గోదావరి రోడ్ కమ్ రైల్ బ్రిడ్జి @ 50
ఉభయగోదావరి జిల్లాలను అనుసంధానం చేస్తూ రాజమండ్రి కొవ్వూరు మధ్య గోదావరి నదిపై నిర్మించిన రోడ్ కమ్ రైల్ బ్రిడ్జి 50 వసంతాలను పూర్తిచేసుకుంది. నాలుగున్నర కిలోమీటర్లు పొడవైన రాజమండ్రి రోడ్ కం రైల్వే బ్రిడ్జి ఆసియా ఖండంలోనే అతిపెద్ద బ్రిడ్జి. ఈ బ్రిడ్జి మనుగడలోకి వచ్చి నేటికీ 50 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈబ్రిడ్జిని 1974 లో అప్పటి రాష్ట్రపతి ఫ్రక్రుద్దీన్ అలీ అహ్మద్ జాతికి అంకితం చేశారు. ఇది గోదారమ్మకు మణిహారం . కొవ్వూరు-.రాజమండ్రికి అపురూప బంధం. ఉభయ గోదావరి జిల్లాలను కలిపిన ఆత్మీయ వారధి ఈ అపురూప రైల్ కమ్ రోడ్ బ్రిడ్జి. ఈ బ్రిడ్జి కూడా ఒక ఇంజినీరింగ్ అద్భుతమే.. ముఖ్యంగా రాజమండ్రి దగ్గర ఈ మలుపు చాలా లెక్కలు వేసి నిర్మించారుట.. ఇండియా లో అతి పొడవైన రైల్ కమ్ రోడ్ బ్రిడ్జి లలో ఇది మూడవది.. మొదటిది అస్సాం లో బ్రహ్మపుత్ర నది పైన, రెండవది సొన్ పూర్ బీహార్ లోనూ… మూడవది మన రాజమండ్రి..కొవ్వూరు మధ్య నిర్మించారు.. 1964 మూడవ పంచవర్ష ప్రణాళిక లో కొవ్వూరు – రాజమండ్రి మధ్య రెండు వరుసలు రైల్ మార్గాన్ని నదిపై బ్రిడ్జి ని నిర్మించాలని తీర్మానించారు. అప్పటికి ఉభయ గోదావరి జిల్లాల మధ్య రాక పోకలు లాంచీల పైనే జరిగేవి. రాజమండ్రి నుంచి భద్రాచలం వరకూ సరుకు రవాణా కూడా లాంచీలే ఆధారం. రాష్ట్ర ప్రభుత్వం రోడ్ మార్గాన్ని కూడా కలిపి వంతెన నిర్మించాలని వినతిని కేంద్రానికి పంపడం, అది ఆమోదం పొందడం చక చకా సర్వే అనుమతులు జెసోప్ కంపెనీ నిర్మాణం మొదలు పెట్టి 1974 ఆగస్టు కి పూర్తి అయింది.
అన్ని పార్టీల్లో అదే టెన్షన్.. ఎవరెన్ని ఓట్లు చీలుస్తారనే లెక్కలు వేస్తున్నారు..?
