మనం కడుతున్నవి ఇళ్లు కాదు.. ఊళ్లు..
మనం కడుతున్నవి ఇళ్లు కాదు.. ఊళ్లు అని ప్రకటించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. గుడివాడలో టిడ్కో ఇళ్ల పంపిణీ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగసభలో ఆయన మాట్లాడుతూ.. ఈరోజు దేవుడి దయతో ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం.. మనం కడుతున్నవి ఇళ్లు కాదు.. ఊళ్లు అన్నారు. పేదలకు 300 అడుగుల టిడ్కో ఇళ్లు ఉచితంగా లబ్ధిదారులకు ఒక్క రూపాయితో ఇస్తామని చెప్పాం.. లేవుట్ 257 ఎకరాల స్థలం సేకరించి ఒక పక్కన టిడ్కో ఇళ్లు, మరోపక్క ఇళ్ల స్థలాలు ఇచ్చి నిర్మాణం చేస్తున్నాం. వీటన్నింటి మధ్య ఈరోజు కొత్త గుడివాడ నగరం కనిపిస్తోందన్నారు.. 16,240 కుటుంబాలు.. ఇంటికి కనీసం ముగ్గురు వేసుకున్నా 40 వేల పైచిలుకు జనాభా ఇక్కడే కాలనీలో నివాసం ఉండబోతోంది. 800 కోట్ల రూపాయలతో 8,912 ఇళ్లు ఈరోజు కట్టడమే కాకుండా కట్టిన ఇళ్లను నా అక్కచెల్లెమ్మలకు ఇచ్చే కార్యక్రమం జరుగుతోందన్నారు. 7,728 ఇళ్ల స్థలాలను, ఇళ్లులేని నా నిరుపేద అక్కచెల్లెమ్మలకు ఇళ్లస్థలాలు కూడా ఇచ్చాం. 8,912 టిడ్కో ఇళ్లతో కలిపి 16,240 ఇళ్లు, కుటుంబాలు నివాసం ఉండబోతున్నాయి. గుడివాడలో మొత్తంగా 13,145 మంది అక్కచెల్లెమ్మలకు ఇళ్ల పట్టాలిచ్చాం. ఒక్క నియోజకవర్గంలోనే 22 వేల మంది అక్కచెల్లెమ్మలకు ఇళ్లు, ఇళ్ల స్థలాలు ఇచ్చాం. ప్రతి లబ్ధిదారుకి 1.1 సెంటు ఇచ్చాం. 7 లక్షల రూపాయలు అక్కచెల్లెమ్మల చేతిలో పెట్టడం జరిగింది. జూలై 8న 8,859 ఇళ్ల పట్టాలకు అదనంగా మరో 4,200 ఇళ్లు కూడా మంజూరు చేస్తున్నాం అని వెల్లడించారు సీఎం జగన్.
సమస్యల పరిష్కారం కోసం సర్కిల్ ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు
సమస్యల పరిష్కారం కోసం సర్కిల్ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పనిలేదని మంత్రి కేటీఆర్ అన్నారు. నేటి నుంచి కొత్త పాలన అందుబాటులోకి వస్తుందన్నారు. జీహెచ్‌ఎంసీలో వార్డు కార్యాలయాలు అందుబాటులోకి వచ్చాయి. పౌరసమస్యల పరిష్కారంలో నగరవాసులకు మరింత చేరువయ్యేందుకు ప్రభుత్వం కొత్త ఆలోచనలతో ముందుకు వచ్చిందన్నారు. గ్రేటర్ హైదరాబాద్‌లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన వార్డు కార్యాలయాలు ప్రారంభమయ్యాయి. కాచిగూడలో వార్డు కార్యాలయాన్ని స్థానిక ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్‌తో కలిసి మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. వార్డు అధికారితో పాటు ఒక్కో వార్డులో 10 మంది చొప్పున 150 వార్డుల్లో మొత్తం 1500 మంది అధికారులు ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటారన్నారు. ప్రజా సమస్యలను అక్కడికక్కడే పరిష్కరిస్తామన్నారు. ఎంతకాలం సమస్యలు పరిష్కరించాలనే విషయమై వార్డు కార్యాలయంలో పౌరసరఫరాల పత్రాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి తొమ్మిదేళ్లు పూర్తి చేసుకుని పదవ వసంతంలోకి అడుగుపెడుతున్నామని మంత్రి కేటీఆర్ అన్నారు. రాష్ట్రంలో మొత్తం 4 కోట్ల జనాభా ఉందని, అందులో కోటి మందికి పైగా హైదరాబాద్ లోనే ఉన్నారని తెలిపారు. నగరం చాలా జనసాంద్రతతో కూడుకున్నదని చెబుతారు. కోట్లాది మందికి సేవలు అందించేందుకు క్షేత్రస్థాయికి పాలన సాగించామన్నారు. వార్డు పాలకవర్గం ప్రజలకు మరింత చేరువయ్యేలా అధికారులను తీసుకొచ్చినట్లు వెల్లడించారు. గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శి, ఇతర సిబ్బంది, చిన్న మున్సిపాలిటీల్లో వార్డు అధికారి ఉంటారని తెలిపారు. ఇక కోటి జనాభా దాటిన జీహెచ్‌ఎంసీలో కేవలం 35 వేల మంది సిబ్బంది మాత్రమే ఉన్నారు. అందుకోసం వార్డు కార్యాలయాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
ఏ విషయంలోనూ స్పష్టత లేని వ్యక్తి పవన్.. రాజకీయాలకు పనికిరాడు..
