2023 ఏడాదికి సంబంధించి అత్యుత్తమ టీ20 జట్టును ఐసీసీ ఈరోజు ప్రకటించింది. ఈ జట్టుకు టీమిండియా మిడిల్ ఆర్డర్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. కాగా.. టీమిండియా స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మకు చోటు దక్కలేదు. యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్, స్పిన్నర్ రవి బిష్ణోయ్, ఫాస్ట్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ లకు చోటు కల్పించింది. సూర్యకుమార్ తో మొత్తం నలుగురు టీమిండియా ఆటగాళ్లకు చోటు దక్కింది.
Deepotsavam: అయోధ్యలో సరయూ నది తీరాన దీపోత్సవం..
సూర్యకుమార్ వరుసగా రెండో ఏడాది జట్టులో స్థానం సంపాదించి టీ20 పురుషుల క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ రేసులో ఉన్నాడు. కాగా.. ICC పురుషుల T20 ప్లేయింట్ ఎలెవన్ లో జైస్వాల్‌కు ఓపెనింగ్ భాగస్వామిగా ఇంగ్లాండ్‌కు చెందిన ఫిల్ సాల్ట్, వికెట్ కీపర్‌గా వెస్టిండీస్‌కు చెందిన నికోలస్ పూరన్, న్యూజిలాండ్‌కు చెందిన మార్క్ చాప్‌మన్, జింబాబ్వేకు చెందిన సికందర్ రజా, ఉగాండా ఆల్ రౌండర్ అల్పేష్ రంజానీ, ఐర్లాండ్‌కు చెందిన మార్క్ అడైర్, జింబాబ్వేకు చెందిన రిచర్డ్ నగర్వాను ఎంపిక చేసింది. ఈ జట్టులో ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, పాకిస్తాన్, శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్ జట్ల నుంచి ఒక్క ఆటగాడిని కూడా ఎంపిక చేయలేదు.
Pakistan: రామ మందిరంపై పాకిస్తాన్ అసూయ..ఆ దేశ విదేశాంగ మంత్రిత్వశాఖ పోస్ట్..
మహిళల జట్టు విషయానికొస్తే.. శ్రీలంకకు చెందిన ఆటపట్టును కెప్టెన్ గా ఎంపిక చేశారు. టీమిండియా ఆటగాళ్లలో ఆఫ్ స్పిన్నర్ దీప్తి శర్మను సెలెక్ట్ చేశారు. నలుగురు ఆస్ట్రేలియా క్రీడాకారిణులు ఉన్నారు. బెత్ మూనీ (వికెట్ కీపర్), ఎల్లీస్ పెర్రీ, యాష్ గార్డనర్, మేగాన్ స్కట్.. ఇంగ్లండ్‌కు చెందిన నాట్ స్కివర్-బ్రంట్, సోఫీ ఎక్లెస్టోన్ ఇద్దరు.. దక్షిణాఫ్రికాకు చెందిన లారా వోల్వార్డ్, వెస్టిండీస్‌కు చెందిన హేలీ మాథ్యూస్, న్యూజిలాండ్ కెర్ ను ఎంపిక చేసింది ఐసీసీ.