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం హీట్ పెంచుతోంది.. ఇదే సమయంలో.. ఓట్ల చీలికపై అన్ని పార్టీల్లో టెన్షన్ నెలకొంది.. మరో వారం రోజుల్లో పోలింగ్.. పదిరోజుల్లో ఫలితాలు వెలువడనుండగా.. విజయం సాధించాలంటే ఎన్నికల్లో ప్రతి ఓటూ కీలకమే. ప్రతి ఓటరూ ముఖ్యమే. ఎందుకంటే ఒక్క ఓటుతో ఓటమిపాలైన అభ్యర్థులు కనిపిస్తారు.. వందలోపు ఓట్ల తేడాతో సీన్ రివర్సైన సందర్భాలు చాలానే ఉంటాయి. అందుకే అభ్యర్థులు ఏ ఒక్క ఓటూ చేజారకూడదని ఆశిస్తారు.. కానీ, అది అంత తేలికైన విషయం కాదు.. ఓట్ల చీలికను అడ్డుకోవటం అసాధ్యం.. ఈ విషయం అర్థమైన పార్టీలు ఇప్పుడు టెన్షన్ పడుతున్నాయి.. ప్రధాన పార్టీలకు ఓ స్థిరమైన ఓటు బ్యాంకు కొంత ఉంటుంది. వీళ్లు, అభ్యర్థి ఎవరైనా ఆ పార్టీ గుర్తును చూసి ఓటేస్తారు.. పార్టీకోసం చమటోడ్చే కార్యకర్తల నుండి, సానుభూతిపరుల వరకు ఈ కేటగిరీలోకి వస్తారు.. ఈ ఓట్లకు ఎప్పుడూ ఢోకా ఉండదు.. ఎటొచ్చీ, సమయం, సందర్భాన్ని అనుసరించి.. అప్పటి సమస్యలు, ప్రస్తుత అభ్యర్థుల ఇమేజ్ ఆధారంగా ఓటెవరికి వేయాలో డిసైడ్ చేసుకునే ఓటర్లు ఎక్కువ మంది ఉంటారు. వీళ్లే గెలుపోటముల్ని డిసైడ్ చేయటంలో కీలకం.. వీళ్లను ప్రసన్నం చేసుకోవటానికి పార్టీలన్నీ తంటాలు పడుతుంటాయి.. గెలుపు సాధ్యం కాదని తెలిసినా, బరిలో ఉండే అభ్యర్థులు చాలామంది ఉంటారు.. ఇండిపెండెంట్ల నుండి, ఇతర చిన్న పార్టీల అభ్యర్థుల వరకు అనేకమంది కనిపిస్తారు. వీళ్లే ఇప్పుడు ప్రధాన రాజకీయ పార్టీలను టెన్షన్ పెడుతున్నారు.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మధ్య ప్రధానంగా పోరు నడుస్తోంది. కానీ, ఈ మూడు పార్టీలకు తోడు అనేకమంది ఇండిపెండెంట్లు బరిలో ఉన్నారు. ఏదైనా సమస్యను ప్రజల్లోకి తీసుకురావాలనే లక్ష్యంతో పోటీ చేసే అభ్యర్థులు కొందరున్నారు. అదే సమయంలో గెలవకపోయినా, తమ బలాన్ని నిరూపించుకోవాలని చూసే చిన్న పార్టీలు.. కూడా రంగంలో ఉన్నాయి.. ఈ అభ్యర్థులంతా కొన్ని వందల నుండి వేల వరకు ఓట్లను చీలుస్తారు.
బీఆర్ఎస్, కాంగ్రెస్‌ను సీపీఎం, బీఎస్పీ టెన్షన్..! ఎవరికి ప్లస్..? ఎవరికి మైనస్..?
తెలంగాణ ఎన్నికల్లో ఓట్ల చీలిక విషయంలో లెఫ్ట్ పార్టీలు కీలకంగా మారిపోయాయి.. ఈ ఎన్నికల్లో మొదట బీఆర్‌ఎస్‌తో వామపక్షాలకు పొత్తు ఉంటుందని భావించారు. ఆ తర్వాత కాంగ్రెస్‌తో లెఫ్ట్ పార్టీలు కలుస్తాయనుకున్నారు. చివరికి కాంగ్రెస్ తో పొత్తు కుదిరి సీపీఐ కొత్తగూడెం సీటుతో సరిపెట్టుకుంది. సీపీఎం మాత్రం ఒంటరిగా కొన్ని చోట్ల పోటీ చేస్తోంది. అయితే సీపీఎం పోటీ చేస్తున్న నియోజకవర్గాల పరిస్థితేంటనే చర్చ ఇప్పుడు కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీల్లో బలంగానే జరుగుతోంది. కొన్ని నియోజకవర్గాల్లో పరోక్షంగా కాంగ్రెస్ ఓటమికి కారణమవుతుందా? అనే అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇందులో కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు పోటీ చేస్తున్న నియోజకవర్గాలు కూడా ఉన్నాయి. ఖమ్మంలో పాలేరు, నల్గొండలో మిర్యాలగూడ సెగ్మెంట్లలో సీపీఎం ఎన్ని ఓట్లు చీలుస్తుంది? ఈ ఓట్లు కాంగ్రెస్ గెలుపోటముల్ని డిసైడ్ చేస్తాయా అనే చర్చ ఒకటి నడుస్తోంది. పాలేరు నియోజకవర్గంలో కమ్యూనిస్టులకు బలమైన ఓటు బ్యాంకు ఉంది. ఇక్కడ నుంచి ఆ పార్టీ నేతలు గతంలో కొన్నిసార్లు అసెంబ్లీకి కూడా ప్రాతినిధ్యం వహించారు. ముఖ్యంగా ఖమ్మం రూరల్ మండలంలో లెఫ్ట్ పార్టీలకు ఓటు బ్యాంకు ఉంది. ఇప్పుడు పాలేరులో తమ్మినేని వీరభద్రం పోటీలో ఉండడంతో, ఖమ్మం రూరల్ మండలంతో పాటు నియోజకవర్గంలో ఉన్న సీపీఎం ఓటు బ్యాంకుని ఆయన చీల్చుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. తమ్మినేని ఎన్ని వేల ఓట్లు సాధిస్తారు? ఆ ఓట్లు ఎవరి గెలుపుకి గండికొడతాయి అనే అంశంపై ప్రధాన పార్టీల అభ్యర్థులు టెన్షన్ పడుతున్నారు.
