Cricket: T10 చరిత్రలో రికార్డు.. 43 బంతుల్లో 193 పరుగులు చేసిన స్పెయిన్ బ్యాట్స్మెన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
T10 చరిత్రలో రికార్డు సాధించాడు స్పెయిన్ బ్యాట్స్మెన్ హమ్జా సలీం దార్.. కేవలం 43 బంతుల్లో 193 పరుగులు చేశాడు. 449 స్ట్రైక్ రేట్‌తో.. అంటే ప్రతి బంతికి 4 పరుగుల కంటే ఎక్కువ పరుగులు చేశాడు. స్పెయిన్‌లో జరుగుతున్న యూరోపియన్ క్రికెట్ సిరీస్‌లో హమ్జా మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఈ క్రమంలో.. టీ10 క్రికెట్ ఫార్మాట్‌లో అతిపెద్ద ఇన్నింగ్స్ ఆడిన రికార్డు సృష్టించాడు. మంగళవారం కాటలున్యా జాగ్వార్, సోహల్ హాస్పిటల్ మధ్య ఈ మ్యాచ్ జరిగింది. మొదట కాటలున్యా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో ఓపెనర్ గా బ్యాటింగ్ దిగిన హమ్జా విధ్వంసకర ఇన్నింగ్స్‌తో 10 ఓవర్లలో 257 పరుగులు చేసింది. మొత్తం జట్టు స్కోర్‌లో హమ్జా 75 శాతం స్కోర్ చేశాడు.
DGP: రేపు ఎల్బీ స్టేడియం పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు
Also Read
హమ్జా ఇన్నింగ్స్‌లో మొత్తం 22 సిక్సర్లు, 14 ఫోర్లు ఉన్నాయి. దీంతో టీ10 క్రికెట్ ఫార్మాట్‌లో లూయిస్ డు ప్లూయ్ రికార్డును బద్దలు కొట్టాడు. అతని పరుగుల కంటే.. హమ్జా 30 పరుగుల ముందున్నాడు. ఈ ఏడాది అక్టోబర్ 5న హంగరీ తరఫున ఆడిన లూయిస్ 40 బంతుల్లో 163 పరుగులు చేశాడు. ఇదిలా ఉంటే.. హమ్జా సలీం దార్ స్పెయిన్ కు చెందిన క్రికెటర్. అతను.. టీ10 క్రికెట్‌లో 121 మ్యాచ్‌లు ఆడాడు. 34.97 సగటుతో, 232 స్ట్రైక్ రేట్‌తో 3113 పరుగులు చేశాడు. టీ10 ఫార్మాట్‌లో హమ్జా పేరు మీద 3 సెంచరీలు, 18 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
𝗪𝗢𝗥𝗟𝗗 𝗥𝗘𝗖𝗢𝗥𝗗 𝗞𝗡𝗢𝗖𝗞!🤯
Hamza Saleem Dar's 43-ball 1️⃣9️⃣3️⃣ not out is the highest individual score in a 10-over match.😍 #EuropeanCricket #EuropeanCricketSeries #StrongerTogether pic.twitter.com/4RQEKMynu2
— European Cricket (@EuropeanCricket) December 6, 2023
తాజావార్తలు
-
OTR : బొత్స అనూషకు భీమిలి వైసీపీ బాధ్యతలు .. గంటాను ఢీ కొట్టగలరా?
-
OTR: ఆక్వా రైతుల ఆగ్రహం.. ఉద్యమానికి రెడీ?
-
El Nino: భారత్‌కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్‌నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
-
Karnataka: హృదయ విదారక ఘటన.. తల్లి శవంపై ఏడుస్తూ కనిపించిన రెండేళ్ల చిన్నారి
-
OTR: కాంగ్రెస్ కంచుకోటలో గ్రూప్ వార్.. క్యాడర్లో పెరుగుతున్న అసంతృప్తి..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!