రేపు కవితను అరెస్ట్ చేయొచ్చు.. రాబోయే ఎన్నికల్లో బీజేపీని లేకుండా చేద్దాం
కవితకు ఈడీ నోటీసులపై సీఎం కేసీఆర్ స్పందించారు. గంగుల, రవిచంద్ర.. ఇప్పుడు కవిత వరకు వచ్చారని ఆయన అన్నారు. ఎంత మంచి పనిచేసినా బద్నాం చేస్తారని ఆయన మండిపడ్డారు. ప్రజల కోసం కడుపు కట్టుకుని పనిచేయాలని ఆయన పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. అంతేకాకుండా.. రేపు కవితను అరెస్ట్ చేయొచ్చునని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. చేసుకుంటే చేసుకోని అని, అందర్నీ వేధిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. భయపడేది లేదని, పోరాటం వదిలేది లేదని ఆయన స్పష్టం చేశారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీని లేకుండా చేద్దామని ఆయన పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. బీజేపీలో చేరని వారిని కేసులతో వేధిస్తున్నారని ఆయన ఆరోపించారు. కవితను కూడా చేరమన్నారని, మహా అయితే ఏం చేస్తారు.. జైలుకు పంపుతారు అంటూ సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఇదిలా ఉంటే.. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవితకు మరోసారి ఈడీ నోటీసులు ఇవ్వడం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. అయితే.. రేపు ఈడీ ముందు కవిత హాజరుకానుంది. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో మరోసారి కవితను ఈడీ విచారించనుంది.
లోకేష్‌కి మిథున్‌రెడ్డి కౌంటర్.. చర్చకు రెడీ.. ప్లేస్ ఎక్కడో చెప్పు..
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఇద్దరు యువనేతల సవాళ్ళు.. ప్రతి సవాళ్ళలతో పొలిటికల్ హీట్ పెంచారు.. దమ్ముంటే చిత్తూరు అభివృద్ధి చర్చకు తంబళ్ళపల్లె రా అని ఎంపీ మిధున్ రెడ్డికి నారా లోకేష్ యువగళం పాదయాత్రలో మదనపల్లె సభలో సవాల్ విసిరితే.. అంతే స్ధాయిలో ప్రతీ సవాల్ విసిరారు ఎంపి మిధున్ రెడ్డి.. ఈ నెల 12తేదినా తంబళ్ళపల్లెలోనే ఉంటానమి ప్లేస్ ఎక్కడో చెప్పాలని లోకేష్ కు కౌంటర్ ఇచ్చారు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి.. నారా లోకేష్ లో ప్రవహించేది చిత్తూరు జిల్లా రక్తం అయితే జిల్లాలో ఏ సీటు నుండి అయినా ఫోటీ చేసి నా మీద గెలవాలన్నారు.. ఇద్దరు నేతల సవాళ్ళు.. ప్రతి సవాళ్ళతో ఇరుపార్టీలో తీవ్ర చర్చ దారితీసింది ..
