సౌతాఫ్రికా గడ్డపై టెస్ట్ సిరీస్ కోల్పోయిన టీమిండియా… ఇవాళ్టి నుంచి వన్డే సిరీస్ వేట మొదలుపెట్టబోతోంది. మూడు వన్డేల సిరీస్‌కు సిద్ధమైంది. ఇవాళ్టి నుంచి మొదలయ్యే వన్డేల్లో నెగ్గి.. సిరీస్‌ను గెలవాలన్న కసితో ఉంది. వన్డే జట్టు కెప్టెన్‌గా పగ్గాలందుకున్న కేఎల్ రాహుల్.. ఓపెనర్‌గా బరిలోకి దిగబోతున్నాడు. ఈ విషయాన్ని రాహులే స్వయంగా ప్రకటించాడు. వన్డేల్లో ఎప్పుడూ 4 లేదా ఐదో స్థానంలో బరిలోకి దిగే రాహుల్… గాయం కారణంగా రోహిత్ శర్మ సిరీస్‌కు దూరం కావడంతో……
దేశంలో కరోనా కేసులు ఉగ్రరూపం దాల్చుతున్నది. కేసులు భారీ స్థాయిలో నమోదవుతున్నాయి. కేసులు పెరుగుతున్న దృష్ట్యా ఢిల్లీలో నైట్‌కర్ఫ్యూ, వీకెండ్ కర్ఫ్యూలు అమలు చేస్తున్నారు. శుక్రవారం రాత్రి 10 గంటల నుంచి సోమవారం ఉదయం 5 గంటల వరకు ఈ వీకెండ్ కర్ఫ్యూ అమలులో ఉంటుంది. అయితే, వీకెండ్ కర్ఫ్యూకు సంబంధించిన ఎలాంటి సందేహాలు ఉన్నా ట్విట్టర్ ద్వారా సమాధానాలు ఇస్తున్నారు పోలీసులు. అత్యవసరమైతే తప్పించి బయటకు రావొద్దని ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. మాస్క్ ధరించడంతో…
సౌతాఫ్రికా పర్యటనలో ఉన్న టీమిండియా.. ఆ గడ్డపై తొలిసారి టెస్ట్ సిరీస్ గెలిచి సత్తా చాటాలన్న పట్టుదలతో ఉంది.. మూడు టెస్ట్‌ల సిరీస్‌లో 1-1 తేడాతో రెండు జట్లు సమానంగా ఉండగా.. ఇవాళ కేప్‌టౌన్ వేదికగా మధ్యాహ్నం 2 గంటలకు భారత్-సౌతాఫ్రికా మధ్య చివరి టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ టెస్ట్ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ ఆడనుండడం భారత్‌కు కలిసివచ్చే అవకాశంగా చెప్పుకోవాలి.. అయితే, కండరాల గాయంతో మూడో టెస్ట్‌కు సిరాజ్ దూరం అయ్యాడు.. సిరాజ్…
సఫారీ గడ్డపై సౌతాఫ్రికాతో జరుగుతున్న మూడు టెస్టుల సిరీస్ ను గెలిచి చరిత్ర సృష్టించాలనుకున్న భారత్‌కు రెండో టెస్టులో ఎదురుదెబ్బ తగిలింది. మొదటి టెస్టులో విజయం సాధించిన భారత్ రెండో టెస్టులో అదే దూకుడును ప్రదర్శించాలని చూసింది. రెండో టెస్టులో మొదటి ఇన్నింగ్స్‌లో 202 పరుగులకే ఆలౌట్ అయింది. అయితే సౌతాఫ్రికా జట్టు కూడా మొదటి ఇన్నింగ్స్‌లో కేవలం 229 పరుగులు మాత్రమే చేసింది. రెండో ఇన్నింగ్స్‌లో ఇండియా 266 పరుగులకే అలౌట్ అయింది. 243 పరుగుల…
టీమిండియా క్రికెటర్ హర్భజన్ సింగ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అంతర్జాతీయ క్రికెట్ కు టీమిండియా ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ వీడ్కోలు పలికారు. అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు కాసేపటి క్రితమే ఈ ప్రకటన చేశారు హర్భజన్ సింగ్. తన 23 సంవత్సరాల క్రికెట్ కెరీర్ లో తనకు సహకరిస్తూ… అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి స్పెషల్ థాంక్స్ చెప్పాడు హర్భజన్ సింగ్. ఈ మేరకు తన ట్విట్టర్ వేదికగా ఓ ఎమోషనల్ ట్వీట్ చేశాడు.…