ఫిషింగ్ హార్బర్‌లో అగ్నిప్రమాదంలో కొత్త ట్విస్ట్.. హైకోర్టుకు లోకల్‌బాయ్ నాని..
విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్‌లో అగ్నిప్రమాదం ఘటనలో మరో కొత్త ట్విస్ట్ వచ్చి చేరింది.. అగ్నిప్రమాదం, బోట్లు తగలబడిపోయిన ఘటనలో పోలీసులు అనుమానితుడిగా భావించిన యూట్యూబర్, లోకల్‌బాయ్ నాని.. హైకోర్టు మెట్లు ఎక్కారు. విశాఖ ఫిషింగ్ హార్బర్ లో బోట్లు కాలిపోయిన ఘటనలో పోలీసులు తనను మూడు రోజుల పాటు అక్రమంగా నిర్బంధించారంటూ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు నాని.. అయితే, ఈ పిటిషన్‌పై విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేసింది ఏపీ హైకోర్టు.
ఫిషింగ్ హార్బర్‌లో ప్రమాదం.. అసలు విషయం బయటపెట్టిన లోకల్ బాయ్ నాని..
విశాఖ ఫిషింగ్ హార్చర్‌లో అగ్నిప్రమాదం తీవ్ర కలకలం రేపింది.. ఈ ప్రమాదంలో 49 బోట్లు కాలిపోయినట్టు.. ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి.. వారికి పరిహారాన్ని కూడా ఇప్పటికే అందజేసింది ఏపీ ప్రభుత్వం.. అయితే, ఈ ఘటనలో యూ ట్యూబర్ లోకల్ బాయ్ నానిపై ఆరోపణలు వచ్చాయి.. నానిని అదుపులోకి తీసుకొని.. మూడు రోజుల పాటు ప్రశ్నించారు పోలీసులు.. ఇదే సమయంలో.. కోర్టును ఆశ్రయించి.. బయటకు వచ్చాడు.. మరోవైపు.. తనను అక్రమంగా నిర్బంధించారంటూ హైకోర్టులో మరో పిటిషన్ దాఖలు చేశారు నాని.. ఆ పిటిషన్‌పై విచారణను సోమవారానికి వాయిదా వేసింది హైకోర్టు.. ఈ సందర్భంగా ఏపీ హైకోర్టు దగ్గర మీడియాతో మాట్లాడిన నాని.. ఏం జరిగిందనే దానిపై అసలు విషయాన్ని బయటపెట్టారు. విశాఖ ఫిషింగ్ హార్బర్ ప్రమాదంలో నేను ఏ తప్పూ చేయలేదని స్పష్టం చేశారు నాని.. వేరే ప్లేస్ లో నా స్నేహితులకు పార్టీ ఇచ్చాను.. రాత్రి 11.45 గంటల సమయంలో నాకు బోట్లు తగల బడుతున్నట్టు ఫోన్ వచ్చింది.. దీంతో, వన్ టౌన్ పోలీస్ స్టేషన్ మీదుగా నేను హార్బర్ కు వెళ్లాను.. నేను వెళ్లే సమయానికి బోట్లు తగల బడుతున్నాయి అని తెలిపాడు.. నేను అప్పటికే మద్యం తాగే ఉన్నాను.. నేను హార్బర్ కు వెళ్లేదంతా సీసీ టీవీ ఫుటేజ్ లో రికార్డ్ అయ్యిందన్నాడు.. అయితే, ఫిషింగ్ హార్బర్‌లో ప్రమాదాన్ని వీడియో తీయటం ద్వారా ప్రభుత్వానికి విషయం చెప్పటానికి మాత్రమే నేను ప్రయత్నం చేశాను.. కానీ, వీడియోలు తీస్తున్న నన్ను కొందరు కొట్టే ప్రయత్నం చేశారని.. వీడియో తీసిన తర్వాత నేను కూడా సహాయక చర్యల్లో పాల్గొననా తెలిపాడు.. ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయినట్టు వెల్లడించాడు.
ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో ఈసీ.. పోలింగ్‌కు భారీ ఏర్పాట్లు
తెలంగాణలో నవంబర్ 30న జరిగే అసెంబ్లీ ఎన్నికల ఏర్పాట్లపై ఈసీ దృష్టిపెట్టింది. రాష్ట్రంలో మొత్తం 119 నియోజకవర్గాలుండగా.. మొత్తం 3 కోట్లకు పైగా ఓటర్లున్నారు. దీంతో.. వారందరికీ సరిపోయేలా.. 35వేల 635 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తోంది ఈసీ. ప్రతి కౌంటింగ్ సెంటర్‌కు ఒక పరిశీలకుడిని నియమించింది. రాష్ట్రస్థాయిలో ముగ్గురు అబ్జర్వర్లను నియమించింది. ఎన్నికల కోసం 36 వేల ఈవీఎంలను ఈసీ సిద్ధం చేసింది. ఈసారి కొత్తగా 51 లక్షల ఓటరు కార్డులు ప్రింట్ చేసి పోస్టల్ శాఖ ద్వారా ఇళ్లకు పంపించారు అధికారులు. ఇప్పటికే 86 శాతం ఓటరు స్లిప్పుల పంపిణీ పూర్తి చేశారు. ఇప్పటికే 9174మంది సర్వీస్ ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోస్టల్ బ్యాలెట్, ఈవీఎం బ్యాలెట్లు, టెండర్, ఛాలెంజ్ ఓట్ల కోసం బ్యాలెట్లు కలిపి మొత్తం 14లక్షలకుపైగా ప్రింట్ చేశారు. ఈవీఎం, వీవీప్యాట్‌ల కమిషనింగ్ ప్రక్రియ కూడా దాదాపుగా పూర్తైంది. రాష్ట్రంలో 35వేలకు పైగా పోలింగ్ కేంద్రాలుండగా.. 59వేల 775 బ్యాలెట్ యూనిట్‌లను రెడీ చేశారు. ఈవీఎంలు తరలించే వాహనాలకు జీపీఎస్ ఏర్పాటు చేస్తున్నారు. పోలింగ్ రోజు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసు శాఖ కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపడుతోంది. హైదరాబాద్ పై ప్రత్యేక దృష్టిపెట్టింది. అన్ని శాఖల సమన్వయంతో ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు ఈసీ అన్ని చర్యలు తీసుకుంటోంది.
మాకు అహంకారం లేదు.. తెలంగాణపై చచ్చేంత మమకారం ఉంది..
హైదరాబాద్ లోని హైటెక్స్ లో పలు సంస్థల ఆధ్వర్యంలో రియల్ ఎస్టేట్ సదస్సు కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సదస్సులో హైదరాబాద్ నగర అభివృద్ధిపై బీఆర్ఎస్ విజన్ ను ఆయన వివరించారు. ఆరున్నర సంవత్సరాలు మాత్రమే మాకు సమర్థవంతంగా పనిచేసే అవకాశం దొరికింది.. ప్రజల కోసం పని చేశామన్నారు. అవతల 60 ఏళ్లు పాలన చేసిన వాళ్ళు ఉన్నారు.. ఒక వైపు ఐటీ పెరిగింది.. అదే సమయంలో వ్యవసాయం పెరిగింది.. పంజాబ్, హర్యానా రాష్ట్రాలను దాటి దేశంలో వరి ఉత్పత్తిలో తెలంగాణ స్టేట్ నెంబర్ వన్ అయ్యింది అని మంత్రి కేటీఆర్ వెల్లడించారు.
