భారత్-దక్షిణాఫ్రికా మధ్య జరగాల్సిన తొలి టీ20 మ్యాచ్ రద్దు అయింది. డర్బన్ లో ఎడతెరిపి లేని వర్షం పడుతుండటంతో.. టాస్ పడకుండానే మ్యాచ్ ను అంపైర్లు రద్దు చేశారు. మొత్తం మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా ఈరోజు డర్బన్‌లోని కింగ్స్‌మీడ్‌లో మ్యాచ్ జరగాల్సి ఉంది. మిగతా రెండు టీ20లు ఈనెల 12, 14 తేదీల్లో జరగనున్నాయి. ఆ మ్యాచ్ లు సెయింట్ జార్జ్ పార్క్, న్యూ వాండరర్స్ స్టేడియాల్లో జరగనున్నాయి.
దుబాయ్ వేదికగా జరుగుతున్న అండర్-19 ఆసియాకప్లో పాకిస్థాన్ చేతిలో భారత జట్టు ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఈ యువ జట్టు పాకిస్థాన్తో 8 వికెట్ల తేడాతో ఓడిపోయింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 259 పరుగులు చేసింది. అనంతరం పాక్ జట్టు కేవలం రెండు వికెట్లు కోల్పోయి సులువుగా లక్ష్యాన్ని ఛేదించింది. పాకిస్థాన్ బ్యాటింగ్ లో ఆజాన్ అవైస్ సెంచరీ (105)తో నాటౌట్ గా నిలిచాడు. ఆ…