టీ20 సిరీస్లో భాగంగా ఆదివారం భారత్ వర్సెస్ ఆఫ్ఘనిస్థాన్ మధ్య రెండో మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో టీమిండియా 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 173 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా.. 15.4 ఓవర్లలోనే చేధించింది. ఈ మ్యాచ్ లో ఓపెనర్ యశస్వి జైశ్వాల్ (68), శివం దూబే (63) అజేయంగా నిలిచి అఫ్ఘాన్ బౌలర్లకు ఊచకోత చూపించారు. లక్ష్యాన్ని ఛేదించిన భారత జట్టు 6 వికెట్ల తేడాతో విజయాన్ని నమోదు చేసి సిరీస్ను…
ఆఫ్ఘనిస్తాన్తో జరుగుతున్న టీ20 మ్యాచ్ లో భారత ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ మంచి ప్రదర్శనను చూపించాడు. టీ20ల్లో 200 వికెట్ల మైలురాయిని చేరుకున్నాడు. ఆదివారం ఇండోర్లో జరిగిన మ్యాచ్లో అక్షర్ పటేల్ 4 ఓవర్లు వేసి కేవలం 17 పరుగులిచ్చి 2 వికెట్లు తీశాడు. దీంతో.. టీ20 క్రికెట్లో 200 వికెట్లు పూర్తి చేసిన 11వ భారత బౌలర్గా అక్షర్ పటేల్ నిలిచాడు. ఇదిలా ఉంటే.. అక్షర్ పటేల్ ఇండియా తరపున 52 టీ20 మ్యాచ్లు…
మూడు టీ20ల సిరీస్లో భాగంగా కాసేపట్లో భారత్, ఆఫ్ఘనిస్థాన్ మధ్య రెండో టీ20 మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ ఎంచుకుంది. ఇండోర్లోని హోల్కర్ వేదికగా ఈ మ్యాచ్ కాసేపట్లో ప్రారంభం కానుంది. రోహిత్ శర్మ సారథ్యంలో తొలి టీ20లో విజయం సాధించిన టీమిండియా.. రెండో మ్యాచ్లో గెలిచి సిరీస్ను కైవసం చేసుకోవాలని భావిస్తోంది. వెటరన్ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ దాదాపు 14 నెలల తర్వాత టీ20 ఇంటర్నేషనల్లో పునరాగమనం చేస్తున్నాడు.