ఇరిగేషన్‌పై సీఎం జగన్ సమీక్ష.. పోలవరం త్వరగా పూర్తి చేయాలని ఆదేశం
ఏపీ ముఖ్యమంత్రి సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఇరిగేషన్‌పై మంగళవారం సమీక్ష నిర్వహించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో అధికారులతో సమగ్రంగా చర్చించారు. ఈ సందర్భంగా.. క్యాలెండర్ ప్రకారం రైతులకు సాగునీరు విడుదలచేస్తున్నామని అధికారులు తెలిపారు. ఇప్పటికే గోదావరి, కృష్ణాడెల్టా, తోటపల్లి కింద ప్రాంతాలకు సాగునీరు విడుదలచేశామని వెల్లడించారు. అటు.. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం సమీపిస్తున్న తరుణంలో, లెఫ్ట్ మెయిన్ కెనాల్‌పై దృష్టి పెట్టాలని అధికారులకు సీఎం సూచించారు. దీంతో.. ఈసీఆర్‌ఎఫ్ డ్యాం నిర్మాణ ప్రాంతంలో పనులు చురుగ్గా సాగుతున్నాయని అధికారులు చెప్పారు. ఈసీఆర్ఎఫ్ డ్యాం గ్యాప్-1లో శాండ్ ఫిల్లింగ్, వైబ్రోకాంపాక్షన్ పనులు పూర్తయ్యాయని అన్నారు. గ్యాప్-2 వద్ద కూడా ఇదే పనులు చురుగ్గా సాగుతున్నాయన్నారు. కేంద్ర జలశక్తి శాఖ, కేంద్ర జలమండలి అధికారులు గైడ్ బండ్‌లో కుంగిన ప్రాంతాన్ని పరిశీలించారని.. నేల స్వభావంలో మార్పల కారణంగా ఇది జరిగి ఉండొచ్చని అనుమానాన్ని కమిటీ వెల్లడించిందని అధికారులు సీఎంకు చెప్పారు. దెబ్బతిన్న ప్రాంతాన్ని రాక్ డంప్‌తో, సిమెంట్ స్లర్రీతో నింపాలని, గేబియన్స్‌తో సపోర్టు ఇవ్వాలని కమిటీ సూచించిందని, ఆ మేరకు పనులు ముందుకు తీసుకెళ్తున్నామని తెలిపారు. పూర్తి విశ్లేషణ తర్వాత శాశ్వతంగా.. చేయాల్సిన మరమ్మతులను సూచిస్తామని కమిటీ చెప్పినట్టుగా అధికారులు వెల్లడించారు. పోలవరం తొలిదశను పూర్తిచేయడానికి కేంద్ర ఆర్థికశాఖ రూ.12,911.15 కోట్లు ఇచ్చేందుకు నిర్ణయం తీసుకుందని, కేంద్ర కేబినెట్‌లో పెట్టేందుకు కేబినెట్ నోట్ తయారీపై వివిధ మంత్రిత్వశాఖల మధ్య సంప్రదింపులు కొలిక్కి వస్తున్నాయని అన్నారు. పోలవరం మొదటి దశ పరిధిలోకి వచ్చే 20,946 ముంపు బాధిత కుటుంబాల్లో 12,658 మందిని ఇప్పటికే తరలించామని, మిగిలిన 8,288 మందిని తరలించడానికి ఏర్పాట్లు చేస్తున్నామన్న వివరించారు.
దమ్ముంటే ద్వారంపూడి ఛాలెంజ్‌ను పవన్ స్వీకరించాలి..
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు దమ్ముంటే ఎమ్మెల్యే ద్వారంపూడి ఛాలెంజ్‌ను స్వీకరించాలి సవాల్ చేశారు మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ.. అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. జనసేన పార్టీలోకి వచ్చి పోయిన వారి సంగతి ఏంటో పవన్ చెప్పాలన్నారు.. పదే పదే కులం గురించి మాట్లాడడం ఎంతవరకు సమంజసం ? సమ సమాజం కోసం మాట్లాడే తీరు ఇదేనా? అంటూ ప్రశ్నించారు. గోదావరి జిల్లాలలో పవన్ అశాంతిని నెలకొల్పుతున్నారని ఆరోపణలు గుప్పించిన ఆయన.. కులాల మధ్య చిచ్చుపెట్టే విధంగా మాట్లాడడం హాస్యాస్పదం అని హితవుపలికారు.. 2019 సంవత్సరంలో మీరు చేసిన ప్రయత్నం ప్రజాభిమానం పొందలేదని స్పష్టం చేశారు. ఇక, కాకినాడ వచ్చి పదే పదే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందంటూ పవన్ కల్యాణ్‌పై ఫైర్ అయ్యారు మంత్రి చెల్లుబోయిన.. పవన్‌కు దమ్ముంటే.. ద్వారంపూడి చెప్పిన ఛాలెంజ్ ను స్వీకరించాలని డిమాండ్ చేశారు.. వారాహిని.. నారాహిగా మార్చారంటూ ఎద్దేవా చేశారు.. మరోవైపు.. 2018లో తనకు ప్రాణహాని ఉందని పవన్ కల్యాణ్ అన్నారని గుర్తుచేశారు.. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మూడు దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉంటూ.. సమాజంలో సముచిత స్థానం కలిగిన వ్యక్తిగా ఉన్నారని తెలిపారు మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ.
ప్రజాక్షేత్రంలో ప్రత్యర్థులు బదానం చేస్తున్నారు.. ఇంటి సమస్యను రాజకీయంగా వాడుకుంటున్నారు..!
గతంలో జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డిపై తన కూతురు పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. సిద్దిపేట జిల్లా చేర్యాలలో ఉన్న భూమి విషయంలో.. తన సంతకాన్ని ఫోర్జరీ చేశారని ఆరోపణలు చేశారు. ఎకరం ఇరవై గుంటల భూమిని తన పేరు మీద తీసుకున్నారని కూతురు తుల్జా భవాని రెడ్డి తన తండ్రిపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తన సొంత కూతురే ఫిర్యాదు చేయడంతో అప్పుడా వివాదం సంచలనం రేపింది. అయితే ఇన్ని రోజులుగా సైలెంట్ గా ఉన్న ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి మరోసారి తను కూతురు పై స్పందించారు. తనను ప్రజా క్షేత్రంలో బాదనం చేయాలన్న దానిపై ప్రత్యర్థుల చేస్తున్న కుట్రగా ఎమ్మెల్యే ముత్తిరెడ్డి పేర్కొన్నారు. రాజకీయంగా దెబ్బతీసేందుకు కొందరు ఇంటి సమస్యను బయటికి తీస్తున్నారని ఆరోపించారు. అంతేకాకుండా ప్రతి ఇంట్లో ఆస్తుల సమస్య ఉంటుంది. కానీ.. ఇంటి సమస్యను రాజకీయంగా వాడుకుంటున్నారని మండిపడ్డారు. గత ఎన్నికల సమయంలో నేను కబ్జా చేశానని ఓ జిల్లా కలెక్టర్ అన్నారు. అయితే ఆ మాటలను తన నియోజకవర్గ ప్రజలు నమ్మ లేదని తెలిపారు.
