టీమిండియా స్టార్ బ్యాటర్ KL రాహుల్ ను ప్రశంసలతో ముంచెత్తింది ప్రముఖ సీనియర్ నటి కస్తూరి. రాహుల్ చేసిన ధైర్యం తనను ఎంతగానో ఆకట్టుందని ఆమె తెలిపింది.తాజాగా KL రాహుల్ ఓ అండర్ వేర్ యాడ్‌లో నటించాడు. ఆ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్‌గా కొనసాగుతున్నాడు. అయితే సాధారణంగా క్రికెటర్లు ఇలాంటి యాడ్స్ చేయడానికి పెద్దగా ముందుకురారు. కానీ రాహుల్ మాత్రం స్టార్ ప్లేయర్ అయినప్పటికీ కొత్త సంప్రదాయానికి నాంది పలికాడు. ఇదే విషయం ఇప్పుడు కస్తూరిని ఎంతగానో…
అంచనాలు లేకుండా వచ్చి గుజరాత్ టైటాన్స్ ఎలా అదరగొట్టింది?పెద్ద టీమ్ లు ఎందుకు విఫలమయ్యాయి? ఐపీఎల్ క్రేజ్ క్రమంగా తగ్గుతోందా?ఫిక్సింగ్ వార్తల్లో నిజమెంత?క్రికెట్ పండగ కళ తప్పిందా? రెండున్నర నెలలుగా క్రీడాభిమానుల్ని అలరించిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2022 15వ సీజన్ అద్భుతమైన వేడుకగా ముగిసింది. ఫైనల్ మ్యాచ్ చూసేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్టేడియానికి వచ్చారు. ఫైనల్ ఈవెంట్ వేడుకల్లో మ్యూజిక్ మ్యాస్ట్రో ఏఆర్ రెహమాన్, బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్ పాల్గొన్నారు మ్యాచ్…
గత రాత్రి జరిగిన రెండో క్వాలిఫయర్ మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుపై రాజస్థాన్ రాయల్స్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించి ఫైనల్స్‌కు అర్హత సాధించింది. ఈసారి కూడా అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్ విభాగాల్లో దారుణంగా విఫలమైన బెంగళూరు ట్రోఫీ కల నెరవేర్చుకోకుండానే ఇంటి ముఖం పట్టింది. రజత్ పటీదార్ మరోమారు ఆపద్బాంధవుడిగా మారడంతో తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు.. రాజస్థాన్ ఎదుట 158 పరుగుల లక్ష్యాన్ని రాజస్థాన్ ముందు ఉంచింది. అయితే.. రాజస్థాన్ ఓపెనర్…
అగ్రదేశం అమెరికాలో క్రికెట్ ప్రేమికులు క్రమంగా పెరుగుతున్నారు. దీంతో అమెరికాలో క్రికెట్ అభివృద్ధికి ఐసీసీ చర్యలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో 2024 టీ20 ప్రపంచకప్ పోటీలకు వెస్టిండీస్‌తో పాటు అమెరికా కూడా ఆతిథ్యమిస్తోంది. మరోవైపు అమెరికాలో ఐపీఎల్ తరహాలో టీ20 లీగ్ నిర్వహించబోతున్నారు. దీనికి మేజర్ క్రికెట్ లీగ్ అని నామకరణం కూడా చేశారు. ఈ లీగ్ కోసం 120 మిలియన్ డాలర్లు సేకరించాలని నిర్వాహకులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటికే 44 మిలియన్ డాలర్లను పోగుచేశారు. మిగిలిన…
కీలకమైన మ్యాచ్ లో సన్ రైజర్స్ బ్యాటర్లు చెలరేగారు. సెమస్ అవకాశాలు సజీవంగా ఉంచుకోవాలంటే ఖచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్ లో మెరుపులు మెరిపించారు. ముంబై ముందు కొండంత లక్ష్యాన్ని ఉంచారు. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ముంబై బౌలర్లకు చుక్కలు చూపించారు సన్ రైజర్స్ బ్యాటర్లు. 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 193 పరుగులు సాధించారు. ఫలితంగా ముంబై ముందు 194 పరుగుల భారీ టార్గెట్ పెట్టారు. సన్ రైజర్స్ బ్యాటర్లలో ప్రియంగార్గ్, త్రిపాఠి, నికోలస్…
