పాకిస్తాన్ క్రికెట్ లీగ్ లో సంచలనాలు నమోదవుతున్నాయి. నాలుగు రోజల క్రితం పెషావర్ జల్మీ-క్వెట్టా గ్లాడియేటర్స్ మ్యాచ్ లో పీఎస్ఎల్ లోనే అత్యధిక టార్గెట్ ను క్వెట్టా ఛేదింగా ఇప్పుడు మరో మ్యాచ్ లో కూడా పెషావర్ జల్మీకి భారీ ఓటమి తప్పలేదు. ముల్తాన్ సుల్తాన్స్ తో జరిగిన మ్యాచ్ లో పెషావర్ జల్మీ.. 242 పరుగులు చేసినా ముల్తాన్ సుల్తాన్ బ్యాటర్లు లక్ష్యాన్ని మరో ఐద బంతులు మిగిలుండగానే కొట్టేశారు. దక్షిణాఫ్రికా బ్యాటర్ రిలీ రూసో ( ముల్తాన్ సుల్తాన్స్ ప్లేయర్ ) పీఎస్ఎల్ లో ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేసి రికార్డు సృష్టించాడు.
Aslo Read : Liquor Scam: ఢిల్లీలో ఉద్రిక్తత.. బీఆర్ఎస్ ఆందోళన
రావల్పిండి వేదికగా జరిగిన మ్యాచ్ లో పెషావర్.. నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానాకి 242 పరుగుల చేసింది. ఆ జట్టు కెప్టెన్ బాబర్ ఆజమ్ ( 39 బంతుల్లో 73, 9 ఫోర్లు, 2 సిక్సర్లు)కు తోడు సయిబ్ అయూబ్( 33 బంతుల్లో 58, 5 ఫోర్లు, 4 సిక్సర్లు) తొలి వికెట్ కే 114 పరుగులు జోడించారు. వన్ డౌన్ లో వచ్చిన మహ్మద్ హారీస్ (35), కొహ్లర్(38)లు రాణించారు. ఫలితంగా ఆ జట్టు ముల్తాన్ ఎదుట భారీ లక్ష్యాని నిలిపింది.
Aslo Read : Women Missing : భర్త వేధింపులు భరించలేక పరారైన వివాహిత
కాగా భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ముల్తాన్ కు ఆదిలోనే డబుల్ షాకులు తాకాయి. ఓపెనర్లు షాన్ మసూద్(5), మహ్మద్ రిజ్వాన్(70లు వెంటవెంటనే పెవిలియన్ బాట పట్టారు. కానీ వన్ డౌన్ లో వచ్చిన రిలీ రూసో (51 బంతుల్లో 121, 12ఫోర్లు, 8 సిక్సర్లు) వీరబాదుడు బాదాడు. 41 బంతుల్లోనే అతడి సెంచరీ పూర్తయింది. తద్వారా పీఎస్ఎల్ లో అతి తక్కువ బంతుల్లోనే సెంచరీ చేసిన ఆటగాడిగా రూసో రికార్డులకెక్కాడు. రూసో.. పొలార్డ్(25 బంతుల్లో 52,3 ఫోర్లు, 5 సిక్సర్లు)తో కలిసి మూడో వికెట్ కు 99 పరుగుల
భాగస్వామ్యం నెలకొల్పారు. మధ్యలో ముల్తాన్ సులత్తాన్స్ త్వరత్వరగా వికెట్లు కోల్పోయింది. టీమ్ డేవిడ్(2), ఖుష్దిల్(18)లు విఫలమయ్యారు. కానీ చివర్లో అన్వర్ అలీ (8బంతుల్లో 24నాటౌట్, 2 ఫోర్లు, 2 సిక్సర్లు), ఉస్మాన్ మీర్(3 బంతుల్లో 11, 1 ఫోర్, 1 సిక్సర్)ల ధాటికి పెసావర్ జల్మీ టీమ్ కు ఓటమి తప్పలేదు.
Aslo Read : Congress: కోమటిరెడ్డిని సస్పెండ్ చేయండి.. ఠాక్రేకి చెరుకు సుధాకర్ ఫిర్యాదు
ముల్తాన్ సుల్తాన్స్ జట్టు 19.1 ఓవర్లలోనే 244 పరుగుల లక్ష్యాన్ని ఛేధించి అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఈ విజయంతో ముల్తాన్.. ప్లేఆఫ్స్ కు అర్హత సాధించింది. పెషావర్ జల్మీ తర్వాత ఆడే అన్ని మ్యాచ్ లను గెలిచినా ప్లేఆఫ్స్ చేరడం కష్టమే.. మూడు రోజుల క్రితం క్వెట్టా గ్లాడియేటర్స్ కూడా పెషావర్ ను చిత్తుగా ఓడించింది. ఈ మ్యాచ్ లో పెషావర్.. నిర్ణీత ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 240 పరుగులు చేసింది. కానీ భారీ లక్ష్యాన్ని క్వెట్టా..18.2 ఓవర్లలోనే ఛేధించింది. జేసన్ రాయ్(145)వీరబాదుడుకు తోడు మహ్మద్ హఫీజ్(41) మెరుపులు తోడవడంతో క్వెట్టా.. పీఎస్ఎల్ లోనే భారీ టార్గెట్ ను విజయవంతంగా ఛేధించిన జట్టుగా నిలిచింది.