మెల్బోర్న్ వేదికగా జరుగుతున్న బాక్సింగ్ డే టెస్ట్ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు తొలి రోజు 6 వికెట్ల నష్టానికి 311 పరుగులు చేసింది. ఇక మొదటి రోజు ఆట ముగిసే సమయానికి స్టీవెన్ స్మిత్ 68 పరుగులతో, కెప్టెన్ పాట్ కమిన్స్ 8 పరుగులతో క్రీజ్ లో ఉన్నారు. ఆస్ట్రేలియా జట్టులో శామ్ కాన్స్టాస్ 65 బంతుల్లో 60 పరుగులు, ఉస్మాన్ ఖవాజా 121 బంతుల్లో 57 పరుగులు, మార్నస్ లాబుషాగ్నే 145…
టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే.. డిసెంబర్ 26 (గురువారం) నుంచి మెల్బోర్న్లో ఆస్ట్రేలియాతో భారత్ నాలుగో టెస్టు మ్యాచ్ ఆడనుంది. ఇదిలా ఉంటే.. కోహ్లీపై ఓ వార్త ప్రచారంలోకి వచ్చింది. ప్రముఖ గాయకుడు, బిగ్‌బాస్ పార్టిసిపెంట్ రాహుల్ వైద్యను కోహ్లీ ఇన్‌స్టాగ్రామ్‌లో బ్లాక్ చేశాడు.
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా రేపటి నుంచి (డిసెంబర్ 26) భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య నాలుగో టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది. మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో బాక్సింగ్ డే టెస్ట్ జరుగనుంది. ఈ సిరీస్‌లో ఇరుజట్లు 1-1తో సమంగా ఉన్నాయి. ఈ క్రమంలో ఈ టెస్ట్ మ్యాచ్ రెండు టీమ్‌లకు చాలా ముఖ్యమైనది. అయితే.. బాక్సింగ్ డే టెస్టు కోసం ఆస్ట్రేలియా ప్లేయింగ్ ఎలెవన్‌ను ప్రకటించింది. టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్‌ను టాస్ సమయానికి ప్రకటించనుంది. బాక్సింగ్ డే…
టీమిండియా స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా.. ప్రస్తుతం ఐసీసీ (ICC) టెస్ట్ ర్యాంకింగ్స్‌లో నంబర్ వన్ బౌలర్‌గా కొనసాగుతున్నాడు. అయితే.. బాక్సింగ్ డే టెస్ట్ మ్యాచ్‌కు ముందు.. బుమ్రా మరో రికార్డు సృష్టించాడు. బ్రిస్బేన్ టెస్ట్ మ్యాచ్‌లో అతని అద్భుతమైన ప్రదర్శనతో.. టీమిండియా తరపున టెస్ట్ క్రికెట్లో ఫాస్ట్ బౌలర్‌గా అత్యధిక రేటింగ్ పాయింట్లు సాధించిన బౌలర్‌గా బుమ్రా నిలిచాడు.
BGT Series: మెల్బోర్న్ వేదికగా జరగనున్న నాలుగో టెస్టుకు ముందు టీమిండియా కష్టాల్లో పడింది. కెప్టెన్ రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ గాయాల కారణంగా టీమిండియా జట్టు ప్రణాళికలకు ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. శనివారం కేఎల్ రాహుల్ చేతికి గాయం కాగా, ఆదివారం రోహిత్ శర్మ మోకాలికి గాయమైంది. ఈ ఇద్దరి గాయాల తీవ్రత ఇంకా స్పష్టంగా తెలియనప్పటికీ, వారు టెస్టుకు దూరమైతే జట్టుకు పెద్ద దెబ్బ అవుతుంది. ఇక 5 టెస్టుల సిరీస్ ప్రస్తుతం…
West Indies vs Bangladesh: వెస్టిండీస్ పర్యటనలో భాగంగా బంగ్లాదేశ్ టీ20 సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసింది. మూడో టీ20లో ఆతిథ్య జట్టును 80 పరుగుల తేడాతో ఓడించి ఈ ఘనత సాధించింది. ముందుగా జరిగిన తొలి టీ20లో బంగ్లాదేశ్ 7 పరుగుల తేడాతో విజయం సాధించింది. తర్వాతి రెండో టీ20లో బంగ్లాదేశ్ 27 పరుగుల తేడాతో గెలిచింది. మూడో టీ20లో బంగ్లాదేశ్ వెస్టిండీస్‌కు 190 పరుగుల విజయలక్ష్యాన్ని నిర్దేశించింది. అయితే, వెస్టిండీస్ 109 పరుగులకు మించి…
కడప జిల్లాకు చెందిన ఓ గ్రామీణ విద్యార్థిని స్టార్ క్రికెటర్లతో కలిసి ఆడే అవకాశం వచ్చింది. తాజాగా జరిగిన ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ వేలంలో ఈ విద్యార్థిని అమ్ముడుపోయింది. రూ. 55 లక్షల పారితోషకంతో ఢిల్లీ క్యాపిటల్స్ శ్రీ చరణి అనే విద్యార్ధిని సొంతం చేసుకుంది. శ్రీ చరణి ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అమ్మాయి. కడప జిల్లా వీరపనేని మండలం ఎర్రమల్లె గ్రామానికి చెందిన విద్యార్థిని.
IND vs AUS: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్, ఆస్ట్రేలియా మధ్య మూడో మ్యాచ్ బ్రిస్బేన్ లోని గబ్బా మైదానంలో జరుగుతోంది. ఈరోజు మ్యాచ్‌లో నాలుగో రోజు కొనసాగుతుంది. మ్యాచ్ లో ఆస్ట్రేలియా తన తొలి ఇన్నింగ్స్‌లో 445 పరుగుల భారీ స్కోర్ చేసింది. అయితే, మొదటి ఇన్నింగ్స్ లో భారత జట్టు ఆరంభం మరోసారి నిరాశపరిచింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ తొలి ఓవర్లోనే పెవిలియన్‌కు చేరుకున్నాడు. మ్యాచ్ నాలుగో రోజు బ్యాటింగ్‌లో కేఎల్ రాహుల్ చక్కటి…
నేపాల్ ప్రీమియర్ లీగ్ (NPL)లో ఆసక్తికరమైన సంఘటన జరిగింది. ఈరోజు కర్నాలీ యాక్స్, ఫార్ వెస్ట్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో అద్భుతం జరిగింది. కర్నాలీ జట్టు బ్యాటర్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఈ సన్నివేశం కనపడింది.