5 టీ20 సిరీస్ లో భాగంగా టీమిండియా సిరీస్ ను కైవసం చేసుకుంది. నాలుగో టీ20 మ్యాచ్ లో ఆస్ట్రేలియాపై భారత్ ఘన విజయం సాధించింది. 20 పరుగుల తేడాతో ఇండియా గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ కు దిగిన భారత్.. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 174 పరుగులు చేసింది. ఈ క్రమంలో లక్ష్యాన్ని చేధించేందుకు బరిలోకి దిగిన ఆసీస్.. 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 154 పరుగులు చేసింది.
రాయ్పూర్ వేదికగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య 4వ టీ20 మ్యాచ్ జరగనుంది. ఈ క్రమంలో.. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బౌలింగ్ ఎంచుకుంది. ఇప్పటికే భారత్.. 2-1 ఆధిక్యంలో ముందుంది. అయితే ఈ మ్యాచ్ గెలిచి సిరీస్ సొంతం చేసుకోవాలని టీమిండియా ఆశిస్తోంది.
టీ20 క్రికెట్లో ఈరోజు టీమిండియా ఓ రికార్డు నెలకొల్పే సమయం వచ్చింది. ఈరోజు జరిగే మ్యాచ్లో ఆస్ట్రేలియాపై గెలిస్తే.. అత్యధిక టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్లు గెలిచిన రేసులో పాకిస్తాన్ను వెనక్కి నెడుతుంది. ప్రస్తుతం ఇండియా-పాకిస్తాన్ సంయుక్తంగా మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి. టీ20 అంతర్జాతీయ క్రికెట్లో భారత్, పాకిస్తాన్లు 135-135 మ్యాచ్ ల్లో గెలుపొందాయి. ఈ క్రమంలో భారత్ పాకిస్తాన్ ను దాటి ముందడుగు వేసేందుకు ఈరోజు మంచి అవకాశం ఉంది. ఇప్పటి వరకు 226 టీ20 మ్యాచ్లు…
వరల్డ్ కప్ ట్రోఫీపై కాళ్లు పెట్టడంపై మిచెల్ మార్ష్ స్పందించాడు. "నేను వరల్డ్ కప్ ను అగౌరవపర్చాలన్న ఉద్దేశంతో అలా చేయలేదని అన్నాడు. కావాలంటే వరల్డ్ కప్ ట్రోఫీపై మళ్లీ కాళ్లు పెడతానని చెప్పుకొచ్చాడు. అందులో ఎలాంటి సందేహం లేదన్నాడు. ఆ రోజున జరిగిన ఘటనపై నేనేమీ పెద్దగా ఆలోచించలేదు". అని మార్ష్ తెలిపాడు. ఈ విషయంపై సోషల్ మీడియాలో తీవ్ర చర్చ జరుగుతున్న విషయం తనకు ఇతరుల ద్వారా తెలిసిందన్నాడు.
సౌతాఫ్రికా పర్యటనకు టీమిండియా ఈరోజు(గురువారం) ఎంపిక చేశారు. డిసెంబరు 10 నుంచి జనవరి 7 వరకు ఈ టూర్ జరగనుంది. ఈ టూర్ లో టీమిండియా 3 టీ20లు, 3 వన్డేలు, 2 టెస్టులు ఆడనుంది. అయితే ఈ పర్యటనలో టీ20లు, వన్డే సిరీస్ లకు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి బీసీసీఐ రెస్ట్ ఇచ్చింది. అయితే, డిసెంబరు 26 నుంచి జరిగే రెండు టెస్టుల సిరీస్ లో ఆడనున్నట్లు తెలిపింది.
ఆస్ట్రేలియాతో 5 టీ20 సిరీస్ లో భాగంగా.. టీమిండియా మూడో టీ20లో ఆస్ట్రేలియా విజయం సాధించింది. 5 వికెట్ల తేడాతో ఇండియాపై ఆసీస్ గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ కు దిగిన భారత్.. నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 222 పరుగులు చేసింది. ఈ క్రమంలో లక్ష్యాన్ని చేధించేందుకు బరిలోకి దిగిన ఆసీస్.. 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 225 పరుగులు చేసింది. చివరి వరకు ఉత్కంఠభరితంగా జరిగిన ఈ పోరులో ఆస్ట్రేలియానే విజయం…