రైతులకు మోడీ రూ.24 వేలు ఇస్తే.. కేసీఆర్ ఇచ్చింది రూ.10 వేలు మాత్రమే
రైతులారా…. ఎకరానికి మోదీ చేసే సాయం రూ.24 వేలు.. కేసీఆర్ చేసే సాయం రూ.10 వేలు మాత్రమే.. రైతు పక్షపాతి ఎవరో మీరే ఆలోచించి ఓటేయాలని బీజేపీ అభ్యర్ధి బండి సంజయ్ కుమార్ ప్రజలకు పిలుపునిచ్చారు. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి ఎన్నికల ప్రచారంలో బండి సంజయ్ మాట్లాడుతూ.. బీజేపీ అధికారంలోకి వస్తే… వరి కనీస మద్దతు ధర రూ.3100 చేస్తామన్నారు. మహిళలకు ఉచితంగా 4 గ్యాస్ సిలిండర్లు అందజేస్తామన్నారు. కరీంనగర్ ఐటీ టవర్ లో తొండలు గుడ్లు పెడుతున్నాయ్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక్క కొత్త కంపెనీని కూడా తీసుకురాలేని దద్దమ్మ గంగుల అని కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్ధులది భూకబ్జాల చరిత్ర ఉందని మండిపడ్డారు. ఎన్నికలైపోగానే ఇద్దరూ ఒక్కటై కేసులు సెటిల్ చేసుకుంటారని అన్నారు. కానీ నాపై ఉన్న కేసుల పరిస్థితి ఏంది? నాది ప్రజల పక్షాన పోరాటాల చరిత్ర అని అన్నారు. గొర్లు ఇస్తామని డబ్బులు తీసుకుని మోసం చేసిన గంగుల.. పద్మశాలీలను నిలువునా మోసం చేశారని మండిపడ్డారు. నేను ఆస్తులు సంపాదించినట్లు రుజువు చేస్తే అవన్నీ ప్రజలకు రాసిస్తా? అని తెలిపారు. ప్రవాస భారతీయులారా… మీకోసం కొట్లాడుతున్న బీజేపీకి ఓటేయండి అని కోరారు.
భవిష్యత్ లో బీఆర్ఎస్ ను మ్యూజియంలో చూస్తారు..
బీఆర్ఎస్ ను భవిష్యత్ లో మ్యూజియంలో చూస్తారని ఏఐసీసీ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. మహబూబాబాద్ జిల్లా తొరూరు డివిజన్ కేంద్రంలో పాలకుర్తి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మామిడాల యశస్విని రెడ్డి ఎన్నికల ప్రచార కాంగ్రెస్ విజయభేరి సభలో ప్రియాంక గాంధీ పాల్గొన్నారు. తెలంగాణ ఏర్పాటులో ఎవరి భాగస్వామ్యం లేకున్నా మానవత్వంతో సోనియా గాంధీ ఇచ్చారని అన్నారు. ప్రజల ఆకాంక్షల మేరకు ఇచ్చారు తెలంగాణ అని తెలిపారు. గత 10 ఏళ్లలో ఒక్క హైదరాబాద్ లో తప్ప ఎక్కడా అభివృద్ధి జరగలేదన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగులకు ఒక్క ఉద్యోగం ఇవ్వలేదన్నారు. యువకులను ఆత్మహత్యలు చేసుకున్నారని తెలిపారు. TSPSC అవినీతికి పాల్పడింది, పేపర్లు అమ్ముకున్నారన్నారు. నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నారని తెలిపారు. సామాజిక న్యాయం లేదు తెలంగాణలో అని మండిపడ్డారు. ఒక్క నలుగురుకు మాత్రమే ఉద్యోగం దొరికిందని అన్నారు. తండ్రి, కొడుకు, కూతురు, అల్లుడికి మాత్రమే ఉపాధి దొరికిందన్నారు. సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్ లు కోరుకుంది ప్రజల తెలంగాణా అన్నారు. ఫార్మ్ హౌస్ తెలంగాణ కాదన్నారు. తెలంగాణలో పీడిత ప్రజలు ఆందోళనలో ఉన్నారని తెలిపారు. బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎంలకు టాటా బాయ్ బాయ్ చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. బీఆర్ఎస్ ను భవిష్యత్ లో మ్యూజియంలో చూస్తారని తెలిపారు. సమాజానికి ఉపయోగపడే మేనిఫెస్టో మా కాంగ్రెస్ గ్యారెంటీ కార్డని తెలిపారు.