స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో కీలక పరిణామం
ఏపీలో స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. సీఐడీతో పాటు సమాంతరంగా విచారణ చేస్తున్న ఈడీ దూకుడుగా వ్యవహరిస్తోంది.మనీలాండరింగ్ పాల్పడిన నలుగురిని ఈడీ అరెస్టు చేసింది. ప్రభుత్వం నుండి కొల్లగొట్టిన రూ.370 కోట్లను విదేశీ కంపెనీలకు మళ్లించినట్లు ఈడీ గుర్తించింది. ఈకేసులో సౌమ్యాద్రి శేఖర్ బోస్, వికాస్ కన్విల్కర్, సురేష్ గోయల్, ముకుల్ చంద్ర అగర్వాల్ లను అరెస్ట్ చేశారు. విశాఖ స్పెషల్ కోర్టులో వీరిని ఈడీ హజరుపర్చింది. ఆ నలుగురినీ విచారణ కోసం తమ కస్టడీకి ఇవ్వాల్సిందిగా కోర్టులో ఈడీ పిటిషన్ వేసింది. నలుగురికి జ్యుడిషియల్ రిమాండ్‌ను కోర్టు విధించింది. సీఐడీ ఎఫ్‌ఐఆర్ ఆధారంగా ఈడీ కేసు నమోదు చేసింది. అరెస్టు చేసిన సీమెన్స్ మాజీ ఎండీ శేఖర్‌బోస్, డిజిటెక్ ఎంపీ వికాస్ నాయక్, పీపీఎస్‌పీ ఐటీ స్కిల్స్ ప్రాజెక్ట్ సీఈవో ముకుల్ చంద్ర అగర్వాల్, ఎస్‌ఎస్‌ఆర్ అసోసియేట్స్ సురేష్ గోయల్‌లను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కోర్టులో హాజరుపరచగా, వారిని రిమాండ్‌కు తరలించారు. మరోవైపు ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ మాజీ మేనేజింగ్ డైరెక్టర్ అర్జా శ్రీకాంత్‌పై కోట్లాది కోట్ల స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణంపై క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్ గురువారం విచారణ జరిపింది. కాగా, అప్పటి సిమెన్స్ ఇండస్ట్రియల్ సాఫ్ట్‌వేర్ ప్రైవేట్ లిమిటెడ్ తన వాటా 10 శాతంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం నుండి మరింత డబ్బు పొందడానికి సాఫ్ట్‌వేర్ ఖర్చును పెంచడానికి ప్రాజెక్ట్ నివేదికను తారుమారు చేసిందని అధికారులు ఆరోపించారు.
48 వేళ్ల నాటి జాంబీ వైరస్‌ను మేల్కొలిపిన సైంటిస్టులు..
ఇటీవల శాస్త్రవేత్తలు ఆర్కిటిక్ ప్రాంతంలో గడ్డకట్టిన స్థితిలో ఉన్న అత్యంత ప్రమాదకరమైన ‘‘ జాంబీ వైరస్’’ను గుర్తించారు. దాదాపుగా 48,500 ఏళ్లుగా ఆర్కిటిక్ ప్రాంతంలో ఇది గడ్డకట్టిన స్థితిలో ఉంది. ఆర్కిటిక్, ఇతర ప్రదేశాల్లో చాలా ఏళ్లుగా పలు వైరస్ లు మంచులో నిద్రాణస్థితిలో ఉన్నాయి. అయితే వీటి వల్ల కలిగే ప్రమాదాల గురించి శాస్త్రవేత్తలు సంవత్సరాలుగా హెచ్చరిస్తున్నారు. ప్రమాదకర వైరస్ మానవుల్లో ప్రాణాంతకవ్యాధిని కలిగించే సామర్థ్యాన్ని కలిగించే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం గ్లోబల్ వార్మింగ్ వల్ల ధృవాల వద్ద ఉన్న మంచు క్రమంగా కరుగుతోంది. దీంతో ఈ వైరస్ ల ముప్పు మరింతగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో వైరస్ లపై శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. తాజాగా జాంబీ వైరస్ వల్ల వచ్చే ప్రమాదాలను ఎదుర్కొనేందుకు ఫ్రెంచ్ శాస్త్రవేత్త, ఆర్కిటిక్ లో సేకరించిన వైరస్ లను మళ్లీ పునరుద్ధరించాడు. ఆర్కిటిక్ టండ్రా, అలస్కా, కెనడా, రష్యాలోని సైబిరియా ప్రాంతాలు అనేక పురాతన వైరస్ కు మంచులో గడ్డకట్టిన స్థితిలో కలిగి ఉన్నాయి.
