నేడు గుడివాడకు సీఎం జగన్.. టిడ్కో ఇళ్ల పంపిణీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు కృష్ణా జిల్లా గుడివాడలో పర్యటించబోతున్నారు.. గుడివాడలోని మల్లాయపాలెం టిడ్కో గృహ సముదాయాన్ని ప్రారంభించనున్న ఆయన.. టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు పంపిణీ చేయనున్నారు.. దీని కోసం ఈ రోజు ఉదయం 9 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరనున్న ముఖ్యమంత్రి జగన్.. తొమిదిన్నరకు గుడివాడ మల్లయ్యపాలెంకు చేరుకుంటారు.. మల్లయ్యపాలెం జగనన్న కాలనీలోని టిడ్కో ఇళ్లు పంపిణీ చేస్తారు.. వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు.. అనంతరం బహిరంగ సభను ఉద్దేశించి మాట్లాడనున్నారు సీఎం జగన్.. ఇక, హెలిపాడ్ దగ్గర స్థానిక పార్టీ నేతలతో ఇంటరాక్ట్ కాబోతున్నారు ఏపీ ముఖ్మంత్రి.. మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో తిరిగి తాడేపల్లికి చేరుకోనున్నారు.. మొత్తంగా ఈ రోజు 8,912 టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు పంపిణీ చేయనున్నారు సీఎం వైఎస్ జగన్. కృష్ణా జిల్లా గుడివాడ సమీపంలో 300 ఎకరాల్లో 8,912 ఇళ్లను నిర్మించారు. అంతేకాకుండా, నవరత్నాలు-పేదలందరికీ ఇల్లు పథకం కింద టిడ్కో కాలనీకి ఆనుకుని 6,700 వ్యక్తిగత ఇళ్లు కూడా నిర్మిస్తున్నారు. మొత్తంగా ఉమ్మడి కృష్ణా జిల్లాలో 27,872 ఇళ్లు నిర్మాణం జరుగుతోంది. కృష్ణా జిల్లా వ్యాప్తంగా AP TIDCO.. పట్టణ ప్రాంతాల్లో 27,872 ఇళ్లను నిర్మిస్తోంది. విజయవాడ, మచిలీపట్నం, గుడివాడ, జగ్గయ్యపేట, నందిగామ, తిరువూరు, ఉయ్యూరులో ఈ ఇళ్లను నిర్మిస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లోని మధ్యతరగతి, పేదల గృహ అవసరాలను తక్కువ ఖర్చుతో తీర్చడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రూపొందించిన ఉమ్మడి వెంచర్ TIDCO గృహాలు నిర్మిస్తున్నారు..
పద్మావతి ఎక్స్‌ప్రెస్‌లో దారుణం.. రైలు నుంచి తోసేసి..!
పద్మావతి ఎక్స్ ప్రెస్ లో దారుణమైన ఘటన జరిగింది.. అనంతపురం జిల్లా గుత్తి రైల్వే స్టేషన్ సమీపంలో ఓ ప్రయాణికుడిని రైలు నుంచి తోసేశారు గుర్తుతెలియని వ్యక్తులు.. ఈ ఘటనలో ప్రయాణికుడు రమేష్ కు తీవ్ర గాయాలు కాగా.. ఆసుపత్రి కి తరలించారు.. గుత్తి రైల్వే స్టేషన్ సమీపంలో జరిగిన ఈ ఘటనలో రైలులో సీటు కోసం గొడవపడిన వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశాడట రమేష్.. దీంతో.. ఆగ్రహంతో ఊగిపోయిన ఇద్దరు ప్రయాణికులు.. రమేష్‌ను రైలు నుంచి బయటకు తోసేశారు.. ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు రమేష్.. క్షతగాత్రుడు అన్నమయ్య జిల్లా పిటిఎం మండలం కుమ్మవారి పల్లెకు చెందిన వ్యక్తిగా గుర్తించారు పోలీసులు.. ఇక, రైలు నుంచి తోసివేయడంతో.. కిందపడిపోయిన రమేష్.. తర్వాత తేరుకుని 108కి సమాచారం ఇచ్చాడు.. దీంతో.. 108 సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని.. బాధితుడిన ఆస్పత్రికి తరలించారు.. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు..
