ఏపీకి చల్లని కబురు.. రుతుపవనాలు వచ్చేస్తున్నాయి.. ఇక వర్షాలే..
వచ్చేస్తున్నాయి నైరుతి రుతుపవనాలు.. కేరళ తీరాన్ని తాకాయి.. భారీ వర్షాలు కురుస్తున్నాయి.. మరో రెండు, మూడు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో కూడా విస్తరిస్తాయనే వార్తలు వచ్చాయి.. కానీ, సీన్ రివర్స్ అయ్యింది.. రుతుపవనాల రాక ఏమోగానీ.. ఎండల తీవ్రత మరింత పెరిగింది. మృగశిరకార్తెలోకి అడుగుపెట్టినా.. బయట అడుగుపెట్టాలంటేనే ఆలోచించాల్సిన స్థాయిలో ఎండలు దంచికొడుతున్నాయి.. అయితే, 6 రోజుల క్రితం ఏపీలోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు రాయలసీమలోని పుట్టపర్తి, శ్రీహరికోటలకు చేరుకుని అక్కడే తటస్థంగా ఉండిపోయాయి. దీంతో రుతుపవనాల విస్తరణ జరగక వర్షాలు కురవలేదు.. ఉష్ణోగ్రతలు కూడా తగ్గింది లేదు.. కానీ, ఉష్ణోగ్రతలు ఇంతలా అట్టుడికిపోవడానికి వాయవ్య గాలులే కారణమని భారత వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంపైకి రాజస్థాన్ నుంచి వేడితో కూడిన పొడిగాలులు వీస్తున్నాయని, అవి దిశ మార్చుకుని నైరుతి లేదా దక్షిణ గాలులు వీచే వరకు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. మరోవైపు రుతువపనాల విస్తరణకు అనుకూల పరిస్థితులు వచ్చేశాయంటూ వాతావరణశాఖ చల్లని కబురు చెప్పింది.. ఈ నెల 18–21 మధ్య రుతుపవనాలు విస్తరించడానికి అనుకూల పరిస్థితులు ఉన్నాయని.. 19వ తేదీ నుంచి రాయలసీమలో తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని.. క్రమంగా కోస్తాంధ్రలోనూ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.. కోస్తాంధ్రలో కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన వర్షాలకు ఆస్కారం ఉందని పేర్కొన్నారు. గంటకు 30–40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని వాతావరణశాఖ చెబుతోంది..
ఎంపీ కుటుంబం కిడ్నాప్ కేసులో కుట్ర.. సీబీఐ, ఎన్‌ఐఏతో విచారణ జరగాలి..!
విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ భార్య, కొడుకు, ఆడిటర్ కిడ్నాప్ కలకలం సృష్టించింది.. అయితే, రంగంలోకి దిగిన పోలీసులు కొన్ని గంటల వ్యవధిలోనే ఈ కేసును ఛేదించారు.. నిందితులను అరెస్ట్ చేశారు.. కిడ్నాప్‌నకు గురైనవారు అంతా సేఫ్ గా వచ్చేశారు.. అయితే, ఈ కేసులో సంచలన వ్యాఖ్యలు చేశారు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్ రాజు.. ఎంపీ కుటుంబం కిడ్నాప్ కేసులో కుట్ర దాగి ఉందన్న ఆయన.. ఈ కేసును సీబీఐ, ఎన్‌ఐఏతో విచారణ జరిపించాలని కోరారు.. ఎంపీ కుటుంబం కిడ్నాప్ ఆశ్చర్యానికి గురి చేసిందన్న ఆయన.. ఎంపీ ఇంటికి ఒక ఆకు రౌడీ వెళ్లాడంటే సాధారణమైన విషయం కాదు.. దీని వెనుక పెద్ద కుట్ర దాగి వుందనే అనుమానం కలుగుతోందన్నారు.. సినిమా స్టోరీని మించిన నిజంగా జరిగిన ఘటన ఇది.. ఈ ఘటన వెనుక ఎంపీ బయటకు చెప్పుకోలేని విషయాలు దాగి ఉన్నాయి అన్నారు. భార్య, కుమారుడు ఎక్కడ ఉన్నారో ఎంవీవీ ఎందుకు గమనించలేదని అంతుబట్టని విషయమన్న ఆయన.. ఎంపీ కొడుకు ఫోన్ చేస్తే.. రోజు స్టేషన్ కు రావాల్సిన రౌడీషీటర్ కదలికలను వదిలేస్తారా..? అని ప్రశ్నించారు.
