టెస్టులు, వన్డేలతో మెల్లగా సాగుతున్న క్రికెట్ లో ఐపీఎల్ సునామీలా వచ్చింది..ఆటను బిజినెస్‌గా మార్చటం ఎలాగో చూపింది.. వేల కోట్ల రెవెన్యూ జెనరేట్ చేసి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది.ఒక్క మాటలో చెప్పాలంటే, ఐపీఎల్ ఓ ట్రెండ్ సెట్టర్. అందుకే ఇప్పుడు ఐపీఎల్ ప్రసారహక్కుల వేలం సంచలనంగా మారింది..బీసీసీఐ ఖజానాలోకి వేల కోట్లు వచ్చిపడ్డాయంటే, ఐపీఎల్ ఎంత సక్సెస్ అయిందో అర్థం చేసుకోవచ్చు. ఐపీఎల్ అంటే నిన్నటిదాకా పరుగుల వర్షం. సిక్సుల సునామీ.. ధనాదన్ మ్యాచ్ లు, ఉత్కంఠరేపే పోరు.…
భారత పర్యటనను దక్షిణాఫ్రికా జట్టు తెగ ఆస్వాదిస్తోంది. ఏ మాత్రం పసలేని భారత బౌలింగ్ ను సునాయాసంగా ఎదుర్కొంటూ వరుసగా రెండు టీ20ల్లో విజయ దుందుభి మోగించింది. తొలి టీ20లో భారత్ 200పైన స్కోరు చేస్తే దక్షిణాఫ్రికా బ్యాటర్లు ఊది పారేశారు. రెండో టీ20లో మనోళ్లు 150 కూడా చేయలేదు.. అంతేకాదు ఆరంభంలోనే 3 వికెట్లు తీసి ప్రత్యర్థిని ఒత్తిడిలో నెట్టారు.. గెలుపుపై ఆశలు రేపారు. కానీ ఆఖరికి ఫలితంలో ఎలాంటి మార్పు లేదు. మళ్లీ గెలిచింది…
తొలి టీ20లో భారత్ 200పైన స్కోరు చేస్తే దక్షిణాఫ్రికా బ్యాటర్లు ఊది పారేశారు. రెండో టీ20లో మనోళ్లు 150 కూడా చేయలేదు.. అంతేకాదు ఆరంభంలోనే 3 వికెట్లు తీసి ప్రత్యర్థిని ఒత్తిడిలో నెట్టారు.. గెలుపుపై ఆశలు రేపారు. కానీ ఆఖరికి ఫలితంలో ఎలాంటి మార్పు లేదు. మళ్లీ గెలిచింది దక్షిణాఫ్రికానే. ఒత్తిడిలోనూ ధాటిగా ఆడిన సఫారీ బ్యాటర్లు భారత్‌కు వరుసగా రెండో ఓటమి రుచి చూపించారు. టీమిండియాకు వరుసగా రెండో ఓటమి ఎదురైన నేపథ్యంలో కెప్టెన్ రిషభ్…
ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ కన్నా భారత టీ20 లీగ్‌కే ఎక్కువ ఆదాయం సమకూరుతుందని బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ అన్నారు. తాజాగా ఇండియా లీడర్షిప్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్న అతడు భారత టీ20 లీగ్ గురించి, టీమ్ఇండియాలో తన కెప్టెన్సీ గురించి మాట్లాడాడు. తాను ఎంతగానో ఇష్టపడే క్రికెట్ చాలా అభివృద్ధి చెందిందంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ ఆట ఎంత అభివృద్ధి చెందిందో తాను కళ్లారా చూశానని సౌరభ్ గంగూలీ వెల్లడించారు. తనలాంటి క్రికెటర్లు ఇక్కడ…
టీమిండియా జట్టుకు గాయాలు, వైఫల్యాలతో కొంత కాలం పాటు దూరమైన హార్థిక్ పాండ్యా.. దక్షిణాఫ్రికాతో సిరీస్ తో మళ్లీ చోటు సంపాదించుకున్నాడు. గతేడాది టీ20 ప్రపంచకప్ తర్వాత టీమ్ఇండియాలో చోటు కోల్పోయి తిరిగి బలంగా వచ్చాడు ఈ ఆల్‌రౌండర్. అయితే అందుకోసం ఎన్నో త్యాగాలు చేసినట్లు చెప్పొకొచ్చాడు పాండ్యా. జట్టుకు దూరమైనప్పుడు తాను చేసిన కృషి.. తనకు ఇటీవలి విజయాల కంటే ఎక్కువ ఆనందాన్నిచ్చినట్టు చెప్పాడు. గుజరాత్ టైటాన్స్ కెప్టెన్‌గా వచ్చిన అవకాశాన్ని పాండ్యా పూర్తిగా సద్వినియోగం…
దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో భారత్ ఓటమిపాలైంది. టీమ్ఇండియాపై దక్షిణాఫ్రికా ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని సౌతాఫ్రికా మూడు వికెట్లు కోల్పోయి 19.1 ఓవర్లలో ఛేదించింది. తొలి టీ20 మ్యాచ్ లో భారత్ పై దక్షిణాఫ్రికా ఏ మాత్రం ఒత్తిడి లేకుండా సునాయాసంగా గెలిచేసింది. దక్షిణాఫ్రికా విజయంలో ప్రధానంగా మిల్లర్, రస్సీ వాండర్ డుసెన్…
న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ కరోనా బారిన పడ్డారు. ఇంగ్లాండ్‌తో రెండో టెస్టుకు ముందు నిర్వహించిన కరోనా పరీక్షల్లో అతడికి కొవిడ్ సోకినట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో నాటింగ్హమ్ వేదికగా జరగనున్న టెస్ట్ మ్యాచ్‌కు కేన్ దూరం కానున్నాడు. కరోనా బారిన పడటంతో కేన్ ఐదు రోజులపాటు ఐసోలేషన్‌లో ఉండనున్నాడు. దీంతో అతడికి రీప్లేస్‌మెంట్‌గా హమిష్ రూథర్‌ఫర్డ్‌ను జట్టులోకి తీసుకున్నారు. Markram: దక్షిణాఫ్రికా స్టార్ బ్యాటర్ మార్క్రమ్కు కొవిడ్ కేన్‌కు కొవిడ్ సోకడంతో మూడు టెస్టుల సిరీస్‌లో…
మొదట్లో కాస్త చప్పగా సాగిన మ్యాచులు , తరువాత ఊపందుకొని చివరి మ్యాచ్ వరకు ఎవరు ప్లే ఆఫ్స్ కి చేసురుకుంటారని తెలియని ఒక ఉత్కంఠతో మొత్తానికి IPL 15వ సా సీజన్ ఘనంగా ముగిసింది. సీనియర్ ఆటగాళ్ల ప్రదర్శన ఆకట్టుకోలేకపోయిన, యువ ఆటగాళ్లు మాత్రం వారి స్థాయికి మించి ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. భారత జట్టుకు ఎవరిని సెలెక్ట్ చేయాలనీ అందరిని ఒక డైలమాలో పడేసారు . మొత్తానికి BCCI సెలక్షన్ కమిటీకి పెద్ద పరీక్షే పెట్టారు.…
పసికూన జట్టు అనే స్థాయి నుండి అగ్ర జట్లను సైతం ముచ్చెమటలు పట్టించే స్థాయికి ఎదిగింది బంగ్లాదేశ్ జట్టు. అలాంటి బంగ్లాదేశ్ క్రికెట్లో ఉన్నట్టుండి ఇప్పుడు ప్రకంపనలు చెలరేగాయి. ఉన్నట్టుండి ఆ జట్టు టెస్ట్ కెప్టెన్ మోమినుల్ హక్ రాజీనామా ప్రకటించడం ఆ దేశ క్రికెట్ వర్గాల్లో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. మోమినుల్ హక్ ఈ సంవత్సరంలో పేలవమైన ఫామ్ కనబర్చుతున్నాడు. తన బ్యాటింగ్‌పై దృష్టి పెట్టడానికి అతను మంగళవారం టెస్ట్ కెప్టెన్సీ నుంచి వైదొలగుతున్నట్లు ప్రకటించాడు.…
IPL 2022 సీజన్ లో మునుపెన్నడూ లేని విధంగా ముంబై జట్టు అత్యంత ఘోరంగా విఫలమైంది. వరుసగా ఎనిమిది ఓటములను మూటగట్టుకొని పాయింట్ల పట్టికలో లాస్ట్ నుండి ఫస్ట్ ప్లేస్ లో నిలిచింది. అసలు ఇది ముంబై జట్టేనా, ఐదు సార్లు టైటిల్ గెలిచినా జట్టేనా అన్నట్లు ఆడింది. రోహిత్ శర్మ, పోలార్డ్ ,ఇషాంత్ కిషన్ ,బుమ్రా లాంటి స్టార్ ఆటగాళ్లు ఉన్నప్పటికీ కనీసం వల్ల స్థాయికి తగ్గట్టు కూడా ఆడకపోవడంతో IPL చరిత్రలోనే ముంబై జట్టు…