తగ్గేదేలే అంటున్న రాహుల్ గాంధీ.. ప్రధాని నరేంద్ర మోడీ ‘పనౌటీ-ఎ-ఆజం’ అట
క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్‌లో భారత జట్టు ఓటమికి కారణం ప్రధాని నరేంద్ర మోడీ అని.. అతను ఓ పనౌటి అంటూ కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ అభివర్ణించారు. దీనిపై బీజేపీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. దీనిపై ఎన్నికల కమిషన్ ఆయనకు నోటీసులు కూడా జారీ చేసింది. అయినప్పటికీ కాంగ్రెస్ అదే వైఖరిని కొనసాగిస్తోంది. ఇప్పుడు సోషల్ మీడియాలో మరో వివాదాస్పద వ్యాఖ్య చేస్తూ, అతను ప్రధాని నరేంద్ర మోడీని పనౌటీ-ఎ-ఆజం అని పిలిచాడు. పోస్టర్‌ను విడుదల చేస్తూ ‘పనౌటీ ఎప్పుడు వెళ్తావు?’ ఈ పోస్టర్‌లో, చంద్రయాన్ -2 వైఫల్యం, కరోనా, ఫైనల్‌లో ఓటమికి ప్రధాని మోడీని కాంగ్రెస్ బాధ్యుడిని చేసింది. వాస్తవానికి అహ్మదాబాద్‌లో జరిగిన ప్రపంచకప్ ఫైనల్‌ను వీక్షించేందుకు ప్రధాని నరేంద్ర మోడీ కూడా వచ్చారు. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ రాహుల్ గాంధీ తనపై అభ్యంతరకర ప్రకటన చేశారు. ప్రజలు ఏదైనా లేదా ఒక వ్యక్తిని అశుభకరమైనదిగా వర్ణించడానికి పనౌటి అనే పదాన్ని ఉపయోగిస్తారు. అటువంటి పరిస్థితిలో ప్రధాని నరేంద్ర మోడీ కోసం ఇలా మాట్లాడటం కాంగ్రెస్‌కు చిక్కులు తెచ్చిపెట్టింది. 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు బీజేపీ ‘చౌకీదార్ చోర్ హై’ అనే ప్రకటనను ప్రధాని మోడీకి ఆయుధంగా మార్చింది. ఇప్పుడు రాహుల్ గాంధీ చేసిన ఈ ప్రకటనపై బీజేపీ కూడా అభ్యంతరం చెప్పవచ్చు. రాహుల్ గాంధీ, కాంగ్రెస్‌లు ప్రధాని మోడీని అవమానించారని బీజేపీ ఆరోపిస్తూ దాడికి దిగవచ్చు.
ఆండ్రాయిడ్ ఫన్‌టచ్ ఓఎస్ 14తో ఐకూ కొత్త ఫోన్!