గాంధీ శాంతి పురస్కారం.. కోటి నగదు బహుమతి వద్దన్న గీతా ప్రెస్
ఉత్తరప్రదేశ్ గోరఖ్‌పూర్‌కు చెందిన ప్రముఖ ప్రచురణ సంస్థ గీతా ప్రెస్‌ను 2021 సంవత్సరానికి గాంధీ శాంతి పురస్కారానికి కేంద్రం సాంస్కృతిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఎంపిక చేసింది. అహింస, సామాజిక, ఆర్థిక, రాజకీయ మార్పును తీసుకువచ్చే దిశగా సేవలందించిన గీతా ప్రెస్‌ను ఈ పురస్కారానికి ఎంపిక చేసినట్లు పేర్కొంది. ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని జ్యూరీ కమిటీ ఏకగ్రీవంగా ఎంపిక చేసింది. ఈ సందర్భంగా గాంధీ సిద్ధాంతాలైన శాంతి, సామాజిక సామరస్యాన్ని పెంపొందించే దిశగా గీతా ప్రెస్ అందించిన సేవలను ప్రధాని గుర్తు చేశారు. గాంధీ శాంతి పురస్కారాన్ని తమకు ప్రకటించడం తమకు దక్కిన గౌరవంగా భావిస్తున్నట్ల్లు గీతా ప్రెస్ సోమవారం తెలిపింది. అయితే ఏ విధమైన విరాళాలు స్వీకరించడం తమ సాంప్రదాయం కానందున అవార్డు కింద ప్రకటించిన రూ. 1 కోటి నగదును తాము స్వీకరించబోమని గీతా ప్రెస్ ప్రకటించింది. గాంధీ శాంతి అవార్డును ప్రకటించిన అనంతరం గీతా ప్రెస్ ట్రస్టీ బోర్డు ఆదివారం గోరఖ్‌పూర్‌లో సమావేశమైంది. రూ. 1 కోటి నగదు బహుమతిని స్వీకరించరాదని సమావేశం నిర్ణయించింది.
భారతీయుల ఉద్యోగాలపై మాంద్యం ఎఫెక్ట్.. ఉద్యోగ ఖాళీలలో భారీ తగ్గింపు
రాబోయే నెలల్లో సింగపూర్‌లో ఆర్థిక మందగమనం పెరగవచ్చని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. గత వారం సింగపూర్‌లో బలహీనమైన ఆర్థిక నివేదిక మాంద్యం భయాలను పెంచింది. ఎగుమతి సంఖ్యలు వరుసగా ఎనిమిదో నెలలో క్షీణించాయి. మొత్తం ఉపాధి నెమ్మదిగా క్షీణిస్తోంది. ఇటీవల తొలగింపులు పెరిగాయి. ఉద్యోగ ఖాళీలు వరుసగా నాలుగో త్రైమాసికంలో తగ్గాయి. సింగపూర్ వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని చట్టబద్ధమైన బోర్డు అయిన ఎంటర్‌ప్రైజ్ సింగపూర్ ప్రకారం.. మేలో చమురుయేతర దేశీయ ఎగుమతులు (NODX) 14.7 శాతం క్షీణించాయి. ఏప్రిల్‌లో ఎలక్ట్రానిక్స్, నాన్-ఎలక్ట్రానిక్స్ ఎగుమతులు 9.8 శాతం క్షీణించాయి. హాంకాంగ్, మలేషియా, తైవాన్ మార్కెట్లలో బలహీనత ఉన్నప్పటికీ చైనా, యూఎస్‌లకు ఎగుమతులు పెరిగాయి. మొత్తం మీద, గత నెలలో సింగపూర్‌లోని టాప్ 10 షేర్లలో NODX క్షీణించింది. బ్లూమ్‌బెర్గ్ పోల్‌లో ఆర్థికవేత్తలు అంచనా వేసిన సగటు 7.7 శాతం క్షీణత కంటే 14.7 శాతం తిరోగమనం చాలా అధికంగా ఉంది. సింగపూర్ ఆర్థిక వ్యవస్థ ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో 0.4 శాతం క్షీణించింది. వడ్డీ రేట్లలో తీవ్ర పెరుగుదల మధ్య ప్రపంచ వినియోగం మందగించడం, బలహీనమైన సంఖ్యలు సింగపూర్ ఎగుమతి ఆధారిత ఆర్థిక వ్యవస్థలో సాంకేతిక మందగమనం సంకేతాలను సూచించాయి.
లీల పాపను వదలనంటున్న మాస్ మహారాజా..?
తనకు హ్యాట్రిక్స్ హిట్స్ ఇచ్చిన గోపీచంద్ మలినేనితో రవితేజ ఒక సినిమా చేస్తున్నాడంటూ వార్తలు వచ్చిన విషయం తెల్సిందే. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుంది. ఈ ఏడాది మైత్రీ- గోపీచంద్ కాంబోలో వీరసింహారెడ్డి రిలీజ్ అయ్యి ఎన్ని సెన్సేషన్స్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో రవితేజ సరసన శ్రీలీల నటిస్తున్నట్లు తెలుస్తోంది. వీరిద్దరి కాంబోలో ధమాకా సినిమా వచ్చిన విషయం తెల్సిందే. గతేడాది డిసెంబర్ లో రిలీజ్ అయిన ఈ చిత్రం ఎంతటి బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా రవితేజ- శ్రీలీల డ్యాన్స్ కు అభిమానులు ఫిదా అయిపోయారు. ఇక ఎలాగో హిట్ కాంబోను రిపీట్ చేస్తున్నామని.. రవితేజ.. శ్రీలీలతో మరోసారి జతకట్టేద్దామని ఫిక్స్ అయిపోయినట్లు తెలుస్తోంది.
సంచలనం సృష్టించిన ఈ సినిమా ఓటీటీ విడుదల ఎప్పుడో తెలుసా…?
ఇటీవల విడుదలయి సంచలనం సృష్టించిన సినిమా ‘ది కేరళ స్టోరీ’.ఈ సినిమాలో అదా శర్మ ముఖ్య పాత్రలో నటించింది.కేరళలో వివాదాస్పదమైన లవ్ జిహాద్ నేపథ్యంలో డైరెక్టర్ సుదీప్తో సేన్ ఈ సినిమాను తెరకెక్కించారు. విడుదలకు ముందే ఎన్నో అడ్డంకులని ఎదుర్కొంది ది కేరళ స్టోరీ సినిమా. ఇక థియేటర్లలో రిలీజయ్యాక ఒక చిన్నపాటి అలజడిని సృష్టించింది. తమిళనాడు మరియు పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఏకంగా ఈ సినిమాను ప్రదర్శించుకుండా నిషేధం కూడా విధించారు. మే 5న విడుదలైన ఈ సినిమా కి లాంగ్ రన్‌లో ఏకంగా రూ. 200 కోట్లకు పైగా వసూళ్లు వచ్చాయని సమాచారం.. ఇలా థియేటర్లలో సంచలనం సృష్టించిన ది కేరళ స్టోరీ ఓటీటీ విడుదల కోసం మూవీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ జీ5 ది కేరళ స్టోరీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుందని సమాచారం. థియేట్రికల్ రన్ ముగియడంతో జూన్ 23 నుంచి ది కేరళ స్టోరీ జీ5లో స్ట్రీమింగ్ కానుందని సమాచారం.
బిగుతైన డ్రెస్సులో ఎద అందాలతో పిచ్చెక్కిస్తున్న రాశి…
రాశి ఖన్నా..ఈ అమ్మడుకు ఇండస్ట్రీలో డిమాండ్ బాగానే ఉంది.. మొదటి సినిమాతోనే అందరి చూపును తనవైపు తిప్పుకున్న బొద్దుగుమ్మ వరుస సినిమాలతో తన క్రేజ్ ను పెంచుకుంది.. ఒకవైపు సినిమా చేస్తున్నా కూడా సోషల్ మీడియాలో క్లివేజ్ షో చేస్తూనే ఉంది.. హాట్ అందాలతో సెగలు పుట్టిస్తుంది.. తాజాగా షేర్ చేసిన ఫోటోలు మైండ్ బ్లాక్ చేస్తున్నాయి.. ఎద అందాలను చూపిస్తూ నెట్టింట వేడి పుట్టిస్తుంది.. తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చేస్తున్నాయి… తాజాగా రాశి ఖన్నా కళ్ళు చెదిరే ఫోజులు ఇచ్చింది. బ్లాక్ డ్రెస్ లో నల్ల త్రాచులాగా ఆమె ఫోజులు అదుర్స్ అనిపిస్తున్నాయి.. బ్లాక్ థైస్ స్ప్లిట్ డ్రెస్ లో రాశి ఖన్నా రెచ్చిపోయింది. ఐడబ్ల్యూఎమ్ బజ్ అనే అవార్డ్స్ వేడుకలో రాశి ఖన్నా మెరిసింది.. ఆమె బాగా బొద్దుగా మారినట్లు అనిపిస్తోంది. దీనితో రాశి ఖన్నా క్లీవేజ్ అందాలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి.. గ్లామర్ పరంగా డోకా లేని రాశికి కేరీర్ మాత్రం డల్ గా సాగుతుంది.. ఈ మధ్య హిట్ సినిమాలు లేవు.. ప్రస్తుతం రాశి ఖన్నా తమిళంలో కొన్ని చిత్రాల్లో నటిస్తోంది. కొత్త హీరోయిన్ల హవా నేపథ్యంలో రాశి ఖన్నాకి పోటీ తప్పడం లేదు. హిందీలో నటిస్తున్న ఫార్జి అనే వెబ్ సిరీస్ లో భాగంగా ప్రమోషన్స్ లో రాశి ఖన్నా ఈ లుక్ లో కనిపించింది..