గతంలో విద్య అంటే కేరళ, ఢిల్లీ.. ఇప్పుడు ఏపీవైపు చూస్తున్నారు..!
గతంలో విద్య అంటే కేరళ, ఢిల్లీ వైపే చూసేవారు.. కానీ, ఇప్పుడు పరిస్థితి మారిపోయింది.. అంతా ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్నారని వ్యాఖ్యానించారు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ.. విజయనగరంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఉత్తమ మార్కులు తెచ్చుకున్న వారిని మిగిలిన విద్యార్థుల మధ్య ఉంచితే వారు స్ఫూర్తిని నింపగలరన్న ఉద్దేశంతో ఆణిముత్యాలు కార్యక్రమం పెట్టడం జరిగిందన్నారు. జిల్లాలో ఉత్తమ మార్కులు తెచ్చుకున్న ముఫ్పై రెండు మంది విద్యార్థులను సత్కరించడం జరుగుతోందన్న ఆయన.. మిగిలిన వారూ పోటీ పడాలనిపించే విధంగా.. ఇలాంటి ప్రోత్సాహకాలు అందిస్తున్నాం. అలాగే విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దిన ఉపాధ్యాయులను కూడా సత్కారిస్తున్నాం.. డబ్బుకాదు ముఖ్యం.. ఇది విద్యార్థుల ఉన్నతి కాక్షించడానికని గమనించాలని.. వీరిని స్పూర్తిగా తీసుకొని మిగిలిన వాళ్లు పోటీ పడాలని.. ప్రతి ఒక్కరూ ఇలాగే సత్కారాలు పొందాలని ఆశిస్తున్నానని తెలిపారు. మధ్యాహ్నం భోజన పథకం గతంలో తూతూ మంత్రంగానే సాగేది.. ఇప్పుడు ముఖ్యమంత్రి గారే స్వయంగా పర్యవేక్షిస్తున్నారని తెలిపారు మంత్రి బొత్స.. ఇక, పోటీ పరీక్షల్లో అందరికంటే దీటుగా ఉండాలనే బైజ్యూస్ తో టైయప్ చేసి ఇంగ్లీషు మీడియం విద్యని ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు.. స్కూళ్లలో స్మార్ట్ టీవీలు ఏర్పాటు చేసి విద్యను అందించాలని నిర్ణయించాం.. గతంలో విద్య అంటే కేరళ, ఢిల్లీల వైపే చూసేవారు.. కానీ, ఇప్పుడు అంతా ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్నారని తెలిపారు మంత్రి బొత్స సత్యనారాయణ.
కిడ్నాప్ కేసులో కీలక ట్విస్ట్.. ప్రియురాలికి రూ.40 లక్షలు
విశాఖలో ఎంపీ భార్య, కుమారుడు, ఆడిటర్ కిడ్నాప్ కేసు కలకలం సృష్టించింది.. ఈ కేసులో విచారణ కొనసాగుతుండగా.. ఇప్పటికే ప్రధాన నిందితుడు హేమంత్‌తో పాటు లాయర్ బొమ్మడి రాజేష్, వులవల రాజేష్ అనే వ్యక్తలను అరెస్ట్ చేశారు పోలీసులు.. ముగ్గురిని రిమాండ్‌కు తరలించారు.. కిడ్నాప్ వ్యవహరంలో పాల్గొన్న మైనర్ బాలురుతో మరికొంత మంది కోసం 7 బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు.. కిడ్నాప్ చేసిన ముగ్గురిని హేమంత్ గ్యాంగ్ చిత్ర హింసలు పెట్టినట్టు చెబుతున్నారు. బాధిత ఎంపీ ఫ్యామిలీ, ఆడిటర్ నుంచి రూ.1.75 కోట్లు వసూలు చేశాడు హేమంత్.. అయితే, ఈ వ్యవహారంలో కీలక విషయాలు వెలుగుచూస్తున్నాయి.. డబ్బులు వసూలు చేయడడమే కాదు.. అనంతరం ఎంపీ ఇంటి వద్దనే వాటాలు వేసుకోని.. ఆడిటర్ జీవీ చేత తన ప్రియురాలు సుబ్బలక్ష్మికి రూ.40 లక్షలు పంపించాడు హేమంత్.. అందులో బెయిల్ కోసం 20 లక్షలు లాయర్ రాజేష్‌కు ఇవ్వాలని తెలిపారు.. జీవీ ఆస్తులను సైతం తనకు రాసివ్వాలంటూ హేమంత్ ఒత్తిడి చేసినట్టు తెలుస్తోంది.. కిడ్నాపర్ల నుంచి క్రికెట్ బ్యాట్, కత్తి, 86 లక్షల క్యాష్, 7 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు విశాఖ పోలీసులు.