చైనాకు చెందిన మొబైల్ తయారీ కంపెనీ ‘ఐకూ’ నుంచి మరో కొత్త 5జీ స్మార్ట్‌ఫోన్ వస్తోంది. నవంబర్ 7న ప్రపంచవ్యాప్తంగా ఆవిష్కరించబడిన ‘ఐకూ 12’.. డిసెంబర్ 12న భారతీయ మార్కెట్లో లాంచ్ కానుంది. 12 లైనప్‌లో ఐకూ 12 మరియు ఐకూ 12 ప్రో ఉండగా.. బేస్ మోడల్ (ఐకూ 12 ) డిసెంబర్ 12న లాంచ్ కానుంది. అయితే హై-ఎండ్ ప్రో వేరియంట్ ఎప్పుడు లాంచ్ అవుతుందో ఇంకా తెలియరాలేదు. ఐకూ 12 ఫీచర్లను ఓసారి చూద్దాం. ఐకూ 12 5G స్మార్ట్‌ఫోన్ భారతదేశంలో ఆండ్రాయిడ్ 14 ఆధారిత ఫన్‌టచ్ ఓఎస్ 14తో లాంచ్ అవుతుందని కంపెనీ ప్రకటించింది. దాంతో దేశంలో లాంచ్ చేయబడిన మొదటి పిక్సెల్ కాని స్మార్ట్‌ఫోన్‌గా నిలవనుంది. ఐకూ 12 ఫోన్ దేశంలో అమెజాన్ మరియు అధికారిక ఐకూ ఇ-స్టోర్ ద్వారా మాత్రమే కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుందని కంపెనీ తెలిపింది. చైనాలో 12 5G స్మార్ట్‌ఫోన్ 12GB + 256GB మరియు 16GB + 512GB వేరియంట్‌లు 3,999 (దాదాపు రూ. 45,000) యువాన్‌లు మరియు 4,299 (దాదాపు రూ. 50,00) యువాన్‌లు ఉన్నాయి. టాప్-ఆఫ్-లైన్ 16GB RAM + 1TB ఎంపిక 4,699 (దాదాపు రూ. 53,000) యువాన్‌లుగా ఉంది. ఈ మోడల్ చైనాలో బర్నింగ్ వేలో లెజెండ్ ఎడిషన్ మరియు ట్రాక్ వెర్షన్ కలర్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంది.
క్రికెట్‌లో ‘డైమండ్ డక్’ అంటే ఏంటో తెలుసా?
క్రికెట్‌లో దాదాపుగా అన్ని పదాలు అభిమానులకు సుపరిచతమే. వైడ్, నో బాల్, ఎల్బీ, డీఆర్ఎస్, కంకషన్ సబ్‌స్టిట్యూట్, డకౌట్, గోల్డెన్ డక్.. వంటివి అందరికి తెలుసు. అయితే ‘డైమండ్ డక్’ అంటే మాత్రం చాలా మందికి తెలియకపోవచ్చు. విశాఖ పట్టణంలో ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టీ20లో భారత ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్.. ఈ డైమండ్ డకౌట్‌గా వెనుదిరిగాడు. దాంతో ఇంతకు ఈ డైమండ్ డక్ అంటే ఏంటి? అని కొందరు గూగుల్ చేస్తున్నారు. అలాంటి వారి కోసమే ఈ వివరణ. ‘డకౌట్’ అంటే ఓ బ్యాటర్ ఎన్ని బంతులు ఆడినా.. పరుగుల ఖాతా తెరవకుండా పెవిలియన్ చేరడం. ‘గోల్డెన్ డక్’ అంటే ఎదుర్కొన్న మొదటి బంతికే ఔటవ్వడం. ‘డైమండ్ డక్’ అంటే.. ఓ బ్యాటర్ ఒక్క బంతి కూడా ఎదుర్కోకుండానే పెవిలియన్ చేరడం. వైజాగ్ వేదికగా జరిగిన మొదటి టీ20లో భారత ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ అలానే ఔటయ్యాడు. ఇన్నింగ్స్ తొలి ఓవర్ ఐదో బంతికి యశస్వీ జైస్వాల్ షాట్ ఆడగా.. రెండో పరుగుకు ప్రయత్నించి రుతురాజ్ రనౌట్ అయ్యాడు. టీ20ల్లో డైమండ్ డక్‌గా వెనుదిరిగిన మూడో భారత ఆటగాడిగా రుతురాజ్ గైక్వాడ్ రికార్డుల్లోకెక్కాడు. ఈ జాబితాలో రుతురాజ్ కంటే ముందు జస్ప్రీత్ బుమ్రా (2016), అమిత్ మిశ్రా (2017)లు ఉన్నారు. ఇక ఐదు టీ20ల సిరీస్‌లో భారత్ శుభారంభం చేసింది. ఆస్ట్రేలియా 208 పరుగులు చేయగా.. భారత్ 19.5 ఓవర్లలోనే ఆ లక్ష్యాన్ని ఛేదించింది. ఈ విజయంలో టీమిండియా తాత్కాలిక కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కీలక పాత్ర పోషించాడు.
