టీ20 ప్రపంచకప్‌లో ఎలైట్ వ్యాఖ్యాత ప్యానెల్లో ఒకరైన దినేష్ కార్తీక్ ఇటీవల ఐపీఎల్‌కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా జరిగిన ఐపీఎల్ 2024 లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) విజయాలలో భాగమైన కార్తీక్ ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఓటమిని చవిచూసిన టోర్నీ నుండి మాత్రమే కాకుండా తన ఐపీఎల్ క్రికెట్ కు వీడ్కోలు తెలిపాడు. అంతర్జాతీయ, ఫ్రాంచైజీ క్రికెట్ రెండింటికీ వీడ్కోలు చెప్పిన ఈ మాజీ ఆటగాడు తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాడు.…
మాజీ క్రికెట్ దిగ్గజం, కేకేఆర్ మెంటర్ గౌతమ్ గంభీర్ టీమిండియా హెడ్ కోచ్‌గా గౌతం గంభీర్ ఖరారైనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో.. గంభీర్‌తో బీసీసీఐ సుధీర్ఘ చర్చలు జరిపినట్లు సమాచారం. గంభీర్‌తో 4 గంటలపాటు బీసీసీఐ సెక్రటరీ జైషా సమావేశమయ్యారు. ఈ సమావేశంలో గంభీర్ కూడా సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. కాగా.. ఐపీఎల్లో కోల్‌కతా నైట్‌రైడర్స్ కి 3 సార్లు టైటిల్ అందించాడు గంభీర్. 2012, 2014లో గంభీర్ కెప్టెన్‌గా ఉన్నప్పుడు కేకేఆర్ కి టైటిల్ అందించి…
ఐపీఎల్ 2024 విజేతగా కోల్‌కతా నైట్ రైడర్స్ అవతరించింది. ఫైనల్స్‌లో సన్ రైజర్స్‌ను ఓడించి 3వ సారి కప్‌ను సొంతం చేసుకుంది. 8 వికెట్ల తేడాతో కేకేఆర్ ఘన విజయం సాధించింది. 114 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కతా.. కేవలం 10.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేధించింది. కోల్‌కతా బ్యాటర్లలో వెంకటేశ్ అయ్యర్ (52*) పరుగులతో రాణించాడు. గుర్బాజ్ (39), సునీల్ నరైన్ (6), శ్రేయాస్ అయ్యర్ (6*) పరుగులు చేశారు. దీంతో.. కోల్‌కతా సూపర్ విక్టరీ…
ఐపీఎల్ ఫైనల్లో ఎస్ఆర్హెచ్ బ్యాటర్లు విఫలమయ్యారు. కోల్‌కతా బౌలింగ్‌కు సన్ రైజర్స్ బ్యాటర్లు చేతులెత్తేశారు. కేవలం 113 పరుగులు చేసి ఆలౌట్ అయ్యారు. 18.3 ఓవర్లలో ఆలౌటైంది. సన్ రైజర్స్ బ్యాటింగ్ లో మొదట నుంచి బ్యాటర్లు ఎవరూ రాణించలేకపోయారు. మొదట్లోనే ట్రావిస్ హెడ్ డకౌట్ కాగా, అభిషేక్ శర్మ (2) వికెట్లు పోవడంతో జట్టు తీవ్ర కష్టాల్లో పడింది. ఆ తర్వాత రాహుల్ త్రిపాఠి ఆదుకుంటాడనకున్నప్పటికీ (9) పరుగులు చేసి పెవిలియన్ బాట పట్టాడు.
కాసేపట్లో ఐపీఎల్ 2024 ఫైనల్ పోరు జరుగనుంది. చెన్నై చెపాక్ స్టేడియం వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో టాస్ గెలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ ఎంచుకుంది.