ముంచుకొస్తున్న ‘మిచౌంగ్’ తుఫాన్.. అధికారుల హెచ్చరికలు
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రస్తుతం నెల్లూరుకు 860 కిలోమీటర్లు, మచిలీపట్నానికి 910 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇది రేపటికి తుఫాన్‌గా మారనుంది. కృష్ణా జిల్లా మచిలీపట్నానికి సమీపంలోనే తీరాన్ని దాటే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ. దీంతో కేంద్ర హోంశాఖ కార్యదర్శి.. ఏపీ సీఎస్ జవహర్ రెడ్డితో సమీక్ష నిర్వహించారు. ఇప్పటికే రాష్ట్ర, జిల్లా స్థాయిలో కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేశామని, తీరప్రాంత జిల్లాల కలెక్టర్లను అప్రమత్తం చేసినట్టు సీఎస్ జవహర్ రెడ్డి తెలిపారు. ఈ తుఫాన్ ప్రభావంతో రాగల రెండు మూడు రోజుల్లో దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నట్టు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. తీరంలో 100 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు కూడా వీచే అవకాశముంది. ఈనెల 4న సాయంత్రానికి చెన్నై- మచిలీపట్నం మధ్య తీరాన్ని తాకే అవకాశమున్నట్టు ఐఎండీ అంచనా వేసింది.
తుఫానుగా మారనున్న వాయుగుండం.. ఏపీకి, తెలంగాణలో వర్షాలు
తెలుగు రాష్ట్రాలకు ఐఎండీ రైల్ అలర్ట్ ప్రకటించింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఆదివారం తుపానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఆదివారం నాటికి తుపాను మచిలీపట్నం తీరం దాటుతుందని తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో ఆదివారం నుంచి భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ ఏపీ ప్రజలకు హెచ్చరికలు కూడా జారీ చేసింది. సోమవారం సాయంత్రం తర్వాత చెన్నై-మచిలీపట్నం మధ్య తుపాను తీరం దాటే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. ఈ ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని… ప్రజలు అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేసింది. భారీ వర్షాల నేపథ్యంలో విపత్తుల నిర్వహణ సంస్థలో స్టేట్ కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశారు. అత్యవసర సహాయం మరియు సమాచారం కోసం 24 గంటల కంట్రోల్ రూమ్ నంబర్లు 1070, 112, 18004250101 అందుబాటులో ఉంటాయని ప్రజలు గుర్తించాలని కోరారు. వాతావరణ పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు అధికారులు. మరోవైపు తెలంగాణలో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. తుపాన్ ప్రభావంతో ఆది, సోమవారాల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. డిసెంబరు 3 నుంచి 5 వరకు పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని.. ఆ తర్వాత తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు.
రేపే కౌంటింగ్.. 49 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపుకు పకడ్బందీ ఏర్పాట్లు
రేపు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోలైన ఓట్ల లెక్కింపు జరగనుంది. రేపు ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపుతో కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమతుంది. 8.30 నుంచి ఈవీఎంల లెక్కింపు మొదలవుతుంది. అందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూముల్లో ఈవీఎంలను భద్రపరిచారు. ఇక.. స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఈవీఎంలు భద్రపరిచిన గదుల వద్దకు ఎవరినీ అనుమతించడం లేదు. స్ట్రాంగ్ రూంల వద్ద సీసీ టీవీ కెమెరాల ఏర్పాటు చేశారు. ఓ డీసీపీ స్థాయి అధికారి ఇద్దరు సీఐలు, నలుగులు ఎస్‌ఐలతో పాటు కేంద్ర బలగాలు పహారా కాస్తున్నాయి. ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమయ్యే వరకు పలు ఆంక్షలతో పాటు 144 సెక్షన్ విధించారు. రాష్ట్రంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయని, ఎక్కడా రీపోలింగ్ నిర్వహించాల్సిన అవసరం లేదనని ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ అన్నారు. శుక్రవారం బీఆర్‌కే భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పలు నియోజకవర్గాల్లో గురువారం రాత్రి వరకు పోలింగ్ కొనసాగుతోందన్నారు. రాష్ట్రంలోని 79 నియోజకవర్గాల్లో 75 శాతానికి పైగా పోలింగ్ నమోదైంది. పోలింగ్ సరళిని పర్యవేక్షించేందుకు వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశామన్నారు. ఎన్నికలు ముగిసిన తర్వాత పార్టీ అభ్యర్థుల ఏజెంట్ల సమక్షంలో అన్ని ఈవీఎంలను స్ట్రాంగ్‌రూమ్‌లకు తరలించినట్లు వికాస్‌రాజ్ వెల్లడించారు. స్ట్రాంగ్‌రూమ్‌లకు అన్ని రకాల భద్రతా చర్యలు తీసుకున్నామని, సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని వెల్లడించారు. 49 ప్రాంతాల్లో కౌంటింగ్ కేంద్రాలు ఉన్నాయని వివరించారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
మిజోరంలో కౌంటింగ్ వాయిదా.. అసలు కారణం ఇదే..!