ప్రేయసిని పెళ్లాడిన టీమిండియా క్రికెటర్!
ఈ ఏడాది భారత క్రికెట్ జట్టులో వరుసగా పెండ్లి బాజాలు మోగుతున్నాయి. ఇప్పటికే కేఎల్ రాహుల్, రుతురాజ్ గైక్వాడ్ వివాహం చేసుకోగా.. తాజాగా యువ పేసర్ నవ్‌దీప్ సైనీ పెళ్లి చేసుకున్నాడు. హర్యానాకు చెందిన సైనీ.. తన ప్రేయసి స్వాతి ఆస్థానని శుక్రవారం వివాహం చేసుకున్నాడు. ఈ వివాహానికి కొద్దిమంది అతిథులు మాత్రమే ఆహాజరయ్యారు. పెళ్లి ఫొటోలను సైనీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో షేర్ చేసుకున్నాడు. ‘నీతో ప్రతిరోజు ప్రేమతో నిండినదే. ఈరోజుతో మనం ఆ ప్రేమను శాశ్వతం చేస్తున్నాం. మా జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తున్న ఈ శుభ సమయంలో మీ అందరి ప్రేమ, ఆశీర్వాదాలు కోరుకుంటున్నాము’ అని నవ్‌దీప్ సైనీ ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొన్నాడు. ఆ ఫొటోలకు చూసిన క్రికెటర్లు, అభిమానులు కొత్త జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. సైనీ, స్వాతి గత కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్నారు. సైనీ క్రికెటర్ కాగా.. స్వాతి ఒక వ్లాగర్. ఫ్యాషన్, ట్రావెల్, లైఫ్‌స్టయిల్ గురించి ఆమె ఆన్‌లైన్‌లో వీడియోలు పెడుతుంటారు.
తారుమారైన ఓటింగ్.. టాప్ లో ఆ కంటెస్టెంట్.. ఫైనల్ కు వెళ్ళేది వాళ్లే?
బిగ్ బాస్ సీజన్ 7 తెలుగు షో దాదాపు ముగింపు దశకు చేరుకుంది.. ప్రస్తుతం 12 వారం జరుగుతుంది.. ఈ వారం నామినేషన్స్ ప్రక్రియ కూడా ముగిసింది.. ఇంకా కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ కొనసాగుతుంది. ఉల్టా పుల్టా అంటూ తీసుకొచ్చిన ఈ సీజన్ మొదటి వారం నుంచి మంచి టీఆర్పీ రేటింగ్ అందుకుంటుంది.. ఈ సీజన్ లో హౌస్ లోకి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.. ఒక్కమాటలో చెప్పాలంటే ఈ వారం షో హిట్ అయ్యింది..ఇప్పుడు గ్రాండ్ ఫినాలేకు దగ్గర పడుతోంది. అయితే బిగ్‌బాస్ లెక్కలు ఎప్పుడు ఎలా మారతాయో చెప్పడం కష్టమే. ఈ ఆట చివరి దశకు వచ్చేటప్పకీ మాత్రమే టైటిల్ విజేత ఎవరనే విషయం ఓ అంచనాకు వస్తుంది. గత సీజన్లలో ఫ్యామిలీ వీక్ తర్వాత విన్నర్, టాప్ 5 ఎవరనేది క్లారీటీ వస్తుండేది.. మొన్నటివరకు హౌస్ లో టాప్ 5 మొదట శివాజీ, సెకండ్ ప్రశాంత్, మూడో స్థానంలో ప్రశాంత్ ఉన్నారు.. ఇప్పుడు లెక్కలు పూర్తిగా మారిపోయినట్లు తెలుస్తుంది.. మొన్నటి వరకు ఫుల్ నెగిటివిటీ ఉన్న అమర్ దీప్ ఇప్పుడు పాజిటివ్ ఫుటేజ్ వస్తుంది. దీంతో ఓటింగ్ లో దూసుకెళ్తున్నాడు. ఇక టాప్ 3లో ఉన్న శివాజీ, ప్రశాంత్, యావర్ ఓటింగ్ నెమ్మదిగా తగ్గుతూ వస్తుంది..