ఖలిస్తాన్ అనుకూల కంటెంట్ ప్రచారం.. 6 యూట్యూబ్ ఛానళ్లు బ్లాక్
ఖలిస్తాన్ అనుకూల భావాలను ప్రచారం చేస్తున్న ఆరు యూట్యూబ్ ఛానెళ్లను కేంద్రం బ్లాక్ చేసిందని సీనియర్ అధికారి ఒకరు శుక్రవారం తెలిపారు. గత 10 రోజులుగా విదేశాల నుంచి పనిచేస్తున్న ఆరు నుంచి ఎనిమిది యూట్యూబ్ ఛానెళ్లను బ్లాక్ చేసినట్లు సమాచార, ప్రసార శాఖ కార్యదర్శి అపూర్వ చంద్ర తెలిపారు. పంజాబీ భాషలో కంటెంట్ ఉన్న ఛానెల్‌లు సరిహద్దు రాష్ట్రంలో ఇబ్బందులను సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆయన అన్నారు. తీవ్రవాద బోధకుడు, ఖలిస్తాన్ సానుభూతిపరుడు అమృతపాల్ సింగ్ మద్దతుదారులు తమ సహాయకులలో ఒకరిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ కత్తులు, తుపాకులతో అజ్నాలాలోని పోలీస్ స్టేషన్‌పై దాడి చేసిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ చర్య తీసుకుంది. నటుడు, కార్యకర్త దివంగత దీప్ సిద్ధూ స్థాపించిన ‘వారిస్ పంజాబ్ దే’ అధినేతగా అమృత్‌పాల్ సింగ్ గత సంవత్సరం నియమితులయ్యారు. ఇది ఉగ్రవాది జర్నైల్ సింగ్ భింద్రన్‌వాలే స్వగ్రామమైన మోగాస్ రోడ్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో జరిగింది. 48 గంటల్లో ఛానెల్‌లను బ్లాక్ చేయాలన్న ప్రభుత్వ అభ్యర్థనలపై యూట్యూబ్ చర్యలు తీసుకుంటోందని మరో సీనియర్ అధికారి తెలిపారు. అభ్యంతరకరమైన కంటెంట్‌ను ఆటోమేటిక్‌గా గుర్తించి బ్లాక్ చేయడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అల్గారిథమ్‌లను ఉపయోగించాలని ప్రభుత్వం యూట్యూబ్‌ని కోరిందని అధికారి తెలిపారు. భారత్‌లో కంటెంట్‌ని ప్రాంతీయ భాషల్లో అప్‌లోడ్ చేయడం, ఆంగ్ల భాషలో కంటెంట్‌ను ప్రదర్శించే వ్యవస్థలు ఉన్నందున యూట్యూబ్ సమస్యలను ఎదుర్కొంటోంది.
ట్విట్టర్‌కు పోటీగా కొత్త యాప్ తీసుకువచ్చే ప్లాన్‌లో మెటా..!
ట్విట్టర్ సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు తమ అభిప్రాయాలను చెప్పేందుకు వేదికగా నిలిచింది. ప్రపంచకుబేరుడు ఎలాన్ మస్క్ భారీ డీల్ తో ట్విట్టర్ ను సొంతం చేసుకున్నాడు. అయితే ప్రస్తుతం ట్విట్టర్ కు పోటీగా కొత్త యాప్ ను తీసుకువచ్చే ప్రయత్నం చేస్తోంది ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ మాతృసంస్థ మెటా. ట్విట్టర్ ప్లేస్ ను ఆక్రమించేందుకు, దానికి పోటీగా నిలిచేందుకు కొత్త సోషల్ మీడియా యాప్ తీసుకువచ్చే ఆలోచనలో మెటా ఉన్నట్లు తెలుస్తోంది. మెటా కొత్త యాప్ మాస్టోడాన్ వంటి డిసెంట్రలైజ్డ్ ఫ్రేమ్ వర్క్ పై ఆధారపడి ఉండనుంది. ట్విట్టర్ లాంటి సేవలను అందించే మాస్టోడాన్ ను 2016లో ప్రారంభించారు. ప్రస్తుతం దీనికి 2 మిలియన్ల మంది యాక్టివ్ యూజర్లు ఉన్నారు. టెక్స్ట్ అప్డేట్స్ కోసం సోషల్ నెట్వర్క్ అణ్వేషిస్తున్నట్లు, క్రియేటర్స్, పబ్లిక్ ఫిగర్స్ తమ ఆసక్తులకు సంబంధించి సమయానుకూలంగా ఆప్డేట్స్ పంచుకునేందుకు ప్రత్యేకంగా యాప్ అవసరం ఉందని భావిస్తున్నట్లు మెటా స్పోక్స్ పర్సన్ రాయిటర్స్ కు వెల్లడించాడు.
ఎన్టీఆర్ హీరోయిన్ ను అవమానించిన నయన్.. మరీ ఇంతలానా
లేడీ సూపర్ స్టార్ నయనతార గురించి ప్రత్యేకంగా ఎవరికీ చెప్పాల్సిన అవసరం లేదు. కోలీవుడ్ లో కానీ, టాలీవుడ్ లో కానీ స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించిన ఘనత ఆమెకు ఉంది. ఇక హీరోయిన్ గా ఉన్న దశలోనే ఆమెకు చాలా పొగరు అని ఇండస్ట్రీలో టాక్. మిగతా హీరోయిన్లతో సరిగా ఉండేది కాదని, ఆమె ఉన్న సినిమాలో ఇంకో హీరోయిన్ ఉంటే ఒప్పుకునేది కాదని కోలీవుడ్ లో మాట్లాడుకుంటూ ఉంటారు. తాజాగా నయన్ అలానే చేసిందన మరో హీరోయిన్ చెప్పడం ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. యమదొంగ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన బ్యూటీ మమతా మోహన్ దాస్. హీరోయిన్ గానే కాకుండా సింగర్ గా కూడా మంచి గుర్తింపు అందుకున్న ఈ ముద్దుగుమ్మ కోలీవుడ్ లో కూడా మంచి అవకాశాలను అందుకుంది. ఇక ఈ మధ్యనే క్యాన్సర్ తో పోరాడి గెలిచిన మమతా ఒక ఇంటర్వ్యూలో తనకు జరిగిన అవమానం గురించి చెప్పుకొచ్చింది. ” నేను ఒక సినిమాలో సాంగ్ చేయడానికి ఒప్పుకున్నాను. పెద్ద హీరో.. మంచి పారితోషికం అన్నారు. సరే అని నేను ఇచ్చిన డేట్స్ లో సెట్ కు వెళ్లాను. నాలుగు రోజులు సెట్ కు వెళ్లడం, కూర్చోవడం జరిగింది. అయితే తరువాత నాకు అర్థమైంది నన్ను వారు క్యాప్చర్ చేయడం లేదని, నాతో షూటింగ్ చేయడం లేదని.. ఇక తరువాత ఆరా తీస్తే అందులో నటిస్తున్న హీరోయిన్.. తాను వేరొక హీరోయిన్ తో నటించడం ఇష్టం లేదని చెప్పిందట. అందుకే వారు నాకు చెప్పకుండా నన్ను పక్కన కూర్చోపెట్టారు. ఆ విషయం తెలిసేసరికి నేను చాలా బాధపడ్డాను. అలా ఆమె వల్ల తన నాలుగు రోజులు టైం వేస్ట్ అయ్యిందని చెప్పుకొచ్చింది. అయితేఆ కథానాయిక ఎవరో కాదు నయనతారనే … ఆ సినిమా రజినీకాంత్, జగపతి బాబు నటించిన కథానాయకుడు. ఆ సినిమాలో నయన్, రజిని పై జరిగే సాంగ్ లో మమతా ఒక చిన్న షాట్ లో మాత్రమే కనిపిస్తుంది. ఈ సినిమా కోసం తన రెమ్యూనిరేషన్ తనకు వచ్చి ఉండొచ్చు కానీ, అలా నయన్ మాట్లాడి తనను అవమానించింది అనే బాధ మాత్రం లోపల ఇంకా ఉందని మమత చెప్పే విధానంలోనే తెలిసిపోయింది అంటున్నారు అభిమానులు.