MS Dhoni: మహేంద్ర సింగ్ ధోని గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేని పేరు.. క్రికెట్ చూసే వారికి మాత్రమే కాదు.. క్రికెట్ చూడని వారికి కూడా మహేంద్ర సింగ్ ధోని తెలుసు. కెప్టెన్‌గా భారత జట్టుకు అనేక ఐసీసీ ట్రోఫీలు అందజేసిన మహి.. ఇంటర్నేషనల్ క్రికెట్ కు గుడ్ బై ప్రకటించిన తర్వాత.. వ్యవసాయంపై దృష్టి పెట్టారు. తమ పొలంలో పుచ్చకాయ,జామ, స్ట్రాబెర్రీ, కీరచ ఆవాలు, క్యాబేజీ, క్యాప్సికమ్, అల్లం వంటి పంటలు పండిస్తున్నాడు. అంతేకాదు కడక్ నాథ్ కోళ్లను కూడా పెంచుతున్నాడు. టైం దొరికనప్పుడుల్లా ఎంఎస్ ధోని తన వ్యవసాయ క్షేత్రంలోనే గడుపుతున్నాడు.
మహేంద్ర సింగ్ ధోని తన వ్యవసాయ క్షేత్రంలోనే సొంతంగా ట్రాక్టర్ తో పొలం దున్నుతున్న ఫోటోలు గతంలో వైరల్ అయ్యాయి. ఇప్పుడు చేపల సాగుపైనా మిస్టర్ కూల్ దృష్టి పెట్టారు. రాంచీలోని ధోని ఫామ్ హౌస్ సాంబోలో ఇప్పుడు చేపలు కూడా సాగవుతున్నాయి. చేపల పెంపకం కోసం అక్కడ రెండు చెరువులను తవ్వారు. అందులో ఏడు నెలల క్రితమే చేప పిల్లలను వదిలిపెట్టారు. ఒక చెరువులో 5 వేలు.. మరో చెరువులో 3 వేలు.. మొత్తం రెండు చెరువులను కలిపి ఎనిమిది వేల చేప పిల్లలను పెంచుతున్నారు. చేపల చెరువుల పర్యవేక్షణ బాధ్యతను ప్రత్యేక బృందానికి అప్పగించారు. ఈ చేపలకు ఉదయం, సాయంత్రం మేత వేస్తారు.
Read Also: ICC World Test Championship: డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ఎవరు.. ?
రెండు చెరువుల్లో రోహు, కట్ల, తెలాపియా రకాల చేపలను మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోని పెంచుతున్నారు. ఇప్పుడవి పెరిగి పెద్దవయ్యాయి. 500గ్రా. కిలోల నుంచి కిలోన్నర వరకు బరువు పెరిగాయి. ఎంఎస్ ధోని వ్యవసాయ సలహాదారు రోషన్ కుమార్ ఈ వివరాలు వెల్లడించారు. మహికి నాన్ వెజ్ ఫుడ్ అంటే చాలా ఇష్టమని చెప్పారు. దేశీ చికెన్ తో పాటు ఫిష్ ఐటమ్స్ తినడానికి ఇస్టపడతాడని రోషన్ తెలిపారు. మహేంద్ర సింగ్ ధోని భార్య సాక్షి కూడా ఈ రెండు చెరువులపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఫామ్ హౌస్ లో కూరగాయాల సాగు, చేప పెంపకం తదితర విషయాలపై తరచూ సిబ్బంది నుంచి సాక్షి సింగ్ వివరాలు సేకరిస్తారని వెల్లడించారు.
ఎంఎస్ ధోనికి వీలు చిక్కినప్పుడల్లా వ్యవసాయ క్షేత్రంలో కలిగయ తిరుగుతూ పంటలతో పాటు కడక్ కోళ్ల ఫారమ్, చేపల చెరువులను పరిశీలిస్తున్నాడు. ప్రస్తుతం వ్యక్తిగత జీవితాన్ని ఆస్వాధిస్తున్న ఎంఎస్ ధోని.. త్వరలోనే మళ్లీ గ్రౌండ్ లోకి అడుగుపెట్టబోతున్నారు. మార్చి 31 నుంచి ఐపీఎల్ టోర్నీ ప్రారంభం కానుంది. ఎప్పటిలానే ఈసారి కూడా చెన్నై జట్టుకు ఎంఎస్ ధోని కెప్టెన్ గా వ్యవహరించబోతున్నారు. ఆయనకు ఇదే ఆఖరి ఐపీఎస్ సీజన్ అని.. ఆ తర్వాత ఐపీఎల్ కు కూడా రిటైర్మెంట్ ప్రకటించవచ్చని టాక్ వినిపిస్తుంది.