ట్రిపుల్ ఐటీ విద్యార్థినిల మరణాలు.. వీసీ వెంకట రమణ క్లారిటీ
బాసర ట్రిపుల్ ఐటీలో దీపిక అనే విద్యార్థిని మృతి చెందిన ఘటన మరవకముందే మరో విద్యార్థిని లిఖిత మృతి చెందిన ఘటన నిర్మల్ జిల్లాలో దిగ్భ్రాంతికి గురయ్యేలా చేసింది. ట్రిపుల్ ఐటీ లోనే విద్యార్థులు ఎందుకు చనిపోతున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై వీసి వెంకట రమణ స్పందించారు. లిఖిత అనే విద్యార్ధిని నాల్గవ అంతస్తు పై నుంచి ప్రమాదశాత్తు పడి చనిపోయిందని తెలిపారు. లిఖిత ఫోన్ చూస్తుండగానే భవనంపై నుంచి జారిపడిందని చెప్పాడు. ప్రమాదంలో లిఖిత వీపు భాగం దెబ్బతిందని తెలిపారు. విద్యార్థుల మృతి బాధాకరమని వీసీ అన్నారు. హాస్టల్ భవనాలకు గ్రిల్స్ ఏర్పాటు చేస్తామన్నారు. చనిపోయిన ఇద్దరు విద్యార్థుల కుటుంబాలను ఆదుకోవాలని కోరారు. తమ వంతు ఆర్థిక సహాయం చేస్తామని తెలిపారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు. దీపికా మృతి పై ప్రాధమిక నివేదిక వచ్చిందని, దీపికా పరిక్ష హాల్ లోకి సెల్ ఫోన్ తీసుకెళ్ళిందని తెలిపారు. పరీక్ష నియమాలు పాటించాలని కౌన్సిలింగ్ కోసం పరిపాలన భవనంను తీసుకెళ్లారని అన్నారు. దీపికా వాష్ రూమ్ కి వెల్లివస్తా అని చెప్పి క్షణికావేశంలో ఉరి వేసుకుని చనిపోయిందని స్పష్టంచేశారు. డైరెక్టర్ పదవి కాలం ముగుస్తుందని, దానిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని అన్నారు. డైరెక్టర్, వీసి మధ్య విభేదాలు లేవని స్పష్టం చేశారు. ట్రిపుల్ ఐటీ లో కొన్ని గ్యాప్ లు ఉన్నాయని, గతం కంటే పరిస్థితి బాగా మెరుగైందన్నారు. విద్యార్థులకు కావాల్సిన సౌకర్యాలు కల్పించామన్నారు. పరీక్షా విధానంలో మార్పుల వల్ల వచ్చే నష్టం ఏమీ లేదని క్లారిటీ ఇచ్చారు. ఇంటర్ స్థాయి లో సెమిస్టర్ విధానం వద్దు అనుకున్నామని తెలిపారు. విద్యార్థుల శ్రేయస్సు కొరకు సెమిస్టర్ విధానం ను రద్దు చేసుకున్నామని స్పష్టం చేశారు.
ఫిజీలో భీకర భూకంపం.. రిక్టార్ స్కేలుపై 6.8గా నమోదు
ఫిజీలో గురువారం అర్థరాత్రి బలమైన భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 6.8గా నమోదైంది. సమాచారం ప్రకారం, భూకంపం చాలా బలంగా ఉంది, ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. ఈ సమాచారాన్ని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (NCS) అందించింది. గురువారం అర్థరాత్రి 11.36 గంటల ప్రాంతంలో భూకంపం సంభవించినట్లు ఎన్‌సీఎస్ తెలిపింది.
టోంగా సమీపంలో భారీభూకంపం
దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలోని టోంగా సమీపంలో భారీభూకంపం సంభవించింది. ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.2 తీవ్రతతో ఉందని యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. భూకంప కేంద్రం టోంగాకు నైరుతి దిశలో 280 కిలోమీటర్ల దూరంలో 104 మైళ్ల లోతులో ఉంది. ఈ భారీ భూకంపం వల్ల అమెరికాకు ఎలాంటి సునామీ ముప్పు లేదని సునామీ హెచ్చరికల వ్యవస్థ తెలిపింది. భూకంపం తర్వాత వెస్ట్ కోస్ట్, బ్రిటిష్ కొలంబియా, అలాస్కాలకు ఎలాంటి సునామీ ముప్పు లేదని శాస్త్రవేత్తలు చెప్పారు. ఈ భూకంపం వల్ల ఆస్ట్రేలియాకు ఎలాంటి సునామీ ముప్పు లేదని ఆస్ట్రేలియా వాతావరణ శాఖ కూడా తెలిపింది. యూరోపియన్ మెడిటరేనియన్ సీస్మోలాజికల్ సెంటర్ మొదట ఫిజీ దీవుల్లో సంభవించిన భూకంపం తీవ్రత 7గా నివేదించింది.
మహిళలకు అదిరిపోయే స్కీమ్..అధిక రాబడిని పొందవచ్చు..
