India Playing XI: అభిషేక్ విషయంలో కోచ్, కెప్టెన్ సంచలన నిర్ణయం.. టీమిండియా తుది జట్టు ఫిక్స్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India Playing XI Prediction: రేపే టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్. న్యూజిలాండ్‌తో పోరుకు భారత్ సిద్ధమైంది. గుజరాత్‌లోని అహ్మదాబాద్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. అయితే.. ఈ మ్యాచ్‌లో ఓపెనర్ అభిషేక్ శర్మపై అందరి దృష్టి ఉంది. ఈ మ్యాచ్‌లో అభిషేక్‌ను ఉంచుతారా? లేదా? తొలగిస్తారా? అనే అంశంపై జోరుగా చర్చ జరుగుతోంది. అయితే.. టోర్నమెంట్ మొత్తం అభి ప్రదర్శన నిరాశ కలిగించినప్పటికీ జట్టు నిర్వహణ మాత్రం అతనిపై నమ్మకం కోల్పోలేదని తెలుస్తోంది. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో జట్టులో ఎలాంటి మార్పులు చేసేందుకు కోచ్, కెప్టెన్, మేనేజ్‌మెంట్ ఇష్టపడటం లేదని సమాచారం. వాస్తవానికి.. టోర్నమెంట్ ప్రారంభమైనప్పుడు పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉండేది. మొదట్లో అభిషేక్ శర్మ భారత ఓపెనింగ్ బ్యాటింగ్‌కు ప్రధాన బలం అవుతాడని అందరూ భావించారు. మరోవైపు సంజూ స్థానంపై అనేక సందేహాలు వ్యక్తమయ్యాయి. ఈ టోర్నమెంట్ సంజూపై ఆశలు తక్కువగానే ఉన్నాయి. అయితే వెస్టిండీస్‌తో జరిగిన కీలక మ్యాచ్ తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. సంజూ శాంసన్ స్థిరంగా ఆడుతూ విమర్శకుల నోర్లు మూయించగా, మరోవైపు అభిషేక్ శర్మ ఫామ్‌పై ప్రశ్నలు మరింత పెరిగాయి. ప్రారంభంలో శామ్సన్ గురించి చర్చలు జరిగితే, ఇప్పుడు మాత్రం టోర్నమెంట్ చివరి దశకు వచ్చేసరికి అభిషేక్ శర్మ నిరాశాజనక ప్రదర్శనే ప్రధాన చర్చగా మారింది.
READ MORE: Srinath Maganti : యానిమల్ సోట్ లో.. రణ్‌బీర్ తిట్టిన బూతులు.. ఎప్పటికి మర్చిపోలేను..
Also Read
- Aamir Khan: రాజ్ ఠాక్రే ఇంటికి అమీర్ ఖాన్.. మేనల్లుడు ఇమ్రాన్ ఖాన్ కోసమేనా?
- AP Municipal Elections: ఏపీలో ముగిసిన మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల పర్వం..
- Donald Trump: ఫ్రాన్స్‌లో అల్లర్లు.. వలసదారులే కారణమన్న ట్రంప్, ‘సరిహద్దులు మూసేయండి’ అంటూ పిలుపు!
- Kiren Rijiju: ‘‘బంగ్లాదేశ్-ఫ్రాన్స్ తరహాలో భారత్‌లో కుట్ర’’.. సోరోస్ ప్లాన్ పనిచేయదన్న కిరెన్ రిజిజు..
విధ్వంసకర బ్యాట్స్‌మెన్‌గా పేరొందిన అభిషేక్ ఈ టోర్నమెంట్‌లో రాణించలేకపోయాడు. గత ఆరు మ్యాచ్‌ల్లో అభి చేసిన పరుగులు చూస్తే పరిస్థితి స్పష్టంగా తెలుస్తుంది. వరుసగా 0, 0, 0, 15, 10, 9 పరుగులు మాత్రమే చేశాడు. జింబాబ్వేపై చేసిన అర్ధశతకం తప్ప ఈ టోర్నమెంట్‌లో చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఏదీ లేదు. అయినా తుది పోరు సమీపిస్తున్న సమయంలో ఓపెనింగ్ జంటను మార్చే ఆలోచన జట్టు నిర్వహణలో లేదని సమాచారం. ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్ తర్వాత కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఇద్దరూ అభిషేక్ శర్మపై పూర్తి నమ్మకం ఉందని చెప్పారు. అశ్విన్ లాంటి కొంత మంది మాజీ ప్లేయర్స్ సైతం అభిషేక్‌కు మద్దతు ప్రకటిస్తున్నారు. ఈ మ్యాచ్‌లో అవకాశం కల్పించాలని.. అభిషేక్‌ను ఒత్తిడికి దూరంగా పెడితేనే మంచి ఫలితం వస్తుందని చెబుతున్నారు. అంతేకాదు.. అభిషేక్ న్యూజిలాండ్ బౌలర్లను గతంలో సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు. ఇప్పుడు కూడా అదే ఫామ్ కొనసాగిస్తాడనే నమ్మకం ఉంది.
- భారత్ (ప్లేయింగ్ XI) అంచనా: అభిషేక్ శర్మ, సంజూ శాంసన్(w), ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్(c), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చకరవర్తి, జస్ప్రీత్ బుమ్రా.
తాజావార్తలు
-
Aamir Khan: రాజ్ ఠాక్రే ఇంటికి అమీర్ ఖాన్.. మేనల్లుడు ఇమ్రాన్ ఖాన్ కోసమేనా?
-
Income Tax Jobs 2026: 10th, ఇంటర్ అర్హతతో.. ఆదాయపు పన్ను శాఖలో ట్యాక్స్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్, MTS పోస్టులు
-
AP Municipal Elections: ఏపీలో ముగిసిన మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల పర్వం..
-
TDP : గుంటూరు మేయర్ పీఠంపై టీడీపీ ఫోకస్.. బరిలోకి లక్ష్మీ అపర్ణ..
-
Dharman: సంక్రాంతి బరి నుంచి తప్పుకున్న సూపర్ స్టార్.. ‘ధర్మన్’ రిలీజ్ ఎప్పుడంటే?
ట్రెండింగ్
-
Ayudha Pooja : ఆయుధ, సరస్వతీ పూజలకు ఇల్లు సిద్ధమవుతోందా?.. ఈ సింపుల్ టిప్స్‌తో మెరిపించేయండి!
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!