నా ఫ్యామిలీ సేఫ్..విశాఖ ఎంపీ కీలక ప్రకటన!
విశాఖ ఎంపీ, రియల్టర్ ఎంవీవీ సత్యనారాయణ కుటుంబం కిడ్నాప్ వ్యవహారం కలకలం రేపుతోంది. విశాఖపట్నం ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ భార్య కుమారుడు ఆడిటర్ను కిడ్నాప్ చేసిన వ్యవహారం ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్ మాత్రమే కాదు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే తన భార్య కుమారుడు సహా తన ఆడిటర్ ఎంవి అలియాస్ యం వెంకటేశ్వరరావు సేఫ్ గా ఉన్నారని ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ప్రకటించారు. ఈ రోజు ఉదయం రిషికొండలో ఉన్న ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ నివాసానికి వెళ్లిన దుండగులు ముందుగా ఎంపీ భార్య, కుమారుడిని అదుపులోకి తీసుకున్నారు. ఎంపీ భార్య చేత ఆడిటర్ వెంకటేశ్వరరావుకి కాల్ చేయించి ఇంటికి పిలిపించారు. ఇంటికి పిలిపించిన తర్వాత ముగ్గురిని కిడ్నాప్ చేసి ఇంటి నుంచి తీసుకువెళ్లారు. అయితే వీరిని విశాఖపట్నంలో ఏలూరు రోడ్డులో పోలీసులు గుర్తించినట్లుగా తెలుస్తోంది. ఇక ఇదే విషయాన్ని ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కూడా ప్రకటించారు. తన భార్య, కుమారుడు, ఆడిటర్ కూడా సేఫ్ గానే ఉన్నారని వెల్లడించారు. ప్రస్తుతానికి పోలీసులు ఈ విషయానికి సంబంధించి ఎలాంటి వివరాలు బయటకు చెప్పలేదు కానీ ఈ ఘటనకు కారణం హేమంత్ కుమార్ అనే ఒక రౌడీషీటర్ అని ఎంపీ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇక ముగ్గురిని కిడ్నాప్ చేయడమే కాక 50 కోట్ల రూపాయలు తమకు చెల్లించాలని డిమాండ్ చేసినట్లుగా కూడా తెలుస్తోంది. ఈ విషయానికి సంబంధించి పోలీసులు మరిన్ని వివరాలు వెల్లడిస్తే కానీ అసలు ఏం జరిగింది? ఎందుకు ఎంపీ కుటుంబాన్ని దుండగులు కిడ్నాప్ చేశారు అనే దానిపై క్లారిటీ వచ్చే అవకాశం కనిపించడం లేదు. అయితే ఒక అధికార పార్టీ ఎంపీ కుటుంబాన్ని కిడ్నాప్ చేయడం ఇప్పుడు కలకలం రేపుతోందని చెప్పొచ్చు. కిడ్నాప్ జరిగిన సమయంలో ఎంపీ సత్యనారాయణ హైదరాబాద్ లో ఉన్నారని చెబుతున్నారు.