టీమ్ఇండియా యువ క్రికెటర్ రిషభ్ పంత్‌కు అరుదైన గౌరవం దక్కింది. క్రీడలు, మానసిక ఆరోగ్యంపై యువతకు అవగాహన కల్పించేందుకు ఉత్తరాఖండ్ ప్రభుత్వం బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించింది. ప్రస్తుతం దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్న రిషభ్‌పంత్‌తో ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ వీడియో కాల్లో మాట్లాడారు. రాష్ట్ర యువతను క్రీడల్లో ప్రోత్సహించేందుకు బ్రాండ్ అంబాసడర్‌గా నియమిస్తున్నట్లు చెప్పారు. ఇక దీనిపై కీపర్ రిషబ్ పంత్ కూడా తన స్టైల్ లో స్పందించారు. ఇలాంటి గౌరవం దక్కడం తనకు చాలా ఆనందంగా…
ఎప్పుడూ రాజకీయాలు.. ఎన్నికలు.. ఆర్థిక మంత్రిత్వ శాఖ లెక్కలే కాదు కాస్త ఆటలు కూడా ఆడాలంటున్నారు మంత్రి హరీష్ రావు. పైగా ఆయనిప్పుడు వైద్యారోగ్యశాఖ మంత్రి కూడా ఫిట్ గా వుండడానికి క్రికెట్ ఆడారు. బ్యాట్ పట్టుకుని కొద్దిసేపు మెరుపులు మెరిపించారు. గతంలోనూ ఆటవిడుపుగా క్రికెట్ ఆడిన సందర్భాలున్నాయి. రాష్ట్రంలో వైద్యారోగ్యశాఖను గాడిన పెట్టే పనిలో బిజీగా వున్న హరీష్ రావు క్రికెట్ ఆడడం ద్వారా సరదాగా గడిపారు.
అభిమానులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న 2028 ఒలంపిక్స్‌లో తమ అభిమాన ఆట జెంటిల్మెన్ గేమ్‌గా ప్రసిద్ధి పొందిన క్రికెట్‌కు ఈ సారి కూడ నిరాశే ఎదురయింది. ఒలంపిక్స్లోక్రికెట్ చూడాలని ప్రతి ఒక్క అభిమాని కోరుకుంటాడు. గతంలో 10 ఓవర్ల క్రికెట్‌కు ఒలంపిక్ సంఘంతో పాటు బీసీసీఐ కూడా అంగీకరించింది. కానీ తాజాగా 2028 లాస్ ఏంజెల్స్‌లో జరిగే ఒలంపిక్స్‌లో క్రికెట్‌కు చోటు ఉంటుందని అనుకున్నారు. ఒలంపిక్స్‌కు ఎంపిక చేసిన 28 క్రీడల ప్రాథమిక జాబితాలో క్రికెట్తోసహా…
మహిళల క్రికెట్ జట్టులో మిథాలీ రాజ్ తర్వాత కెప్టెన్ ఎవ్వరూ అనే చర్చ మొదలైంది. మిథాలీ స్థానంలో స్మృతీ మంధానను నియమించాలన్న డిమాండ్లు పెరుగుతున్నాయి. వచ్చే ఏడాది న్యూజిలాండ్‌తో జరగనున్న వన్డే ప్రపంచ కప్ అనంతరం మిథాలీ రాజ్ రిటైర్మెంట్ కానుంది. ఈ నేపథ్యంలో టెస్టులు, వన్డేల్లో మిథాలీ వారసురాలిగా స్మృతీకి ఛాన్స్ ఇవ్వాలని మాజీ కెప్టెన్ శాంతా రంగస్వామి అభిప్రాయపడింది. టీ20జట్టుకు హర్మన్‌ప్రీత్‌కౌర్ నాయకత్వం వహిస్తుంది. కానీ ఆమె బ్యాటింగ్‌లో రాణించలేకపోతుందన్నారు. దీంతో మిథాలీ వారసురాలిగా…
ప్రపంచం లో ఫుట్ బాల్ తర్వాత అంత క్రేజ్ ఉన్న ఆట అంటే క్రికెట్. అయితే అటువంటి క్రికెట్ ను ఒలంపిక్స్ లో చేర్చాలి అని కామెంట్స్ అప్పుడప్పుడు వినిపిస్తూనే ఉన్నాయి. అయితే తాజాగా ఇంగ్లాండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ ఈ వ్యాఖ్యలను సమర్ధించాడు. ప్రస్తుతం అబుదాబి లో జరుగుతున్న టీ 10 లీగ్ లో ఢిల్లీ బుల్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న… మోర్గాన్ ఒలంపిక్స్ లో టీ10 ఫార్మాట్ క్రికెట్ ను చేర్చాలి అని అన్నారు.…