5 టీ20 సిరీస్ లో భాగంగా టీమిండియా సిరీస్ ను కైవసం చేసుకుంది. నాలుగో టీ20 మ్యాచ్ లో ఆస్ట్రేలియాపై భారత్ ఘన విజయం సాధించింది. 20 పరుగుల తేడాతో ఇండియా గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ కు దిగిన భారత్.. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 174 పరుగులు చేసింది. ఈ క్రమంలో లక్ష్యాన్ని చేధించేందుకు బరిలోకి దిగిన ఆసీస్.. 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 154 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా బ్యాటర్లలో ఓపెనర్లు ట్రేవిస్ హెడ్ (31), జోష్ ఫిలిప్పి (8) పరుగులు చేశారు. బెన్ మెక్‌డెర్మోట్ (19) ఆరోన్ హార్డీ (8), టిమ్ డేవిడ్ (19), మ్యాథ్యూ షార్ట్ (22), మ్యాథ్యూ వేడ్ (36) పరుగులు చేశారు. ఇక.. భారత్ బౌలర్లలో అక్షర్ పటేల్ 3 వికెట్లు తీయగా.. దీపక్ చాహార్ 2 వికెట్లు పడగొట్టాడు. రవి బిష్ణోయ్, ఆవేశ్ ఖాన్ తలో వికెట్ తీశారు.
Jigarthanda Double X : ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘జిగర్తాండ డబుల్ ఎక్స్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?
అంతకు ముందు బ్యాటింగ్ చేసిన టీమిండియా 174 పరుగులు చేసింది. టీమిండియా బ్యాటర్లలో ఓపెనర్లు యశస్వి జైస్వాల్ (37), రుతురాజ్ గైక్వాడ్ (32) పరుగులు చేశారు. శ్రేయాస్ అయ్యర్ (8) పరుగులు చేయగా.. సూర్యకుమార్ యాదవ్ ఒక పరుగు చేసి పెవిలియన్ బాట పట్టాడు. ఆ తర్వాత రింకూసింగ్ (46), జితేష్ శర్మ (35) పరుగులు చేశారు. ఇదిలా ఉంటే.. ఆస్ట్రేలియా బౌలర్లలో బెన్ ద్వార్షుయిస్ 3 వికెట్లు పడగొట్టాడు. జాసన్ బెహ్రెన్‌డార్ఫ్, సంఘా తలో రెండు వికెట్లు తీశారు. ఆరోన్ హార్డీకి ఒక వికెట్ దక్కింది.
Election Commission: ఈశాన్య రాష్ట్రం మిజోరం ఓట్ల లెక్కింపు వాయిదా.. 4వ తేదీకి మార్పు