ఆ విషయంలో తెలంగాణ టాప్.. ఏపీకి పదో స్థానం
తెలంగాణ ఇప్పటికే ఎన్నో అవార్డులు, రివార్డులు సొంతం చేసుకుంది.. కేంద్రం నుంచే కాకుండా.. కొన్ని ప్రతిష్టాత్మక సంస్థల నుంచి కూడా అభినందనలు అందుకున్నాయి.. తెలంగాణ ప్రభుత్వ పథకాలు.. ఇప్పుడు ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో నంబర్ వన్‌గా నిలిచింది తెలంగాణ రాష్ట్రం.. సీపీ గ్రామ్ నివేదిక ప్రకారం.. ప్రజా ఫిర్యాదులను పరిష్కరించడంలో తెలంగాణ దేశంలోనే తొలి స్థానంలో నిలిచింది. గతంలోనూ అద్భుతమైన పనితీరును చూపించిన తెలంగాణ.. తాజాగా మే నెలలోనూ ఉత్తమ ప్రదర్శనను కనబరిచింది. తెలంగాణలో మే నెలలోనే 2,524 పిటిషన్లను అత్యల్పంగా ఎనిమిది రోజుల్లోనే పరిష్కరించింది.. అదే లక్షద్వీప్ 12 రోజుల వ్యవధిలో 171 పిటిషన్లను పరిష్కరించి రెండోస్థానం నిలిచింది.. ఇక, అండమాన్ నికోబార్ 442 పిటిషన్లను 20 రోజుల్లో పరిష్కరించి మూడోస్థానంలో ఉంది. ఇక, 15 వేలలోపు పిటిషన్లు ఉన్న రాష్ర్టాలను గ్రూప్-డీ క్యాటగిరీలో చేర్చారు. ఈ క్యాటగిరీ రాష్ర్టాలకు కేటాయించిన ర్యాంకింగ్‌లోనూ తెలంగాణ మొదటిస్థానంలో ఉంది.. గ్రూ ప్-డీ క్యాటగిరీలో తెలంగాణ 72.49 స్కోర్‌తో మొదటి స్థానంలో నిలవగా.. ఛత్తీస్‌గఢ్ 55.75 స్కోర్‌తో రెండోస్థానం ఉంది.. ఇదే కేటగిరీలో 8.61 శాతం స్కోర్‌తో ఆంధ్రప్రదేశ్ 10వ స్థానంలో ఉంది.. జాతీయస్థాయిలో సామాన్యుల నుంచి ఫిర్యాదులను స్వీకరించి, పరిష్కరించేందుకు సెంట్రలైజ్డ్ పబ్లిక్ గ్రీవెన్స్‌స్ రెడ్రెస్ అండ్ మానిటరింగ్ సిస్టం (సీపీజీఆర్‌ఏఎంఎస్) పేరుతో ఆన్‌లైన్ పోర్టల్‌ను కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తుండగా.. సామాన్యులెవరైనా ఈ వేదికపై ప్రజా ప్రయోజనాలతో ముడిపడి ఉన్న సమస్యలపై ఫిర్యాదు చేయొచ్చు. కేంద్రం వాటిని రాష్ర్టాలకు పంపించి, పరిష్కరించాలని కోరుతుంది. ఇందుకోసం రాష్ర్టాలవారీగా గ్రీవెన్స్ రిడ్రెస్సల్ ఆఫీసర్స్ ఉంటారు. ఇటీవలే వివిధ రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల జీఆర్‌వోల సమావేశాన్ని నిర్వహించింది.. ఆ నివేదిను బుధవారం విడుదల చేయడంతో.. ఈ విషయం వెలుగు చూసింది.
మాకు లేవా చెప్పులు..? రెండు చెప్పులు చూయించిన నాని..
ఆంధ్రప్రదేశ్‌లో చెప్పులు చూయించుకునే రాజకీయం నడుస్తోంది.. ఆ మధ్య నన్ను ప్యాకేజీ స్టార్ అంటే చెప్పుతో కొడతానంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్.. చెప్పు చూపించి మరీ వార్నింగ్ ఇచ్చారు.. అయితే, ఇప్పుడు మీడియా సమావేశంలో రెండు చెప్పులు చూపించారు మాజీ మంత్రి, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పేర్ని