Jasprit Bumrah: ధోనీ, కోహ్లీ, రోహిత్‌ల కెప్టెన్సీపై బుమ్రా ఆసక్తికర వ్యాఖ్యలు..
- ధోనీ.. కోహ్లీ.. రోహిత్‌ల కెప్టెన్సీపై బుమ్రా ఆసక్తికర వ్యాఖ్యలు
- ముగ్గురు కెప్టెన్ల నాయకత్వంలో ఆడిన స్టార్ బౌలర్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహేంద్ర సింగ్ ధోనీ, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల కెప్టెన్సీపై భారత ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు. ఈ ముగ్గురు ఆటగాళ్లు జట్టుపై ప్రభావం చూపి ఆటగాళ్లను ఎలా తయారో చేశారో చెప్పాడు. ముగ్గురు కెప్టెన్ల నాయకత్వంలో ఆడిన అతికొద్ది మంది ఆటగాళ్లలో బుమ్రా కూడా ఉన్నాడు. ధోనీ కెప్టెన్సీలో అరంగేట్రం చేసిన బుమ్రా.. కోహ్లీ కెప్టెన్సీలో తనను తాను మెరుగుపరుచుకున్నాడు. అటు.. రోహిత్ నాయకత్వంలో స్వేచ్ఛగా ఆడే స్వేచ్ఛ లభించింది. రోహిత్ కెప్టెన్సీలో బుమ్రా ముంబై ఇండియన్స్‌కు కూడా ఆడిన సంగతి తెలిసిందే.
Read Also: UP video: స్కూటీపై వెళ్తుండగా యువతికి పోకిరీలు వేధింపులు.. వీడియో వైరల్
Also Read
రోహిత్ గురించి బుమ్రా ఏం అన్నాడంటే..?
ఆటగాళ్లతో భావోద్వేగ స్థాయిలో కనెక్ట్ అవుతాడని.. వారి ఆలోచలను అర్థం చేసుకుంటాడని రోహిత్‌ను ప్రశంసించాడు. రోహిత్ కెప్టెన్సీ గురించి బుమ్రా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. బ్యాట్స్‌మెన్ అయినప్పటికీ బౌలర్ల పట్ల సానుభూతి చూపే అతికొద్ది మంది కెప్టెన్లలో రోహిత్ ఒకడని అన్నాడు. రోహిత్ రిజిడ్ కాదు, రియాక్ట్ అయ్యేందుకు సిద్ధంగా ఉంటాడని తెలిపాడు.
ధోనితో తన అనుభవాలు
2011 ప్రపంచ కప్‌తో సహా అనేక చిరస్మరణీయ విజయాలను భారత్‌కు అందించిన ధోనీ కెప్టెన్సీలో బుమ్రా తన అనుభవాలను కూడా పంచుకున్నాడు. తనకు ధోనీ చాలా భద్రత కల్పించాడని తెలిపాడు. అతను తన ప్రవృత్తిపై గొప్ప విశ్వాసాన్ని కలిగి ఉంటాడన్నాడు. ఓవర్ ప్లానింగ్‌ను నమ్మడని చెప్పాడు. ఆ నమ్మకమే అతనిని అంతర్జాతీయ స్థాయిలో రాణించిందని బుమ్రా పేర్కొన్నాడు.
కోహ్లీ ఇప్పటికీ నాయకుడిగా ఉన్నాడు
కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్న తర్వాత కూడా జట్టు ఫిట్‌నెస్ ప్రమాణాలను మార్చడానికి.. తన నాయకత్వ ఉనికిని కొనసాగిస్తునందుకు కోహ్లీని బుమ్రా కొనియాడాడు. విరాట్ శక్తివంతంగా, ఉద్వేగభరితంగా, దూకుడుగా ఉంటాడని బుమ్రా చెప్పాడు. కోహ్లీ ఇప్పుడు కెప్టెన్ కాదు కానీ.. ఇప్పటికీ నాయకుడిగా కొనసాగుతున్నాడని బుమ్రా తెలిపాడు.
బౌలర్లకు నాయకత్వ సామర్థ్యాలు ఉన్నాయి
బుమ్రా భారత టెస్ట్, టీ20 జట్లకు కూడా కెప్టెన్‌గా వ్యవహరించాడు. బౌలర్‌లకు ప్రత్యేకమైన నాయకత్వ సామర్థ్యాలు ఉన్నాయని తన నమ్మకాన్ని వ్యక్తం చేశాడు. తన కెప్టెన్సీ గురించి బుమ్రా మాట్లాడుతూ.. ‘బౌలర్లు తెలివైనవారని నేను భావిస్తున్నాను. ఎందుకంటే వారు బ్యాట్స్‌మెన్‌లను అవుట్ చేస్తారు. మనం మ్యాచ్‌లు ఓడిపోయినప్పుడు సాధారణంగా బ్యాట్స్‌మెన్‌పై నిందలు వేస్తారు. కాబట్టి ఇది కష్టమైన పని. కపిల్ దేవ్, ఇమ్రాన్ ఖాన్, వసీం అక్రమ్ మరియు వకార్ యూనిస్ వంటి కెప్టెన్లు కూడా బౌలర్లేనని తెలిపాడు. కపిల్ దేవ్ భారత్ కు ప్రపంచకప్ అందించాడు అని అన్నాడు. ఇమ్రాన్ ఖాన్ పాకిస్థాన్‌కు ప్రపంచకప్ అందించాడు. అందుకే బౌలర్లు తెలివైనవారని జస్ప్రీత్ బుమ్రా చెప్పాడు.
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?