MS Dhoni: ధోనీని ‘తల ఫర్ ఎ రీజన్’ అని ఎందుకు పిలుస్తారు?.. దాని వెనుక కథను చెప్పిన మహి!
- హైదరాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఎంఎస్ ధోని
- 'తల ఫర్ ఎ రీజన్' అని ఎందుకు పిలుస్తారని అడిగిన హోస్ట్
- ఎంఎస్ ధోని సమాధానం సోషల్ మీడియాలో వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MS Dhoni Thala for a Reason : భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనిని అభిమానులు మహి, తల అని పిలుచుకుంటారు. ఎంఎస్ ధోనీ సోషల్ మీడియాలో ‘తల ఫర్ ఎ రీజన్’తో ట్రెండ్ అయ్యాడు. ఇందులో మహి అభిమానులది పెద్ద పాత్ర. ఈ సందర్భంగా ఎంఎస్ ధోని మాట్లాడుతూ.. ఏదైనా జరిగినప్పుడు సోషల్ మీడియాలో డిఫెన్స్ చేయడం అభిమానుల ప్రేమ అని చెప్పుకొచ్చారు.
సీఎస్కే మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఒక కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చారు. అక్కడ క్రికెట్‌కు సంబంధించిన అనేక ప్రశ్నలు అడిగారు. అయితే ఆ మధ్య ‘తలా ఫర్ ఏ రీజన్’ ట్రెండ్ సోషల్ మీడియాని ఊపేసింది. ఈ ట్రెండ్ గురించి తాజాగా మహీ ఈవెంట్లో స్పందించాడు. తనకూ ఇన్స్టాగ్రామ్ ద్వారానే ‘తలా ఫర్ ఏ రీజన్’ గురించి తెలిసిందని చెప్పాడు. “అది నాకే తెలియదని, ఇన్స్టాగ్రామ్ ద్వారానే తెలుసుకున్నానని ధోనీ చెప్పాడు. నేను ఇన్‌స్టాగ్రామ్‌లో లేదా సోషల్ మీడియాలో మాట్లాడాల్సిన అవసరం లేనందున నా అభిమానుల కారణంగా నేను గర్వపడుతున్నాను. ఎప్పుడు కావాలంటే అప్పుడు అభిమానులు నన్ను ఆదుకుంటారు. ఎప్పుడు కావాలంటే అప్పుడు అభిమానులు నన్ను మెచ్చుకుంటారు. కాబట్టి నేను ఏమీ చేయవలసిన అవసరం లేదు. నేను సోషల్ మీడియాలో అంత యాక్టివ్‌గా లేను కానీ నేను పోస్ట్ చేసినప్పుడల్లా నా అభిమానులకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఇదంతా అభిమానులకు నాపై ఉన్న ప్రేమ, అందులో భాగంగానే ‘తల ఫర్ ఎ రీజన్’.” అంటూ ధోనీ సమాధానమిచ్చారు.
Also Read
- AR Rahman: "ఆ ఓపిక, సమయం నాకు లేదు".. రామాయణం సాంగ్ ట్రోలింగ్‌పై ఏఆర్ రెహమాన్ రియాక్షన్..
- Arnab Cyclone Alert: 'అర్నబ్' తుపాన్ పంజా.. ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు, పాఠశాలలకు సెలవులు!
- Jio Platforms IPO: జియో ఐపీఓ అలాట్మెంట్ వచ్చేసింది.. షేర్లు అలాట్ అయ్యాయో.. లేదో.. చెక్ చేసుకోండి ఇలా..!
- Israel Elections: ఇజ్రాయెల్‌లో నేడు సార్వత్రిక ఎన్నికల పోలింగ్.. నెతన్యాహు పీఠానికి ముప్పు?
ఐపీఎల్ 2025 ఆడటంపై అనుమానమే..
ఐపీఎల్ 2025కి సన్నాహాలు ముమ్మరంగా సాగుతుండటం గమనార్హం. అదే సమయంలో సీఎస్కే మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీని ఆడడం లేదా ఆడకపోవడంపై అభిమానుల్లో సందేహం నెలకొంది. ఇదే కార్యక్రమంలో ఐపీఎల్ ఆడే అంశంపై ఇప్పుడే ఏమీ చెప్పలేనని చెప్పాడు. ప్రస్తుతం జట్టు ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకోనున్నారు.
” I am grateful for my fans, they defend me ” – MS Dhoni. 🥹❤️#MSDhoni @MSDhoni #WhistlePodu pic.twitter.com/YfWcxZ8UI7
— Dhoni Army TN™ (@DhoniArmyTN) August 1, 2024
తాజావార్తలు
-
AR Rahman: “ఆ ఓపిక, సమయం నాకు లేదు”.. రామాయణం సాంగ్ ట్రోలింగ్‌పై ఏఆర్ రెహమాన్ రియాక్షన్..
-
Arnab Cyclone Alert: ‘అర్నబ్’ తుపాన్ పంజా.. ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు, పాఠశాలలకు సెలవులు!
-
Jio Platforms IPO: జియో ఐపీఓ అలాట్మెంట్ వచ్చేసింది.. షేర్లు అలాట్ అయ్యాయో.. లేదో.. చెక్ చేసుకోండి ఇలా..!
-
Israel Elections: ఇజ్రాయెల్‌లో నేడు సార్వత్రిక ఎన్నికల పోలింగ్.. నెతన్యాహు పీఠానికి ముప్పు?
-
AP Local Body Elections: నేడు సుప్రీంకోర్టులో స్థానిక సంస్థల ఎన్నికల కేసుపై విచారణ.. కీలక ఆదేశాలపై ఉత్కంఠ!
ట్రెండింగ్
-
Sabarimala Virtual Queue Booking: అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్.. అక్టోబర్ 29 నుంచే శబరిమల వర్చువల్ క్యూ బుకింగ్స్ షురూ..!
-
IND vs NZ: సిరీస్‌పై భారత్ కన్ను.. కివీస్‌కు డూ ఆర్ డై..! నేడే మూడో టీ20.. భారత్ ప్లేయింగ్ XI ఇలా..
-
Tilak Varma: ఎంఎస్ ధోనిని వెనక్కి నెట్టిన తిలక్ వర్మ.. విరాట్ కోహ్లీ తర్వాతి స్థానంలో స్టార్ బాయ్..!
-
Winter Diet Tips : చలికాలంలో బరువు తగ్గాలా? ఈ 6 ఆహారాలతో లాభాలెన్నో.!
-
AI Chatbot Privacy: ఏఐ చాట్బాట్లలో ఈ వివరాలు షేర్ చేస్తున్నారా? జాగ్రత్త