నాని.. తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. పవన్ కళ్యాణ్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు.. పవన్ కళ్యాణ్ తిరుగుతున్న లారీకి నారాహి అనే పేరు పెట్టాల్సిందని సెటైర్లు వేశారు.. రోజుకో రకంగా మాట్లాడుతూ వ్యూహం అంటాడని ఎద్దేవా చేశారు.. చంద్రబాబు పచ్చగా కళకళలాడటానికే పవన్ కల్యాణ్ వ్యూహమన్న నాని.. పవన్.. చంద్రబాబు చొక్కా ఎన్ని సార్లు పట్టుకున్నావు? ఎన్ని సార్లు మోడీ కోటు పట్టుకున్నావ్? లేటరైట్ పేరు మీద అల్యూమినియం దోచుకున్నందుకు చంద్రబాబు చొక్కా పట్టుకుని పవన్ అడిగారా? అని ప్రశ్నించారు. ఇక్కడకు వస్తే వంగో బెడతాం అంటూ పవన్ కల్యాణ్‌కు వార్నింగ్ ఇచ్చారు పేర్నినాని.. పవన్ కల్యాణ్ చెప్పులు చూపిస్తాడట.. మాకు లేవా చెప్పులు…? రెండు ఉన్నాయి.. మా పార్టీ ఆఫీసులో కూర్చుని చూపించాను.. ఏమయ్యింది? అని ప్రశ్నిస్తూ.. మీడియా సమావేశంలోనే తన రెండు చెప్పులను చూపించాడు పేర్నినాని.. చంద్రబాబు కోసం, చంద్రబాబు చేత, చంద్రబాబుతో జనసేన పార్టీ నడుపుతున్నారని చిన్న పిల్లలకు కూడా తెలుసన్న ఆయన.. చంద్రబాబు, జనసేన, బీజేపీ కలిపి ప్రభుత్వం నడిపారని.. అప్పుడు చంద్రబాబు ఏం చెప్పాడు? అని ప్రశ్నించారు. నేను వేసిన రోడ్ల పై నడుస్తున్నారని ప్రజలను ఉద్దేశించి చంద్రబాబు చెప్పినప్పుడు పవన్ ఎక్కడకు వెళ్ళారు? తెలంగాణ వాళ్ల చేత ఆంధ్రా కొడుకల్లారా అని చెప్పించుకున్న తర్వాత కూడా పౌరుషం రాకపోతే ఎలా అని పవన్‌ను ప్రశ్నించారు..
కాపులను వాడుకుని వదిలేయలని పవన్ చూస్తున్నాడు..
పవన్ అర్థంపర్ధం లేని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు మంత్రి కొట్టు సత్యనారాయణ. అత్యధిక కాపులు ఉండే ప్రాంతానికి వెళ్లి కాపులను తిట్టడం మంచి పద్ధతి కాదని హితవుపలికిన ఆయన.. పవన్ తెలివి తేటలు ప్రదర్శిస్తున్నారో.. అతి తెలివి చూపిస్తున్నారో తెలియని పరిస్థితి ఉందన్నారు.. కాపు రిజర్వేషన్లు ఇస్తామని నువ్వు గానీ, నీ దత్త తండ్రి గానీ చెప్పగలరా..? అంటూ పవన్‌ను నిలదీశారు. పవన్ కల్యాణ్, చంద్రబాబులను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు.. అందుకే గత ఎన్నికల్లో చిత్తు చిత్తుగా ఓడించారని తెలిపారు మంత్రి కొట్టు.. కాపుల రిజర్వేషన్ కోసం ముద్రగడ పోరాటం చేస్తే తట్టుకోలేక చంద్రబాబు రైలు తగలబెట్టి.. కేసుల్లో ఇరించారని విమర్శించారు.. కానీ, ఆ విషయం పవన్‌కు తెలియదా? అని ప్రశ్నించారు.. కాపులను వాడుకుని వదిలేయాలని చూడటం, చంద్రబాబుకి కాపులను తాకట్టు పెట్టాలని పవన్ కల్యాణ్ చూస్తున్నారంటూ ఆరోపించారు మంత్రి కొట్టు సత్యనారాయణ.