రావణుడి లుక్‌పై ట్రోలింగ్.. మైండ్ బ్లాకయ్యే సమాధానమిచ్చిన నిర్మాత!
ప్రభాస్ హీరోగా కృతి సనన్ హీరోయిన్ గా సైఫ్ అలీ ఖాన్ రావణాసురుడుగా ఆదిపురుష్ సినిమా తెరకెక్కింది. ఓం రౌత్ డైరెక్షన్లో టీ సిరీస్ సంస్థ నిర్మించిన ఈ సినిమాను తెలుగులో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ రిలీజ్ చేసింది. సినిమా మంచి వసూళ్లు రాబడుతున్న నేపథ్యంలో తాజాగా హైదరాబాద్ లోని దసపల్లా హోటల్ లో సక్సెస్ మీట్ నిర్వహించింది సినిమా యూనిట్. ఈ క్రమంలో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాతల్లో ఒకరైన వివేక్ కూచిభొట్ల రావణుడి లుక్ పై జరుగుతున్న ట్రోలింగ్ విషయంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కంటెంట్ విషయానికి వస్తే చిన్న పిల్లలకు అర్ధమేయ్యేలా ఒక సినిమా తీయాలి, రామాయణం అంటే పాతకాలంలో లాగా సంస్కృత పద్యాలూ, పదాలతో ఒక సినిమా చేస్తే ఖచ్చితంగా మీరే అప్డేట్ అవ్వండిరా అని అంటారు, సో అప్డేట్ అయ్యి ఒక సినిమా చేస్తే వాళ్లు ఏంటి ఇలా ఉన్నారు? రావణాసురుడు ఏంటి ఇలా ఉన్నాడు? వీళ్ళు ఏంటి ఇలా ఉన్నారు అని అంటున్నారని అన్నారు. అంటే మీరు చూడలేదు నేను చూడలేదు, మీ ఊహకు మీరు రావణాసురుడిని ఒకలా ఊహించుకున్నారు, మేము ఒకలా ఊహించుకున్నామని ఆయన అన్నారు. కానీ ఎక్కడా చరిత్రను పక్కదోవ అయితే ఈ సినిమాలో పట్టించలేదు, రాముడు ధీరోదాత్తుడు, రాముడు సకల గుణాభిరాముడు అనే చూపించారు. మంచి చెప్పడానికి షుగర్ కోటెడ్ గా ఇలా చేశామని ఆయన అన్నారు. ఈరోజు పిల్లలకు ఒక హల్క్ తెలుసు, ఒక థోర్ తెలుసు, డిస్నీ క్యారెక్టర్లు అన్నీ తెలుసు. కానీ వీళ్లకు జాంబవంతుడు అంటే తెలుసా? సుగ్రీవుడు అంటే తెలుసా? అంగదుడు అంటే తెలుసా? తెలియదు. ఒక బ్యాట్ మ్యాన్ అంటే వెంటనే గుర్తు పడతారు కానీ అంగదుడు అంటే ఎవరూ గుర్తు పట్టరు. ఈరకంగా అయినా మన పిల్లలకి రామాయణం గురించి తెలిసే అవకాశం వచ్చిందని ఆయన అన్నారు.