తెలంగాణ, రాజస్థాన్, మధ్యప్రదశ్, ఛత్తీస్‌గఢ్‌లో కౌంటింగ్ ఫీవర్ ఓ రేంజ్‌లో ఉంది. ఇప్పటికే విడతల వారీగా ఎన్నికలు జరగగా.. ఆదివారం కౌంటింగ్ జరుగనుంది. వాస్తవంగా ఈ నాలుగు రాష్ట్రాలతో పాటు.. మిజోరంలో కూడా ఎన్నికలు జరిగాయి. ఆదివారం రోజే మిజోరం ఫలితాలు రావాల్సి ఉంది. ఆ రాష్ట్రంలో కౌంటింగ్ ప్రక్రియను ఒకరోజు వాయిదా వేసింది ఎలక్షన్ కమిషన్. సోమవారం రోజు ఓట్లు లెక్కించి ఫలితాలు వెల్లడించనుంది. మిజోరంలో క్రిస్టియన్‌ల సంఖ్య ఎక్కువగా ఉంది. ఆదివారం రోజుకు అక్కడి ప్రజలు ప్రాముఖ్యతనిస్తారు. ఆ రోజు చర్చి వెళ్లాల్సి ఉంటుంది. అలాగే.. తమ కమ్యూనిటీకి సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొంటారు. దీంతో.. మిజోరంలో నవంబర్ 7న జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు తేదీని మార్చాలని కోరుతూ నిన్న అక్కడి ప్రజలు నిరసనలు తెలిపారు. మిజోరం NGO కోఆర్డినేషన్ కమిటీ, సెంట్రల్ యంగ్ మిజో అసోసియేషన్, మిజో జిరాలై పాల్ వంటి విద్యార్థి సంస్థలు ఆందోళనలు నిర్వహించాయి. డిసెంబర్ 3 ఆదివారం నుంచి కౌంటింగ్ తేదీని మార్చాలని ఎన్జీవోసీసీ చాలాసార్లు ఈసీకి విజ్ఞప్తి చేసింది. మిజోరం ప్రజల విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన ఈసీ.. కౌంటింగ్ తేదీని ఆదివారం నుంచి సోమవారానికి మార్చింది. మిగిలిన నాలుగు రాష్ట్రాలైన మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, తెలంగాణలో మాత్రం యథావిథిగా ఆదివారమే ఎన్నికల ఫలితాలను ప్రకటిస్తామని ఈసీ చెప్పింది. ఇక.. మిజోరంలో 40 అసెంబ్లీ స్థానాలుండగా.. నవంబర్ 7న పోలింగ్ జరిగింది. 80శాతం కంటే ఎక్కువ మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
చంద్రయాన్-3 విజయంపై నాసా చీఫ్ ప్రశంసలు
ఇస్రో ప్రవేశపెట్టిన చంద్రయాన్ -3 మిషన్ విజయవంతం కావడంతో నాసా చీఫ్ బిల్ నెల్సన్ ప్రశంసించారు. ఏ దేశం చేయని పనిని భారత్ చేసింది.. అందుకే ఈ ఘనత సాధించినందుకు అందరి ప్రశంసలు దక్కుతాయని ఆయన అన్నారు. భారతదేశానికి నా అభినందనలు.. చంద్రుని దక్షిణ ధృవం చుట్టూ ల్యాండ్ అయిన మొదటి ప్రయోగం మీదేనని చెప్పుకొచ్చారు. నిసార్ (NISAR) మిషన్ గురించి కూడా బిల్ నెల్సన్ ప్రస్తావించారు. ఇది భూమిపై ఏమి జరుగుతుందో తెలుసుకోవడానికి పూర్తి త్రిడీ మిశ్రమ నమూనాను చూపిస్తుందన్నారు.. దీనికి నాలుగు ప్రధాన అబ్జర్వేటరీలు ఉన్నాయి.. తాము ఇప్పటికే కక్ష్యలో ఉన్న 25 స్పేస్‌క్రాఫ్ట్‌లతో నాలుగింటిని పైకి తీసుకువచ్చామని చెప్పుకొచ్చారు. ఈ అబ్జర్వేటరీలలో నిసార్ మొదటిది.. ఇది భూమి యొక్క అన్ని ఉపరితలాలను గమనిస్తుంది.. నీరు, భూమి, మంచులో ఏవైనా వచ్చాయా అనే మార్పులను గమనిస్తుంది.. ఇది మనం అర్థం చేసుకోవడానికి సహాయపడే మరొక డేటా అని నెల్సన్ తెలిపారు. ఈ మిషన్ వచ్చే ఏడాది ప్రథమార్థంలో ప్రవేశపెట్టబోతున్నాం.. ఈ రాకెట్‌ను ఇండియన్ స్పేస్ ఏజెన్సీ అందించింది.. దీని కోసం మేము అంతరిక్ష నౌకను నిర్మించాము.. ఇదీ బెంగళూరులోని ఇస్రో సెష్టన్ లో అభివృద్ధి చేస్తున్నారు అని నాసా చీఫ్ వెల్లడించారు.
పొట్టి క్రికెట్‌లో టీమిండియా సరికొత్త రికార్డు
తొలి రెండు టి20ల్లో నెగ్గిన భారత్.. మూడో టి20లో ఓడింది. రాయ్ పూర్ వేదికగా జరిగిన నాలుగో టి20లో భారత్ 20 పరుగుల తేడాతో విజయాన్ని సాధించింది. దీంతో.. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 3-1తో సొంతం చేసుకుంది టీమిండియా. ఈ విజయంతో పొట్టి క్రికెట్‌ఫార్మాట్‌లో టీమిండియా సరికొత్త రికార్డు సృష్టించింది.. టీ 20ల్లో అత్యధిక విజయాలు సాధించిన జట్టుగా నిలిచంది.. 213 మ్యాచ్‌లు ఆడి 136 విజయాలు సాధించడంతో.. టీ20ల్లో సత్తా చాటింది భారత జట్టు.. పొట్టి ఫార్మెట్‌లో ఇదే అత్యధికం.. ఇప్పటి వరకు ఈ రికార్డు పాకిస్థాన్ 226 మ్యాచ్‌ల్లో 135 విజయాలతో ఫస్ట్ ప్లేస్‌లో ఉండగా.. ఇప్పుడు పాక్‌ను రెండోస్థానానికి నెట్టి.. టాప్ స్పాట్‌కు దూసుకెళ్లింది భారత్… ఇక, కివీస్ 200 మ్యాచ్‌లలో 102 విక్టరీలు, ఆస్టేలియా 181 మ్యాచ్‌లలో 95 గెలుపులు, సౌతాఫ్రికా 171 మ్యాచ్‌లలో 95 విజయాలతో వరుసగా లిస్ట్‌లో ఉన్నాయి.. మరోవైపు సొంత గడ్డపై భారత్ వరుసగా 5 టీ20 సిరీస్‌లు గెలుచుకోవడం మరో విశేషం.