హైదరాబాద్‌లో పెరిగిన ఇళ్ల ధరలు
నిర్మాణ వ్యయాలు పెరగడం, నిర్మాణ వ్యయాలు ఎక్కువ కావడం వల్ల ఈ ఏడాది తొలి త్రైమాసికంలో ఇళ్లు, ప్లాట్ల ధరలు పెరిగిపోయాయి. గతేడాది ఇదే సమయంతో పోల్చితే ఇండియాలోని జనవరి- మార్చిలో 8 నగరాల్లో ఇళ్ల ధరలు 8 శాతం పెరిగినట్టు క్రెడాయ్-కోలియర్స్, లియోసెస్ ఫోరాస్ నివేదిక వెల్లడించింది. ఢిల్లీలో 16 శాతం పెరగగా.. కోల్‌కతాలో 15 శాతం పెరిగాయి. అదే బెంగళూరులో 14 శాతం పెరగగా.. హైదరాబాద్‌లో 13 శాతం పెరిగాయి. ఇవి కాకుండా అహ్మదాబాద్‌లో 11 శాతం, చెన్నైలో 4 శాతం, పుణెలో 11 శాతం పెరిగాయని తెలిపింది. అయితే ఇన్ని నగరాల్లో ధరలు పెరిగితే ముంబయిలో మాత్రం 2 శాతం తగ్గినట్టు నివేదికలో పేర్కొంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో చదరపు అడుగు ధర రూ. 10,410లకు చేరిందని నివేదికలో పేర్కొంది. కొన్ని నగరాల్లో నిర్మించిన ఇళ్లు అమ్ముడు పోకపోవడంతో నిర్మాణదారులు కొంత ఆందోళన చెందుతున్నారు. కోట్లాది రూపాయలు పెట్టి నిర్మాణాలు చేపట్టిన సంస్థలు నిర్మించిన ఇళ్లు అమ్ముడు పోకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. పెరుగుతున్న గిరాకీతో ప్రయోజనం పొందాలని డెవలపర్స్ కొత్త ప్రాజెక్టులను ప్రారంభిస్తున్నారు. దీంతో అమ్ముడుపోని యూనిట్ల సంఖ్యా పెరుగుతోంది. గత ఏడాదితో పోల్చితే హైదాబాద్‌లో అమ్ముడుపోని ఇళ్ల సంఖ్య 38 శాతం పెరిగిందని కోలియర్స్ ఇండియా తెలిపింది.
మణిపూర్ లో అల్లర్లు.. మహిళా మంత్రి ఇంటికే నిప్పు..!
మణిపూర్ కేబినెట్‌లో ఏకైక మహిళ మంత్రిగా ఉన్న నెమ్చా కిప్‌జెన్ ఇంటికి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. ఇంఫాలో ఉన్న మంత్రి అధికారిక నివాసానికి దుండగులు నిప్పంటించినట్లు ఒక అధికారి వెల్లడించారు. కాగా ఈ ఘటన జరిగినప్పుడు బీజేపీ నాయకురాలైన మహిళ మంత్రి నెమ్చా కిప్‌జెన్ కానీ, ఆమె కుటుంబ సభ్యులు కానీ ఇంట్లో లేరని తెలిపారు. ఆమె కుకీ కమ్యూనిటీకి చెందినది.. కాగా ఇది మెయిటీస్ వర్గీయులే దాడి చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే ఇంఫాల్ పశ్చిమ జిల్లాలోని లాంఫెల్ ప్రాంతంలో బుధవారం రాత్రి మణిపూర్ మంత్రి నెమ్చా కిప్‌జెన్ అధికారిక నివాసానికి గుర్తు తెలియని దుండగులు నిప్పు పెట్టారు. మంటలు పక్క భవనాలకు వ్యాపించకముందే అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు. గత కొన్ని రోజులుగా మణిపూర్‌లో మెయిటీ మరియు కుకీ కమ్యూనిటీల మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. ఈ హింసాకాండలో దాదాపు 115 మందికి పైగా మరణించారు.. 300 మందికి పైగా గాయపడ్డారు. దాదాపు 60,000 మంది 350 సహాయ శిబిరాల్లో తలదాచుకుంటున్నారు.
ఫిలిప్పీన్స్ లో భూకంపం..
