అండర్-19 ఆసియాకప్ 2024లో భాగంగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో ఇండియా విజయం సాధించింది. షార్జా క్రికెట్ స్టేడియంలో జరిగిన రెండవ సెమీ-ఫైనల్ మ్యాచ్లో.. భారత్ ఏడు వికెట్ల తేడాతో గెలిచింది.
సుఫియాన్ ముకీమ్ డేంజరస్ బౌలింగ్తో జింబాబ్వే జట్టును మట్టి కరిపించాడు. రెండో టీ20 మ్యాచ్లో పాకిస్తాన్ 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో 3 మ్యాచ్ల టీ20 సిరీస్లో మొదటి రెండు మ్యాచ్లు పాక్ గెలుపొందింది.
మ్యాచ్ ఫిక్సింగ్ కేసులో దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్, వన్డేలో ప్రపంచ మాజీ నంబర్ 1 బౌలర్ లోన్వాబో త్సోత్సోబే అరెస్టయ్యాడు. ఇతనితో పాటు థమీ సోలెకిలే, ఎథి మభలాటి అరెస్టయ్యారు. మ్యాచ్ జరుగుతుండగానే పోలీసులు వీరిని అరెస్టు చేశారు. 2015-16 రామ్స్లామ్ టీ-20 మ్యాచ్ ఫిక్సింగ్ కుంభకోణంలో వీరిని అరెస్ట్ చేశారు. ఈ క్రికెటర్లపై ఐదు అవినీతి ఆరోపణలు నమోదయ్యాయి.
ఐపీఎల్ మెగా వేలం రెండు రోజు కొనసాగనుంది. తొలి రోజు వేలంలో ఆటగాళ్లు.. కోట్లు కొల్లగొట్టగా, ఈరోజు కూడా అదే స్థాయిలో ఆటగాళ్లు అమ్ముడుపోనున్నారు. తొలిరోజు 84 మంది ఆటగాళ్లపై బిడ్డింగ్ జరిగింది. ఫ్రాంచైజీలు ఆదివారం మొత్తం రూ.467.95 కోట్లు ఖర్చు చేశారు. సోమవారం కూడా పెద్ద సంఖ్యలో వేలం జరుగనుంది.
ఐపీఎల్ మెగా వేలం (IPL 2025) ప్రారంభమైంది. ఆది, సోమవారాల్లో జెడ్డాలో జరుగనుంది. ఈసారి వేలంలో పలువురు స్టార్ ప్లేయర్లు పాల్గొనడంతో మెగా వేలంలో భారత ఆటగాళ్ల ఆధిపత్యం కనిపించబోతోంది. 366 మంది భారతీయులు, 208 మంది విదేశీ ఆటగాళ్లతో కూడిన ఈ మెగా వేలంలో 577 మంది ఆటగాళ్ల భవిష్యత్తు తేలనుంది.
వచ్చే ఏడాది జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీ టూర్ షెడ్యూల్లో ఐసీసీ మార్పులు చేసింది. ట్రోఫీ టూర్ను పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే)లో నిర్వహించడంపై భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ క్రమంలో.. గ్లోబల్ బాడీ ఆఫ్ క్రికెట్ పీఓకేను చేర్చని సవరించిన షెడ్యూల్ను విడుదల చేసింది.
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ రెండోసారి తండ్రి అయ్యాడు. భార్య రితికా సజ్దే నవంబర్ 15న (శుక్రవారం) మగబిడ్డకు జన్మనిచ్చింది. రోహిత్ శర్మకు కొడుకు పుట్టడంతో అతని కుటుంబంలో సందడి వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో రోహిత్ శర్మ కుటుంబ సభ్యులు నలుగురయ్యారు. రోహిత్, రితిక దంపతులకు 2018లో సమైరా అనే కూతురు జన్మించింది. కాగా.. కొడుకు పుట్టడంపై రోహిత్ శర్మతో పాటు కుటుంబ సభ్యులు తీవ్ర ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో.. రోహిత్ శర్మ…
ఐపీఎల్ 2025 కోసం వేలం సౌదీ అరేబియాలోని జెడ్డాలో నిర్వహించబడుతుంది. ఈసారి మెగా వేలం జరగనుండడంతో రెండు రోజుల పాటు జరగనుంది. నవంబర్ 24, 25 తేదీల్లో వేలం జరగనుంది. ఈ వేలంలో 574 మంది ఆటగాళ్లలో కేవలం 204 మందిని మాత్రమే తీసుకునే అవకాశం ఉంది. బిడ్లో పాల్గొనే ఆటగాళ్ల జాబితాను బీసీసీఐ విడుదల చేసింది. చాలా మంది దిగ్గజ ఆటగాళ్ల పేర్లు ఈ జాబితాలో లేవు.
సంజూ శాంసన్, తిలక్ వర్మల అజేయ సెంచరీలతో నాలుగు మ్యాచ్ల సిరీస్లో భారత్ 3-1తో దక్షిణాఫ్రికాను ఓడించింది. వాండరర్స్ స్టేడియంలో శుక్రవారం రాత్రి జరిగిన నాలుగో టీ20లో, భారత్ ఒక వికెట్ నష్టానికి 283 పరుగుల భారీ స్కోరును సాధించింది, ఆపై దక్షిణాఫ్రికాను 148 పరుగులకు ఆలౌట్ చేసి దక్షిణాఫ్రికాను 135 పరుగులకే ఆలౌట్ చేసింది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 కోసం నిర్వహించనున్న మెగా వేలానికి సంబంధించి బీసీసీఐ భారీ ప్రకటన చేసింది. సౌదీ అరేబియాలోని జెడ్డా నగరంలో మెగా వేలం నిర్వహించనున్నారు. నవంబర్ 24, 25 తేదీల్లో వేలం జరగనుంది.