అమెరికాపై పాకిస్థాన్ ఓటమి తర్వాత క్రికెట్ ప్రపంచంలో కలకలం రేగింది. క్రికెట్ నిపుణులతో పాటు అభిమానులు కూడా బాబర్ అండ్ కంపెనీపై నిరంతరం విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలో పాకిస్థాన్ క్రికెట్ జట్టు మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ ప్రకటన కూడా తెరపైకి వచ్చింది.
టీ20 ప్రపంచకప్ 2024 మ్యాచ్లో భాగంగా.. పాపువా న్యూ గినియాతో జరిగిన మ్యాచ్లో ఉగాండా చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. 2024 పురుషుల టీ20 ప్రపంచకప్లో ఉగాండా తన తొలి మ్యాచ్లో విజయం సాధించింది. రియాజత్ అలీ షా (33) పరుగులతో రాణించడంతో విజయాన్ని నమోదు చేసింది. 78 పరుగుల తక్కువ పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఉగాండా.. 3 వికెట్ల తేడాతో పపువా న్యూ గినియాను ఓడించింది. ఈ మ్యాచ్లో విజయం సాధించిన ఉగాండా జట్టు…
ఐపీఎల్లో అద్భుత ప్రదర్శన చూపించిన కింగ్ విరాట్ కోహ్లీ.. టీ20 వరల్డ్ కప్లో మొదటి మ్యాచ్లోనే నిరాశపరిచాడు. మంచి ఫామ్లో ఉన్న విరాట్ కోహ్లీపై.. టీమిండియ భారీ ఆశలు పెట్టుకుంది. ఈ క్రమంలో.. నిన్న ఐర్లాండ్తో జరిగిన మ్యాచ్లో కోహ్లీ ఓపెనర్గా బరిలోకి దిగాడు. కానీ.. అనుకున్నంత స్థాయిలో ఆడలేక అభిమానులను నిరాశపరిచాడు. కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి ఔటయ్యాడు. అది కూడా.. పెద్ద టీమ్ బౌలర్లు కూడా కాదు.. పసికూన ఐర్లాండ్ బౌలర్లకే కోహ్లీ…
నిజామాబాద్ జిల్లా కేంద్రం గౌతం నగర్లో తీవ్ర విషాదం నెలకొంది. విజయ్ అనే యువకుడు క్రికెట్ ఆడుతూ కుప్పకూలిపోయాడు. నగరంలోని అమ్మ వెంచర్లో స్నేహితులతో కలిసి విజయ్ క్రికెట్ ఆడుతుండగా.. గుండెపోటు వచ్చింది. దీంతో గమనించిన తోటి స్నేహితులు వెంటనే ఆసుపత్రికి తరలించే లోపు యువకుడు విజయ్ మృతి చెందాడు.