ఫిలిప్పీన్స్ లో ఇవాళ 6.5 తీవ్రతతో భూకంపం సంభవించిందనీ, ప్రకంపనల కారణంగా నష్టం వాటిల్లే ఛాన్స్ ఉందని స్థానిక అధికారులు హెచ్చరించారు. రాజధాని మనీలాకు 120 కిలో మీటర్ల దూరంలో, 10 కిలో మీటర్ల లోతులో భూకంప కేంద్రం కేంద్రీకృతమై ఉందన్నారు. మనీలాతో సహా దేశంలోని అత్యధిక జనాభా కలిగిన ప్రాంతంలో భూప్రకంపనలు సంభవించిన తర్వాత ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీసినట్టు స్థానిక అధికారులు తెలిపారు. ప్రస్తుతం సంభవించిన భూకంప ప్రభావం చాలా అధికంగానే ఉందనీ.. ప్రకంపనల సమయంలో ఇళ్ల నుంచి బయటకు వచ్చినట్లు తెలిపారు. భూకంపం నేపథ్యంలో ప్రాణనష్టం గురించి తక్షణ సమాచార నివేదికలు లేవు.. కానీ ప్రకంపనల ప్రభావాన్ని అంచనా వేయడానికి విపత్తు అధికారులను నియమించామని కలటగాన్ మున్సిపల్ అధికారి మెండోజా చెప్పారు. భూకంపం 30 సెకన్ల నుంచి నిమిషం వరకు కొనసాగిందని కలటగాన్ విపత్తు అధికారి రోనాల్డ్ టోర్రెస్ వెల్లడించారు. భూకంప ప్రభావాన్ని అధికారులు అంచనా వేస్తున్నారని సివిల్ డిఫెన్స్ కార్యాలయ సమాచార అధికారి డియాగో మరియానో పేర్కొన్నారు. ప్రస్తుతానికి పెద్దగా ప్రాణనష్టం, ఆస్తి నష్టం జరగలేదు.. అక్కడక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయని మరియానో మీడియాకు తెలిపారు.
తన బ్యూటీ పై బోల్డ్ కామెంట్స్ చేసిన అషు రెడ్డి..!!
అషురెడ్డి సోషల్ మీడియా లో చేస్తున్న గ్లామర్ షో ఎంతో బోల్డ్ గా మారింది.అషు రెడ్డి తన ఇన్స్టాగ్రామ్ లో గ్లామర్ పిక్స్ తో రెచ్చగొడుతుంది.రాంగోపాల్ వర్మ తో బోల్డ్ ఇంటర్వ్యూ తో అషురెడ్డి మరింత గా పాపులర్ అయింది. సినిమాల్లో అయితే ఆమెకు అంతగా ఆకట్టుకునే పాత్రలు మాత్రం దక్కడం లేదు. సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ యువతని బాగా ఆకర్షిస్తోంది. ముఖ్యం గా అషు రెడ్డి అంటే జూనియర్ సమంత అని అందరూ అనుకుంటారు.అలాగే యూత్ ని పిచ్చెక్కించేలా థైస్ అందాలని ఎప్పుడూ ఎక్స్ పోజ్ చేస్తూ ఉంటుంది.అప్పుడప్పుడూ తన ఫ్యామిలీ ఫన్నీ వీడియోస్ ని కూడా అషు రెడ్డి పోస్ట్ చేస్తూ ఉంటుంది. ఇదిలా ఉండగా తాజాగా అషురెడ్డి షేర్ చేసిన పిక్స్ బాగా వైరల్ గా మారాయి. అషురెడ్డి హాట్ హాట్ డ్రెస్సుల్లో యూత్ ని బాగా ఆకట్టుకుంది.తాజాగా ఆమె చిరుత చర్మం లాంటి డ్రెస్ ను వేసుకొని నడి రోడ్డుపై మైండ్ బ్లోయింగ్ ఫోజులతో రెచ్చగొట్టింది.కళ్ళు చెదిరే విధంగా టైట్ ఫిట్ డ్రెస్ లో అషురెడ్డి అందాల హొయలు పోతూ కనిపించింది.ఈ ఫోటోల కు అషురెడ్డి కొంటెగా క్యాప్షన్ కూడా ఇచ్చింది.ఆడవారి శరీరం లో మోస్ట్ బ్యూటిఫుల్ అందాలు ఇక్కడ వున్నాయి అంటూ హాట్ గా కామెంట్ చేసింది అషు. ఇలా సోషల్ మీడియాలో పాపులర్ అయిన కూడా ఆమె కు సినిమా అవకాశాలు మాత్రం తక్కువ గానే వస్తున్నాయి.