నీళ్లల్లో దూకి మరీ రిపోర్టింగా.. జర్నలిస్ట్ అంటే నువ్వే బాసూ…
పాకిస్థాన్‌లోని కరాచీలో వైరల్‌గా మారిన ఓ వీడియో సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది. అతని ఫన్నీ రిపోర్టింగ్ ప్రజలను నవ్వించింది. ఈ వింత టెక్స్ట్ కారణంగా పాకిస్థానీ రిపోర్టర్ ఇంటర్నెట్‌లో సంచలనం సృష్టించాడు. ఇది చాలా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో ఒక మధ్య వయస్కుడైన వ్యక్తి ‘లైవ్ రిపోర్టింగ్’ కాన్సెప్ట్‌ను కొత్త స్థాయికి తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తున్నాడు. వాతావరణ సమాచారాన్ని రిపోర్ట్ చేస్తున్నప్పుడు, రిపోర్టర్ ప్రేక్షకులను ఆశ్చర్యపరిచే పనులు చేస్తాడు. ఏది ఒప్పో ఏది తప్పో తెలియకుండానే ఉత్సాహంగా రిపోర్టు చేస్తున్నాడు. వైరల్ క్లిప్‌లో అబ్దుల్ రెహ్మాన్ ఖాన్ అనే రిపోర్టర్ బీచ్‌లో రిపోర్ట్ చేస్తున్నాడు. వాతావరణ సమాచారం ఇచ్చే పనిని చాలా ఫన్నీగా చేస్తున్నాడు. సముద్రం ఎంత లోతుగా ఉందో, వాతావరణం ఎలా ఉంటుందో ఇక్కడ సరదాగా, అతిశయోక్తిగా చెబుతున్నారు. అసలు ఆశ్చర్యం ఏమిటంటే, అతను మైక్రోఫోన్ పట్టుకుని సముద్రంలోకి దూకి, ఈత కొడుతూ రిపోర్టింగ్ కొనసాగించాడు. అతను నీటిలోకి వెళ్లి అది ఎంత లోతుగా ఉందో చెబుతాడు.
నన్నడిగే సీఎస్కే జట్టులోంచి తీసేశాడు..!
ఐపీఎల్ 2021లో చెన్నై సూపర్ కింగ్స్ కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంది. మిస్టర్ ఐపీఎల్‌గా పేరు పొందిన సురేశ్ రైనాను రాబిన్ ఉతప్ప కోసం తప్పించింది. సీజన్‌కు ముందే రాజస్థాన్ రాయల్స్ నుంచి అతడిని కొనుగోలు చేసిన సీఎస్కే యాజమాన్యం.. ఢిల్లీ మ్యాచ్ లో అతన్ని తుది జట్టులోకి తీసుకుంది. దీంతో ఈ మ్యాచ్ తర్వాత రైనాను టీమ్ లోకి తీసుకోలేదు.. టాస్‌కు ముందే అతడు గాయపడ్డాడని ధోని చెప్పడం గమనార్హం. రాబిన్ ఉతప్పతో జరిగిన చర్చలో సురేశ్ రైనా ఈ విషయాలను తెలిపాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచులో రైట్ హ్యాండర్ బ్యాటర్‌ను తీసుకోవడం వ్యూహాత్మక అంశమని అతడు వివరించాడు. అందుకోసమే ఎంఎస్ ధోనీ తనని ముందుగా సంప్రదించాడని సురేశ్ రైనా తెలిపాడు. ఢిల్లీ మ్యాచుకు ముందు నేను, ఎంఎస్ ధోనీ మాట్లాడుకున్నాం.. రాబిన్ ఉతప్పను ప్రయత్నించడం మంచిదని నేను సలహా ఇచ్చాను అతడు చెప్పాడు. ఉతప్పను ఆడించేందుకు ఎంఎస్ ధోని నా పర్మిషన్ తీసుకున్నాడు.. నన్ను నమ్ము! ఉతప్ప మనల్ని ఫైనల్‌కు తీసుకెళ్తాడని నేను నచ్చచెప్పాను’ అని రైనా వివరించాడు. నేను లేని తుది జట్టును తీసుకోవడం ధోనీ డిక్షనరీలోనే లేదు.. 2008 నుంచి మనిద్దరం కలిసి ఆడుతున్నామని ధోని చెప్పాడు.. తాను ఈ సీజన్ ఎలాగైనా గెలవాలని పేర్కొన్నాడు అని రైనా అన్నాడు. దాంతో రాబిన్‌ను మూడో స్థానంలో ఆడించాలని, ఫైనల్ వరకు అలాగే కొనసాగించాలని సూచించాను.. నువ్వు గెలిస్తే సీఎస్కే గెలిచినట్టే.. ఎవరు ఆడినా ఒక్కటే.. రాబిన్, రైనాకు తేడా లేదని చెప్పా అని సురేశ్ రైనా పేర్కొన్నాడు.
