిసి ఉంచుకోవడం కరెక్ట్ కాదంటూ తీసేశాడు. నీకు కెప్టెన్ కావాలనే ఇంట్రెస్ట్ లేకపోతే నాకు ముందే చెప్పేస్తే అంత డిస్ట్రబెన్స్ అయ్యేది కాదు. శోభా ఏడవడం ఎందుకు.. అప్పుడే నువ్వు ఎందుకు చెప్పలేదు.. అదే విధంగా గౌతమ్ కూడా శివాజినీ నామినేట్ చేశారు.. మొత్తానికి అందరు కలిసి శివాజినీ టార్గెట్ అయినట్లు తెలుస్తుంది.. అలా ఈ వారం నామినేషన్స్ హీటేక్కించాయి..