ఏ విషయంలోనూ స్పష్టత లేని వ్యక్తి పవన్ కల్యాణ్.. ఆయన అమాయకుడనో.. మెంటల్ అనో అనను.. కానీ, చంచల మనస్కుడు.. రాజకీయాలకు పనికిరాడు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు మంత్రి అంబటి రాంబాబు.. తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో ఉన్న ఆయన.. మీడియాతో మాట్లాడుతూ.. సినిమాల్లో హీరో అయిన వ్యక్తి రాజకీయాల్లోకి వస్తే హీరో అవుతారు అని నిరూపించిన వ్యక్తి ఎన్టీఆర్.. కానీ, కామెడీ యాక్టర్ అవుతారని నిరూపించిన వ్యక్తి పవన్ కల్యాణ్ అని సెటైర్లు వేశారు.. ప్రశ్నిస్తానని రాజకీయాల్లోకి వచ్చావు.. ఐదేళ్ళ టీడీపీ పాలనలో ఎవరిని ప్రశ్నించావు..? అని నిలదీశారు. సీఎం జగన్ ఎన్ని మంచి పనులు చేసిన కొనియాడ లేడు, ప్రశ్నిస్తాడు అని మండిపడ్డారు. అసలు, రాష్ట్ర రాజకీయాల్లో పవన్ ధ్యేయం ఏమిటి..? సింగిల్ గా పోటీ చేస్తావా, అసెంబ్లీలో అడుగు పెట్టడమా.. నీకు క్లారిటీ ఉందా ? గతంలో రెండుసార్లు అధికారం ఇచ్చుంటే బాగా చేసేవాడట.. లేదంటే దిగిపోయేవాడట.. ఈ మాత్రం దానికి అధికారం కోరుకోవడం దేనికి.. ముఖ్యమంత్రి అవ్వాలనుకుంటున్నావా లేదా సూటిగా చెప్పాలి.. 175 స్థానాలకు పోటీ చేస్తావా లేదా కనీసం సగం స్థానాలుకైనా పోటీ చేస్తావా.. ఇదేనా స్పష్టం చేయాలి.. అసెంబ్లీలోకి వెళ్లాలనే ఉద్దేశంతోనే పోటీ చేస్తావా? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు మంత్రి అంబటి.
ఇండిగో విమానానికి తప్పిన ప్రమాదం.. ఐదు రోజుల్లో ఇది రెండోసారి
ఇండిగో ఎయిర్‌లైన్స్ విమానాల భద్రతపై మరోసారి ప్రశ్నలు తలెత్తుతున్నాయి. గురువారం అహ్మదాబాద్ విమానాశ్రయంలో ఇండిగో ఎయిర్‌లైన్స్ విమానానికి తృటిలో ప్రమాదం తప్పింది. విమానాశ్రయంలోని రన్‌వేపై ల్యాండింగ్ సమయంలో ఇండిగో విమానం వెనుక భాగం నేలను తాకింది. అయితే ఆ తర్వాత విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేశారు. ఈ సంఘటన కూడా కలవరపెడుతోంది ఎందుకంటే ఇండిగో విమానానికి గత 5 రోజుల్లో రెండవ సారి ఈ ప్రమాదం జరిగింది. అంతకుముందు జూన్ 1న కూడా కోల్‌కతా నుంచి వస్తున్న ఇండిగో ఎయిర్‌బస్ A321 విమానం ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అవుతుండగా టెయిల్ స్ట్రైక్ వచ్చింది.