మహిళల అభివృద్ధి కోసం ప్రభుత్వం ఎన్నో రకాల స్కీమ్ లను ప్రవేశ పెడుతుంది.. అందులో కొన్ని స్కిమ్ లు అధిక రాబడితో పాటు రిస్క్ తక్కువగా ఉండేలా ఉన్నాయి.. ప్రభుత్వం అందిస్తున్న స్కీమ్ లలో మహిళా సమ్మాన్ పొదుపు పథకం ఒకటి..ఈ పథకం మహిళలకు మాత్రమే. ఒకేసారి చెల్లింపు తర్వాత.. హామీ మొత్తం లబ్ధిదారుని ఖాతాలో జమ చేయబడుతుంది. ఈ పథకాన్ని భారత ప్రభుత్వం కేవలం మహిళల కోసం మాత్రమే ప్రారంభించింది. ఇది మెచ్యూరిటీ పూర్తయిన తర్వాత హామీ ఆదాయాన్ని అందిస్తుంది. మహిళల పొదుపుపై వచ్చిన వడ్డీని ఎలా లెక్కించాలి. మహిళా సేవింగ్స్ స్కీమ్‌పై పొందిన వడ్డీ మెచ్యూరిటీపై చెల్లించబడుతుంది. అయితే వడ్డీ త్రైమాసిక ప్రాతిపదికన సమ్మేళనం చేయబడుతుంది. ఈ పథకంలో పెట్టుబడిపై మొత్తం సాధారణ వడ్డీ రేటుపై లెక్కించవచ్చు…ప్రభుత్వం అందిస్తున్న మిగిలిన పథకాలు లాగానే ఇది కూడా వడ్డీని లెక్కిస్తారు.. ఈ అకౌంట్ గురించి పూర్తి వివరాలు.. మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికేట్ యోజనను తల్లిదండ్రులు ఎవరైనా స్త్రీ లేదా ఆడపిల్లల కోసం తీసుకోవచ్చు. ఈ పథకం కింద 31 మార్చి 2023 నుంచి రెండు సంవత్సరాల పాటు ఖాతాను తెరవవచ్చు. ఈ పథకంలో, పెట్టుబడిదారులు ఒకే రకమైన ఖాతాను తెరవగలరు… ఈ ఖాతాను పోస్టాఫీసు లేదా బ్యాంకులలో కూడా ఓపెన్ చెయ్యొచ్చు..
ఆ సమయంలో దేవుడిని మనశ్శాంతిని ఇవ్వమని కోరుకున్నా…
సమంత గత సంవత్సరం మయోసైటిస్ అనే అరుదైన ఆటోఇమ్యూన్ వ్యాధి బారిన పడిన విషయం తెలిసిందే.. దాదాపు ఆరు నెలల చికిత్స అనంతరం ఆమె పూర్తి ఆరోగ్యంతో బయటికొచ్చి సినిమా సెట్స్‌లోకి అడుగుపెట్టింది.ప్రస్తుతం సమంత హిందీ ‘సిటాడెల్’ చిత్రీకరణ కోసం సెర్బియాకు వెళ్ళింది.మయోసైటిస్ వ్యాధి నిర్ధారణ జరిగి సంవత్సరం పూర్తయిన సందర్భంగా వ్యాధిపై తన పోరాటాన్ని గుర్తుచేసుకుంటూ సమంత ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ భావోద్వేగభరితమైన పోస్ట్ ను పెట్టింది. ‘నేను సాధారణ జీవితంలోకి అడుగుపెట్టడానికి సంవత్సర కాలం పట్టింది. ఈ క్రమంలో నా శరీరం చాలా బాధను భరించింది. అన్ని రుచులకు దూరంగా కేవలం ఔషధాలే ఆహారంగా తీసుకోని నేను బతకాల్సి వచ్చింది. అయితే భారంగా సాగుతున్న ఈ రోజులు నాకు జీవితం ఏంటో తెలియజెప్పాయి. ఆత్మపరిశీలన చేసుకునేందుకు కావాల్సిన సమయం కూడా దొరికింది. నాకు ఎలాంటి సంపదలు అలాగే బహుమానాలు వద్దని శారీరక బలాన్ని పూర్తి మనశ్శాంతిని మాత్రమే ప్రసాదిస్తే చాలని ఆ దేవుడిని కోరుకున్నా’ అంటూ సమంత ఎమోషనల్ గ మాట్లాడింది.. ఆమె విజయ్ దేవరకొండ సరసన హీరోయిన్ గా నటిస్తున్న ‘ఖుషి’ చిత్రం సెప్టెంబర్ 1న విడుదల కానుంది. ఆ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్స్,లిరికల్ సాంగ్ మంచి ఆదరణ పొందాయి. ఈ సినిమాలో సమంత ముస్లిం యువతీగా నటించబోతుంది.ఈ సినిమా పై విజయ్ దేవరకొండ భారీగా ఆశలు పెట్టుకున్నాడు.ఇంతకు ముందు చేసిన లైగర్ సినిమా ఊహించని డిజాస్టర్ అయింది.200 కోట్లు కలెక్ట్ చేస్తుంది అని అనుకుంటే భారీగా నష్టపరిచింది లైగర్ సినిమా. అందుకే ఖుషి సినిమాతో మళ్ళీ ఫామ్ లోకి రావాలనుకుంటున్నాడు విజయ్.ఈ సినిమా సమంతకు కూడా ఎంతో కీలకం. తాను నటించిన శాకుంతలం సినిమా కూడా భారీ డిజాస్టర్ అయింది. బాగా ఆడుతుంది అనుకున్నారు మూవీ టీం అంతా కానీ సినిమా ఊహించని విధంగా షాక్ తగిలింది. అందుకే ఖుషి సినిమా సమంత, విజయ్ దేవరకొండ ఇద్దరికీ ముఖ్యం.