శనిదోష నివారణ పూజ కోసం వెళ్తుండగా ప్రమాదం.. నలుగురు మృతి
ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతిచెందారు.. శని దోష నివారణ పూజల కోసం మందపల్లి వెళ్తున్నవారు ముగ్గురు, విదేశీ పర్యటన ముగించుకుని సొంత ఊరికి వెళ్లుతున్నవారిలో ఒకరు.. మృతిచెందినవారిలో ఉన్నారు.. ఈ ఘోర రోడ్డు ప్రమాదం అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం మడికి వద్ద జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో 9 మంది గాయపడ్డారు. చోడవరం నుండి టాటా మేజిక్ వాహనంలో పది మంది మందపల్లి వెళ్తున్నారు.. ఇదే సమయంలో విదేశీ పర్యటన ముగించుకుని కారులో విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్ నుంచి సొంతూరు భీమవరం.. కారులో నలుగురు బయల్దేరారు.. అయితే, టాటామ్యాజిక్ వాహనాన్ని కారు వేగంగా వచ్చి ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. నలుగురు అక్కడే మృతిచెందగా.. ప్రమాదంలో 9 మంది గాయాలపాలయ్యారు. ఇక, సమాచారం అందుకున్న ఆలమూరు పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకున్నారు.. చెల్లాచెదురుగా పడి ఉన్న మృతదేహాలను.. గాయపడిన వారిని 108 సిబ్బంది సహాయంతో ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు ఆలమూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.. AP 35 W 2306 నంబర్ గల టాటా మ్యాజిక్‌వాహనంలో రంపచోడవరం నుండి మందపల్లి శనేశ్వరస్వామి దైవ దర్శనం కోసం పది మంది వస్తుండగా.. వైజాగ్ ఎయిర్ పోర్టు నుంచి AP 39 C 2266 నంబర్ గల కారులో నలుగురు వెళ్తున్నారు.. ఈ ప్రమాదంలో టాటా మ్యాజిక్ వాహనంలోని ముగ్గురు మృతి చెందగా.. కారులో ఉన్నవారిలో ఒకరు ప్రాణాలు విడిచారు.
నేడు వరంగల్‌లో కేటీఆర్ పర్యటన.. అజంజాహిమిల్స్ గ్రౌండ్‌లో భారీ బహిరంగ సభ
మంత్రి కేటీఆర్ నేడు వరంగల్ జిల్లాలో పర్యటించనున్నారు. పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం, శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు. గీసుగొండ మండలంలోని కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కులో యంగ్‌గోన్ కంపెనీ ఎవర్ టాప్ టెక్స్‌టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో రూ.840 కోట్లతో చేపట్టనున్న వస్త్ర పరిశ్రమ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. పార్కు నుంచి మంత్రి కేటీఆర్ హెలికాప్టర్ ద్వారా ఖిలావరంగల్ చేరుకుంటారు. ముందుగా వరంగల్‌లోని నర్సంపేట రోడ్డులో ఏర్పాటు చేసిన వరంగల్ తూర్పు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని కేటీఆర్ ప్రారంభించనున్నారు. అనంతరం సమీపంలోని అజాంజాహిమిల్స్ మైదానంలో ఇంటిగ్రేటెడ్ డిస్ట్రిక్ట్ ఆఫీస్ కాంప్లెక్స్ (ఐడీఓసీ)కి మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేస్తారు.
శ్రీవారి భక్తులకు అలెర్ట్.. ఏ రోజు ఏ టికెట్లు విడుదలంటే..?
కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీవారి వేంకటేశ్వరస్వామి భక్తులకు అలెర్ట్.. ఎందుకంటే.. వివిధ రకాల సేవా టికెట్లను విడుదల చేసేందుకు సిద్ధమైంది తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ).. ఎప్పుడైనా ఏ టికెట్లను విడుదల చేసినా.. కొన్ని నిమిషాల వ్యవధిలోనే భక్తులు టికెట్లను బుక్‌చేసుకుంటున్న విషయం విదితమే కాగా.. ఎల్లుండి నుంచి అంటే ఈ నెల 19వ తేదీ నుంచి 21వ తేదీ వరకు సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళపాదపద్మారాధన సేవా టికెట్లను లక్కీడిఫ్ కోసం నమోదు చేసుకునే అవకాశం కల్పించింది టీటీడీ.. ఈ నెల 19వ తేదీన సెప్టెంబర్ నెలకు సంబంధించిన ఆర్జిత సేవా టిక్కేట్లను అమ్మకానికి పెట్టనున్నారు. ఇక, 22వ తేదీ ఉదయం 10 గంటలకు వర్చువల్ సేవా టికెట్లను విడుదల చేయనున్నట్టు ప్రకటించింది.. 22వ తేదీన పవిత్రోత్సవాల సేవా టిక్కేట్లు విడుదల కానుండగా.. 23వ తేదీన ఉదయం 10 గంటలకు అంగప్రదక్షణం టికెట్ల కోటాను విడుదల చేయనున్నట్టు టీటీడీ పేర్కొంది. మరోవైపు ఎల్లుండి టీటీడీ పాలకమండలి సమావేశం జరగనుంది.. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది.. ఇక, తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంది.. 31 కంపార్టుమెంట్లలో భక్తులు వేచిఉన్నారు.. టోకెన్‌లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతున్నట్టు టీటీడీ అధికారులు తెలిపారు.. మరోవైపు.. నిన్న శ్రీవారిని 72,299 మంది భక్తులు దర్శించుకున్నారు.. వారిలో 36,378 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు.. హుండీ ఆదాయం రూ. 3.92 కోట్లుగా ఉంది..
పరీక్షకు వచ్చిన స్టూడెంట్స్.. హిజాబ్ తొలగించాలన్న కాలేజీ యాజమాన్యం
సంతోష్ నగర్ ఐ.ఎస్.సధన్ చౌరస్తాలో ని కె.వి. రంగారెడ్డి మహిళ డిగ్రీ కళాశాలలో చెందిన కొంతమంది ముస్లిం విద్యార్థులు ఉర్దూ మీడియం డిగ్రీ పరీక్ష రాయడానికి వందలాది మంది హిజాబ్ ధరించి ఇక్కడికి వచ్చారు. కళాశాల సెంటర్ వద్ద సిబ్బంది హిజాబ్ ధరించి వచ్చిన యువతులను అడ్డుకున్నారు. హిజాబ్ ధరించడం వల్ల ఎవరో గుర్తు పట్టలేమని తెలిపారు. పరీక్ష సెంటర్ లోకి అనుమతించాలంటే హిజాబ్ తీసి వెళ్లాలని తెలిపారు. అయితే యువతులు మాత్రం హిజాబ్ తీయడానికి ససేమిరా అన్నారు. పరీక్ష రాయడానికి లోనికి అనుమతించాలని కోరారు. అయినా యాజమాన్యం మాత్రం అనుమతించలేదు. ఒకరినొకరు వాదోపవాదలు చేసుకున్నా అనుమతి నిరాకరించారు. ముస్లీం యువతులు దాదాపు అరగంట పాటు ఎదురుచూడాల్సి వచ్చింది. చివరకు గత్యంతరం లేక హిజాబ్ తీసి పరీకా కేంద్రానికి వెళ్లారు.
అతి తక్కువ వడ్డీకే హోం లోన్ అందిస్తున్న 10 బ్యాంకులు..
హోం లోన్ తీసుకునేటప్పుడు.. చాలా ఇంపార్టెంట్ విషయాలను గుర్తు పెట్టుకోవాలి. లోన్ కోసం ఎటువంటి బ్యాంకును ఎంపిక చేసుకోవాలి.. అనేది చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే.. ముఖ్యంగా ఏ బ్యాంకులో తక్కువ వడ్డీ రేట్లు కలిగి ఉందో చెక్ చేసుకోవాలి.. అతి తక్కువ వడ్డీ రేట్లకు గృహ రుణాలను అందిస్తున్నటువంటి 10 బ్యాంకుల గురించి ముఖ్యమైన సమాచారాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం.. 2010లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గృహ రుణాలపై వడ్డీ రేటును వర్తింపజేయడానికి బేస్ లెండింగ్ రేటు అంటే BLR విధానాన్ని అమలు చేసింది. 2016లో, ఇది మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్-బేస్డ్ లెండింగ్ రేట్ (MCLR)గా మార్చారు. ఆ తరువాత, అక్టోబర్ 2019 నుంచి RBI రెపో లింక్డ్ లెండింగ్ రేటు లేదా RLLRని అమలు చేసింది. దీని ఆధారంగానే బ్యాంకులు గృహ రుణలపై వడ్డీ రేటును నిర్ణయిస్తాయి. అయితే,.. పైన పేర్కొన్న బ్యాంకులు తక్కువ ధరలకు గృహ రుణాలను అందిస్తున్నాయి.. వాటి వడ్డీ రేటు తగ్గడం లేదా పెరుగుదల అనేది ఇతర అంశాలపై కూడా ఆధారపడి ఉంటుంది. క్రెడిట్ స్కోర్, లోన్ వ్యవధి, లోన్ మొత్తం.. హోమ్ లోన్‌పై వడ్డీ రేటుతో పాటు, ప్రాసెసింగ్ ఫీజు, స్టాంప్ ఫీజు, వాల్యుయేషన్ ఫీజు, కొన్ని ఇతర ఛార్జీలు వంటి అనేక అదనపు ఛార్జీలు కూడా వర్తిస్తాయి. కాబట్టి, గృహ రుణం తీసుకునే సమయంలో ఇలాంటి విషయాలను మనం గుర్తుంచుకోవాలి..
40శాతం మార్కెట్లోకి వచ్చిన రూ.2000 నోట్లు
2000 రూపాయల నోటుకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్‌డేట్‌లు వస్తున్నాయి. ఎస్‌బిఐ నుండి కోటక్ బ్యాంక్ వరకు, పిఎన్‌బి వారికి 2000 రూపాయల నోటు ఎంత తిరిగి వచ్చిందనే సమాచారాన్ని నిరంతరం ఇస్తున్నాయి. ఈసారి RBIనుంచి వచ్చిన అప్ డేట్ వింటే ఆశ్చర్యం కలుగజేస్తుంది. ఆర్బీఐ సమాచారం ఇస్తూ, ఇప్పటివరకు రూ.1.80 లక్షల కోట్లు రూ.2000 రూపంలో వచ్చాయని, అందులో రూ.83 వేల కోట్లకు పైగా తిరిగి మార్కెట్‌లోకి వచ్చినట్లు ఆర్‌బీఐ తెలిపింది. జూన్ 2 వరకు 1.80 లక్షల కోట్ల రూపాయలు బ్యాంకులకు 2000 రూపాయల రూపంలో వచ్చాయని, ఇది మొత్తం డబ్బులో 50 శాతం అని ఆర్‌బిఐ సమాచారం ఇస్తోంది. ఇందులో రూ. 83242 కోట్లు మళ్లీ మార్కెట్లోకి తిరిగి వచ్చాయి.. అది కూడా రూ. 500, 200, 100 రూపంలో. అంటే డిపాజిట్ చేయకుండా నోట్లు మార్చుకున్న వారు తిరిగి ఇతర డినామినేషన్లలోకి వచ్చారు. మే నెలలో మొత్తం 2000 రూపాయల నోట్లను ఉపసంహరించుకుంటున్నట్లు ఆర్‌బీఐ ప్రకటించింది. ఆ తర్వాత మే 23 నుంచి రూ.2000 నోట్లు బ్యాంకుల్లోకి రావడం మొదలైంది. సామాన్యులకు సెప్టెంబర్ 30 వరకు సమయం ఉంది.