చైనా అధ్యక్షులు జిన్‌పింగ్‌తో నేడు బిల్‌గేట్స్ భేటీ
ప్రపంచంలోని అత్యంత సంపన్నుల్లో ఒకరైనా మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకులు బిల్ గేట్స్ నేడు చైనాలో.. ఆ దేశ అధ్యక్షుడు చైనా అధ్యక్షులు జిన్‌పింగ్‌తో భేటీ కానున్నారు. మలేరియా మరియు క్షయవ్యాధిపై పోరాడటానికి చైనా చేస్తున్న ప్రయత్నాలకు మద్దతుగా తమ ఫౌండేషన్ నుంచి సహాయం చేయడానికి ముందుకొచ్చిన నేపథ్యంలో బిల్ గేట్స్ చైనా అధ్యక్షుడితో భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. బిల్ గేట్స్ ఫౌండేషన్ నుంచి వ్యాదులపై చైనా ప్రభుత్వం చేస్తున్న పోరాడటానికి సహాయం చేయడానికి 50 మిలియన్ల అమెరికా డాలర్లను ఇవ్వనున్నారు. చైనాను సందర్శించిన అనేక మంది విదేశీ వ్యాపారవేత్తల్లో బిల్‌గేట్స్ కూడా ఉన్నారు. చైనా దేశం కఠినమైన కోవిడ్ నియంత్రణలను ముగించుకుందని.., దాదాపు మూడు సంవత్సరాల పాటు ప్రపంచం నుండి చైనాకు రాకపోకలు మూసివేయబడిన విషయం తెలిసిందే.
పోస్టల్ లో భారీగా ఉద్యోగాలు.. పూర్తి వివరాలు..
కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగులకు వరుస గుడ్ న్యూస్ లను చెబుతుంది.. మరి కొద్ది రోజుల్లో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో వరుసగా జాబ్ నోటిఫికేషన్ లను విడుదల చేస్తూ వస్తుంది.. ఈమేరకు పోస్టల్ లో ఖాళీ ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది.. ఇటీవల పోస్టల్ డిపార్ట్ టెంట్ నుంచి భారీ నోటిఫికేషన్ విడుదలైంది. పదో తరగతి అర్హతతో ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు..ఇటీవల 40వేలకు పైగా గ్రామీణ్ డక్ సేవక్ (జీడీఎస్) పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే.. దానికి ఎక్కువ మంది అప్లై చేసుకున్నారు.. ఇప్పుడు తాజాగా మరో నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. 12 వేలకు పైగా ఉద్యోగాల భర్తీకి పోస్టల్ శాఖ మరో నోటిఫికేషన్ విడుదల చేసింది..స్పెషల్ జీడీఎస్ ఆన్ లైన్ ఎంగేజ్ మెంట్ కింద 5,746 బీపీఎం అండ్ 7,082 ఏబీపీఎం పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది… ఈ నోటిఫికేషన్ కోసం పూర్తి సమాచారం కోసం https://indiapostgdsonline.gov.in/ వెబ్ సైట్ సందర్శించవచ్చు.
ఈసారి మరో డిఫరెంట్ సినిమాతో రాబోతున్న నరేష్…?