అమెరికాలో ప్రధాని మోడీ పేరుతో కారు నంబర్ ప్లేట్
ప్రపంచ నాయకుడిగా ప్రధాని నరేంద్ర మోడీ స్థాయి ఎంత పెరిగిందో ప్రపంచ వ్యాప్తంగా ఆయనకున్న ప్రజాదరణను బట్టి అంచనా వేయవచ్చు. భారతదేశం నుండి అమెరికా వరకు చాలా మంది ప్రజల హృదయాల్లో ప్రధాని మోడీ చెరగని ముద్ర వేశారు. అలాంటి వారిలో ఒకరు అమెరికాలోని భారతీయ సంతతికి చెందిన రాఘవేంద్ర. రాఘవేంద్ర ప్రధాని మోడీని ఎంతగానో ఆరాధిస్తారు. అమెరికాలో మోడీ నేమ్ ప్లేట్‌ను కూడా తయారు చేసుకున్నారు. న్యూస్ ఏజెన్సీ ANI దీనికి సంబంధించిన వీడియోను విడుదల చేసింది, అందులో NMODI అనే నంబర్ ప్లేట్ కనిపిస్తుంది. రాఘవేంద్ర మాట్లాడుతూ.. తాను ప్రధాని మోడీని ఎంతగానో అభిమానిస్తానని చెప్పారు. దేశానికి ఏదైనా మంచి చేయాలనే స్పూర్తిని ప్రధాని మోడీ నుంచే పొందుతున్నా అన్నాడు. అతనిని చూసి ముగ్ధుడై, 2016లో అతను PM మోడీ పేరు నంబర్ ప్లేట్‌ను తీసుకున్నాడు. తాను నరేంద్ర మోదీ పేరుతో నంబర్ ప్లేట్‌ను పొందాలనుకున్నానని, అయితే అందుకు అనుమతించలేదని, ఆ తర్వాత తనకు NMODI పేరుతో నంబర్ ప్లేట్ జారీ చేశారని ఆయన గతంలో చెప్పారు. ప్రధాని మోడీ అమెరికా పర్యటనకు వస్తున్నారని, ఆయనకు స్వాగతం పలికేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని చెప్పారు.
చికెన్ నూడుల్స్ ను ఇలా చేస్తే చాలా టేస్టీగా ఉంటాయి..
ఒకప్పుడు హెల్తీ ఫుడ్ ను తీసుకొనేవారు.. ఇప్పుడు మాత్రం ఎక్కువగా ఫాస్ట్ ఫుడ్ ను ఇష్టంగా తింటున్నారు.. అయితే బయట స్ట్రీట్ ఫుడ్ తినడం అంత మంచిది కాదు.. వాళ్ళు ఎలా చేస్తారో, ఎలా చేస్తారో కూడా తెలియదు.. అందుకే అలాంటి టేస్ట్ వచ్చేలా ఇంట్లోనే మనం ఫాస్ట్ ఫుడ్ ను చేసుకోవచ్చు.. అందులో ఈరోజు మనం చికెన్ నూడుల్స్ ను ఎలా చెయ్యాలో ఇప్పుడు తెలుసుకుందాం.. ముందుగా చికెన్ ను ఒక గిన్నెలో వేసి బాగా కడిగి పక్కన పెట్టాలి..అర టీ స్పూన్ కారం, అర టీ స్పూన్ గరం మసాలా, పావు టీ ఉప్పు, ఒక టీస్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలపాలి. తరువాత ఇందులో చికెన్ ను వేసి కలపాలి. తరువాత కార్న్ ఫ్లోర్, మైదాపిండి వేసి కలపాలి. ఆ తరువాత సగం కోడిగుడ్డును, ఫుడ్ కలర్ ను వేసి బాగా కోట చేసుకోవాలి. దీనిని అలాగే 30 నిమిషాల పాటు మూత పెట్టి పక్కకు ఉంచాలి. ఇక తరువాత గిన్నెలో లీటర్నర నీళ్లు, ఉప్పు, ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి వేడి చేయాలి. నీళ్లు మరిగిన తరువాత నూడుల్స్ వేసి 90 శాతం ఉడికించాలి.. తర్వాత ఈ నూడుల్స్ ను జల్లి గంటే తీసుకొని నూడుల్స్ ను వడగట్టుకోవాలి..నూడుల్స్ ను కాసేపు చల్లారనివ్వాలి..స్టవ్ ఆన్ చేసి కడాయిల్ పెట్టాలి..నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక చికెన్ ముక్కలను వేసి వేయించాలి. వీటిని మధ్యస్థ మంటపై కరకరలాడే వరకు వేయించుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత ఈ ముక్కలను కావల్సిన పరిమాణంలో కట్ చేసుకోవాలి. ఇప్పుడు పెద్ద కళాయిని స్టవ్ మీద ఉంచి వేడి చెయ్యాలి.. ఇక కళాయి వేడయ్యాక 3 టేబుల్ స్పూన్ల నూనె వేసి కళాయి అంతా చేసుకోవాలి. నూనె వేడైన తరువాత రెండు కోడిగుడ్లు వేసి వేయించాలి. కోడిగుడ్లు వేగిన తరువాత ఇందులో క్యారెట్ ముక్కలు, క్యాబేజి తురుము, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసి ఒక నిమిషం పాటు వేయించాలి. తరువాత వేయించిన చికెన్ ముక్కలు వేసి కలపాలి. తరువాత నూడుల్స్ వేసి కలపాలి.. వీటన్నిటిని బాగా కలిసేవరకు టాస్ చెయ్యాలి..స్ప్రింగ్ ఆనియన్స్ ను చల్లుకుని మరో అర నిమిషం పాటు టాస్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే చికెన్ నూడుల్స్ తయారవుతాయి.. అంతే ఎంతో టేస్టీగా ఉండే చికెన్ నూడుల్స్ రెడీ అయ్యినట్లే..
కోట్లు ఖరీదైన కారు కొన్న హీరో యష్..!!
కన్నడ స్టార్ హీరో అయిన యష్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.. కేజిఎఫ్ సినిమాతో దేశవ్యాప్తంగా భారీ పాపులారిటీని తెచ్చుకున్నాడు యష్.ఎలాంటి సపోర్ట్ లేకుండా సినిమా ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నాడు. కేజిఎఫ్ సినిమా తర్వాత అభిమానులు చాలామంది యష్ ని రాఖీ బాయ్ అనే ముద్దుగా పిలుస్తున్నారు.. తాజాగా యష్ ఒక ఖరీదైన ల్యాండ్ రోవర్ కంపెనీకి చెందిన రేంజ్ రోవర్ ను కొనగోలు చేశాడు. కాగా ఈ కారు ఖరీదు సుమారు రూ.4 కోట్లు ఉంటుందని సమాచారం.. ఇండియన్ మార్కెట్లో బడా వ్యాపారులు అలాగే సినీ తారలు ఎక్కువగా కొనుగోలు చేసే కార్లలో రేంజ్ రోవర్ కూడా ఒకటి. ఈ కారు అత్యాధునిక ఫీచర్స్ తో పాటు ఆకర్షణీయమైన డిజైన్ ను కలిగి ఉంటుంది. ఈ కారుతో పాటు ఇప్పటికే యష్ వద్ద మెర్సిడెస్ బెంజ్ డీఎల్ఎస్ 350 డి, ఆడి క్యూ 7, అలాగే రేంజ్ రోవర్ ఎవోక్, మిత్సుబిషి పజెరో స్పోర్ట్స్ మరియు మెర్సిడెస్ జీఎల్సి 250 డి కూపే లాంటి భారీ లగ్జరీ కార్లు ఉన్నాయి. ప్రస్తుతం ఆ కార్ కు సంబంధించిన ఫోటోలు మరియు వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారాయి. అందులో యష్ తో పాటు ఆయన భార్యా పిల్లలు కూడా ఉన్నట్లు తెలుస్తుంది..కారు కొన్న సందర్బంగా ఆయన అభిమానులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.కెజిఎఫ్ 2 తో భారీ హిట్ కొట్టిన యష్,ప్రశాంత్ నీల్ కాంబో కెజిఎఫ్ 3 కి సిద్ధం అవుతున్నట్లు సమాచారం.