తొలిరోజే కలెక్షన్ల రికార్డ్ బద్దలు కొట్టిన ‘ఆదిపురుష్’
చాలా రోజుల తర్వాత ప్రభాస్ నటించిన ‘ఆదిపురుష్’ సినిమా బాక్సాఫీస్ వద్ద విడుదలైంది. ఆదిపురుష్ విషయంలో అభిమానుల్లో విపరీతమైన క్రేజ్ ఉంది. తొలిరోజు భారీ వసూళ్లు రాబట్టిన ఈ సినిమా ఎన్నో రికార్డులను బద్దలు కొట్టింది. ఒక్క సౌత్ లోనే కాదు హిందీలోనూ ప్రభాస్ స్టింగ్ మోగుతోంది. ఆదిపురుష తొలిరోజు కలెక్షన్ల లెక్కలు తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను సాధించింది. తొలిరోజు లెక్కల ప్రకారం.. ఆదిపురుష్ హిందీలో అద్భుతంగా రాణిస్తూ మొదటి రోజు 50 కోట్లకు పైగా వసూలు చేసింది. పఠాన్ తర్వాత, ఆదిపురుష్ హిందీ మాట్లాడే రాష్ట్రాల్లో అత్యధికంగా సంపాదించింది. అలాగే ప్రభాస్ చిత్రం ఇతర భాషలలో కూడా దాదాపు 50 కోట్లు వసూలు చేసింది. ఓవరాల్‌గా ప్రభాస్, కృతి సనన్‌ల ఈ సినిమా ఇండియాలోనే 120 నుంచి 140 కోట్లు రాబట్టింది. ఇది గొప్ప రికార్డుగా పరిగణించబడుతుంది. నేడు రేపు వీకెండ్ కావడంతో భారీ వసూళ్లను రాబట్టవచ్చు. విదేశాల్లో కూడా ఆదిపురుషానికి మంచి స్పందన వస్తోంది. అడ్వాన్స్ బుకింగ్ పరంగా ఈ సినిమా ఎన్నో రికార్డులను బద్దలు కొట్టింది. ఇప్పుడు ఆదిపురుష్ తొలిరోజు వరల్డ్‌వైడ్ కలెక్షన్ గురించి చెప్పాలంటే, ఈ సినిమా 150 కోట్లను దాటవచ్చు. అయితే, ఇవి ప్రాథమిక గణాంకాలు మాత్రమే.
‘బ్రహ్మాస్త్ర’ రికార్డును బ్రేక్ చేసిన ‘ఆదిపురుష్’
విడుదలకు ముందు, విడుదల తర్వాత కూడా ‘ఆదిపురుష్’ను నిరంతరం వివాదాల మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఈ సినిమాలో రాముడు, సీత కథను చిత్రీకరించి ఉండవచ్చు. అయితే కొందరికి ఈ సినిమా అస్సలు నచ్చలేదు. ఈ చిత్రానికి వ్యతిరేకంగా హిందూ సైన్యం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. ఈ చిత్రం శ్రీరాముడిని ఎగతాళి చేసిందని కూడా ఆరోపించారు. అంతే కాకుండా సినిమాలో వాడిన డైలాగులు కూడా చాలా చర్చనీయాంశమయ్యాయి. మిక్స్ డ్ రెస్పాన్స్ మధ్య ఇప్పుడు ‘ఆదిపురుష్’ సినిమా రణబీర్ కపూర్ సినిమా బ్రహ్మాస్త్రతో లింక్ అవుతోంది. అయితే అంతకు ముందు ముందస్తు బుకింగ్ పరంగా రణబీర్, అలియా నటించిన బ్రహ్మాస్త్ర చిత్రం రికార్డును ‘ఆదిపురుష్’ బద్దలు కొట్టింది. ఈ చిత్రం విడుదలకు ముందే బ్రహ్మాస్త్రానికి ప్రేక్షకుల ఆదరణ విపరీతంగా ఉంది. సినిమా విడుదలకు ఒక్కరోజు ముందు అంటే గురువారం 25 కోట్ల విలువైన ‘ఆదిపురుష్’ టిక్కెట్లు అమ్ముడుపోయాయి. మరోవైపు, బ్రహ్మాస్త్ర అడ్వాన్స్ బుకింగ్ గురించి మాట్లాడుకుంటే, ఈ చిత్రానికి సంబంధించిన దాదాపు 17 కోట్ల విలువైన టిక్కెట్లు అమ్ముడయ్యాయి. మరోవైపు, ఈ రెండు సినిమాల్లోనూ సాధారణంగా కనిపించే ఒక విషయం ఏమిటంటే, రెండు సినిమాలు నమ్మకంతో ఆడుతున్నాయని ప్రజలు అంటున్నారు. బ్రహ్మాస్త్రలో రణబీర్ కపూర్ ఒక సన్నివేశంలో ఒక ఆలయం లోపల బూట్లు ధరించి కనిపించాడు. దీనిపై పెను దుమారం రేగింది. దీనిపై వారణాసిలో ఫిర్యాదు కూడా నమోదైంది.