అల్లరి సినిమాతో తెలుగు ఇండస్ట్రీ కి పరిచయం అయ్యాడు నరేష్. అల్లరి సినిమా పేరే తన స్క్రీన్ నేమ్ గా మారిపోయింది..నరేష్ తన కెరియర్ మొదటి నుంచి కూడా అన్ని కామెడీ సినిమాలు చేసేవాడు…కానీ కొన్నాళ్ళు గా ఆ సినిమాలు సరిగ్గా హిట్ అవ్వకపోవడం తో ఇప్పుడు డిఫరెంట్ జానర్స్ సినిమాలని నరేష్ ట్రై చేస్తున్నాడు అందులో భాగం గా వచ్చిన సినిమాలే అల్లరి నరేష్ ఇటీవల చేసిన నాంది మరియు ఉగ్రం వంటి రెండు థ్రిల్లర్ మూవీస్…ఈ సినిమాల తో తన అభిమానులను మెప్పించాడు. విజయ్ కనకమేడల తీసిన ఆ రెండు సినిమాల్లో కూడా భారీ ఎమోషనల్ క్యారెక్టర్స్ తో తన లోని పెర్ఫార్మన్స్ తో అదరగొట్టి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు నరేష్. ఇక ఆయన తరువాత సినిమా పై ఇప్పటికే టాలీవుడ్ లో ఆసక్తికరంగా చర్చ జరుగుతూ ఉంది. అల్లరి నరేష్ తన తరువాత మూవీని పీరియాడిక్ జానర్ లో చేయనున్నారని సమాచారం.. తొలిసారిగా అల్లరి నరేష్ ఇటువంటి జానర్ మూవీ చేస్తుండగా దీనిని అద్భుతం గా తెరకెక్కించేందుకు ప్రస్తుతం యువ దర్శకుడు అయిన సుబ్బు కథ మరియు కథనాలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. అతి త్వరలో ఈ క్రేజీ ప్రాజక్ట్ గురించి పూర్తి వివరాలు అధికారికం గా వెల్లడి కానున్నట్లు సమాచారం..ఈ వార్త నిజం అయితే అల్లరి నరేష్ ఫ్యాన్స్ కి ఇది గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు..అయితే అల్లరి నరేష్ ఒకప్పుడు అన్నీ కామెడీ సినిమాలు చేశాడు ఇప్పుడు థ్రిల్లర్ సినిమాలని చేస్తూ మెప్పిస్తున్నాడు..కానీ వరుసగా అవే సినిమాలు చేయడం వల్ల ఆయన కెరీర్ చాలా పెద్ద మైనస్ అయ్యే అవకాశం కూడా ఉందని కామెడీ సినిమాలు ఎలా అయితే ఆయన కి మైనస్ అయిందో ఇలాంటి థ్రిల్లర్ జానర్ లో మరో సినిమా కనుక చేస్తే ప్రేక్షకులకు అంతగా నచ్చకపోవచ్చు. అందుకే నరేష్ సరికొత్తగా ఆలోచిస్తున్నట్లు సమాచారం.
ప్రభాస్ మొదటి సినిమా కలెక్షన్స్ ఎంతో తెలుసా…?
నేడు ప్రభాస్ హీరో గా నటించిన ‘ఆదిపురుష్’మూవీ గ్రాండ్ గా విడుదలై పాజిటివ్ రెస్పాన్స్ ని అందుకుంది.. ప్రభాస్ మొదటి సినిమా ‘ఈశ్వర్’ గురించి పలు ఆసక్తికరమైన పలు విషయాలను తెలుసుకుందాం.ఈ సినిమాని ప్రముఖ దర్శకుడు ‘జయంత్ సి పరాన్జీ’ తెరకెక్కించిన విషయం తెలిసిందే. ప్రముఖ నిర్మాత అశోక్ రాజు ఈ సినిమాలో విలన్ గా నటిస్తూ నే సినిమాను నిర్మించాడు కూడా. అప్పట్లో ఈ చిత్రానికి పాజిటివ్ రెస్పాన్స్ కూడా వచ్చింది, ప్రభాస్ నటనను అందరూ మెచ్చుకున్నారు.. అప్పట్లో ఈ చిత్రాన్ని రెండు కోట్ల రూపాయిల బడ్జెట్ లోపే తెరకెక్కించారని సమాచారం.విడుదల తర్వాత ఈ సినిమాకి పాజిటివ్ రెస్పాన్స్ రావడం తో ఫుల్ రన్ లో నాలుగు కోట రూపాయిల షేర్ వసూళ్లు చేసినట్లు సమాచారం.. మొదటి సినిమానే సూపర్ హిట్ అవ్వడం తో ప్రభాస్ కి యూత్ లో అప్పటి నుండే క్రేజ్ పెరగింది.ప్రభాస్ మొదటి సినిమాగా స్టూడెంట్ నెంబర్ 1 చిత్రం చెయ్యాల్సి ఉంది, కానీ అప్పటికే ఆ కథ జూనియర్ ఎన్టీఆర్ తో ఫిక్స్ అయిందని చెప్పడం తో ప్రభాస్ ‘ఈశ్వర్’ సినిమాతో లాంచ్ అయ్యాడని ప్రముఖ నిర్మాత అశ్వినీ దత్ ఒక ఇంటర్వ్యూ లో తెలిపారు.. ఈ రెండు సినిమాలు కూడా సూపర్ హిట్ గా నిలిచాయి. రెండు సినిమాల్లోని పాటలు కూడా హిట్ అయ్యాయి.అలా ప్రభాస్ మొదటి సినిమా ఈశ్వర్ నాలుగు కోట్ల రూపాయిలు రేంజ్ లో వసూలు చేస్తే, ఇప్పుడు ప్రభాస్ రేంజ్ ఏ స్థాయికి వెళ్లిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు..