మొదట్లో కాస్త చప్పగా సాగిన మ్యాచులు , తరువాత ఊపందుకొని చివరి మ్యాచ్ వరకు ఎవరు ప్లే ఆఫ్స్ కి చేసురుకుంటారని తెలియని ఒక ఉత్కంఠతో మొత్తానికి IPL 15వ సా సీజన్ ఘనంగా ముగిసింది. సీనియర్ ఆటగాళ్ల ప్రదర్శన ఆకట్టుకోలేకపోయిన, యువ ఆటగాళ్లు మాత్రం వారి స్థాయికి మించి ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. భారత జట్టుకు ఎవరిని సెలెక్ట్ చేయాలనీ అందరిని ఒక డైలమాలో పడేసారు . మొత్తానికి BCCI సెలక్షన్ కమిటీకి పెద్ద పరీక్షే పెట్టారు.
ఇక అంతర్జాతీయ సిరీస్ లపై BCCI ఫోకస్ చేసింది. ఇందులో భాగంగా జూన్ 9 నుంచి దక్షిణాఫ్రికా తో ఐదు మ్యాచ్ ల T20 సిరీస్ టీమిండియా ఆడనుంది. ఢిల్లీ వేదికగా ఈ నెల 9న తొలి T20 జరగనుండగా.. అనంతరం రెండో T20 ఒడిశాలోని కటక్ వేదికగా జరుగుతుంది. ఇందుకోసం అక్కడి బారాబతి స్టేడియాన్ని సిద్ధం కూడా చేస్తున్నారు.
అయితే రెండో టి20 మ్యాచ్ ను జరపకూడదంటూ సంజయ్ నాయక్ అనే వ్యక్తి ఒడిషా హైకోర్టులో PIL ను దాఖలు చేశాడు. బారాబతి స్టేడియం 44 వేల సీటింగ్ కెపాసిటీతో ఉన్నట్లు పేర్కొన్న అతడు.. అందులో ఫైర్ సేఫ్టీ విషయంలో లోపాలు ఉన్నట్లు పేర్కొన్నాడు. మ్యాచ్ జరిగే సమయంలో అగ్ని ప్రమాదం జరిగినట్లు అయితే ప్రత్యక్షంగా చూడటానికి వచ్చిన ప్రేక్షకుల భద్రతలకు ముప్పు పొంచి ఉందని తన వ్యాజ్యంలో సంజయ్ పేర్కొన్నాడు.
జూన్ 12వ తేదీన కటక్ వేదికగా భారత్, సౌతాఫ్రికా మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో కోర్టు ఏ విధమైన తీర్పును ఇస్తుందో అని క్రికెట్ ఫ్యాన్స్ లో ఆసక్తి నెలకొని ఉంది. ఈ సిరీస్ కోసం సౌతాఫ్రికా జట్టు ఇప్పటికే ఢిల్లీకి చేరుకోగా..భారత ఆటగాళ్లు రేపు ఢిల్లీలో సమావేశం కానున్నారు. ఇక తొలి T20 ఈ నెల 9న ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్ల మైదానంలో జరగనుంది.