IND vs AUS: సెంచరీతో చెలరేగిన గిల్.. రెండో వికెట్ కోల్పోయిన భారత్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇండియా-ఆస్ట్రేలియా మధ్య అహ్మదాబాద్ లో జరుగుతున్న నాలుగో టెస్టులో భారత్ కూడా ఆస్ట్రేలియా మాదిరిగానే బ్యాటింగ్ పిచ్ లో నిలకడగా ఆడుతుంది. తొలి ఇన్నింగ్స్ లో భారత జట్టు లంచ్ తర్వాత కూడా కాస్త నెమ్మదించినా వికెట్లను కాపాడుకుంటూనే భారీ స్కోరు దిశగా సాగుతుంది. ఓపెనర్ శుభ్ మన్ గిల్ (216 బంతుల్లో 116 నాటౌట్, 12, ఫోర్లు, 1 సిక్స్) సెంచరీతో కదం తొక్కగా అర్థ సెంచరీ దిశగా సాగుతున్న నయా వాల్ ఛటేశ్వర్ పుజారా (121 బంతుల్లో 42, 3 ఫోర్లు ) ఎల్బీగా వెనుదిరిగాడు. దీంతో భారత్ రెండో వికెట్ కోల్పోయింది. టీ బ్రేక్ సమయానికి భారత్ 63 ఓవర్లు ముగిసేటప్పటికీ రెండు వికెట్లు కోల్పోయి 188 పరుగులు చేసింది. శుభ్ మన్ గిల్ తో పాటు విరాట్ కోహ్లీ 31 బంతుల్లో 8 పరుగులతో నాటౌట్ గా క్రీజులో ఉన్నాడు.
Aslo Read : Tamarind Seeds: ఆన్లైన్‌లో చింతగింజల అమ్మకాలు.. ధర ఎంతో తెలుసా?
Also Read
- Yuvraj Singh: సిక్సర్ల రాజు యువీ రీఎంట్రీ.. బ్యాటింగ్ కోచ్గా బాధ్యతలు!
- CWC27 Ticket Ballot: టికెట్ బ్యాలెట్ ప్రక్రియకు అనూహ్య స్పందన.. 142 దేశాల నుంచి 1.50 కోట్ల దరఖాస్తులు..
- Cheteshwar Pujara: భారత్లో కూడా క్రిస్ గేల్ ఉన్నాడు.. చతేశ్వర్ పుజారా ఆసక్తికర వ్యాఖ్యలు..
- ICC Awards: శుభ్మన్ గిల్, షెఫాలి వర్మలకు అవార్డులు..
ఈ ఏడాది వన్డేలు, టీ20లలో సూపర్ ఫామ్ లో ఉండి రెండు ఫార్మాట్లలోనూ సెంచరీలు చేసిన గిల్.. ఇప్పుడు ఆస్ట్రేలియాతో తొలి ఇన్నింగ్స్ లో కూడా ఆ ఫామ్ ను కొనసాగించాడు. టెస్టులలో గిల్ కి ఇది రెండో సెంచరీ కావడం విశేషం.. మరో ఎండో లో పుజారా కూడా తనదైన డిఫెన్స్ తో పాటు చూడచక్కని డ్రైవ్ లతో రాణించాడు. ఈ ఇద్దరు కలిసి రెండో వికెట్ కు 113 పరుగుల భాగస్వామ్యం జోడించారు. మూడో రోజు ఉదయం ఓవర్ నైట్ స్కోర్ 36-0తో ఇన్నింగ్స్ ఆరంభించిన టీమిండియా.. ధాటిగానే ఇన్నింగ్స్ ను ప్రారంభించింది. రోహిత్ శర్మ (35), గిల్ లు తొలి వికెట్ కు 74 పరుగుల భాగస్వామ్యం జోడించారు. ఈ జోడిని కున్హేమన్ విడదీశాడు. రోహిత్ శర్మ నిష్ర్కమించినా తర్వాత క్రీజులోకి వచ్చిన పుజారాతో కలిసి గిల్ మరో సూపర్ ఇన్నింగ్స్ ఆడుతున్నాడు.
Aslo Read : Dog Saves Owner: పాము నుంచి యజమానిని కాపాడిన కుక్క
అర్థ సెంచరీ తర్వాత గిల్ 80లలోకి చేరేంత వరకూ ఆచితూచి ఆడాడు. కానీ ఆ తర్వాత కామెరూన్ గ్రీన్ వేసిన 56వ ఓవర్లో రెండు ఫోర్లు కొట్టి 90లలోకి వచ్చాడు. మర్ఫీ వేసిన 57 ఓవర్లో తొలి బంతిని బౌండరీకి తరలించిన పుజారా కూడా 40లలోకి చేరాడు. ఇక లియాన్ వేసిన 60వ ఓవర్లో రెండో బంతిని గిల్ బౌండరీకి తరలించాడు. దీంతో శుభ్ మన్ గిల్ స్కోర్ 96 పరుగులకు చేరింది. ఇక మర్పీ వేసిన 61వ ఓవర్లో రెండో బంతికి బౌండరీ బాదీ 194 బంతుల్లో సెంచరీ సాధించాడు. గిల్ కు భారత్ లో ఇదే తొలి టెస్టు సెంచరీ కావడం విశేషం, మొత్తంగా టెస్టులలో శుబ్ మన్ గిల్ కు రెండో సెంచరీ..
Aslo Read : Silicon Valley Bank: సిలికాన్ వ్యాలీపై ఎలాన్ మస్క్ ఫోకస్.. బ్యాంక్ కొనుగోలుకు ఆసక్తి
గిల్ సెంచరీ తర్వాత ఓవర్ వేసిన మర్ఫీ భారత్ కు షాకిచ్చాడు. హాప్ సెంచీర దిశగా సాగుతున్న పుజారాను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. దీంతో భారత్ రెండో వికెట్ కోల్పోయింది. తొలి ఇన్సింగ్ లో ఆసీస్ 480 పరుగులు చేసింది. రెండు రోజులు బ్యాటింగ్ చేసిన ఆ జట్టుకు ఉస్మాన్ ఖవాజా 9180), కామెరూన్ గ్రీన్ (114) లు సెంచరీలతో కదం తొక్కారు.
తాజావార్తలు
-
Vijay Deverakonda : “నా ఫెయిల్యూర్ చూసి వాళ్ళు పండగ చేసుకున్నారు.. ఈసారి గట్టిగా కొడుతున్నా!” –
-
Rashmika : “పెళ్లయిందన్న ఫీలింగే లేదు.. ఆయన పర్ఫార్మెన్స్ చూసి వణికిపోయా!”
-
Rahul Sankrityan : విజయ్ – రష్మికకు నిజంగానే పెళ్లి జరుగుతుందని అప్పుడు తెలీదు
-
AP DSC 2026 Notification: టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. DSC నోటిఫికేషన్ విడుదల
-
AP Local Body Elections Schedule: స్థానిక ఎన్నికల సందడి.. మున్సిపల్, ఎంపీటీసీ, పంచాయతీ షెడ్యూల్ వివరాలివే..!
ట్రెండింగ్
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!