బుకింగ్స్ ఓపెన్ అవుతున్నాయి… బాక్సాఫీస్ బద్దలవ్వాల్సిందే
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కలిసి చేసిన ఇండియాస్ బిగ్గెస్ట్ కమర్షియల్ సినిమా ‘సలార్’. డార్క్ సెంట్రిక్ థీమ్ తో తెరకెక్కిన ఈ మూవీ డిసెంబర్ 22న ఆడియన్స్ ముందుకి రావడానికి రెడీ అవుతోంది. బాహుబలి తర్వాత సరైన హిట్ కోసం చూస్తున్న ప్రభాస్ సలార్ సినిమాతో మరోసారి తన బాక్సాఫీస్ స్టామినా ఏంటో ప్రూవ్ చేయబోతున్నాడు. అనౌన్స్మెంట్ నుంచి భారీ హైప్ ని మైంటైన్ చేస్తున్న సలార్ సినిమా ట్రైలర్ రిలీజ్ తో ఒక్కసారిగా ఇండియాస్ హాట్ టాపిక్ అయ్యింది. ట్రైలర్ తో ప్రశాంత్ నీల్ అండర్ ప్లే చేస్తూ ప్రభాస్ ని లేట్ గా ఎంట్రీ ఇచ్చేలా చేసాడు. ‘దేవా’ అనే పేరు నుంచి ప్రభాస్ రివీల్ అవ్వడం అక్కడి నుంచి మిర్చి, ఛత్రపతి రేంజ్ మాస్ ఫైట్స్ తో ప్రభాస్ అగ్రెసివ్ గా కనిపించడం ఫ్యాన్స్ ని ఎంటర్టైన్ చేసింది. ఇలాంటి ప్రభాస్ ని ఈ మధ్య కాలంలో మాత్రం చూడలేదు. సింపుల్ గా చెప్పాలి అంటే వింటేజ్ ప్రభాస్ ని ఒక్క ట్రైలర్ లో చూపించాడు ప్రశాంత్ నీల్. డిజిటల్ రికార్డ్స్ ని బ్రేక్ చేసే పనిలో ట్రైలర్ ఉండగా… బాక్సాఫీస్ రికార్డులని టార్గెట్ చేస్తూ బుకింగ్స్ ఓపెన్ అవుతున్నాయి. సలార్ ప్రీబుకింగ్స్ డిసెంబర్ 15 నుంచి ఓపెన్ అవనున్నాయని హోంబలే ఫిల్మ్స్ అనౌన్స్ చేసింది. బుకింగ్స్ ఓపెన్ అవ్వడం ఆలస్యం పాన్ ఇండియా ఆడియన్స్ టికెట్స్ బుక్ చేసుకోవడానికి ఫుల్ జోష్ లో ఉంటారు. ప్రీబుకింగ్స్ లో సలార్ కొత్త రికార్డ్ ని క్రియేట్ చేయడం గ్యారెంటీ. ఇప్పుడున్న హైప్ కి ఒక సాలిడ్ ప్రీరిలీజ్ ఈవెంట్ కూడా పడితే సలార్ బుకింగ్స్ ఇండియన్ బాక్సాఫీస్ హిస్టరీలోనే కొత్త చరిత్ర సృష్టిస్తుంది.
రాత్రి పది తర్వాత సుధీర్ ఇలాంటి పనులు చేస్తాడా?.. సుధీర్ గుట్టు రట్టు చేసిన ఆది..
సుడిగాలి సుధీర్, హైపర్ ఆది ల స్నేహం గురించి అందరికీ తెలుసు.. వీరిద్దరి కామెడీ టైమింగ్ ను జనాలు ఇష్టపడుతున్నారు.. సుడిగాలి సుధీర్.. టీవీ షోస్ మానేసి సినిమాల్లో హీరోగా చేస్తూ బిజీగా ఉన్నారు. తాజాగా ఆయన నటించిన కాలింగ్ సహస్త్ర మూవీ శుక్రవారం థియేటర్లలో విడుదలైంది. సినిమాకి మిశ్రమ స్పందన లభిస్తుంది. అయితే తన సినిమా ప్రమోషన్స్ కోసం మళ్లీ ఈటీవీకి వచ్చాడు. అక్కడ ఉన్న ఆది సుధీర్ గురించి కొన్ని నమ్మలేని విషయాలను చెప్పి అందరికీ షాక్ కు గురి చేశాడు.. ఆది నవ్వుతూనే సుధీర్ గురించి అతి పెద్ద రహస్యం బయటపెట్టాడు. జబర్దస్త్ షోలో డబుల్ మీనింగ్ డైలాగ్‌లతో పంచ్‌లు, సెటైర్లు పేల్చి నవ్వించారు హైపర్ ఆది, సుధీర్. కానీ ఇద్దరికి ఏడాది గ్యాప్ వచ్చింది. సుధీర్ హీరోగా బిజీ కావడంతో జబర్దస్త్ వదిలేశాడు. ఆది కూడా కొన్నాళ్లు ఆ షోని వీడారు. చాలా రోజులు తర్వాత ఈ ఇద్దరు కలవడంతో మళ్లీ పాత ట్రాక్ లోకి వెళ్లారు.. దాంతో ఇద్దరు కలిసి కాసేపు కామెడీ చేశారు.. అదే సమయంలో ఆది సుధీర్ గుట్టు రట్టు చేశాడు.. ఆయన రాత్రిళ్లు ఏం చేస్తాడో మొత్తం చెప్పేశాడు. రాత్రి 10.30 వరకే కాలింగ్ సహస్త్ర అని.. పదిన్నర దాటిందా.. కాలింగ్ గీత, కాలింగ్ సరళ.. ఫస్ట్ కాలింగ్.. ఆ తర్వాత కూలింగ్. ఆ తర్వాత లింగడి లింగడి లింగడి.. అంటూ అసలు విషయం చెప్పాడు ఆది.. ఇక సుధీర్ కూడా అతనికి తగ్గట్లుగానే రెచ్చిపోయాడు. మధ్యలో యాంకర్ ప్రదీప్ కూడా ఎంట్రీ ఇవ్వడంతో వీరి సంభాషణ కామెడీగా సాగింది.. ఇక షోలో ఓ వైపు తన విషయం బయటకు రావడంతో సుధీర్ నిర్వహకులను వేడుకున్నాడు. మళ్లీ వచ్చి తప్పు చేశాను. క్షమించమని వేడుకున్నారు. ప్రస్తుతం ఢీ లేటెస్ట్ ఎపిసోడ్‌కి చెందిన ప్రోమో యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతుంది..
రాజమౌళి మహేష్ సినిమాలో తమిళ్ స్టార్ హీరో..?
తెలుగులో స్టార్ డైరెక్టర్ లిస్ట్ మొదటగా రాజమౌళి పేరు వినిపిస్తుంది.. ఆయన తీసిన సినిమాలు అన్నీ కూడా బాక్సాఫీస్ ను షేక్ చేసినవే.. ఆయన చేసిన సినిమాలు ఎంత పెద్ద విజయం సాధించాయో మనందరికీ తెలిసిందే.. ఇక త్రిపుల్ ఆర్ సినిమా ఆస్కార్ కు నామినేట్ అయ్యింది.. తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పారు.. ఆయనతో సినిమాలు చెయ్యాలని స్టార్ హీరోలు ఆసక్తి చూపిస్తున్నారు.. త్రిపుల్ ఆర్ తర్వాత ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే… మరోసారి ఇండియాలోనే కాకుండా, హాలీవుడ్ రేంజ్ లో తన సత్తా చాటడానికి రెడీ అవుతున్నాడు. ఇక ఈ సినిమాలో మహేష్ బాబు అడ్వెంచర్లు కూడా చేయబోతున్నట్టుగా సమాచారం.. ఈ సినిమా జక్కన్న ఇప్పటివరకు తీసిన సినిమాల కన్నా ఈ సినిమా డిఫరెంట్ గా ఉంటుందని తెలుస్తుంది.. ప్రతి ఫ్రెమ్ కొత్తగా ఉండబోతుందని తెలుస్తుంది.. ఈ సినిమాలో ఇక ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసుకున్న ఈ సినిమాలో తమిళ్ సినిమా ఇండస్ట్రీకి చెందిన విక్రమ్ కూడా ఒక కీలకపాత్రలో నటించబోతున్నట్టుగా సమాచారం అయితే అందుతుంది. అయితే ఆయన విలన్ పాత్రలో కనిపించునున్నారా.. లేక చిన్న రోల్ చేస్తారా అన్నది మాత్రం తెలియలేదు.. ఈ సినిమాలో తప్పకుండా ఒక క్యారెక్టర్ లో నటిస్తున్నట్టుగా సమాచారం అనేది బయటికి లీక్ అయింది. ఇక ఈ సినిమాలో విక్రమ్ కనక చేసినట్లయితే ఆయన నటనతో విశ్వరూపం చూపిస్తాడని చెప్పడం లో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.ఇక రాజమౌళి సినిమాల్లో నటులు తనదైన రీతిలో రెచ్చిపోయి నటిస్తూ ఉంటారు.ఇక దానికి తగ్గట్టుగానే విక్రమ్ అయితే వేరే సినిమాల్లోనే అద్భుతమైన నటనను కనబరుస్తాడు.. మరి దీనిపై అధికార ప్రకటన వచ్చేవరకు వెయిట్ చెయ్యాల్సిందే..