ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2023లో బెంగళూరు జట్టును ఓటములు వెంటాడుతున్నాయి. ఆ టీమ్ ఖాతా తెరవలేకపోయింది. శుక్రవారం యూపీ వారియర్స్ తో జరిగిన మ్యాచ్ లోనూ 10 వికెట్ల తేడాతో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ఈ క్రమంలో టీమ్ కెప్టెన్ స్మృతి మంధాన.. ఆర్సీబీ ఓటమికి తనదే బాధ్యత అని హాట్ కామెంట్స్ చేశారు. మ్యాచ్ తర్వాత ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. దీంతో స్మృతి మంధాన ఫ్యాన్స్ ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు.
Aslo Read : JanaSena: మేం బీసీల ఐక్యత కోరుకుంటున్నాం.. వారికి అండగా ఉంటాం..
గత నాలుగు మ్యాచ్ లుగా ఇదే కొనసాగుతుంది. ఆడిన ప్రతీ మ్యాచ్ లో మంచి ఆరంభం లభించినప్పటికీ.. ఆ తర్వాత నుంచి వికెట్లు కోల్పోతున్నామని స్మృతి మంధాన తెలిపారు. అదే మా మ్యాచ్ లపై తీవ్ర ప్రభావం చూపిస్తోందని అన్నారు. అంతే కాకుండా మా గేమ్ ప్లాన్ కూడా సరిగా లేనందున వరుసగా నాలుగు మ్యాచ్ ల్లో ఓడిపోయామని స్మృతి వెల్లడించింది. అందుకే ఓటములకు పూర్తి బాధ్యత తానే తీసుకుంటున్నానని పేర్కొంది. ఒక బ్యాటర్ గా తాను పూర్తిగా ఫెయిలవుతున్నా.. టాప్ ఆర్డర్ బ్యాటింగ్ మెరుగుపడాల్సి ఉందన్నారు. ఓటములతో గడిచిన వారం మాకు చాలా కష్టంగా అనిపించిందని స్మృతి మంధాన తెలిపారు. ఇక తన ఫ్యామిలీ ఎప్పుడు తనకు అండగా ఉంటుందన్నారు. ఒంటరిగా కూర్చొని ఓటమికి గల కారణాలను వెతికి సరి చేసుకోవడమేనని స్మృతి మంధాన పేర్కొన్నారు.
Aslo Read : Bilawal Bhutto Zardari: కాశ్మీర్ అంశాన్ని ముఖ్యమైన ఎజెండా చేయడానికి పాక్ ప్రయత్నిస్తోంది..
మరోవైపు శుక్రవారం జరిగిన మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ కు దిగిన ఆర్సీబీ 19.3 ఓవర్లలో 138 పరుగులకు ఆలౌటైంది. ఎలిస్ పెర్రీ 52 పరుగులతో టాప్ స్కోరర్ గా మారగా..
సోపీ డివైన్ 36 పరుగులు చేసింది. ఇక మిగిలిన జట్టు సభ్యులు మైదానంలో పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. అటు యూపీ వారియర్స్ బౌలర్ ఎసెల్ స్టోన్ నాలుగు వికెట్లు తీయగా.. దీప్తీ శర్మ మూడు వికెట్లను పడగొట్టింది. ఇక యూపీ వారియర్స్ బ్యాటింగ్ చేసినప్పుడు.. 13 ఓవర్లలోనే వికెట్ కోల్పోకుండా లక్ష్యాన్ని అందుకుంది. కెప్టెన్ అలిసా హీలీ ( 47 బంతుల్లో 96 నాటౌట్ గా నిలిచి.. 18 ఫోర్లు, ఒక సిక్సర్)బాదింది.. దేవికా వైద్య 36 పరుగులను సాధించింది.