బాలీవుడ్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన తాప్సీ…
ఎంతో మంది హీరోయిన్స్ తెలుగు సినిమాలలో అలరించి హీరోయిన్స్ గా మంచి పేరు తెచ్చుకున్న తర్వాత బాలీవుడ్ లో కి ఎంట్రీ ఇస్తున్నారు. అలాంటి హీరోయిన్ లలో తాప్సీ కూడా ఒకరు .మంచు మనోజ్ నటించిన ఝమ్మంది నాదం సినిమా తో తెలుగు తెరకు పరిచయం అయింది తాప్సీ. తొలి సినిమా తోనే తన నటనతో మరియు గ్లామర్ తో ఆకట్టుకుంది. ఆ తర్వాత రవితేజతో వరుసగా రెండు సినిమా ల్లో నటించింది. ప్రభాస్ తో చేసిన మిస్టర్ ఫర్ఫెక్ట్ తో మంచి హిట్ ను అందుకుంది. తెలుగులో అవకాశాలు అందుకుంటున్న సమయంలోనే బాలీవుడ్ కు వెళ్ళింది.అక్కడ పలు సినిమా అవకాశాలు అందుకున్న ఈ అమ్మడు బాగానే విజయం సాధించింది.హిందీలో తక్కువ సమయంలో మంచి క్రేజ్ ను కూడా సొంతం చేసుకుంది. అక్కడ లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో అందరిని బాగా మెప్పించింది. అలాగే స్టార్ హీరోయిన్ అయిన కంగనా రనౌత్ తో మాటల యుద్ధం కూడా జరిగింది.. అలా బాలీవుడ్ లో తాప్సీ కూడా ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకుంది. బాలీవుడ్ లో వరుసగా సినిమాలు చేస్తున్నప్పటికీ అక్కడక్కడ సౌత్ సినిమాలు కూడా చేస్తూ బాగానే ఆకట్టుకుంటుంది. ఇదిలా ఉంటే తాజాగా తాప్సీ బాలీవుడ్ పై చేసిన కామెంట్స్ ఇప్పుడు తెగ వైరల్ అవుతున్నాయి. ప్రియాంక చోప్రా వంటి స్టార్ హీరోయిన్ బాలీవుడ్ పై పలు ఆరోపణలు కూడా చేసింది ఈ ఆరోపణల పై స్పందిస్తూ తాప్సీ కూడా బాలీవుడ్ పై కొన్ని షాకింగ్ కామెంట్స్ చేసింది . ఒక సినిమా లో ఏ ఏ పాత్రలకు ఎవరిని తీసుకోవాలో కొంతమంది నటీనటులు డిసైడ్ చేస్తారని చెప్పుకొచ్చింది ఈ భామ.టాలెంట్ ఉన్నవాళ్ళు, క్యారెక్టర్ కు సూట్ అయ్యేవాళ్ళను అయితే కాకుండా.తమ స్నేహితులను అలాగే ఏజెన్సీ వాళ్ళను రిఫర్ చేస్తూ ఉంటారు అని చెప్పుకొచ్చింది. హిందీలో ఫేవరిటిజం ఎక్కువగా ఉంటాయని సంగతి తెలిసిందే..బాలీవుడ్ లో అవకాశాలు కోసం తిరుగుతున్న వారికీ అంతగా రావని తెలిపింది తాప్సీ.