మరో రసవత్తర పోరుకు రంగం సిద్ధమైంది. ఈ రోజు ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య ఆసక్తికరపోరు జరుగనుంది. హైదరాబాద్ తన సెమిస్ ఆశలను పదిలంగా ఉంచుకోవాలంటే తప్పనిసరిగా ముంబైపై విజయం సాధించాలి. ఇదిలా ఉంటే ఇప్పటికే ముంబై ఇండియన్స్ ఈ సీజన్ లో ఘోరంగా విఫలం అవుతోంది. ఈ రెండు జట్ల మధ్య వాంఖడే స్టేడియం, ముంబై వేదికగా మ్యాచ్ జరుగబోతోంది. టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ ఫీల్డింగ్ ఎంచుకున్నారు. దీంతో…
ఆస్ట్రేలియా క్రికెట్లో పెను విషాదం నెలకొంది. ఆ జట్టు దిగ్గజం, మాజీ క్రికెటర్ ఆండ్రూ సైమండ్స్(46) రోడ్డుప్రమాదంలో మరణించాడు. టౌన్స్‌విల్లేలో జరిగిన కారు ప్రమాదంలో అతడు ప్రాణాలు కోల్పోయాడు. ఇటీవల ఆసీస్ స్పిన్ దిగ్గజం షేన్ వార్న్ గుండెపోటుతో మృతి చెందగా.. ఇప్పుడు సైమండ్స్ రోడ్డుప్రమాదంలో మరణించడంతో ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్భ్రాంతికి గురైంది. ఆసీస్ జట్టులో కీలక ఆటగాడిగా ఎదిగిన సైమండ్స్ 2012లో అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. సైమండ్స్ 26 టెస్టులు ఆడి 1,462 పరుగులు…
ఈసారి ఐపీఎల్ లో అనూహ్య ఫలితాలు కనిపిస్తున్నాయి. సీజన్లోకి ప్రవేశించిన జట్లు విలక్షణ ఫలితాలతో అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఐపీఎల్ మొదలైన నాటి నుంచి ఏ సీజన్లో కూడా ఒక జట్టు తొలి 9 మ్యాచ్‌లలో 8 విజయాలు సాధించిన చరిత్ర లేదు. కానీ ఈసారి గుజరాత్ టైటాన్స్ తన సత్తా చాటింది. మరోసారి సమష్టి ప్రదర్శనతో చక్కటి ఆటతీరు కనబర్చిన గుజరాత్ వరుసగా ఐదో విజయాన్ని అందుకుని వాహ్ వా అనిపించింది. తొలి మూడు మ్యాచ్‌లు గెలిచాక…
వరుస విజయాలతో ఐపీఎల్ 2022లో తన సత్తా చాటుకుంటోంది సన్ రైజర్స్ హైదరాబాద్. ఆదివారం ఐపీఎల్ మెగా లీగ్‌లో భాగంగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఘన విజయం సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్‌కు ఎదురుదెబ్బ తగిలింది. పంజాబ్ నిర్దేశించిన లక్ష్యాన్ని 18.5 ఓవర్లలోనే ఛేదించి 7 వికెట్ల తేడాతో గెలుపొంది తనకు తిరుగులేదని నిరూపించింది. పంజాబ్ నిర్దేశించిన 152 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సన్‌రైజర్స్ బ్యాటర్లు అభిషేక్…
ఐసీసీ మహిళల ప్రపంచకప్‌లో భాగంగా ఇవాళ కీలక మ్యాచ్ ఆడుతోంది భారత మహిళల జట్టు.. ఇప్పటికే రెండు మ్యాచ్‌ల్లో ఓడి 4 పాయింట్లతో 4వ స్థానంలో ఉన్న మిథాలీ సేన.. వరుస విజయాలతో జోరుమీదున్న ఆస్ట్రేలియా జట్టుతో తలపడుతోంది.. ఇక, టాప్ 4లో స్థానం దక్కాలంటే మాత్రం.. ఈ మ్యాచ్‌లో భారత జట్టు తప్పనిసరిగా విజయం సాధించాలి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా… టీమిండియాకు బ్యాటింగ్ అప్పగించింది. ఈ సిరీస్‌లో ముందుకు సాగాలంటే.. ఈ మ్యాచ్…