ప్రస్తుతం క్రికెట్ లో అంతర్జాతీయ మ్యాచ్ ల కంటే తీగ్ ల పేరుతో ఆయా దేశాలు నిర్వహిస్తున్న టోర్నీ మ్యాచ్ లు ఎక్కవైపోయాయి. విరివిగా పుట్టుకొస్తున్న డొమెస్టిక్ లీగ్ ల వల్ల అంతర్జాతీయ క్రికెట్ కు ప్రమాదం పొంచి ఉందని.. దానిని కాపాడుకోవాని క్రికెట్ లో చట్టాలు చేసే మెరిల్ బోన్ క్రికెట్ క్లబ్( ఎంసీసీ) వెల్లడించింది.
మహేంద్ర సింగ్ ధోని గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేని పేరు.. క్రికెట్ చూసే వారికి మాత్రమే కాదు.. క్రికెట్ చూడని వారికి కూడా మహేంద్ర సింగ్ ధోని తెలుసు. కెప్టెన్‌గా భారత జట్టుకు అనేక ఐసీసీ ట్రోఫీలు అందజేసిన మహి.. ఇంటర్నేషనల్ క్రికెట్ కు గుడ్ బై ప్రకటించిన తర్వాత.. వ్యవసాయంపై దృష్టి పెట్టారు.
ఏపీలో కామన్ ఎంట్రన్స్ టెస్ట్‌ల తేదీలు ఇవే.. ఏపీ ఉన్నత విద్యా మండలి ప్రకటన అన్ని పరీక్షలకు సమయం దగ్గర పడుతోంది.. టెన్త్, ఇంటర్ పరీక్షలు ముగియగానే కామన్ ఎంట్రన్స్ టెస్ట్‌లు నిర్వహించేందుకు సిద్ధం అవుతున్నారు.. కామన్ ఎంట్రన్స్ టెస్ట్‌ల తేదీలను ప్రకటించింది ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి.. ఇవాళ ఈసెట్ నోటిఫికేషన్ విడుదల చేశారు.. మే 5వ తేదీన పరీక్ష నిర్వహించనున్నారు. ఈ నెల 10వ తేదీన EAPCET నోటిఫికేషన్ విడుదల కానుండగా.. మే 15 నుంచి…
సీఎం జగన్‌కు సోము వీర్రాజు లేఖ.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు మరో లేఖ రాశారు బీజేపీ ఏపీ చీఫ్ సోము వీర్రాజు.. అగ్రి గోల్డ్ బాధితుల సమస్య పరిష్కారంపై తన లేఖలో పేర్కొన్నారు.. అగ్రి గోల్డు బాధితుల పరిష్కారంపై శ్వేత పత్రం ప్రకటించాలని డిమాండ్ చేశారు.. అధికారంలోకి వచ్చిన 6 మాసాల్లో అగ్రిగోల్డు బాధితుల సమస్యలను న్యాయస్థానాల పరిధి నుండి దాటి పరిష్కరిస్తానని ఎన్నికల ముందు హామీ ఇచ్చారు. అయితే, అధికారం వచ్చి మూడున్నరేళ్లు దాటినా…
ఉద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పిన ప్రభుత్వం ఉద్యోగులకు తీపి కబురు చెప్పింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. మార్చి నెలాఖరులోగా పెండింగ్ బిల్లులు చెల్లించేందుకు అంగీకారం తెలిపింది.. ఈ నెలాఖరులోగా సుమారు రూ. 3 వేల కోట్ల మేర పెండింగ్ బిల్లులు చెల్లిస్తామని స్పష్టం చేసింది ప్రభుత్వం.. ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం జరిపిన చర్చలు ముగిశాయి.. అనంతరం మీడియాతో మాట్లాడిన ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి.. ఉద్యోగులు ప్రభుత్వంలో భాగం.. అందరూ కలిస్తేనే.. ప్రభుత్వ లక్ష్యాలను సాధించడం సాధ్యం అనే స్పృహతోనే…
గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో విదేశీ పెట్టుబడులు ఒక్కపైసా రాలేదు..! విశాఖపట్నం వేదికగా గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్(జీఐఎస్) నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెద్ద ఎత్తున పెట్టుబడులు రాబట్టింది.. ఈ మేరకు ఆయా సంస్థలతో ఎంవోయూలు కూడా కుదుర్చుకుంది.. అయితే, జీఐఎస్‌పై విపక్షాల నుంచి విమర్శలు తప్పడం లేదు.. ఈ వ్యవహారంపై స్పందించిన బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్.. శ్రీ సత్యసాయి జిల్లాలో మీడియాతో మాట్లాడుతూ.. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మెలో ఒక్క పైసా కూడా విదేశీ పెట్టుబడి రాలేదని ఆరోపించారు..…
కర్నూలులో భూప్రకంపనలు.. ఇళ్లు, సీసీ రోడ్డుకు బీటలు.. ఆంధ్రప్రదేశ్‌లో భూప్రకంపనలు కలకలం రేపుతున్నాయి.. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో భూ కంపాలు భారీ విధ్వంసాన్ని సృష్టించాయి.. టర్కీలో సంభవించిన భూకంపంతో భారీ ఆస్తి, ప్రాణనష్టం జరిగింది.. ఆ తర్వాత వరుసగా భూకంపాలు వస్తూనే ఉన్నాయి.. టర్కీలో భూకంపం తర్వాత భారత్‌లోనూ పలు ప్రాంతాల్లో ప్రకంపనలు వచ్చాయి. ఇప్పుడు కర్నూలు జిల్లాలో భూప్రకంపనల కలకలం రేపుతున్నాయి.. తుగ్గలి మండలం రాతనలో భూప్రకంపనలు వచ్చాయంటున్నారు స్థానికులు.. ఒక్కసారిగా భూ ప్రకంపనలు…
సహజ, మానవ వనరులకు కొదవలేదు.. ఏపీలో పెట్టుబడులు పెట్టండి.. నైపుణ్యం కలిగిన మానవ వనరులకు, సహజ వనరులకు కొదవలేదు.. ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టండి అంటూ పారిశ్రామిక దిగ్గజాలకు స్వాగతం పలికారు ఆంధ్రప్రదేశ్ మంత్రులు.. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ సందర్భంగా మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో పారిశ్రామికంగా పుష్కలమైన అవకాశాలు ఉన్నాయి. సంక్షేమం, అభివృద్ధి ప్రాధాన్యతనిస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలన కొనసాగిస్తున్నారు. ఏపీలో మౌలిక సదుపాయాల కల్పన వేగంగా జరుగుతోంది. రాష్ట్రంలో సీఎం జగన్ సారధ్యంలో…
పారిశ్రామిక వేత్తల చూపు.. విశాఖ వైపు.. నేటి నుంచి జీఐఎస్.. పారిశ్రామిక దిగ్గజాల చూపు.. ఇప్పుడు విశాఖపై పడింది.. విశాఖపట్నం వేదికగా గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ (జీఐఎస్)ను నిర్వహిస్తోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. నేటి నుంచి రెండు రోజుల పాటు జగనున్న ఈ సమ్మిట్ పారిశ్రామిక వర్గాల్లో కొత్త ఉత్సాహాన్ని తీసుకొచ్చింది. వచ్చే అతిథులను ఎటువంటి లోటుపాట్లు తలెత్తకుండా ఏర్పాట్లు చేసింది సర్కార్. పారిశ్రామిక వేత్తల కోసం హెలికాప్టర్లు, లగ్జరీ కార్లను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. దేశీయ…