2023 ఏడాదికి సంబంధించి అత్యుత్తమ టీ20 జట్టును ఐసీసీ ఈరోజు ప్రకటించింది. ఈ జట్టుకు టీమిండియా మిడిల్ ఆర్డర్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. కాగా.. టీమిండియా స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మకు చోటు దక్కలేదు. యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్, స్పిన్నర్ రవి బిష్ణోయ్, ఫాస్ట్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ లకు చోటు కల్పించింది. సూర్యకుమార్ తో మొత్తం నలుగురు టీమిండియా ఆటగాళ్లకు చోటు దక్కింది.
అండర్ -19 వరల్డ్ కప్ లో భారత్ విక్టరీ కొట్టింది. బంగ్లాదేశ్ తో జరిగిన తొలి మ్యాచ్ లో టీమిండియా 84 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 251 పరుగులు చేసింది. ఆ తర్వాత 252 పరుగుల పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లా 167 పరుగులకే ఆలౌటైంది. టీమిండియా బ్యాటర్లలో ఆదర్శ్ సింగ్ (76), ఉదయ్ సహారన్ (64) పరుగులతో…