Cricket: ఇటీవల ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ 2023 ఫైనల్‌లో టీమిండియా ఘోర పరాజయం పొందింది. దీంతో రోహిత్ శర్మ కెప్టెన్సీపై తీవ్రంగా కామెంట్స్ చేస్తున్నారు క్రికెట్ అభిమానులు. రోహిత్ టైం అయిపోయింది.. అతను కెప్టెన్సీ చేయడం కష్టమంటూ తీవ్ర వ్యాఖ్యలు గుప్పిస్తున్నారు. దీంతో పలువురు రోహిత్ శర్మను కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించాలని కోరుతున్నారు. అయితే బీసీసీఐ కూడా కెప్టెన్ ని మార్చాలనే ఆలోచనకు వచ్చినట్టు సమాచారం. వెస్టీండీస్ టూర్ ముగిసిన తర్వాత కెప్టెన్ మార్పు ఉంటుందని గుసగుసలు వినపడుతున్నాయి.
Read Also: AAA Cinimas: అల్లు అర్జున్ మల్టీఫ్లెక్స్.. ఏఏ సినిమాలు స్క్రీనింగ్ అవుతున్నాయంటే.. ?
ఐతే కెప్టెన్ గా రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తప్పిస్తే.. ఆ స్థానంలో ఎవరికి బాధ్యతలు అప్పగించాలనే ఆలోచనలో పడ్డారు సెలక్టర్లు. ఫిట్ గా ఉండే ప్లేయర్ ని టెస్ట్ కెప్టెన్ గా నియమిస్తే బెటర్ అని సెలక్టర్లు అంటున్నారు. అయితే రోహిత్ శర్మ స్ధానంలో టెస్ట్ సారథ్య బాధ్యతలు రవిచంద్రన్ అశ్విన్ కి ఇవ్వాలని అంటున్నాడు భారత మాజీ క్రికెటర్ దేవాంగ్ గాంధీ. ఈ ఏడాది డిసెంబర్‌లో సౌతాఫ్రికా పర్యటనలో టీమిండియా టెస్టు సిరీస్ ఆడనుంది. అప్పటిలోగా కొత్త టెస్టు కెప్టెన్‌ని ఎంపిక చేసేందుకు బీసీసీఐకి కావాల్సినంత సమయం ఉంది. కొత్త టెస్టు కెప్టెన్ ఎవరు? అనే విషయం మీద ఇప్పటికే చర్చ మొదలైపోయింది. రోహిత్ శర్మ ఫిట్‌నెస్ కారణంగా ఇంగ్లాండ్‌తో టెస్టుకి జస్ప్రిత్ బుమ్రా, బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌లకు కెఎల్ రాహుల్‌ని తాత్కాలిక సారథిగా ఎంపిక చేయాల్సి వచ్చింది.
Read Also: Periods Pains : పీరియడ్స్ లో వచ్చే నొప్పిని తగ్గించాలంటే.. వీటిని తప్పక తీసుకోవాలి..!
మరోవైపు టెస్ట్ సారథ్య బాధ్యతల విషయంలో రవిచంద్రన్ అశ్విన్ పేరు ఎక్కువగా వినిపిస్తుంది. అతను ఫిట్ గా ఉన్నాడు. టెస్టుల్లో నెం.1 బౌలర్ గా, నెం.2 ఆల్ రౌండర్ గా కొనసాగుతున్నాడు. విదేశాల్లో కూడా అశ్విన్ కు మంచి రికార్డు ఉంది. కెప్టెన్సీ స్కిల్స్ విషయంలో డౌటే అవసరం లేదు… ఒకవేళ అశ్విన్‌కి కెప్టెన్సీ ఇవ్వడం ఇష్టం లేకపోతే అజింకా రహానేకి ఇవ్వండంటూ పలువురు మాజీ క్రికెటర్లు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు టెస్ట్ సిరీస్ లలో కుర్రాళ్లకు అవకాశం కల్పించాలని కొంతమంది మాజీ క్రికెటర్లు కోరుతున్నారు. డబ్ల్యూటీసీ ఫైనల్ లో ఘోరంగా విఫలమైన సీనియర్ బ్యాటర్లలో పుజారా ఒకరు. అతని స్థానంలో కుర్రాళ్లకు ఛాన్స్ ఇస్తే.. బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు. యశస్వి జైస్వాల్, సర్ఫరాజ్ ఖాన్ వంటి కుర్రాళ్లకు అవకాశం ఇవ్వాలని అంటున్నారు.